9, నవంబర్ 2015, సోమవారం

సమస్య - 1850 (శవపూజల వలన జన్మ...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శవపూజల వలన జన్మ సార్థక మగురా.

40 కామెంట్‌లు:

  1. గురువుగారికి ప్రణామములు....అంతా కుశలమే నని భావిస్తున్నాము.

    భవభయ హరులున్ భక్త జ
    నవత్సలురు, హరిహరులను నమ్మి కొలుచు మా
    నవులకు వసుధన శివకే
    శవ పూజల వలన జన్మ సార్థక మగురా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మా ప్రయాణం ఏ ఇబ్బంది లేకుండా కొనసాగింది. ఈ ఉదయమే ఇల్లు చేరుకున్నాము.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వసుధను’ అనండి.

      తొలగించండి
  2. భువి నేలెడు మాంత్రికులకు
    శవపూజల వలన జన్మ సార్ధక మగురా
    భవితకు భాష్యము జెప్పుచు
    నవిరళముగ మోస గించి నాకము జూపున్
    ----------------------------------
    భవబంధ ములువీడి శివకే
    శవపూజల వలన జన్మ సార్ధక మగురా
    యవనిని భక్తిగ గొలిచిన
    దివినేలెడి ప్రభువు నిన్ను దీవించు నుగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవపూరణ మొదటిపాదంలో గణదోషం. ‘భవబంధరహిత శివకే...’ అనండి.

      తొలగించండి
  3. అవరోధము లేకుండగ
    జవసత్వము లున్ననాడె సన్మతితోడన్
    భవనాశకులగు శివకే
    శవ పూజల వలన జన్మ సార్థక మగురా!

    రిప్లయితొలగించండి
  4. అవనిన భాగ్యము గుడువను
    భవబంధమునందు మునుగు పాపుల కిలలో
    భవభయ హరులౌ శివకే
    శవపూజల వలన జన్మ సార్థక మగురా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అవనిని’ అనండి.

      తొలగించండి
  5. నవ వికసిత పూవులతో
    భవభయ హరునకు ముదమున భక్తితొ మ్రొక్కన్
    భువనము లేలెడి యా కే
    శవ పూజల వలన జన్మ సార్థక మగురా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వికసిత పూవు’లని సమాసం చేయరాదు కదా. ‘వికసిత సుమములతో’ అనండి. ‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. ‘భక్తిని’ అనండి.

      తొలగించండి
  6. శవ మనగ నండ్రు శివుడని
    శివు డెప్పుడు దప్పకుండ సేమము గూర్చున్
    శివ శవములు నొక్క ట గుట
    శవ పూజల వలన జన్మ సార్ధక మగురా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ లాజిక్కుతో కూడిన పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి సమస్య మరియు పద్య ములను తిలకించ గోర్తాను.

    స్పష్టోక్త గణ నియమ భూ
    యిష్టము క్లుప్తమగుభావమెప్పుడు మరి సం
    తుష్టి నొసగవలె జదివిన
    కష్టము గద కవిత లల్లఁ గందమునందున్.

    నీతుల్ జెప్పెడివారలు
    కోతలు కోసెడి ప్రబుద్ద కోవిదులును ప్ర
    ఖ్యాతుల సలహా నీయను
    జూతుము గాదె జనులనిల సూటిగ లీలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ నిన్నటి పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. అవిరామముగా వేడుచు
    భవబంధవిమోచనుడగు పంకజనాభున్
    సివరమ్మును గాచిన కే
    శవబూజలవలన జన్మసార్థకమగురా!!!

    రిప్లయితొలగించండి
  9. భవ చరణములే గతి మా
    ధవ యని నిరతము తపించు తాపసు లకిలన్
    పవన సఖుని సాక్షిగ కే
    శవపూజల వలన జన్మ సార్థక మగురా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పియెస్సార్ మూర్తి గారూ, (దయచేసి మీ పూర్తి పేరు చెప్పండి)
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువు గారికి నమస్కారములు. నా పేరు ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి. మా స్వగ్రామం గుంటూరు, గత 22 సంవత్రములుగా ఉద్యోగరీత్యా బెంగళూరులో నివాసం. మీ ఆశీస్సులతో మన భాషకు దగ్గరవుతున్నాను.

