ఊకదంపుడు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు’ అన్నది గసడదవాదేశానికి కూడ వర్తిస్తుంది. ‘చేసి+పెట్ట’ అన్నప్పుడు గసడదవాదేశ సంధి రాదు. ‘చేసి పెట్ట’ అనే ఉంటుంది.
శ్రీ శంకరయ్య గారికి నంస్కారం . పూరణములు పోస్ట్ చేయుటలో నేను చేసిన విధానం సరియైనదేనా ? (ప్రత్యుత్తరం కాలం లో పోస్ట్ చెయ్యటం ) . అది కాక వ్యాఖ్యలలోకి వెడితే అది మెయిల్స్ లోకి తీస్కు వెడుతున్నది. దయచేసి పూరణలు పోస్ట్ చేసే విధానం తెలియజేయ వలసినది.
లోకుల మాటలు విడుమిక
రిప్లయితొలగించండినీ కరమునఁ జేసి వెట్ట, నీ కన్నులలో
నా కన్ను లుంచి నేఁగొనఁ
గాకర చేఁ దన్నమాట కల్లయె సుమ్మీ.
ఊకదంపుడు గారూ,
తొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
‘క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు’ అన్నది గసడదవాదేశానికి కూడ వర్తిస్తుంది. ‘చేసి+పెట్ట’ అన్నప్పుడు గసడదవాదేశ సంధి రాదు. ‘చేసి పెట్ట’ అనే ఉంటుంది.
గురువుగారూ, మన్నించండి,
తొలగించండిసవరించిన పద్యము
లోకుల మాటలు విడుమిక
నీ కరమునఁ జేసి పెట్ట, నీ కన్నులలో
నా కన్ను లుంచి నేఁగొనఁ
గాకర చేఁ దన్నమాట కల్లయె సుమ్మీ.
వాకబు జేసిన తెలియును
రిప్లయితొలగించండిప్రాకటముగ వండి తినిన ప్రాముఖ్య మటన్
సాకము మేలగు వంటికి
కాకర చేదన్న మాట కల్లయె సుమ్మీ
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్షమించాలి
రిప్లయితొలగించండిశాకము
గురువు గారికి ప్రణామములు ..సుకవి మిత్రులకు అభినందనలు
రిప్లయితొలగించండిలోకము లోమధు మేహుల
శాకమనెడు కీర్తినొంది సకల జనాళిన్
తా కుశలతనొస గెడునా
కాకర చేదన్న మాట కల్లయె సుమ్మీ
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లోకుల మాటలు నమ్ముచు
రిప్లయితొలగించండికాకర చేదంచు విడువ కాయము చెడుటన్
నిక్కము ;తినుటయు మానకు
కాకర చేదన్న మాట కల్లయె సుమ్మీ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిడా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నా కలల రాణి నీవే
రిప్లయితొలగించండినాకైతివి భార్యగాను నమ్ముము, నిజమే
నీ కరము చేత వండిన
కాకర చేఁ దన్నమాట కల్లయె సుమ్మీ.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భీకరముగ నుడి వితిరే
రిప్లయితొలగించండికాకర చేదన్న మాట కల్లయె సుమ్మీ
కాకర చేదుగ నుండక
యేకర ణి ని దీయ నుండు నీ శా ! చెపుమా .
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శాకములందున మేటిగ
రిప్లయితొలగించండినాకారము జూడ గరకు నౌషధగుణముల్
ప్రాకటముగ నిచ్చెడు నా
కాకర చేదన్నమాట కల్లయె సుమ్మీ!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కీకారణ్యములె యొసగు
రిప్లయితొలగించండినీ కుంభిని వర్షపాత మెవ్విధి నైనన్
నాక చరాంబుదముల ఫల
కాకర చేఁ దన్నమాట కల్లయె సుమ్మీ.
[ఫలక + ఆకర = ఫలకాకర = ఫలకలకు నిలయమైనది, కొండ; చేఁదు= ఆకర్షించు]
పాకములందు ప్రశస్తము
తొలగించండిశాకము చేదైన నెట్టి సంతాపములం
జేకూర్ఛ దనామయమున్
కాకర చేఁదన్నమాట కల్లయె సుమ్మీ
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నది. అభినందనలు.
ఫలకాకర... అని విభక్తి ప్రత్యయం లేకుండా వ్రాయరాదు కదా!
