వేదుల సుభద్ర గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో యతి తప్పింది. 'సత్యలోకమున మనెడి సాధ్వి వాణి' అనండి. మా నాన్న గారి ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు. నేను ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఉన్నాను.
"సిరియి వాణియు నొక్కచోఁ జేర రెపుడు" పాత కాలపా నానుడి పాటి తప్పె కలియుగపు దేవతలు కూడ కల్తి బడిరి నేను నీకును నాకును నీవు యంచు కలసి పోయిరి యొక్కచో కట్టు తెంపి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిఫణి విద్యాలయమ్మున వేల వేలు
తొలగించండిగుమ్మరించుచు విద్యలన్ కొనెడు వారు
సిరియి వాణియు నొక్కచో జేర రెపుడు
ననెడు పాతమాటను మార్చిరాధునికులు.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినింగి నేలను తాకిన ఖంగు తినదు
రిప్లయితొలగించండిపచ్చ గడ్డియె లేకున్న భగ్గు మనును
అత్త కోడళ్ళ కొకదరి పొత్తు లేదు
సిరియు వాణియు నొక్కచోఁ జేర రెపుడు
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కృష్ణ దేవ రాయామిత కృపను బడసి
రిప్లయితొలగించండివైభవమున వెలిగి రష్ట వారణములు
కవులు శ్రీయుతులే సరిగా దిటులన
సిరియి వాణియు నొక్కచోఁ జేర రెపుడు.
పోచిరాజు కామేశ్వరరావు గురూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వాయిమంచితనమ్మున వాణి యుండి
రిప్లయితొలగించండితృప్తి గల్గిన సిరి యని తెలియు చోట
సిరియు వాణియు నొక్కచోఁ జేర రెపుడు
యనగ సరిగాదు .తెలియుడు అనఘులార.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
'ఎపుడు+అనగ' అన్నప్పుడు యడాగమం రాదు.
పండితుడు కడికోసమై పాట్లు పడగ
రిప్లయితొలగించండికనికరించని సిరి, వాణి గలదటంచు ,
నక్షరాశ్యత నెరుగని నరుని బ్రోచు;
సిరియి వాణియు నొక్కచోఁ జేర రెపుడు.
సిరియి వాణియు నొక్కచోఁ జేర రెపుడు
ననెడు సత్యమసత్యమై గనగ నేడు
చదువు కొనజూడమే సిరిసాధనముగ
నత్తకోడళ్ళ కొక్కచో పొత్తు కుదర
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅమ్మ వారి గుడిన నక్షరాభ్యసనము
తొలగించండివేల ఖర్చును దెచ్చుటే విశదపఱచు
సిరియి వాణియు నొక్కచో జేర రెపుడు
ననెడు మాటెంత కల్లయో యవని యందు
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
సిరియు చింతను దృంచెడి వరముగాదు
రిప్లయితొలగించండివరమువిద్యయె| మనిషికి కరుణ నింపు|
నింపుకరుణచె లక్ష్మియునిలువదచట
సిరియు వాణియు నొక్కచోచేర రెపుడు
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.అభినందనలు.
2వాణి వాగ్ధాటి లేకున్న వసుధయందు
రిప్లయితొలగించండిలక్ష్మినిలువదులే|మనలక్ష్యమంత
సిరియు, వాణియు నొక్కచో చేర|రెపుడు
వారి దయలేక మనుషులు వరలగలర
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి-------------------------
కోటి విద్య " ల ధ ని "కూటి కొరకు నేర్చు
" ధ ని " వహి౦చడు శధ్ధ విద్యను గడి౦ప ;
కనుక తరచి విచారి౦పగ. క్ష్మాతలాన
సిరియు వాణియు నొక్కచో చేర రెపుడు
{ ధని = ధనికుడు ; అధని = ధనము
లేని వాడు }
.
ె
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది అభినందనలు.
