27, మార్చి 2015, శుక్రవారం

పద్య రచన - 861

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

  1. ముసలి తనము నందు మోడీపై ప్రేమతో
    బైకునెట్టుకొనుచు బయలుదేర
    మోడి గాయ రాడు మూర్ఛ వచ్చిన నీకు
    కుర్రవాండ్రవోలె వెర్రి యేల?

    రిప్లయితొలగించండి
  2. లూనాపై దిరిగి తివని
    నీనామము తెలుప రెవరు వీరుడ వంచున్
    ఈనాటి రాజకీయము
    లేనాటికి మార వంట నిక్కము తాతా

    రిప్లయితొలగించండి
  3. మోడి పైగల బ్రేమతో ముసలి గాంధి
    మోడి బొమ్మను బైకుకు ముందు పెట్టి
    పోవు చుండెను నెచటికో పోయి పిలువు
    విశ్ర మించికొ లదిసేపు వెళ్ళును మఱి

    రిప్లయితొలగించండి
  4. మోడిగూర్చి ప్రసంగించ ముదము తోడ
    మోపెడునుగొని చనుచుండె ముసలి తాత
    క్రొత్త మార్పుల కోసమై చిత్త మలర
    తపను వేడిని భరియించి తరలు చుండె

    రిప్లయితొలగించండి
  5. చేరినచెత్తపెత్తనముచీపురు బట్టియునూడ్చమంచు తా
    కోరెనుమోది|గాంధివలెకోర్కెలుదీర్చగవేషభూషణా
    బారినబడ్డవాడతడు|బాధ్యతచేతను వెళ్లుచుండె.కై
    వారపుస్వచ్చభారతము వారసుదట్లుగముందుచూపునన్.
    వేషముజూడ గాంధిగను వేదన నెంచెడిమోదిమార్గమై
    దోషమునింపుచెత్త తగుదూరముజేయుటె?స్వచ్చభారతం
    పోషణజేయబూనుటకె పూర్తిగనందరు రమ్మటంచు సం
    తోషమునందుదెల్పుటకెతొందర|నందుకెవాహనంబనెన్,

    రిప్లయితొలగించండి
  6. సొచ్చెము జేయగ భరతము
    మెచ్చుచు మోడీని తాత మేదిని యందున్
    వచ్చెను దెలుపగ జనులకు
    ఖచ్చితముగ కలుప చేయి కలలే నిజమౌ!!!

    రిప్లయితొలగించండి
  7. మోదిపతాకశీర్షిక ప్రమోదమటంచును నెంచివాహనం
    బాదిగ నుంచి,గాంధివలెబట్టలుగట్టినబాధ్యతాయుతా?
    రోదన,రోగబాధలకు రోతయెకారణమన్నసత్యమున్
    మోదియుగుర్తెరింగి మనముంగిటదెల్పెనుటివి లందునన్

    రిప్లయితొలగించండి
  8. ప్రచలిత వాహన మిదియట!
    ప్రచారపర్వమ్ము సలుపఁ బండు వయసునన్!
    వచియింప నెవరి తరమౌ?
    నుచితంబుగ భోజన మట నూరేగనిలన్!

    రిప్లయితొలగించండి
  9. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది.అభినందనలు.
    రెండవపాదంలో యతి తప్పింది.‘నీ నామము తెలుప రెవరు నేత వటంచున్’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘భూషణా, భారతం’ అన్న ప్రయోగాలు దోషం. ‘తొందర యందుకె’ అనండి.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి