23, నవంబర్ 2014, ఆదివారం

దత్తపది - 55 (ఆలము-కాలము-జాలము-వాలము)

కవిమిత్రులారా!
ఆలము - కాలము - జాలము - వాలము
పైపదాలను ఉపయోగిస్తూ రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

24 కామెంట్‌లు:

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

ఆలము జేయ తలచె పో
గాలము చేరువయిన దశ కంఠుడు మాయా
జాలము తో నైనను కర
వాలముతో నైనను గెలువంగలననుచున్

వసంత కిశోర్ చెప్పారు...

అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

జాంబవంతుని యుద్బోధ - హనుమంతుని ప్రయాణం :

01)
________________________________

ఆలము లోన రాక్షసుల - నడ్డెడి వీరుడ వీవెగా మరిన్
కాలము లోనె వేగముగ - కంధిని దాటగ నీకె సాధ్యమౌ
జాలము లెన్నియున్న మరి - చక్కగ దిద్దెడు జాణ వౌటచే
వాలమె శూలమైన, నలు - వంకల లంకను సీత గాంచగన్

నీ సరి వేరులేరు మరి - నీసరి వీరుడ వీవె యౌటచే
వేసట జెందియున్న మన - వృక్షచరమ్ముల గావ నెంచ మా
యాసను దీర్చమంచతని - నచ్ఛపు రాజదె కోరినంతనే
హాసము చిందు చుండ నని - లాత్మజు డేగెను సీత జాడకై !
________________________________
కాలము లోనె = ఉన్న సమయము లోనె (సుగ్రీవుడిచ్చిన గడువు తీరకముందే)
కంధి = సముద్రము
జాలము = మోసము
జాణ = నేర్పరి
శూలము = ఆయుధము
అచ్ఛము = భల్లుకము
హాసము చిందు చుండ = ఉప్పొంగిన యానందముతో

subbarao చెప్పారు...

ఆలమున గాచుకొ నుముర
కాలము నిక దీరె నీకు ,కర వాలముతోన్
జాలము జేయక జంపుదు
గూళు డ ,యో రావణుండ !కోరిక తీ రన్

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఆలముఁ జేయక వినుమా!
కాలము లెల్ల చెడుగనగ కఠినుడవై యీ
జాలము లో జిక్కుకొనకు
వాలము చాలు నినుఁ జుట్టి వైతును కడలిన్.

ఆలము= ఉపేక్ష
హనుమంతుడు రావణునితో అన్న పలుకులుగా...

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

ఆలమునందు దుష్టదనుజాధములన్ వధియించి మీకు స
త్కాలముఁ గల్గఁజేసెదను ధైర్యమునున్ వహియింపుమమ్మ యా
జాలము క్రౌర్యసంయుతులఁ సంహరణంబొనరింతు నమ్మ మ
ద్వాలము దైత్యరాజయమపాశముగా రహియింపఁజేసెదన్.

జాలము = కపటము,

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కంది శంకరయ్య చెప్పారు...

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ, కొసరు పద్యము రెండూ బాగున్నవి. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శీఘ్రమే - సీఘ్రమే అని టైపయింది. ‘అన్నియూ’ అన్నదాన్ని ‘అన్నియున్’ అనండి. ‘మహా ఆలము’ అనేది వైరిసమాసం. అక్కడ ‘ముందు ఘోరమౌ| నాలము...’ అనండి.

A.Satyanarayana Reddy చెప్పారు...

చేటు కాలము రావణ! చేరువయ్యె
నాలమందున నీ చమూ జాలము నీల్గు
వానరుల వాలపు యురుల లోనఁ జిక్కి
శరణు వేడుము రాముని సంధిఁ గోరి
జాలము : సమూహము

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో ‘చమూజాలము నీల్గు’ అన్నచోట గణభంగం. ‘నీ చమూజాల మీల్గు’ అనండి.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఆలమునన్ సీతన్ గొన
గాలమ్మెట్లోర్చునె? దశకంఠుని మాయా
జాలముఁ జెల్లెనె? మారుతి
వాలముఁ గాల్చ, రఘురాము బాణము గూల్చెన్!

