21, అక్టోబర్ 2014, మంగళవారం

సమస్యా పూరణం – 1536 (సద్గ్రంథపఠనము జనుల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సద్గ్రంథపఠనము జనులఁ జవటలఁ జేయున్.

26 కామెంట్‌లు:

  1. సద్గ్రంధ మనగ దెలియుము
    సద్గ్రంధ మె మనకు దెలుపు సదసద్గుణ ముల్
    సద్గ్రంధ మిటుల జేయదు
    సద్గ్రంధ పఠ న ము జనుల జవటలజేయున్

    రిప్లయితొలగించండి
  2. కవిమిత్రులకు నమస్కారములు!

    సద్గ్రాహ్యము కానట్టి వి
    యద్గ్రహణ పరిధినిఁ బోలు నాకారము కిం
    చిద్గ్రామ్యాంచితమగు న
    సద్గ్రంథపఠనము జనులఁ జవటలఁ జేయున్!

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    రావణాది రాక్షసులు - చక్కగా చదివిన చవటలే గద :

    01)
    ____________________________

    ఉద్గ్రంథ పఠన నెఱపియు
    సద్గ్రాహత్వము కొరవడి - చచ్చిరి యసురుల్ !
    సద్గ్రహణ లేనిచో నిల
    సద్గ్రంథపఠనము జనులఁ - జవటలఁ జేయున్ !
    ____________________________
    గ్రాహ్యత్వము = ఎఱుక
    గ్రహణ = గ్రహించుట

    రిప్లయితొలగించండి
  4. ఉద్గ్రీవునిగన్ చేయును
    సద్గ్రంథపథనము, జనులఁజవటలఁజేయున్
    సద్గ్రహయాళువు గాకన్
    సద్గ్రంథపఠనముఁ దెగడుచు చరియించినచో

    రిప్లయితొలగించండి
  5. ఉద్గ్రంధములెన్నున్నను
    సద్గ్రంధములెన్ను కొనుచు చదువగ వలెగా
    తద్గ్రంధము లెన్నక విడ
    సద్గ్రంథపఠనము, జనులఁ జవటలఁ జేయున్.

    రిప్లయితొలగించండి
  6. సద్గ్రంధ మెట్టిదైనను
    సద్గ్రాహ్యము కానియెడల సరిపోలదుగా!
    సద్గ్రాహ్యులు దొరకనపుడె (దొరకని సమయంలో)
    సద్గ్రంధపఠనము జనుల జవటల జేయున్.

    రిప్లయితొలగించండి
  7. శ్రీగురుభ్యోనమ:

    యద్గ్రాహ్యర్హం బగునో
    తద్గ్రాహ్యము జేయకుండ తప్పులు బట్ట
    న్నుద్గ్రంథము జదివిననూ
    సద్గ్రంథపఠనము జనులఁ జవటలఁ జేయున్!

    రిప్లయితొలగించండి
  8. సద్గ్రంధ పఠితలై, కిం
    చిద్గ్రంధ రసగ్రహణము చేయక యున్నన్
    యద్గ్రామీణులకైనను
    సద్గ్రంధపఠనము జనుల జవటల జేయున్

    రిప్లయితొలగించండి
  9. గ్రంథపఠనం అంటే గుర్తుకు వచ్చింది.
    గ్రంథసంచయమున గల సద్విషయముల చదివి నేర్చెడు నంత చదువు లేదు

    గుండువారి పూరణ బాగుంది. నేనూ అసద్ర్గంథం అనే పూరించేవాడిని.
    సుబ్బారావుగారి పూరణలో అన్వయం కొంచెం కృతకంగా ఉంది

    రిప్లయితొలగించండి
  10. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    సద్గ్రంథమాది కావ్యము
    చిద్గ్రాహ్యముగా రచింప ఛీఛీ యనిరే
    తద్గ్రామ మసురమయమవ
    సద్గ్రంథపఠనము జనుల జవటల జేయున్

    రిప్లయితొలగించండి
  11. సద్గ్రాహ్యమైన యపుడది
    సద్గ్రంధ పఠన మిడుగద సద్బుద్ధి యిలన్
    సద్గ్రాహ్యముఁగాకయు, నా
    సద్గ్రంధ పఠనము జనులఁ జవటలఁజేయున్

