9, నవంబర్ 2015, సోమవారం

పద్యరచన - 1059

కవిమిత్రులారా!
“పూమాలల్ గడు భక్తిఁ దెచ్చితిని నీ పూజార్థినై...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

25 కామెంట్‌లు:

  1. పూమాలల్ గడు భక్తి దెచ్చితిని నీ పూజార్థినై చేరితిన్
    కామార్థమ్ముల గోరనైతి నిను నిష్కామంబుతో కొల్చుచున్
    నే మోక్షమ్మును గోరి వచ్చితిని నన్నేలంగ జాగేలనో
    కామాక్షీ! నినునమ్ము భక్తులనిలన్ గాపాడవే నిత్యమున్

    రిప్లయితొలగించండి
  2. పూమాలల్ గడు భక్తిఁ దెచ్చితిని నీ పూజార్థినై నే ప్రభూ!
    రామా! ధాత్రిజహృత్సరోజభ్రమరా! రాజీవపత్రేక్షణా!
    స్వామీ! భక్తజనావనా! గుహసఖా! సామీరిసంసేవితా!
    కామారీవినుతా! సురార్చితపదా! కైకోగదే రాఘవా!

    రిప్లయితొలగించండి
  3. పూమాలల్ గడు భక్తి దెచ్చితిని నీ పూజార్థినై నిల్చితిన్
    రామా! పుణ్య గుణాభి రామత్రిజగ ద్రక్షైక దీక్షాపరా!
    కామార్థంబుల సాధనమ్మె ఘన సత్కార్యమ్ముగా నెంచెడిన్
    సామాన్యుండను, నేనెఱుంగనయితిన్ సాకేత మన్నింపు నీ
    నామమ్మేనిల పెన్ని ధంటెఱీగితిన్ నాకింక దిక్కీవెరా!

    రిప్లయితొలగించండి


  4. గు రు మూ ర్తి ఆ చా రి
    ...........................

    పూమాలన్ గడు భక్తి దెచ్చితిని నీ పూజార్థ్తి నై ; నన్నికన్
    ప్రేమన్ బ్రోవుము - రాఘవా ! హృదయ శా౦తిన్ ప్రసాద౦చి ; మ
    త్సామీప్య౦బున నిల్చి నిత్యము విపత్ స౦తప్తుని౦జేయు నీ
    కామ క్రోధ మదాది ఘాతుక. రిపు గ్రామ౦బు ఖ౦డి౦పవే

    రిప్లయితొలగించండి


  5. గు రు మూ ర్తి ఆ చా రి
    ...........................

    పూమాలన్ గడు భక్తి దెచ్చితిని నీ పూజార్థ్తి నై ; నన్నికన్
    ప్రేమన్ బ్రోవుము - రాఘవా ! హృదయ శా౦తిన్ ప్రసాద౦చి ; మ
    త్సామీప్య౦బున నిల్చి నిత్యము విపత్ స౦తప్తుని౦జేయు నీ
    కామ క్రోధ మదాది ఘాతుక. రిపు గ్రామ౦బు ఖ౦డి౦పవే

    రిప్లయితొలగించండి
  6. పూమాలన్ గడు భక్తిఁదెచ్చితిని నీపూజార్థినై కొమ్మ! నీ
    నామంబే జపియించుచుంటి సతమున్ నాపై దయంజూపుమా!
    ఆమీనాంకుడు నాదుమానసమునందాసీనుడైయుండి వే
    కామంబున్ పురిగొల్పుచుండె పతిగాఁగావించి నన్బ్రోవుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. పూమాలల్ గడు భక్తి దెచ్చితిని నీ పూ జార్ధినై దేవరా !
    యీ మాలల్ యి క నీకు సాదరముగా యీ నీ శిరంబందు నే
    బ్రేమంబొ ప్పగ వైతు నో శివ ! మరిన్బ్రీ తిన్ ననున్ గావుమా
    నామాట ల్ సరియౌను గా దలచి నా కోరికన్ మన్నించవే ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘సాదరముగా+ఈ=సాదరముగా నీ’ అవుతుంది. సాదరముగా నీ యీ శిరంబందు... అనండి.

