15, నవంబర్ 2015, ఆదివారం

సమస్య - 1855 (జలము ఘనీభవముఁ జెందె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
జలము ఘనీభవముఁ జెందె జ్వాలలు సోఁకన్.

40 కామెంట్‌లు:

  1. బలముగ హిమమే కురిసిన
    జలము ఘనీభవముఁ జెందె,జ్వాలలు సోఁకన్
    చలనము జెందిన వాయువు
    కలకలము నురేపు దిశెల కల్లోల మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొన్ని టైపాట్లున్నాయి.

      తొలగించండి
    2. నమస్కారములు
      టైపాట్లు నాకు తెలియ టల్లేదు .దయచేసి తెలుప గలరు

      తొలగించండి
    3. క్షమించాలి " దిశ " కు " దిశె " అనివ్రాసాను . చలనము జెందిన కు బదులుగా " చలనము నందున " అనివ్రాయ వలెనను కుంటాను.ఇక మొదటి పాదము చివర " హిమమే కురియగ " అంటే బాగుంటుం దేమొ . నాకు తెలిసినది ఇవే అనుకుంటాను

      తొలగించండి
  2. చలిగాలుల తాకిడికిన్
    జలమ ఘనీభము జెందె,జ్వాలలు సోకన్
    కలవరము రేగె నీ కౌ
    గిలి జేర్చగ రమ్ము ప్రియుడ క్లేశము బాపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. మిత్రులందఱకు నమస్సులు!

    విలయమ్మది క్రౌర్యమ్మున
    బలిమినిఁ జెలరేఁగ, భూమి వలయమునఁ బ్రజల్
    మలమల మాడిరి! సాగర

    జలము ఘనీభవముఁ జెందె జ్వాలలు సోఁకన్!

    (సాగరజలము ఘనీభవించి "లవణము"గా మారెను)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      ముందుగా మీకు ‘జన్మదిన శుభాకాంక్షలు’!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మధుసూదన్ గారు మీకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు!!!

      తొలగించండి
    3. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి మఱియు శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదములు!

      తొలగించండి
    4. సోదరులు శ్రీ గుండు మధుసూదన్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు

      తొలగించండి
    5. సోదరి నేదునూరి రాజేశ్వరి గారికి ధన్యవాదములు!

      తొలగించండి
  4. మధుసూదన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

    అల ల్యాబులోన విద్యా
    ర్థులకుప్పును జేయు విధము దోపగ జూపన్
    జలజల లవణము గానే
    జలము ఘనీభవముఁ జెందె జ్వాలలు సోఁకన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సుకవి మిత్రులు కవి దురందరులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు......సరస్వతీ దేవి సంపూర్ణ కృపా కటాక్షలబ్ధులకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

      తొలగించండి
    3. సుకవి మిత్రులు ఆంజనేయ శర్మ (విరించి) గారికి మనఃపూర్వక ధన్యవాదములు!

      తొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. బలమగు శీతలము కతన
    జలము ఘనీభవముఁ జెందె ; జ్వాలలు సోఁకన్
    పలు జీవరాశు లడవిని
    కలవరమును జెంది యగ్ని కాహుతి యయ్యెన్

    రిప్లయితొలగించండి
  7. ఇలమంచు మిగుల గలుగుత
    జలముఘనీభవముజెందె జ్వాలలు సోకన్
    మలమలమాడుచుదరువులు
    పలుమారులుధగ్ధమయ్యె బగలునురేయున్

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. బల ధన దర్ప నిరసనా
      కుల భాషణముల నపార కోపానలమున్
      విలసిల్లె మదిని మరియుం
      జలము ఘనీభవముఁ జెందె జ్వాలలు సోఁకన్.

      [చలము = మాత్సర్యము; కోపజ్వాలలతో మాత్సర్యము మరింత గట్టిపడింది.]

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. .చలికౌగిట జేరగనే
    జలముఘనీభవము జెందె|”జ్వాలలు సోకన్
    వలపును వీడిన వనితగ
    మెల మెల్లగ రవినిగాంచి మెరుపున వెళ్ళెన్|

    రిప్లయితొలగించండి

  10. * గు రు మూ ర్తి ఆ చా రి *

    చలి యెక్కువైన కతన౦
    జలము ఘనీభవము చె౦దె ; జ్వాలలు సోకన్ ,
    చెలి తనువు లోన -- తన కౌ
    గిలితో గప్పుచు ప్రియు౦డు గిలిగి౦త లిడెన్

    { చలము = నానార్థము =
    వాయువు , గాలి }
    { చలి తీవ్రత. వర్ణి౦చుటకై
    వాయువు ఘనీభవి౦చెనని
    అతిశయోక్తిగా చెప్పబడినది }


    ి

    రిప్లయితొలగించండి
  11. బలమగు శీతల గాలికి
    జలము ఘనీభవము జెందె, జ్వాలలు సోకన్
    నిలువక ఘనమే కరుగుచు
    సలిలముగా మారునదియె జలచక్ర మనన్

    రిప్లయితొలగించండి
  12. విలయము సృష్టించుటకై
    తలపోసిన ముష్కరులట దాడులు జేయ
    న్నిలుగన్ ఫ్రాన్సు జనులు క
    జ్జలము ఘనీభవముఁ జెందె జ్వాలలు సోకన్!

    (కజ్జలము=చీకటి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. చలిగాలుల తీవ్రతతో
    జలముఘనీభవముచెందె, జ్వాలలుసోకన్
    చెలకౌ గిటిలో , ధృతితో
    చలిగాచుకొనుచు తనిసితి చల్లని రేయిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. .గలగల పారెడి నదిలో
    జలము ఘనీభవముజెందె|”జ్వాలలు సోకన్
    చిలిపిగ రవికిరణమ్ములు
    గలువగనేగంతులేసి కదలెనుజలమే|.

    రిప్లయితొలగించండి
  15. జలమది యూరెను నోటిని
    వలపుగ గుంటూరి బజ్జి వాసన జూడన్
    లలనది మండగ లాలా
    జలము ఘనీభవముఁ జెందె జ్వాలలు సోఁకన్

    లలన = జిహ్వ

    రిప్లయితొలగించండి
  16. వలపున నెగయగ జ్వాలలు
    పలుకుట మానగను నీవు పంతము మీరన్
    బలుపుగ నేడ్వగ కన్నుల
    జలము ఘనీభవముఁ జెందె జ్వాలలు సోఁకన్

    రిప్లయితొలగించండి