    సద్గ్రాహ్యులఁ జేయు నదియ
    సద్గ్రంధ పఠనము జనులఁ,-జవటలఁజేయున్
    సద్గ్రాహ్యము కాకఁ జదువ
    సద్గ్రహములు కూడానట్టి జాతకు కెందున్

    సద్గ్రహ వీక్షణ కలిగిన
    సద్గ్రాహ్యమగునుగ విద్య జనములు పొగడన్
    సద్గ్రహ వీక్షణ లేకను
    సద్గ్రంధ పఠనము జనులఁ జవటలఁజేయున్

    సద్గ్రహ యుక్తుని కెందును
    సద్గ్రాహ్యమగును చదువగ, సత్పురుషుడగున్
    సద్గ్రహముల్ చెడినప్పుడు
    సద్గ్రంధ పఠనము జనులఁ జవటలఁజేయున్

    సద్గ్రామ మందు నున్నను
    సద్గ్రంధ యుతులగు జనుల సత్సంగము మేల్,
    సద్గ్రాహ్య హీన సంగము
    సద్గ్రంధ పఠనము జనులఁ జవటలుఁ జేయున్

    రిప్లయితొలగించండి
  12. ఉద్గ్రంథ శోధనంబున
    సద్గ్రాహ్యత కొవడంగ సాత్విక మతులే
    యుద్గ్రీవులగుచుఁ జేసెడు
    సద్గ్రంథ పఠనము జనులఁ జవటలఁ జేయున్!

    రిప్లయితొలగించండి
  13. ఉద్గ్రీష్మంబది వేదము
    నుగ్ద్రంథి విముక్తుడొక్కడుద్ఘోషించెన్
    చిద్గ్రాసపు నాస్తికమత
    సద్గ్రంథపఠనము జనులఁ జవటలఁ జేయున్!

    రిప్లయితొలగించండి
  14. సద్గ్రాహ్యములేకను కిం
    చిద్గ్రాంధికభాషలేక చీపురుతంపై
    సద్గ్రహణలేమికలుఁగు య
    సథ్గ్రంథపఠనము జనులఁ జవటలఁ జేయున్.

    రిప్లయితొలగించండి
  15. శ్రీమధుసూదన్ గారికి,
    నమస్సులు.

    మూడవపాదములో గణభంగము అయినట్ట్లుగా తోస్తున్నది. నేనే పొరబడ్డానా ??

    రిప్లయితొలగించండి
  16. సద్గ్రంధము ల సరస వే
    రుద్గ్రంధము లుద్భవించె యుత్తితి వగుచున్,
    ఉద్గ్రంధమైన యట్టి య
    సద్గ్రంధ పఠనము జనుల ( జవటల జేయున్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  17. ఉద్గ్రంధము లన్నియు గన
    సద్రంధము లౌనె చదువ సందియ మేలా
    ఉద్గ్రంధమె మేలనుచు న-
    సద్గ్రంథపఠనము జనులఁ జవటలఁ జేయున్.

    రిప్లయితొలగించండి
  18. సహదేవుడు గారి పూరణం లో రెండవ పాదంలో ఒక చిన్న టైపాటను కుంటాను "కొరవడంగ" కు బదులుగా "కొవడంగ" అనిపడింది.

    రిప్లయితొలగించండి
  19. ఒక వ్యక్తి స్వీయ రచన గూర్చి గొప్పగా ఇలా చెబుతున్నాడు.

    మద్గ్రంధ పఠన చేయుడు
    నుద్గ్రంధం బిదియె ధరణి నోహోయనగా
    యద్గ్రంధము పోలదు న
    సద్గ్రంధపఠనము జనుల జవటల జేయున్

    రిప్లయితొలగించండి
  20. నిజమే...నా పూరణమందలి మూఁడవపాదమున గణభంగమైనది. తెలియఁజేసినట్టి కవిమిత్రులు సంపత్ కుమార్ శాస్త్రిగారికి ధన్యవాదములు. నా సవరణము......"అంచితమగు న..."..."...అంచితమైన య..."గాఁ బఠించిన సరిపోవును..

    నా సవరించిన పూరణము:

    సద్గ్రాహ్యము కానట్టి వి
    యద్గ్రహణ పరిధినిఁ బోలు నాకారము కిం
    చిద్గ్రామ్యాంచితమైన య
    సద్గ్రంథపఠనము జనులఁ జవటలఁ జేయున్!

    రిప్లయితొలగించండి
  21. దుష్కరప్రాసతో సమస్య ఇచ్చినా దాదాపు మిత్రులందరూ ఉత్సాహంగా పూరణలు చేసినందుకు సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    నాలుగు పాదాల్లోనూ ‘సద్గ్రంధ’మును ప్రయోగించి క్లిష్టతను తొలగించుకొని పూరణ చేశారు. బాగుంది. అభినందనలు.
    కానీ పద్యంలో అన్వయలోపం ఉన్నది. మీ పద్యానికి నా సవరణ....
    సద్గ్రంధ మేదొ దెలియుము
    సద్గ్రంధమె హితము దెలుపు. సద్గుణము లిడున్
    సద్గ్రంధమె, చెప్పదగునె
    సద్గ్రంధ పఠనము జనుల జవటలజేయున్.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదాన్ని సవరించినందుకు సంతోషం!
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సద్గ్రహయాళువు’...?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఎన్ని + ఉన్నను’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. సంధి లేదు. ‘సద్గ్రంధము లెన్ని కలుగ...’ అనండి.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మూడవ పూరణ మూడవ పాదంలో గణదోషం. ‘యద్గ్రంథము సరిపోల ద/సద్గ్రంథము...’ అనండి.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘చదివిననూ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘చదివినఁ ద/త్సద్గ్రంధము...’ అనండి.
    *
    శ్యామలరావు గారూ,
    ధన్యవాదాలు. సుబ్బారావు గారి పద్యానికి కొన్ని సవరణలు సూచించాను.
    ‘నిజతత్త్వ మెఱిగికొను’ డన్న మీ పద్యాన్ని చూశాను. చాలా బాగున్నది.
    *
    కెంబాయి వేంకట తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘అసురమయ మవ’ అన్నదాన్ని ‘అసురమయ మట...’ అంటే బాగుంటుందేమో?
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    నిన్ననే చెప్పాను అందరికి. పోస్ట్ చేసేముందు ఒకసారి టైపాట్లను పరిశీలించవలసిందని!
    *
    మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘లేక’ కళ. ‘లేకను’ అనరాదు. అక్కడ ‘లేకయు/ లేకయె’ అనవచ్చు.
    గుండు వారు మీ సూచనను గమనించి సవరించారు. ధన్యవాదాలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సరస వేరు’...?
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. గురువుగారికి (అలా అనుకునే ఇలారాశాను)సవరణ సూచించినందులకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  23. గురువుగారికి నమస్సులు. సవరించిన పద్యము

    యద్గ్రాహ్యార్హం బగునో
    తద్గ్రాహ్యము జేయకుండ తప్పులు వెదుక
    న్నుద్గ్రంథము జదివినఁ ద
    త్సద్గ్రంథపఠనము జనులఁ జవటలఁ జేయున్!

    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  24. కవికవిమిత్రులు శ్రీ సోమనాధశాస్త్రుల వారికి మరియు
    గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    ఉద్గ్రంథ శోధనంబున
    సద్గ్రాహ్యత కొరవడంగ సాత్విక మతులే
    యుద్గ్రీవులగుచుఁ జేసెడు
    సద్గ్రంథ పఠనము జనులఁ జవటలఁ జేయున్!

    రిప్లయితొలగించండి
  25. పూజ్యగురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. గ్రహయాళువు అంటే గ్రహించు వాడు. మంచిగా గ్రహించలేని వాడు అనే అర్థములో వాడాను (సద్గ్రుహయాళువు కాకన్). లోపంఉంటే దయచేసి సవరణ చూచించండి.

    రిప్లయితొలగించండి
  26. మంచి పుస్తకాల సరసన వేరే పుస్తకాలు(డిటెక్టివ్)అని నా ఊ హ సరి శ్లేష వస్తుం దని భావిస్తున్నాను
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి