19, నవంబర్ 2015, గురువారం

సమస్య - 1859 (లంగా లేకున్న వలదు)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

34 కామెంట్‌లు:

 1. మంగళ కరమంచు దలచి
  బంగరు ప్రతిమన్ బ్రతిష్ఠ భక్తిఁ జలిపియున్
  కంగారు పడెడు మది పది
  లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. బంగారపు నగ లందున
  సింగా రించగ ప్రతిమను సిరులే విరియున్
  గంగను మునిగిన మదికుశ
  లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్

  రిప్లయితొలగించండి
 3. మంగళ కరమగు వ్రతమును
  హంగులతోచేయ నెంచి యన్యుల మనముల్
  భంగప రచుచుమది విశా
  లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్.

  రిప్లయితొలగించండి
 4. బంగారు కాంతులీనెడు
  సింగార మొలుకు ప్రతిమయె సిరులనొసగు, నా
  సంగతి హృదయము లో పది
  లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్

  రిప్లయితొలగించండి

 5. పంచె లేకున్న వలదు వెంకన్న గుడికిన్
  ఓణీ లేకున్న వలదు పద్మావతి చెంతకున్
  పూబోణి ! అలివేణి ! అమ్మన్ణీ ! వేణీ
  లంగా లేకున్నా వలదు లక్ష్మీ పూజల్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ భావానికి నా పద్యరూపం....

   అంగపు వస్త్రము లేక చ
   నంగఁ జనదు తిరుమలేశు నాగారము, చ
   క్కంగా వసనంబులు పది
   లంగా లేకున్న వలదు లక్ష్మీపూజల్.

   తొలగించండి
 6. పదిలంగా పద్యములు వ్రాయుచున్న కవిమిత్రులకు అభినందనలు.

  లంగా వోణీ గట్టుక
  బంగారపు బొమ్మవోలె పదపద గుడికే !
  జంగమ దేవర భక్తి బ
  లంగా లేకున్న వలదు లక్ష్మీ ! పూజల్.

  రిప్లయితొలగించండి
 7. రంగని సతినే గొలువగ
  మంగళముగ నిష్టతోడ మనసా వాచా
  హంగుగ బూజించుము, విమ
  లంగా లేకున్న వలదు లక్ష్మీ బూజల్!!!

  రిప్లయితొలగించండి
 8. రంగుల కలలో తేలుచు
  భంగములు కలుగుచు నుం డ ప్రాయపు సడితో
  ముంగల నీ హృద యము పది
  లంగా లేకున్కి వలదు లక్ష్మీ పూజల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. గంగా ప్రవాహ మై సిరి
  పొంగి పొరలునాదిలక్ష్మి పూజిం చిన, యా
  సంగతి నీ మదిలో పది
  లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్

  రిప్లయితొలగించండి
 10. మంగళదాయి రమా దే
  వింగని మ్రొక్కవలె భక్తిఁ బ్రియముగ మరియె
  భ్భంగిని శ్రద్దయు భక్తి బ
  లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. బంగరు వన్నెల గూడిన
  రంగని సతియైన యా మె రక్తిని జూడ
  న్నంగన లారా !మీ మన సులువిమ
  లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవపాదంలో గణదోషం. ‘రక్తిని గనగా| నంగనల మనమ్ములు విమ|లంగా...’ అనండి.

   తొలగించండి
 12. బంగారు నగలు మెడలో
  పొంగారగ వేసుకొనిన పొలతులు మదిలో
  మంగళకరమౌ భక్తి బ
  లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘పొలతుల మదిలో’ అనండి.

   తొలగించండి
 13. పొంగారు భక్తి భావన
  సింగారమునందుపూలు-సిరిమల్లియలై
  బంగారముగా-ననుకూ
  లంగా లేకున్న వలదు లక్ష్మీపూజల్.
  2.బంగారమువంటి భక్తియు
  సింగారమునింపు మనసు సిద్డతచేతన్
  పొంగెడి నుత్సాహంబుబ
  లంగా లేకున్న వలదు లక్ష్మీపూజల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవపూరణ మొదటిపాదంలో గణదోషం. ‘బంగారు వంటి భక్తియు’ అనండి.

   తొలగించండి
 14. అంగన్యాసాదులు చే
  యంగ సరియె? శ్రీపదాంబుజాశ్రితులై సా
  ష్టాంగవిధి భక్తితో వ్రా
  లంగా లేకున్న వలదు లక్ష్మీపూజల్.

  రిప్లయితొలగించండి
 15. * గు రు మూ ర్తి ఆ చా రి * గారి అన్నారు....

  {నేను పద్యము లో " ల౦ గా " తో సహా " లు౦ గీ " కూడ చేర్చాను లక్ష్మి యను నామెను స౦బోధి౦చి ఆమె తల్లి ఈవిధ౦గా నీతి బోధి౦చినది :-- లక్మీ ! పతి సేవ లేని పూజలు వలదు }
  బ౦గారము వ౦టి గుణమె
  సి౦గారము ; మగువకు పతి సేవ యికన్ జా
  లు౦ గీలక మది లో గ్రా
  ల౦గా లేకున్న , వలదు లక్ష్మీ ! పూజల్

  {కీలకము = మర్మము , శ క్తి , బీజ మ౦త్రము ; లో = మదిలో ; గ్రాల౦గా లేకున్న. = ప్రకాశి౦చ లేక యున్న}

  రిప్లయితొలగించండి
 16. రంగని గొలువ మనసు పది
  లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్
  ముంగిట ముమ్మూర్తుల నిడి
  దొంగగ సంపదల బొంద తుదకగు జైలే

  రిప్లయితొలగించండి
 17. కవిమిత్రులారా,
  ఈనాటి సమస్యాపూరణలలో ఒక విషయం ప్రస్తావించవలసి ఉన్నది. కొందరి పద్యాలలో వారు ప్రయోగించిన వ్యావహారిక పదాలకు సవరణలను సూచించాను. కాని పూరణలకు అనుకూలించిన పదాలు ‘పదిలంగా, బలంగా, విమలంగా, కుశలంగా, అనుకూలంగా’ అనేవి వ్యావహారిక పదాలు. కవివరేణ్యులు డా. విష్ణునందన్ గారు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. అంతకంటె గత్యంతరం లేదనుకొని ఆ పూరణలు బాగున్నవి అన్నానే కాని ఊకదంపుడు గారి ‘వ్రాలంగా’, గురుమూర్తి ఆచారి గారి ‘క్రాలంగా’ ప్రయోగాలు సాధువులు. పదిలంగా మొదలైన ప్రయోగాల విషయంలో హెచ్చరించకుంటే అవి సాధుప్రయోగాలే అనుకునే ప్రమాదం ఉంది కనుక తెలియజేస్తున్నాను. గమనించండి.

  రిప్లయితొలగించండి
 18. మంగా! జాగ్రత! పిల్లా!
  నంగాగా నుండరాదు నగలన్నిటితో
  బంగరు బొమ్మకు చీరయు
  లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్!

  రిప్లయితొలగించండి