29, నవంబర్ 2014, శనివారం

దత్తపది - 56 (అరి-కరి-గురి-సరి)

కవిమిత్రులారా!
అరి - కరి - గురి - సరి
పైపదాలను ఉపయోగిస్తూ కర్ణుని దాతృత్వాన్ని గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

22 కామెంట్‌లు:

  1. అరియైన వచ్చి యడిగిన
    గురిపించును వితరణంబు కుంతీ సుతుడే
    సరిలేని దానగుణుడన
    హరికి కవచ కుండలముల యంహతి కరియౌ
    (అంహతి =దానము , కరి = నిదర్శనము )

    రిప్లయితొలగించండి
  2. సరిరా గర్ణున కెవరును
    నరి వచ్చిన గురియు ధనము నాతని చేతిన్
    నొరులకు దానము చేయును
    కరియే గద దానమీయ కన్నని కపుడున్

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    దానకర్ణుడు :

    01)

    ___________________________

    అడగ వచ్చిన వారెవ్వ - రైన గాని
    కరిని గాచిన శ్రీహరి - కరణి వేగ
    గురిని దప్పక యర్థుల - కోర్కి దీర్చు
    శ్వాస నడిగిన జంకక - సరియె యనును

    కవచ కుండలము లడగ - కౌశికునకు
    కోసి యిచ్చిన దాతృత్వ - కోవిదుండు
    దాన మిడుటను కర్ణుడే - ధరణి యందు
    మేటి గావున నాతని - సాటి యతడె !
    ___________________________
    గురి = లక్ష్యము , నిశ్చయత

    రిప్లయితొలగించండి
  4. గురి గుదిరి వచ్చియడిగిన
    యరియైనను వెళ్ళమనక నడిగినదిచ్చున్
    సరిలేరు దానమందున
    కరిమీదకు నెక్కి చెపుదు కర్ణుని గొప్పన్.

    రిప్లయితొలగించండి
  5. సరి తూగ నెవడు కలడే
    గురిలో ధరణీ చరిత్ర ? కోసియె నిచ్చెన్
    అరి యర్ధించ కవచమున్
    కరియైనింకేదివలయు? కర్ణుని కొలవన్

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సరియే’ అనండి. చివరిపాదం భావాన్ని వివరించండి.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కోసియె యిచ్చెన్’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. సరిలేరు నార్క సూతికి
    యరి కైన నొసంగుగాదె యతిసర్గములన్
    గురిగానిలిచెను ధర తొల
    కరిదొర చొక్కిలగ సహజ కవచాదులిడెన్

    తొలకరిదొర =ఇంద్రుడు

    రిప్లయితొలగించండి
  8. శంకరార్యా ! ధన్యవాదములు !

    తప్పిపోయిన "శత్రువు" తో మరల

    దానకర్ణుడు :

    1అ)
    ___________________________

    అరియె స్వయముగ నర్థించ - నానందముగ
    కరిని గాచిన శ్రీహరి - కరణి వేగ
    గురిని దప్పక యర్థుల - కోర్కి దీర్చు
    శ్వాస నడిగిన జంకక - సరియె యనును

    కవచ కుండలము లడగ - కౌశికునకు
    కోసి యిచ్చిన దాతృత్వ - కోవిదుండు
    దాన మిడుటను కర్ణుడే - ధరణి యందు
    మేటి గావున నాతని - సాటి యతడె !
    ___________________________

    రిప్లయితొలగించండి
  9. అరిబలము హరియించగ గురికొని హరి
    కరిపురము జొచ్చె కొనగను కవచ కుండ
    లముల నంచు నెరింగియు రమణ తోడ
    ధర్మ మార్గ మనుసరించి దాన మిచ్చె

    రిప్లయితొలగించండి
  10. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘అర్కసూతి’ సరియైన ప్రయోగం.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మొదటి పాదం చివర గణదోషం. సవరించండి.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. శంకరార్యులకు ధన్యవాదములతో

    దానకర్ణుడు :