‘
ఆకాకరకాయలెపుడు
రిప్లయితొలగించండినీకాలము దొరుకుచుండు నిబ్బ డి గానే
కైకొనుడి ష్టముగా నా
కాకర చేదన్న మాట కల్లయె సుమ్మీ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆకాకర రుచికరమౌ
రిప్లయితొలగించండినాకాకర ధరయు మిన్న యైనను కొందున్
నాకెంతో యిష్ట మ్మా
కాకర చేఁ దన్నమాట కల్లయె సుమ్మీ.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సోకిన చక్కర రోగికి
రిప్లయితొలగించండికాకర చేదన్నమాట కల్లయె సుమ్మీ
లోకులవలె తాననినవి
వేకము నశియించినట్లె –విలువలు సున్నా.|
2.కాకర నౌషధ గుణములు
సోకిన|రోగాలుదగ్గు సోమరికైనా
లోకులకది చేదు నిజము
కాకరచేదన్నమాట కల్లయె సుమ్మీ
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
సున్నా, సోమరికైనా... అని వ్యావహారికాలను ప్రయోగించారు. విలువలు తొలగున్, సోమరికైనన్... అనండి.
ఏకబిగిని శ్రమజేయుచు
రిప్లయితొలగించండినాకలితో నున్న వాని కాహార మిడన్
నూకల గంజియె నమృతము
కాకర చేదన్నమాట కల్లయె సుమ్మీ .
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏకబిగిని శ్రమజేయుచు
రిప్లయితొలగించండినాకలితో నున్న వాని కాహార మిడన్
నూకల గంజియె నమృతము
కాకర చేదన్నమాట కల్లయె సుమ్మీ .
రాకూడని మధుమేహము
రిప్లయితొలగించండిచే, కుందుచునున్న రోగి, చెప్పెను కవితన్
"శాకము చక్కెర పాకమె
కాకర; చేఁ దన్నమాట కల్లయె సుమ్మీ.
చేకూరగ నారోగ్యము
కాకర చిక్కుడును గోబి క్యారటులు తినన్
శాకము ప్రియమైనను నా
కాకర చేఁ దన్నమాట కల్లయె సుమ్మీ.
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రిప్లయితొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
కాకరకు పులుసు పి౦డుచు
శాకము వ౦డుకొని తిన పస౦దుగ. ను౦డున్
శాక మొసగు నొడలునకున్
కాకర చేదన్న మాట కల్లయె సుమ్మీ
ీ ( శాకమొసగు = శక్తి నొసగు )
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శాకముల సంకరమునన్
రిప్లయితొలగించండిలోకమ్మున తారుమారు రుచులే మిగులు
న్నేకారముండదు మిరప
కాకర చేదన్న మాట కల్లయె సుమ్మీ!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిలోకుల రోగము మాన్పఁగఁ
జేకొను మాత్రలవి మిగుల చేఁదగు నటులే
కాఁకర గుణముల నెన్నఁగఁ
గాఁకర చేఁదన్న మాట కల్లయె సుమ్మీ!!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గారికి నంస్కారం . పూరణములు పోస్ట్ చేయుటలో నేను చేసిన విధానం సరియైనదేనా ? (ప్రత్యుత్తరం కాలం లో పోస్ట్ చెయ్యటం ) . అది కాక వ్యాఖ్యలలోకి వెడితే అది మెయిల్స్ లోకి తీస్కు వెడుతున్నది. దయచేసి పూరణలు పోస్ట్ చేసే విధానం తెలియజేయ వలసినది.
తొలగించండిలోకోద్ధరణమ్మే శ్రే
రిప్లయితొలగించండియోకార్యమ్మనుచు సాయి యోగీశుండై
తాకగ నా వేపాకులుఁ
గాకర, చేఁ దన్న మాట కల్లయె సుమ్మీ!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
కాకర చేదని బెదరక
రిప్లయితొలగించండిమాకొక యవకాశమిండు మారును రుచియే
యీ కారము బెల్లముతో
కాకర చేదన్న మాట కల్లయె సుమ్మీ !
(వంటవాళ్లు చేదు లేకుండా కాకరకాయ వేయిస్తా మని , తమకి అవకాశమివ్వమనీ డుగుతున్నారు.)
ధనికొండ రవిప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదం సర్ !
తొలగించండిపీకగ గింజలు గుజ్జును
రిప్లయితొలగించండిమూకుడు నూనెను సలసల మురుకుల వోలెన్
చీకాకుగ వేయించగ
కాకర చేఁ దన్నమాట కల్లయె సుమ్మీ
భీకరమౌ బెల్లముతో
రిప్లయితొలగించండిప్రాకారము దద్దరిల్ల వంటల గదినిన్
పాకము పట్టగ నత్తయ
కాకర చేఁ దన్నమాట కల్లయె సుమ్మీ