      తొలగించండి
  10. అవిరళము కరము నిష్ఠన్
    భవబందమ్ము లను వీడి వైవశ్వముతో
    శివమునుగొన గను శివ కే
    శవ పూజవలన జన్మ సార్థక మగురా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. అవనికి నధిపతి కాగా
    శవపూజల చేయ జన్మ సార్ధక మగునా !
    భవబబంధము తొలగగ కే
    శవపూజల చేయ జన్మ సార్ధక మౌగా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధనికొండ రవిప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమస్యలోని ‘అగురా’ మీ పూరణలో ‘ఔగా’ అయింది.

      తొలగించండి
  12. భువి లో మార్కండేయుడు
    శివునికి తా తపమొనర్చి చిర జీవిగ పొం
    దె వరమిక ధ్రువునకు కే
    శవ పూజల వలన జన్మ సార్ధక మగురా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో గణదోషం. ‘దె వరమిక ధ్రువునకును కే’ అనండి.

      తొలగించండి
  13. శివకేశవ బేదంబుల
    సవరణ కై తిక్కనార్య సాహిత్యములో
    భవితకు దెల్పెను శివకే
    శవ|పూజలవలన జన్మ సార్థక మగురా.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    భువి జనియించిన మనుజు ల
    నవరత మును ముక్తి గోరి నామ జపముతో
    భవ సాగర మీదగ కే
    శవపూజల వలన జన్మ సార్థక మగురా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. భాగవతుల సత్యనారాయణ మూర్తి గారూ,
      ప్రతిరోజూ నాన్నగారి పూరణలను, పద్యాలను పంపిస్తున్నందుకు ధన్యవాదాలు. మీ నాన్నగారి పేరున ఒక జీమెయిల్ అకౌంటు ప్రారంభించి దానినుండి నేరుగా పంపించవచ్చు కదా! అందువల్ల ప్రతిసారి ‘శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ’ అని టైపి చేయవలసిన అవసరం ఉండదు. నేరుగా నాన్నగారి పేరుతోనే ప్రకటింపబడతాయి. గమనించవలసిందిగా మనవి.

      తొలగించండి
  15. అవిరళ భక్తిని నిత్యము
    భవసాగర తరణమునకు పరమాత్మ కథా
    శ్రవణముపాయము శివకే
    శవపూజల వలన జన్మ సార్థక మగురా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  16. గు రు మూ ర్తి ఆ చా రి .
    ................ ..........

    అవివేక మా౦త్రికు డొక౦


    డవిరళ మగు క్షుద్ర శక్తి
    న౦దుట కై మా


    నవు జ౦పి శిష్యుతో ననె


    " శవపూజల వలన.
    జన్మ సార్థక మగు రా ! "

    రిప్లయితొలగించండి


  17. గు రు మూ ర్తి ఆ చా రి .
    ................ ..........

    అవివేక మా౦త్రికు డొక౦


    డవిరళ మగు క్షుద్ర శక్తి
    న౦దుట కై మా


    నవు జ౦పి శిష్యుతో ననె


    " శవపూజల వలన.
    జన్మ సార్థక మగు రా ! "

    రిప్లయితొలగించండి
  18. శివ రామ కృష్ణు లొకరే
    భవ భయములు బాపువారు పామర వినుమా
    సవినయ భక్తిని శివ కే
    శవ పూజల వలన జన్మ సార్థక మగురా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. నవకమలమ్ములఁ గోరక
    యవస్తలందున్నవారి నాదుకొనెడు మా
    నవసేవఁ బూజనెడు కే
    శవ పూజల వలన జన్మ సార్థక మగురా!

    రిప్లయితొలగించండి
  20. పవమాన సుతుల స్ట్రైకున
    నవరంధ్రమ్ములను మూసి నగవుచు చంపన్
    చివరకు తోకలు మూయగ
    శవపూజల వలన జన్మ సార్థక మగురా

    రిప్లయితొలగించండి