    1ఆ)
    ___________________________

    అరియె స్వయముగ నర్థించ - నరుసముగను
    కరిని గాచిన శ్రీహరి - కరణి వేగ
    గురిని దప్పక యర్థుల - కోర్కి దీర్చు
    శ్వాస నడిగిన జంకక - సరియె యనును

    కవచ కుండలము లడగ - కౌశికునకు
    కోసి యిచ్చిన దాతృత్వ - కోవిదుండు
    దాన మిడుటను కర్ణుడే - ధరణి యందు
    మేటి గావున నాతని - సాటి యతడె !
    ___________________________

    రిప్లయితొలగించండి
  12. పూజ్యులు గురుతుల్యులు శంకరయ్య గారికి వందనములు

    అరిది విజయము సాధింప ననిని క్రీడి
    అభ్రకరివాహనుడడుగ నచ్చెరువుగ
    సహజ కవచ కుండలముల సరిగ నొసగె
    అడుగు రిపువైన! దానకర్ణుడు యతండు!

    రిప్లయితొలగించండి
  13. అరిపిత కోరగ కవచము
    కరియౌ గద నిచ్చుటదియ,కదనము నందున్
    గురి యాత డర్జునునకై
    సరి దానము చేయనెవరు సాటిగ రారే!
    (కరి=సాక్ష్యము)
    గురితప్పదు బాణము విడ
    సరి లేరిల దానమునను,శక్రుడు కోరన్
    నరియైన నిచ్చె కవచము
    కరికిని సాటగును శూర గణమున నెందున్

    గురి యయ్యెను శాపములకు
    సరి లేరతనికి బవరము సలుపగ దానాల్
    అరి నందెను మృత్యువతడు
    కరి బోలినయోధుడయిన,ఘనముగ దాతై

    రిప్లయితొలగించండి
  14. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారిపూరణ

    అరి యతడంచు,పుత్రుడగునర్జుని కావగ వచ్చెనంచు తా
    నెరిగియు త్యాగియై కవచ మిచ్చెను.కర్ణుని కేరి ధారుణిన్
    సరి?గురియౌ గదా యినుము సమ్మెట నగ్నినిగూడినట్లు లో
    క రిపువు గా కనంబడును కర్ణుడు కౌరవ నాథ మిత్రుడై

    రిప్లయితొలగించండి
  15. అరివీర భయంకరుడని,
    గురికల వాడని జడియుచుఁ గొమరుని గావన్
    హరి కరికరి పెట్టిన నూ
    సరిల్లక కవచముఁ దీసి సత్రమొసంగన్!

    రిప్లయితొలగించండి
  16. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    కె.యస్, గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. సరి యే గర్ణున కెవరును
    నరి వచ్చిన గురియు ధనము నాతని చేతిన్
    నొరులకు దానము చేయును
    కరియే గద దానమీయ కౌశికు న కునున్

    రిప్లయితొలగించండి
  18. సరిలేదు దానమున నలు
    గురిలో పేరందెనతడు గుణకోవిదుడై
    యరినైన కాచు తానిల
    గరిమను దేవేంద్రునైన ఖర్వము చేయున్

    రిప్లయితొలగించండి
  19. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. కె ఈశ్వరప్పగారి పూరణ
    పదుగురి సంతసంబె తనపట్టు నటంచును దానకర్ణుడై
    కదలగ, దానినెట్లు అరి కట్టుట న౦చును యింద్రు డెంచగా
    ఆదరని సూర్యుడట్లు సరియైన పథమ్మున సాగుచుండగా
    వదలడుదానధర్మపు నివాసిగ శాంకరి యన్నపూర్ణలా

    రిప్లయితొలగించండి
  21. అరిభీకరుడైనను, పో
    కరియై దుర్జనుల తోడ కలిసినకతమో
    గురి తప్పెను దానఫలము
    సరి నిలువగలేక మడఁగె చక్రి సఖునిచేన్.

    రిప్లయితొలగించండి
  22. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి