4, నవంబర్ 2014, మంగళవారం

సమస్యా పూరణం - 1543 (వార్ధకమ్మునఁ గావలె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వార్ధకమ్మునఁ గావలెఁ బడుచు భార్య.

32 కామెంట్‌లు:

 1. పెళ్లి గోలేల ముసిలోడ వెళ్ళవయ్య
  జుట్టు నెరిసెను కళ్ళేమొ సొట్ట బోయె
  నడుము వంగెను నలుగురు నవ్వ, నేల
  వార్ధకమ్మునఁ గావలెఁ బడుచు భార్య?

  రిప్లయితొలగించండి
 2. కన్నపిల్లల జేయూ త మిన్న గాను
  వార్ధ కమ్మున గావలె , బడుచు భార్య
  యవస రముయుక్త వయసున నలరు యువకు
  నకు భు వినిమఱి నిజమిది నమ్ము డార్య !

  రిప్లయితొలగించండి

 3. అదిగో అయ్యవారు పరిగ్రహించె
  విశ్రామ కాలమున బ్లాగ్కన్యను
  వార్ధక్యమున గావలె బడుచు భార్య
  డైలీ హనీమూను సౌకర్యము గావింప!!

  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ముసిలోడ, కళ్ళేమొ’ అన్నవి గ్రామ్యాలు. అక్కడ ‘వృద్ధుఁడ, కనులేమొ’ అనండి.
  ***
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ***
  జిలేబీ గారూ,
  మంచి భావాన్ని అందించారు. ధన్యవాదాలు. మీ భావానికి నా పద్యరూపం....
  అదిగొ యయ్యవారు పరిగ్రహణముఁ జేసె
  విశ్రమించు కాలమున ‘బ్లాగ్’ కన్నె కరము
  దినదినము ‘హనీమూను’ పొందెను ముదమున
  వార్ధకమ్మునఁ గావలెఁ బడుచు భార్య!

  రిప్లయితొలగించండి
 5. నేటి యవ్వన గర్వితోన్మేషమందు
  తోడు యవసరమేమియు తోచదయ్య
  శక్తులుడుగును మనసది చపలమౌను
  వార్ధకమ్మునఁ, గావలెఁ బడుచు భార్య.

  రిప్లయితొలగించండి
 6. జిలేబీ గారి భావానికి నేను వ్రాసిన పద్యం రెండవ పాదంలో యతి తప్పింది. దానిని ‘బ్లాగ్ పిల్ల కరము’ అని చదువుకొనవలసిందిగా మనవి.
  ***
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. వార్ధ కమ్మునఁ గావలె పడుచు భార్య
  లాగ చరియించు సహచరి లగ్గు గలుగ
  ముసలి తనమునఁ గూరును ముచ్చ టప్డు
  సాగు జీవిత మంతయు చక్కగాను

  రిప్లయితొలగించండి
 8. శ్రీగురుభ్యోనమ:

  ధర్మ మర్థము కామము కర్మ ఫలము
  వార్ధకమ్మునఁ గావలెఁ, బడుచు భార్య
  యు ముదుసలి కాకపోదు, పయోధి కాదె?
  మనిషి సంసార మనునది మాన్యు లార.

  (ధర్మ మనెడు అర్థము, కర్మ ఫలము అనెడు కోరిక కలిగి ఉండవలెనను భావముతో వ్రాసినాను)

  రిప్లయితొలగించండి
 9. విరమణంబున రాబడి వేడుకవ్వ
  రంగు లద్దగఁ గ్రొత్తైన హంగుటిల్లు
  కారు ముంగిట కొలువై షికారులమర
  వార్ధకమ్మునఁ, గావలెఁ బడచు భార్య?
  (కొత్త యిల్లు, కొత్త కారు, కొత్త. .అదిరిందయ్యా చంద్రం!స్ఫూర్తితో)

  రిప్లయితొలగించండి
 10. కె యెస్ గురుమూర్తి ఆచారిగారి పూరణ
  వార్ధకమ్మునఁ గావలెఁ, బడుచు భార్య
  యని మరల పెండిలిని చేసు కొనెద రయ్య
  రండి త్వరగకొనండి తిన౦డి బాబు
  యని పలికె కామలేహ్యము నమ్మువాడు

  రిప్లయితొలగించండి
 11. కవిమిత్రులందఱకు నమస్కారములు!

