27, నవంబర్ 2015, శుక్రవారం

పద్యరచన - 1076

కవిమిత్రులారా,
“కలిమి వివేకశీలురకుఁ గల్గఁగఁ జేయు...”
ఇది పద్యప్రారంభం. 
దీనికి కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.

22 కామెంట్‌లు:

  1. గురువు గారికి నమస్కారములు....ముఖపుస్తకములో నాన్నగారిని చూసాను చాలా బాధనిపించింది. యేంచేయగలం...ఆభగవంతున్ని ప్రార్థించడం మినహా.,.,త్వరగా స్వస్థత చేకూర్చమని ఆ పరమేశ్వరుని వేడుకుందాం......

    కలిమి వివేక శీలురకు గల్గగ జేయు సహాయ మేమియున్
    వలదిల! జ్ఞాన పూర్ణులగు వారికి సంపద వారి బుద్ధియే
    తళుకుల గోరబోరు మరి దర్పము జూపక నేర్పుజూపుచున్
    మెలకువ తోడ నిక్కటుల మిక్కిలి ఓర్పువహించి గెల్వరే!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      నాన్నగారి పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. నేను రోజంతా హాస్పిటల్లోనే ఉంటున్నాను.
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. కలిమి వివేక శీలురకుఁ గల్గఁగఁ జేయు శుభంబు లెన్నడున్
    చెలిమిని సాటి వారలకు చేతన మొందగ మంచి మాటలన్
    బలిమిని సేద దీర్చగను భాసుర మొప్పగ మాన సంబునన్
    సలలిత రాగముల్ విరియ సాగర మంతటి మైత్రి నొందరే ?

    రిప్లయితొలగించండి
  3. కలిమి వివేకశీలురకుఁ గల్గఁగఁ జేయునపార కీర్తినిన్
    చెలిమిని దానధర్మము లశేష దయాగుణ రక్తిఁ జేయగన్
    కలిమి వివేకహీనులకుఁ గల్గఁగఁ జేయు నపార దర్పమున్
    మలిన మనస్కులై విభవ మత్త విచేతను లౌదు రందఱున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. కలిమి వివేక శీలురకు గల్గగ,జేయును చట్ట బధ్ధమౌ
    నలుగురి మేలు కోరెడి ప్రణాలికలన్ సమకూర్చ,కాని యా
    కలిమి వివేక హీనులకు గల్గిన;గర్వితులై చరించి సత్
    ఫలితము పొందజాలక సపాట మొనర్తురు ,దాంబికమ్మునన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. కలిమివివేక శీలురకు గల్గగ జేయు సమర్ధ వంతమే|
    కలుషితభాగ్య బంధములకల్పన లన్నియు ద్రుంచివేయగా?
    మెలిగెడి మేటి నాయకుల మిక్కిలి ప్రేమనుబొందుగాన|తా
    పలికిన కార్య సాధనల బాధ్యత పండగ?భాగ్యమేగదా|
    2.కలిమివివేక శీలురకుగల్గగ జేయునుమంచిపద్దతుల్
    నిలుపును ధర్మ మార్గమునునీతిని జాతికి పంచిపెట్టుచున్
    నిలచినచెట్లలాయెదిగి నిత్యసుఖాలనుజాతికుంచుచున్|
    విలువలనేర్చి కూర్చినవివేకము మాన్పునుమార్గగామిగా|

    రిప్లయితొలగించండి
  6. “కలిమి వివేక శీలురకుఁ గల్గఁగఁ జేయును సద్గుణంబులన్
    గలిమి వివేక శూన్యులకు గల్గిన బెంచును లోభ తత్వమున్
    కలిమియె మంచి చెడ్డలకు కారణమై వెలుగొందు ధాత్రిలో
    కలిమియు లేని మానవుల గానరు కాద వివేక ముండినన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. పద్యరచన
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    కలిమి వివేకశీలురకు గల్గగ జేయు
    వినమ్రశీలమున్ ;
    ...................................................
    చెలిమిని విస్మరి౦పరు , కుచేల సఖున్ వలె. ; ె
    భాగ్య మున్న ద౦
    .......................................................
    చులుకరు , వీగ. రెప్పుడు ; యథోచిత రీతిని
    దాన ధర్మముల్
    .......................................................
    సలిపెద రెల్ల వారలకు , స౦తతమున్
    నిరపేక్ష వైఖరిన్
    ................................. .......................

    { ఉలుకరు = ఉలికిపడరు. వీగరు = విర్రవీగరు.}

    రిప్లయితొలగించండి
  8. చంద్రమౌళి రామారావుగారి పద్యము

    కలిమి వివేకశీలురకుఁ గల్గఁగఁ జేయు విశేష సద్గుణో
    జ్వల మణి భూషణావళులు చక్కని రూప విలాస హాసముల్
    సలలిత సంస్కృతీ సహిత సాంద్ర సుధామయ జీవనంబులున్
    విలసిత కీర్తి చంద్రికలు విస్తృత మిత్ర సుగంధ భూజముల్

    రిప్లయితొలగించండి
  9. కలిమి వివేక శీలురకు గల్గగ జేయు ను శాంతి సౌఖ్యముల్
    చెలిమిని గూర్చు వారలకు సేమమునిచ్చును నెంతయోయికన్
    కలిమి వివేక హీనులకు గల్గగ జేయును దర్పమున్ భువిన్
    మెలకువ తోడనుండుచు ను మిక్కిలి యో ర్పును గల్గియుండుమా

    రిప్లయితొలగించండి
  10. కలిమి వివేకశీలురకుకల్గఁగఁ జేయును సత్ప్రవర్తనన్
    తలపులుసాగు నిత్యమును తన్విగ దానవవైరిఁగొల్చుచున్
    మలినముఁజేయుకోర్కులును మానసమందునఁగల్గవెప్పుడున్
    కలుగును సేవలన్ సలుపు కాంక్ష సతమ్మును చిత్తమందునన్
    కలలనుగూడ చేయరిల కాని పనుల్ తమ యూపిరాగినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. కలిమి వివేకశీలురకుఁ గల్గఁగఁ జేయును శీర్షకోశమే
    చెలిమియు పారిపోవుగద చీకటి దారుల నప్పుసొప్పులన్
    బలిమియు తీరిపోవుగద బంధు జనమ్ముల వాంఛలూడ్చగా
    విలువలు మారిపోవుగద వీధుల వెంబడి రచ్చహెచ్చగా :)

    శీర్షకోశము = తలనొప్పి

    రిప్లయితొలగించండి
  12. కలిమి వివేకశీలురకుఁ గల్గఁగఁ జేయును కష్టమెంతయో
    పలుకుచు మంచి మాటలను పాడుచు మెప్పులు నెత్తికెత్తుచున్
    మిలమిల కండ్లునార్పుచును మీరిన ప్రీతిని కాగలించుచున్
    కొలిమిని బెట్టి బంధువులు కొట్టెద రెల్లరు నప్పుకోరుచున్

    రిప్లయితొలగించండి