పూర్వకాలము నందున బుధుల మాట
రిప్లయితొలగించండి"సిరియు వాణియు నొక్కచో జేర రెపుడు "
నేటి కలి కాలమందున నీతి మారె
సిరి గలుగు వారలకు వాణి చిక్కి పోపు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అత్త కోడళ్ళ మధ్యన నాదినుండి
రిప్లయితొలగించండిపొత్తు కుదురుట గంటిమే? నుత్తమాట
రెండు కత్తులు నొకయొర నుండగలవె
సిరియు వాణియు నొక్కచో జేరరెపుడు!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారికి నమస్కారం. మీ నాన్నగారు కులాసాగా ఉన్నారని ఆశిస్తున్నాను. దయచేసి నా క్రింది పూరణము పరిశీలించి తప్పులున్న తెలియచేయగలరు.
రిప్లయితొలగించండితే.గీ:
పాలసంద్రముమెట్టినపడతి లక్ష్మి,
సత్యలోకమునమనుడుసుదతివాణి
యత్తకోడలుకలియుటయరుదుయగుచు
సిరియువాణియునొక్కచోఁజేరరెపుడు.
గురువుగారికి నమస్కారం. మీ నాన్నగారు కులాసాగా ఉన్నారని ఆశిస్తున్నాను. దయచేసి నా క్రింది పూరణము పరిశీలించి తప్పులున్న తెలియచేయగలరు.
రిప్లయితొలగించండితే.గీ:
పాలసంద్రముమెట్టినపడతి లక్ష్మి,
సత్యలోకమునమనుడుసుదతివాణి
యత్తకోడలుకలియుటయరుదుయగుచు
సిరియువాణియునొక్కచోఁజేరరెపుడు.
వేదుల సుభద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో యతి తప్పింది. 'సత్యలోకమున మనెడి సాధ్వి వాణి' అనండి.
మా నాన్న గారి ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు. నేను ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఉన్నాను.
ధన్యవాదాలు గురువుగారు. సవరించి తిరిగి రాశాను.
తొలగించండిపాలసంద్రముమెట్టినపడతి లక్ష్మి,
సత్యలోకమునమనుడుసాధ్వివాణి
యత్తకోడలుకలియుటయరుదుయగుచు
సిరియువాణియునొక్కచోఁజేరరెపుడు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి-----------------------
గురువుగారికి వ౦దనములు మీ నాన్న గారు
త్వరగా కోలుకోవాలని భగవ౦తుని ప్రార్థిస్తున్నాను .
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి-----------------------
గురువుగారికి వ౦దనములు మీ నాన్న గారు
త్వరగా కోలుకోవాలని భగవ౦తుని ప్రార్థిస్తున్నాను .
ధన్యవాదాలు.
తొలగించండిచదువుకొను వారల కెపుడు సంకటంబె
రిప్లయితొలగించండిచదువు 'కొనెడి'తీరు పెరిగె సంఘమందు
సిరియు వాణియు నొక్కచో చేరరెపుడు
యనెడి మాట నిజము కాదు యవని యందు.
2.వాణి కరుణయున్న యగును భాగ్యశాలి
లక్ష్మి వచ్చిచేరునతి సులభముగాను
సిరియు వాణియు నొక్కచో చేరరెపుడు
యనున దానాటి మాటయ్యె నరసి జూడ.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమి రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణలో ‘ఎపుడు+అనెడి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘చేర రెపుడు|ననెడి మాట...’ అనండి.
రెండవపూరణలో ‘కరుణ యున్న నగును, చేర రెపుడు | ననెడి...’ అనండి.
నమస్తే.తండ్రిగారి ఆరోగ్యము ఎలావుందండి.
రిప్లయితొలగించండిమా నాన్నగారి పరిస్థితి అలాగే ఉంది. వైద్యం కొనసాగుతున్నది. ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నాం.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి"సిరియి వాణియు నొక్కచోఁ జేర రెపుడు"
తొలగించండిపాత కాలపా నానుడి పాటి తప్పె
కలియుగపు దేవతలు కూడ కల్తి బడిరి
నేను నీకును నాకును నీవు యంచు
కలసి పోయిరి యొక్కచో కట్టు తెంపి.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కాలపు+ఆ’ అన్నపుడు టుగామమం వచ్చి ‘కాలపు టా నానుడి’ అవుతుంది. ‘పాతకాలపు నానుడు’ అనండి. అలాగే ‘నీవటంచు’ అనండి.