  ("ఈ నవయౌవనంపు హేమంతమ్మునను నాకుఁ బెండ్లి యింకనుం గాలేదు గదా!"యని యొక యువకుఁడు తపింౘుౘున్న సందర్భము)

  ఇరువదొక్కేఁడు నేగె! నభీప్సితమ్ముఁ
  దీరదాయె! నా పెండ్లి కా దింత దాఁక!
  రేఁగె మదిఁ గోర్కె! యీ పంచ త్రింశతియు న
  వార్ధకమ్మునఁ గావలెఁ బడుౘు భార్య!

  (పంచత్రింశతియు-నవ = 35 + 9 = 44 ఏండ్లు; అర్ధకమ్మున = సగము వయస్సున = 44 ఏండ్లలో సగము = 22 ఏండ్ల వయస్సున)

  రిప్లయితొలగించండి
 12. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  వార్ధకమ్మునఁ గావలెఁ, బడుచు భార్య
  పతిని దైవమ్ముగా నెంచు పరమ సుభగ
  వార్ధకమ్మున గాదె చ్యవన మహర్షి
  పెండ్లి యాడె సుకన్యను ప్రీతిగాను

  రిప్లయితొలగించండి
 13. సంతు బొందుట కొరకునై సత్యమరయ
  భార్యగావలె నందురు,పడయ విద్య
  లకును వయసది మీరగా,లాలితముగ
  వార్ధకంబున కావలె పడుచుభార్య

  "వార్ధకంబున గావలె పడుచు భార్య
  సత్యవతి" యంచు కోరగా శంతనుండు,
  దేవవ్రతు డెంతొ భీషణ తీవ్ర ప్రతిన
  జేసి,భీష్ముడై నుతిగాంచె జృంభణముగ

  కోరి వంశంపు వృద్ధిని గొప్పగాను
  ధర్మ పద్ధతి నానాడు తలచినారు
  "వార్ధకంబున గావలె పడుచు భార్య"
  యిపుడు వాంఛలు తీరగా నింపు నడుగ

  భార్య గతియించె నొకనికి వార్ధకమున
  వానికీయంగ బోయిరి వయసు మీద
  పడగ,వద్దని యాతండు పలికె, నేల?
  వార్ధకంబున గావలె పడుచు భార్య

  పతిత మౌచుండె మనుజుల భావమరయ
  పడతి పొందును కోరుటే భవ్య మనుచు
  బాధవెట్టి,చంపియును తా పడతి కొరకు
  వార్ధకంబున కావలె పడుచు భార్య

  రిప్లయితొలగించండి
 14. గద్దె నెక్కిన పెద్దయేఘనముగాను
  సుబ్బరమ్ముగ కన్యకు శుల్కమిచ్చి
  డెబ్బదేండ్లకు మనువాడె నబ్బు రముగ
  వార్ధకంబున కావలె పడుచు భార్య??!!!

  రిప్లయితొలగించండి
 15. వయసు పెరుగగ దానితో వాంఛ పెరుగ,
  తలలు బోడైన తలపులు తరుముచుండ,
  పాత రుచులను తలచుచు తాత వూగ,
  రమ్య మైనట్టి తలలకు రంగు నింప,
  వార్ధకంబున గావలె పడుచు భార్య!

