20, నవంబర్ 2015, శుక్రవారం

పద్యరచన - 1069

కవిమిత్రులారా,
"నమ్మితిని నా మనమున సనాతనులగు...'
ఇది పద్యంలో మొదటి పాదం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

30 కామెంట్‌లు:

 1. నమ్మితిని నామనమున సనాతనులగు
  వారిపద్దతు లెన్నియో దారిజుపి
  నీతినియమాలునిష్ఠగ నిలుపునట్లు
  సాగుజేయుచుసంఘమ్ము సాకుగాన.

  రిప్లయితొలగించండి
 2. పోతన గారి ‘నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్...’ పద్యానికి రూపాంతరం...

  నమ్మితిని నా మనమున సనాతనులగు
  నా యుమామహేశ్వరులను నాదిదంప
  తులను మిమ్ము మేలుగ భజింతును గదమ్మ
  హరినిఁ బతిఁ జేయుమమ్మ దయాంబురాశి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. శ్రీ పోతనామాత్యుని హృదయ వృత్తాన్ని తేట తెలుగు గీతిలో చక్కగా వర్ణించారు. కవిహృదయోత్పలాలు సుందరములు గదా!

   తొలగించండి
 3. 1.నమ్మితిని నామనమున సనాతనులగు
  కులపు దైవంబు లెల్లరన్ కూర్మి తోడ
  మేమొనర్చు పూజల గొని మేలు జేయు
  మనుచు మనసార కొలుతుము మమ్ము కావ.
  2.నమ్మితిని నామనమున సనాతనులగు
  పూర్వపు ఋషుల నెల్లను పుడమి పైన
  దలచి మ్రొక్కులిడుచు నుందు దారి జూపు
  నట్టి మార్గదర్శకులైన నార్యులకును.
  3.నమ్మితిని నామనమున సనాతనులగు
  నాది దంపతులైనట్టి నాదిశక్తి
  మరియు పరమేశ్వరులనిల ;మమ్ము బ్రోచి
  వివిధ శుభముల నిడుమని వేడు కొనుచు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 4. నమ్మితిని నా మనమున సనాతనులగు
  ధర్మ మూర్తుల ఋషి ప్రబోధముల నెల్ల
  నాచరించెద సతతమ్ము నార్ష ధర్మ
  పథమున చరించెద ను కడు భక్తి తోడ.

  రిప్లయితొలగించండి
 5. నమ్మితి ని నామనమున సనా తనులగు
  పార్వ తీ పర మేశ్వరు పాద పద్మ
  ములను గడు గాఢ మగు బ్రేమ ముట్టి వడగ
  నాది దంపతు లేగద, యార్య !వారు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘పార్వతీ పరమేశ్వర పాదపద్మ...’ అనండి.

   తొలగించండి
 6. నమ్మితిని నా మనమున సనాతనులగు
  నాది దంపతుల శుభంకరావిరళ కృ
  పారసామృత వీక్షణా ప్రసరణులను
  పార్వతీ పరమేశుల భక్తి తోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 7. నమ్మితిని నామనమున సనాతనులగు
  బొమ్మ విష్ణు మహేశ్వరుల్ మువ్వుర, కడు
  భక్తి పూజసలుపు చుంటి ప్రతిదినమ్ము
  సంసరణపు బాధ లు వెస సమసిపోవ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.
   బొమ్మతో విష్ణుమహేశ్వరులను కలిపి సమాసం చేయరాదు కదా! ‘బ్రహ్మవిష్ణుమహేశ్వరపాదములకు’ అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
 8. నమ్మితిని నామనమున సనాతనులగు
  కొన్నిపద్డతులెంచినేకోరిజేతు
  శాస్త్రయుక్తంబు లైనట్టి సంపదనుచు
  చేయబూనెద సంస్కృతి మాయనట్లు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘సనాతనములగు పద్ధతులు’ అనాలి కాని, సనాతనులగు పద్ధతులు అనరాదు కదా!

