23, జూన్ 2014, సోమవారం

పద్యరచన - 599

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21 కామెంట్‌లు:

  1. కొన్న బొమ్మను నొకచేత మిన్న యనుచు
    కన్న బిడ్డను ముదమంది గట్టి గాను
    రెండు జేతుల బట్టెను గుండె కదిమి
    చేరు చుండెను నింటికి సార లమ్మ

    రిప్లయితొలగించండి

  2. ఒక చేత గోపన్న ఉన్నా
    ఇక ప్రయోజనం సున్నా
    బిడ్డడి పాల కోసం గోపన్న
    అంగడి వీధిన అమ్మకున్న !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. కన్నయ నొక కరమున, నీ
    కన్నయ నింకొక కరమున గలిగి కదలెదో -
    కన్నయ నమ్మిన యెడ, నీ
    కన్నయ కిక కడుపు నిండు గదనే తల్లీ!

    రిప్లయితొలగించండి
  4. కన్నయ్య నొక్క చంకను
    కన్నయ్యను వేరు చంక గలిగిన తల్లీ !
    కన్నయ్య పాలనడుగును
    కన్నయ్యే పాలనమ్ము జేయును గనవే !

    రిప్లయితొలగించండి
  5. ఫణీంద్ర గారూ ! బహుకాల దర్శనము.. మీ పూరణ బాగుంది...నేనూ మీ కన్నయ బాటలోనే నడిచాను..

    రిప్లయితొలగించండి
  6. పార్శ్వ మందున్న మనుమని పాల కొఱకు
    వెన్ను బొమ్మను ముసలమ్మ విక్ర యించ
    తీసికొని వెళ్ళు చుండెను తేజ !చూడు
    చిత్ర మందున నున్నట్టి చిత్తరువును

    రిప్లయితొలగించండి
  7. అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    మంచి భావాన్ని అందించారు. మిత్రులెవరైనా దీనిని ఛందోబద్ధం చేస్తారేమో చూద్దాం.
    *
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘చిత్రభావము లొలికించు చిత్తరువును’ అంటే బాగుంటుందేమో? చిత్రము, చిత్తరువు అన్న పునరుక్తి తొలగిపోతుంది.

    రిప్లయితొలగించండి
  8. పుడమిని మించిన సహనము
    ముడుతల దేహంపు ముసలి మోమున గనుమా
    అడుగులు వేయుచు, తన మను
    మడిఁ, కృష్ణుని మోయుచుండె మండే ఎండన్

    రిప్లయితొలగించండి
  9. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘దేహపు ముదుసలి..’ అనండి.

    రిప్లయితొలగించండి
  10. కన్నయ్య బొమ్మ నమ్మిన
    కన్నసుతుని కడుపు నిండు, కనుమా తల్లిన్
    పున్నెమొ పాపమొ తెలియక
    కన్నీరొలక ముఖ మట్లు కనిపించుగదే!

    రిప్లయితొలగించండి
  11. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. నెమ్మనమున నమ్మిన గో
    పెమ్మల, రాధమ్మ ప్రియుని విగ్రహమున్ ఓ
    యమ్మరొ! తన బిడ్డను పె
    ద్దమ్మ టునిటు నెత్తు కొనియు తా జనుచుండెన్.

    రిప్లయితొలగించండి
  13. పసివానిని పోషింపగ
    మిసమిస బొమ్మలనుఁ దెచ్చి మిక్కిలి శ్రమతో
    దసరావేళల నమ్మెడు
    ముసలమ్మను గనుడు! రండు, బొమ్మల కొనగా!

    రిప్లయితొలగించండి
  14. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...

    దక్షణపు కరమందున దైత్యవైరి
    నెత్తుకొని తన మనుమని నెడమ కరము
    పోవుచుండెను ముదమున ముదుక యొకతె
    శౌరి పూజను సలుపగ చక్కగాను

    రిప్లయితొలగించండి
  15. ఓరిమితో నొకముదుసలి
    మారామును చేయుచున్న మనుమడి తోడన్
    శౌరిని కరమున మోయుచు
    సీరుని వేడిమికి వగచి చెమటలు గ్రక్కెన్

    రిప్లయితొలగించండి
  16. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. మాస్టరుగారూ ధన్యవాదములు.
    కార్యాలయమునకు వెడలు తొందరలో యతి మైత్రి పొరబాటు జరిగినది...సవరణతో...


    కన్నయ్య నొక్క చంకను
    కన్నయ్యను వేరు చంక గలిగిన తల్లీ !
    కన్నయ్య పాలనడుగును
    కన్నయ్యే పాలనమును గనగా జేయున్ !

    రిప్లయితొలగించండి
  18. గోలి వారూ,
    మీ చెప్పేదాక నేనూ గమనించలేదు. సంతోషం. సవరణ బాగుంది.

    రిప్లయితొలగించండి
  19. కన్నయ్యనొక్క చేతను
    చిన్నయ్యను మరొక వైపు చేతను దాల్పన్
    ఎన్నగనా ముసలిమనిషి
    అన్నన్నా!ఎవరినీయ ననులాగొప్పున్!

    రిప్లయితొలగించండి