      తొలగించండి
  9. పూమాలల్ కడుభక్తిఁ దెచ్చితిని నీపూజార్ధి నైప్రీతి తో
    కామాక్షీ నినునమ్మి యుంటినిక నేకామ్యమ్ము లన్వీడితిన్
    వేమారుల్ కొనియాడి వేడితిని నీవేగాచి బ్రోవంగ నన్
    నీమాయా జగమం దునుండ గలమే నీసేవ లేకున్నచో

    రిప్లయితొలగించండి
  10. పూమాలల్ క డు భక్తిదెచ్చితిని నీపూజార్థినై గావుమా
    రామా రక్షకు డీవె లోకులకుసారాంశంబు లో దాగియున్
    ప్రేమన్నింపుచు పెంపు జేయుమయ సర్వేశుండు నీవే గదా
    నామంబెంచిన ఆంజ నేయుడిలలో నన్యాయంబు మాన్పించుగా|

    రిప్లయితొలగించండి
  11. పూమాలల్ గడు భక్తిఁ దెచ్చితిని నీ పూజార్థినై నేడు మా
    సామాన్యుల్ దిను కాయగూరల ధరల్ సర్వంబు పెర్గెన్నభం
    బీ మాపేదల కంద జేయుమయ సర్వేశా! హరీ! దేవ దే
    వా! మా భారత మాత బిడ్డలను గాపాడార్తులన్ మమ్ములన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. పూమాలల్ గడు భక్తిఁ దెచ్చితిని నీ పూజార్థినైన్నార్తినిన్
    వేమారుంభవ నామ మంత్రమును కాపీర్ణంబుతో దల్చుచున్
    రామారామయటంచునిత్యమునపారాచంచలాశక్తినిన్
    ప్రేమంబొప్పగపూజసేతునయ నేరేయింబవల్లిద్ధరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసార్హం. కానీ కొన్ని లోపాలు... పూజార్థినై+ఆర్తి=పూజార్థినై యార్తి అవుతుంది. పూజార్తినై యార్తితో అనండి. వేవారుం దవనామ...అంటే బాగుంటుంది. అచంచల శక్తి అనాలి. అచంచలాశక్తి అనరాదు. రేయింబవల్+ఇద్ధరన్=రేయింబవలిద్ధరన్ అవుతుంది. రేయింబవల్ భూమిపై అనండి. ,

      తొలగించండి
  13. రుక్మిణి భవానీ మాతతో:
    పూమాలల్ గడు భక్తిఁ దెచ్చితిని నీ పూజార్థినై యీశ్వరీ!
    సేమమ్మీయగ నాదిదంపతుల నాశీర్వాదమున్ బొందగ
    న్నామీదన్ దయఁ జూపరమ్మ! హరినిన్నావాడిఁ గావించగన్
    మీమీదన్ గల నమ్మకమ్ము వరమై మెప్పించ నే వేడెదన్!

    రిప్లయితొలగించండి
  14. పూమాలల్ గడు భక్తిఁ దెచ్చితిని నీ పూజార్థినై నేడు నీ
    జామాతన్ గడుపండ్లు లేవుగద నీ జంజాట వేపుల్ తినన్
    సామాన్యంబగు కంది పచ్చడులతో చారున్ వడిన్ జేయుమా
    మామూల్ జేసెడి బిర్యనిన్ను విడుమా మాతాన్నపూర్ణేశ్వరీ!

    రిప్లయితొలగించండి
  15. పూమాలల్ గడు భక్తిఁ దెచ్చితిని నీ పూజార్థినై దండిగా
    భామా! నీ జడనున్ ధరించి మురియన్ భక్తుండనై చూడగన్
    శ్యామా! నా కలలే కృశించగనునే సంతోషమున్ గూర్చకే
    ప్రేమే పోయెను నాశనమ్మవుచు నీ పిగ్ టైలు గాంచంగనే!😊

    రిప్లయితొలగించండి