   తొలగించండి

 9. * గు రు మూ ర్తి ఆ చా రి *

  నమ్మితిని నా మనమున సనాతనులగు
  బ్రహ్మ విష్ణు మహేశుల. ప్రత్యహమ్ము ;
  స్వా౦తమున వారి గొల్వని జన్మ మి౦క >>
  "భసిత నిక్షిప్త ఘృతముగ వ్యర్థ మగును

  ( భసిత నిక్షిప్త ఘృతము = బూడిదలో
  ను౦చబడిన. నె య్యి )

  రిప్లయితొలగించండి
 10. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నాయీ సందేహమును నివృత్తి జేయ గోర్తాను.
  మానిని వృత్తములో రెండు రకములున్నవా?
  భ , భ , భ , భ , భ , భ , భ , గ గణములతో 7,13,19 అక్షరాలు యతితో ఒకటి , 13 వ అక్షరము యతితో ఒకటీను.
  మానిని. తమ్ములుఁ దానును ధర్మ తనూజుఁడు తత్ క్షణసంభృత సంభ్రముఁడై
  అమ్మునినాథ వరేణ్యునకున్ వినయమ్మున మ్రొక్కి సమున్నత పీ
  ఠమ్మున నుంచి యథావిధి పూజలొడంబడఁ జేసి మునీశ్వర నె
  య్యమ్మున నీవిట వచ్చుట జేసి కృతార్థుల మైతిమి యిందఱమున్ భా. ఆ. 8-91

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మానిని అనేది 22వ ఆకృతి చ్ఛందంలోని 1797559వ వృత్తం. దీని గణాలు భభభభభభభగ.7, 13, 19వ అక్షరాలు యతి చెల్లుతాయి. భీమన 13వ అక్షర మొక్కటే యతి చెల్లుతుందని చెప్పి ఉదాహరణగా మాత్రం 7,13,19 అక్షరాలకు యతి చెల్లే పద్యాన్ని ఇచ్చాడు. అప్పకవి 13వ అక్షరానికే యతి చెప్పి అటువంటి ఉదాహరణమే ఇచ్చాడు. మీరిచ్చిన పద్యం అప్పకవి లక్షణానికి సరిపోతుంది. ఇక భీమన చెప్పిన లక్షణానికి ఉదాహరణ...
   బంగరుచేలయుఁ *బద్మనిభాక్షులు *బాహుచతుష్కము *భవ్యవిభో
   త్సంగిత శంఖసు*దర్శన శార్ఙ్గగ*దాముఖ చిహ్నము *తత్త్వము నీ
   లాంగము నీనది *యౌర సృజించు ని*జాశ్రిత దేహికి *నంతిక స
   ద్రంగశయానుఁ ది*రంబుగఁ జూచి క*రం బిదివో చతు*రత్వమునన్. (కళా. 2-149)

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నాసందేహమును నివృత్తి జేశారు. ధన్యవాదములు.

   తొలగించండి
 11. నమ్మితిని నా మనమున సనాతనులగు
  ముగురు మూర్తుల నెపుడు నే పూజ జేతు
  వారె నను గాచు చుందురు వారి కరుణె
  కష్టములనుండి కాపాడి గాచుచుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. నమ్మితిని నా మనమున సనాతనులగు
  నాది దంపతుల దలచి యనవరతము
  ధూప దీపము లీయుచు తుష్టి తోడ
  వేడుకొందును నిత్యము విరుల గొలిచి!!!


  రిప్లయితొలగించండి
 13. శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  "ధుప దీపము లొసగుచు" అనండి.

  రిప్లయితొలగించండి
 14. నమ్మితిని నామనమున సనాతనులగు
  పార్వతీపరమేశుల భక్తిమీర
  నాదిదంపతులనిగొల్తు నాశతోడ
  వమ్ము చేయరు గదమ్మ నమ్మకమును
  హరిను పతిజేసి భాగ్యమ్ము నందనిమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. 'జాశ్రిత' అన్న పదం లేదు. నిఘంటువులలోను లభించలేదు. మీరు ఈ పదాన్ని ఎక్కడనుండి స్వీకరించారో ఆ పద్యం కాని, వాక్యం కాని పూర్తిగా ఇవ్వండి.
  జ+ఆశ్రిత అని చూస్తే 'జ' అంటే చంద్రబీజమని నిఘంటువు చెప్తున్నది. దానిని ఆశ్రయించి ఉండేదని అర్థం వస్తున్నది.
  జా+శ్రిత అని చూస్తే 'జా' అంటే గెలుపు అని నిఘంటువు చెప్తున్నది. గెలుపును ఆశ్రయించి ఉండేదని అర్థం చెప్పుకోవచ్చు.
  ఏదేమైనా మీరా పద్యాన్నో, వాక్యాన్నో పూర్తిగ ఇస్తే సరైన వివరణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.

  రిప్లయితొలగించండి