కంది శంకరయ్య చెప్పారు...

గుండా వేంకట సుబ్బా సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

ఆలము నందు రాక్షసులు యాతన నొందుచు నాంజనేయునిన్
జాలము పన్ని పట్టుకొని జంకుచు జేర్చిరి రాజు చెంతకున్
కాలము మూడి రావణుడు కాల్చగ నెంచుచు నిప్పు బెట్టినన్
జ్వాలలు రేగగా హనుమ వాలము కాల్చెను లంకనంతటిన్

A.Satyanarayana Reddy చెప్పారు...

పూజ్య గురుదేవులకు నమస్సులు. తమరి సవరణకు ధన్యవాదములు.

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ చెప్పారు...

గురుతుల్యులకు నమస్సులు . మీ సలహాలకు కృతజ్ఞతలు .



ఉ. కాలము చెల్లెలే, తమకు కయ్యము తప్పదు సీఘ్రమే సుమా
వాలము కాల్చ , నీ హనుమ వానియనుంగులునేకమవ్వ మీ
జాలము లన్నియున్ ముగియు జాప్యము లేదిక, ముందుఘోరమౌ
నాలము పెళ్లునన్ చెలగు అందరు చావుట తధ్యమే కదా!

subbarao చెప్పారు...


కాలము చెల్లెను నీకిక
నాలము లో గాచు కొనుము హా దశ కంఠా !
వాలము గలిగెడు వీరుల
జాలముతో వత్తు నిన్ను జంపుట కొఱకున్

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆలమునన్ రావణ సుతు
జాలముతో లక్ష్మణుండు సరిమూర్ఛిల్లన్
వాలము చరచుచు హనుమ స
కాలములో నౌషధముల కైగిరి తెచ్చెన్.

Unknown చెప్పారు...

ఆలము నందున నిలచియు
వాలములు కలిగిన యోధ వానర సేనా
జాలము నసురుల జంపగ
కాలము దశకంఠు డందె కార్ముక హతిచే

కాలము తీరెను లంకకు
వాలముతో హనుమ గాల్చ భాసుర లీలన్
జాలము వానర యోధులు
అలము నందున దునుమరె యసురుల నెల్లన్

రావణు కాలము తీరగ
వే వాలము తోడ లంక వెలిగెను మంటన్
తా వానర జాలముతో
రావణు, నాలమున దునిమె రాముడు నెలమిన్

sailaja చెప్పారు...

ఆలము మానుము రావణ
జాలము జేయక శరణను జానకి నాధున్!
వాలము దాల్చిన దూతకు
కాలము చెల్లించ నీకు కపిరధుడొచ్చున్!!

కంది శంకరయ్య చెప్పారు...

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వచ్చున్’ అన్నదాన్ని ‘ఒచ్చున్’ అన్నారు. అది దోషం. అయినా ‘కపిరథుడు’...?

sailaja చెప్పారు...

పూజ్యగురువు గారికి వందనములతో..
శ్రీరామునికి నానార్ధాలలో కపిరథుడు అని వుంది కావున ఆ పదాన్ని ఉపయోగించాను. దోషమున్నచో సవరణ తెలియచేయగలరు..

Unknown చెప్పారు...

కెఈశ్వరప్పగారి పూరణ
ఆలము సేయ బోనిక యయాతికి రక్షణ నీదు శక్తి మ
మ్మేలెడి రామ నే నభయమిచ్చిన వాలముశూలమౌను యే కాలము లెక్కసేయకను గాచెడిదేగద రామభక్తి పో
జాల ముదావహంబగున?జంకుట లేదనె నాoజనేయుడే

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

A.Satyanarayana Reddy చెప్పారు...

ఆలములోన వేగముగ నంతము నొందుచు నుండగా చమూ
జాలము మానసంబునను సంధిలు ప్రాణ భయంబు నీకు పో
గాలము చేరువయ్యె నిను గాచెడు వారలు లేరు భూమిపై
వాలపు జీవులే చెఱచు పావన లంకను రాము నండతో