28, నవంబర్ 2015, శనివారం

సమస్య - 1868 (సోనియాగాంధి మోడీకి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సోనియాగాంధి మోడీకి చుట్ట మగును.

54 కామెంట్‌లు:

  1. తొలి శిశువునకుఁ దన నేత్రి దొడ్డ పేరు
    మలి శిశువునకుఁ దన నేత మంచి పేరు
    నయముగ నిడ నూసరవెల్లి నాయకుండె
    సోనియాగాంధి మోడీకి చుట్ట మగును.

    రిప్లయితొలగించండి
  2. భరత భూమిన జన్మించు ప్రజలమంత
    సోదరుల మంచు తలచిన చోద్య మిదియె
    భార తీయుడు రాజీవు భ్రాత యైన
    సోనియా గాంధి మోడీకి చుట్టమగును.

    రిప్లయితొలగించండి
  3. దేశ పితకింటి కోడలు తానె గాని
    దేశ జనులకు హితమైన బాణి లేని
    పోరు నోడాక టీలమ్ము పనిని బూని
    సోనియాగాంధి మోడీకి చుట్ట మగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మద్దూరి ఆదిత్య గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని... మూడు పాదాల్లోను యతి తప్పింది. మీ పద్యానికి నా సవరణ.....
      దేశపిత కింటికోటలై తేజరిల్లి
      దేశజనులకు హితమైన దిశ నొసఁగక
      పోరులో నోడి టీల నమ్ముటకు బూని
      సోనియాగాంధి మోడీకి చుట్ట మగును.
      (అన్నట్టు... మద్దూరి రామమూర్తి గారు మీకు చుట్టమా?)

      తొలగించండి
  4. ఎవని కెవరే మౌదురీ యవని యందు
    నీది నాదను కొట్లాట నిజము తప్ప
    నటన జేసెడి పాత్రల నాట కమ్ము
    సోనియా గాంధి మోడీకి చుట్ట మగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదంలో గణదోషం. ‘ఎవరి కెవ్వ రేమౌదు రీ...’ అనండి.

      తొలగించండి
    2. ఎవరి కెవ్వరే మౌదురీ యవని యందు
      నీది నాదను కొట్లాట నిజము తప్ప
      నటన జేసెడి పాత్రల నాట కమ్ము
      సోనియా గాంధి మోడీకి చుట్ట మగును

      తొలగించండి

  5. అదిగో వచ్చుచున్నది జీ ఎస్ టీ !
    కలగంటి గాంధీ, సోనియా టీ వాలా !
    సోనియా, గాంధీ మోడీ కి చుట్ట మగును
    జరూరు గ వచ్చును జీ ఎస్ టీ !

    GST!
    cheers
    zilebi

    రిప్లయితొలగించండి
  6. నమస్కారం గురువుగారు. మహాత్మాగాంధీని ఆదర్శంగా 'క్లీన్ ఇండియా' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధాని వారికి చుట్టమే అన్న భావనలో రాశాను. దయచేసి తప్పులు తెలియచేయగలరు. ధన్యవాదాలు.

    పరిసరములశుభ్రతయేప్రముఖమనుచు
    బాపుపలుకులునిజమనిబాగజూపి
    చేతచీపురుబట్టియుచెత్తనూడ్చి
    సోనియా, గాంధి మోడీకి చుట్ట మగును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేదుల సుభద్ర గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. 'పరిసమ్ముల శుభ్రత ప్రముఖ....' అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారు. సరిచేసిన పద్యమిదిగోనండి.
      పరిసరమ్ములశుభ్రతప్రముఖమనుచు
      బాపుపలుకులునిజమనిబాగజూపి
      చేతచీపురుబట్టియుచెత్తనూడ్చి
      సోనియా, గాంధి మోడీకి చుట్ట మగును.

      తొలగించండి
  7. భార్యాభర్తలు వేరున్న పగటిపూట
    రాత్రిపడకన జేరరా?రాజకీయ
    పార్తివేరైన సభలందు ,పలుకులందు
    సోనియా గాంధి మోడీకి చుట్టమగును.
    2.కులమువేరైన గుణమందు కూడినట్లు
    బలమువేరైన భాధ్యతా విలువ లొకటె|
    రాజకీయాన పార్టీల మోజునందు
    సోనియాగాంధి మోడీకి చుట్టమగును

    రిప్లయితొలగించండి
  8. ఎన్నికల వేళ చర్చల నెన్నడైన
    సోనియా యన మోదీకి చుర్రుమనును
    బిల్లు గట్టెక్క నిచ్చెడు విందులందు
    సోనియా గాంధి మోదీకి చుట్టమగును

    రిప్లయితొలగించండి
  9. చర స్థిరాస్తులు పితరుల సంపదలకు
    జ్ఞాతు లధికార మొందెడి చట్టములటు
    దేశ పాలన జేసెడి తీరు జూప
    సోనియాగాంధి మోడీకి చుట్ట మగును.

    రిప్లయితొలగించండి
  10. సమస్య

    * గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { దయచేసి దీనిని రాజకీయ పరముగా
    ఆలోచి౦చ. వద్దు . పూరణా విధానము
    మాత్రమే గమని౦చ వలయును }
    ి
    ఇటలి c బుట్టి తన కొడుకునే ప్రధాని
    ి
    జేయ , రాష్ట్రమున్ రె౦డుగా జీల్చి వైచె >

    సోనియా| గా౦ధి మోఢికి చుట్ట మగును

    భారతస్థలి నిరువురు ప్రభవ మ౦ది ;

    రిరువుర. నొక రక్తమె ప్రసరి౦చు చు౦డె |

    " సబ్బి హ౦ ఏకు హై " యని చాటిరి గద.

    ( గా౦ధి = మహాత్మగా౦ధి ప్రభవమ౦ది : జన్మి౦చి ) ్

    రిప్లయితొలగించండి
  11. అరయగ నిటలీ దేశపు టాడపడుచు
    భారతావని మెట్టిన వనిత పూర్వ
    భారతప్రధాని సతియు తరుణి యెట్లు
    సోనియాగాంధి మోడీకి చుట్ట మగును?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      తరుణి అనవచ్చునా అన్న సందేహమటుంచితే, ఆ పదప్రయోగం వల్ల మూడవపాదం లో యతి భంగమైనట్లుంది. భార లో భా గురువు అవటం చేత, తరుణి లో త లఘువు కావటం చేత - లాక్షణికులు - ప్రాసమైత్రినంగీకరించరనుకుంటాను

      భవదీయుడు

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వరరావు గురూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదాన్ని "భరతదేశ ప్రధానికి పత్ని యెట్లు" అనండి. ప్రాసయతి కుదురుతుందని.

      తొలగించండి
    3. ఆర్యా మీరు చెప్పినది సరియైనదే. ధన్యవాదములు.సవరించిన పద్యాన్ని తిలకించ గోర్తాను.
      పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. యతి “త” అనే భ్రమలో ముందు” తలుప” వ్రాసి తర్వాత "తరుణి" గా మార్చాను. ప్రాస యతి అనుకోలేదు. సవరించిన పద్యాన్ని తిలకించ గోర్తాను.
      అరయగ నిటలీ దేశపు టాడపడుచు
      భారతావని మెట్టిన వనిత పూర్వ
      భారతప్రధాని సతియు పడతి యెట్లు
      సోనియాగాంధి మోడీకి చుట్ట మగును?

      తొలగించండి
  12. సోనియా గాంధి మోడీకి చుట్ట మగును
    నవును రాజకీయము నందు నగుదురుగద
    చుట్టములుశత్రువుగను సుమ్ము వార
    రాజకీయపు చతురత రమ్య! యదియ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అగును+అవును’ అన్నప్పుడు ‘అగునవును’ అవుతుంది. నుగాగమం రాదు.

      తొలగించండి
  13. ఎవ్వ రెవరికి చుట్టమో యెరుగ లేము
    తేనె బూసిన కత్తుల తీరు వారు
    కాఫి విందుకు పిలిపించె గాన తెలిసె
    సోనియా గాంధి మోడీకి చుట్ట మగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. మిత్రుని చెలికాడు సతము మిత్రుడగును
    ప్రక్క దేశపు వారల ప్రాపుకొరకు
    కర్షకుల దోచుకొనునట్టి కార్యములను
    సోనియాగాంధి మోడీకి చుట్టమగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. భాజపా నితీశుల మైత్రి భగ్నమైన
    సోనియా లాలు కూడిక సొబగు నందె
    విధి వశమున నితీశును వీడ లాలు,
    సోనియాగాంధి, మోడీకి చుట్టమగును!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. సమస్య

    * గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { దయచేసి దీనిని రాజకీయ పరముగా
    ఆలోచి౦చ. వద్దు . పూరణా విధానము
    మాత్రమే గమని౦చ వలయును }
    ి
    ఇటలి c బుట్టి తన కొడుకునే ప్రధాని
    ి
    జేయ , రాష్ట్రమున్ రె౦డుగా జీల్చి వైచె >

    సోనియా| గా౦ధి మోఢికి చుట్ట మగును

    భారతస్థలి నిరువురు ప్రభవ మ౦ది ;

    రిరువుర. నొక రక్తమె ప్రసరి౦చు చు౦డె |

    " సబ్బి హ౦ ఏకు హై " యని చాటిరి గద.

    ( గా౦ధి = మహాత్మగా౦ధి ప్రభవమ౦ది : జన్మి౦చి ) ్

    రిప్లయితొలగించండి
  17. భారతీయులు యెల్లరు భాగ్యవంతు
    లవని యందున వీరలు నన్నదమ్ము
    లనుచు ప్రతిఙ్ఞ యొనరించి నట్లుగాను
    సోనియా గాంధి మోడికి చుట్టమగును.
    (భారతదేశము నామాతృభూమి భారతీయులందరు నాసహోదరులు అనే దాని ఆధారంగా వ్రాశానండి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘భారతీయులు+ఎల్లరు=భారతీయు లెల్లరు’ అవుతుంది. యడాగమం రాదు. ‘భారతీయులు తా మెల్ల’ అనండి. మూడవపాదంలో గణదోషం. ‘...లనుచును ప్రతిజ్ఞ యొనరించి...’ అనండి.

      తొలగించండి
  18. భరత వంశ వృక్షము నకు ఫలము మోడి
    అ౦టు కట్టిన కొమ్మయై నలరె సోని
    బాదరాయణ సంబంధ బంధమమర
    సోనియాగాంధి మోడికి చుట్టమగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. భరత వంశ వృక్షము నకు ఫలము మోడి
    అ౦టు కట్టిన కొమ్మయై నలరె సోని
    బాదరాయణ సంబంధ బంధమమర
    సోనియాగాంధి మోడికి చుట్టమగును

    రిప్లయితొలగించండి
  20. ఇందిరాగాంధి పెదకోడలెవరు బాల?
    ఏది చెపుమ హీరాబెను యెవరి తల్లి ?
    మేనకాగాంధి యేమగు సోనియాకు ?
    సోనియాగాంధి, మోడీకి, చుట్టమగును!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. ప్రజలె బంధువుల్ మాకని బలుకు వారె
    బరగు రాజకీయంబున బ్రబలమగుచు
    బంధు బంధుల బంధువే బంధువట్లు
    సోనియా గాంధి మోడికి చుట్టమగును

    రిప్లయితొలగించండి
  22. భరతదేశపు దేశీయ పడతిగాదు
    ఇటలి దేశముననుగాక ఇఛట మోడి
    ఇంటబుట్టిన నట్లైన నిదియె నిజము
    సోనియా గాంధి మోడికి చుట్టమగును

    రిప్లయితొలగించండి
  23. అక్క కాంగ్రేసు భాజపా అన్న గారు
    కలికి సుతకేమొ సోనియా గాంధి పేరు
    నతని పుత్రుని కట మోడి యనుచు పిలువ
    బావమరదళ్ళెగద వారి వరుస జూడ
    సోనియాగాంధి మోడీకి చుట్టమగును

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. సోనియా గాంధి మోడీకి చుట్టమగును
      మేనకా గాంధి సోనియ మిత్రయగును
      సానియా మిర్జ షోయబు శత్రువగును
      కాన రానివి కలలోన ఖాయమగును

      తొలగించండి


  25. ఇందిరాగాంధి కోడలి వీవు గాదె
    సోనియా! గాంధి మోడీకి చుట్ట మగును
    ఘూర్జ రమ్ము స్వదేశము కొంత కార
    ణమగుట మరియు పరిరక్షణము తనదిగ!

    జిలేబి

    రిప్లయితొలగించండి