  రిప్లయితొలగించండి
 16. పార్ధసారధీ కనుమీ ప్రపంచలీల
  స్వార్ధమే జీవులకు పరమార్ధమాయె
  గార్దభమ్ముకు గావలె గానవిద్య
  వార్ధకమ్మున గావలె పడుచుభార్య

  రిప్లయితొలగించండి
 17. కవిమిత్రులు కామేశ్వరశర్మగారూ,
  మీ పూరణము బాగుగనున్నది. కాని, గార్దభమ్ముకు...సాధువుకాదు. గార్దభమునకు...అనినచో నెటులుండును?

  రిప్లయితొలగించండి
 18. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  మరియొకపూరణ

  వయసు నందు న౦తరములు పతి సతులకు
  హెచ్చుగానుండ భర్తకు నిబ్బడిగను
  ప్రేమ పెరుగును భార్యపై ,పిదప తనకు
  వార్ధకమ్మున గావలె పడుచు భార్య
  సేవ లొనరింప నుండును సిద్ధముగను

  రిప్లయితొలగించండి
 19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 20. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ***
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ***
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  "వేడుకవ్వ" అని గ్రామ్యాన్ని ప్రయోగించారు.
  ***
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  "బాబు + అని" అన్నప్పుడు సంధి జరుగుతుంది. అక్కడ "బాబ/టంచు" అనండి.
  ***
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ***
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ***
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ***
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ***
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  గుండు వారి సూచనను గమనించారు కదా.

  రిప్లయితొలగించండి
 21. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. వయసునందున ప్రేమించ " బడుచు భార్య "
  వాదులాటల గొడవలు " బడుచు భార్య "
  పలువిధమ్ములుగా సాయ " బడుచు భార్య "
  వార్ధకమ్మునఁ గావలెఁ " బడుచు భార్య."

  రిప్లయితొలగించండి
 23. పెండ్లి కెదిగిన కొమరుని పెళ్ళి కొరకు
  అన్ని విధముల సరిజోడు నెన్ను కొనగ ,
  నెరపు పనులన్ని మరియును నిలుపు గౌర
  వా ర్ధ కమ్మున (గావలె (బడుచు భార్య
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 24. సతి వియోగమునొందిన పతియొకండు
  పతి వియోగమునొందిన సతిని వెదుకు
  చుండి యనెను ప్రౌఢయె జాలునోయి, యేల
  వార్ధకమ్మున గావలెఁ బడుచు భార్య?

  రిప్లయితొలగించండి
 25. కె.ఈశ్వరప్ప గారి పూరణలు
  వార్ధకమ్మునఁ గావలెఁ " బడుచు భార్య."
  యన్న నాన్నతోకొడుకనె "కన్నవారు
  కూతురు సుఖ పడగ నెంత్రు. గుణము యున్న
  పెద్దవై యుండి మాటాడ వద్దు నాన్న"
  2,ఆస్తి పాస్తులు నెన్నున్న ఆదరించు
  భార్య లేకున్నబ్రతుకున భంగపాటె
  పదవి వదలిన తరువాత కొదువ యున్న
  వార్ధకమ్మున గావలె పడుచు భార్య

  రిప్లయితొలగించండి
 26. వల్ల కాటికి జేరెడు వయసు నీది
  యీదు చుంటివి కడురోగ పుదతిలోన
  మూడు కాళ్ళతో నడిచెడి మూర్ఖ! యేల
  వార్ధకమ్మున గావలె బడుచు భార్య?

  రిప్లయితొలగించండి
 27. మంచి చమత్కారమైన విరుపుతోనున్న శ్రీగుండు మధుసూదన్ గారి పూరణ ప్రశంసనీయం

  రిప్లయితొలగించండి
 28. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ‘బడు’ ధాతువు ప్రయోగంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  ‘గౌరవ + అర్ధమ్ము’తో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  బాగున్నది మీ పూరణ. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 29. ***ధన్యవాదములు చంద్రమౌళిగారూ!

  ***సంతోషము కామేశ్వరశర్మగారూ!

  రిప్లయితొలగించండి