దైవము పై న భారమిడి ధర్మము దప్పక జీవనం బును న్నెవ్వడు జేయునో నతని నేడు తరంబుల వారికి న్దగన్ లావుగ సర్వ సంపదలు లాస్యము గామఱి యీ శు డి చ్చుత న్వేవురు సంతసంబడగ,వీడని బ్రేమను గల్గి యుంట చే
దైవము పైన భారమిడి ధర్మము తప్పక సంచరించ నా దైవమె గాచుచుండు తగు దారిని జూపుచు నెల్లవేళలన్ జీవన మార్గమందుగల చిక్కులుదీర్చుచు కాంతినింపుచున్ పావనరాఘవుండు నిజ భక్తుల బ్రోవును సర్వదాకృపన్ !!!
దైవము పైన భారమిడి ధర్మముఁ దప్పక పాలనంబు న
రిప్లయితొలగించండిన్నీవిధి యాట లాడునని నేకల నైనను గాంచ కుంటినే
కావగ రారు దేవతలు కానల కంపితి క్రూర తండ్రినై
పావన మైనరాము గని భారము నిల్పుచు పాపినై తినే
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
'న|న్నీవిధి నాటలాడునని యేకల... 'అనండి.' క్రూరతండ్రి' అని సమాసం చేయరాదు.
దైవముపైన భారమిడి ధర్మముఁదప్పక ధీక్షతోడుతన్
రిప్లయితొలగించండిసేవకవృత్తిలో మసల చిక్కును మోక్షము నిశ్చయంబుగా
రావలె చెచ్చెరన్ మనకు రాముని పాలన దేశ వృద్ధికై
పోవలె స్వార్థచింతనము పొందగ సద్గతి సంతతమ్మిలన్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
దైవము పైన భారమిడి ధర్మము తప్పక పెద్దవారికిన్
రిప్లయితొలగించండిసేవలనంద జేసిన యశేష జనావళి గారవింపదే
నీవొక మార్గదర్శిగననేకులు తల్చుచు గుండెలందునన్
కోవెల గట్టి నిన్నెపుడు కొల్తురు దేవుని రీతిగా నిలన్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.
దైవముపైన భారమిడి ధర్మముఁ దప్పక జేయు కార్యముల్
రిప్లయితొలగించండిజీవన యానమందున విజేతగ నిల్పును నిన్ను మిత్రమా !
చావని వార్య మంచెరిగి సాగుము ముందుకు నిర్మలాత్మతో
భావము నందు దీనుల కభాగ్యులకున్ దగు స్థాన మిచ్చుచున్
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
దైవము పై న భారమిడి ధర్మము దప్పక జీవనం బును
రిప్లయితొలగించండిన్నెవ్వడు జేయునో నతని నేడు తరంబుల వారికి న్దగన్
లావుగ సర్వ సంపదలు లాస్యము గామఱి యీ శు డి చ్చుత
న్వేవురు సంతసంబడగ,వీడని బ్రేమను గల్గి యుంట చే
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
దైవముపైన భారమిడి ధర్మముఁ దప్పక సంచరించుచున్
రిప్లయితొలగించండిపావక కీల లందు మసిబారిన వీటిని వీడి నత్తరిన్
పావన జాహ్నవీ నదిని పాటవ మొప్పగ దాటి రాత్రి వే
ళా వసుదేవసూను మది నందిడి పాండవు లుండె కానలన్
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పాండవు లుండిరే వనిన్... అనండి.
దైవము పైన భారమిడి ధర్మము తప్పక సంచరించ నా
రిప్లయితొలగించండిదైవమె గాచుచుండు తగు దారిని జూపుచు నెల్లవేళలన్
జీవన మార్గమందుగల చిక్కులుదీర్చుచు కాంతినింపుచున్
పావనరాఘవుండు నిజ భక్తుల బ్రోవును సర్వదాకృపన్ !!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
దైవము ఫైన భారమిడి ధర్మము దప్పక జీవితంబులో
రిప్లయితొలగించండిభావన బాధ్య తాయుతపు బంధము నందున సాగుభక్తిచే
దీవెనలంది పెద్దల విదేయుడ వయ్యును ధర్మ మార్గమున్
జీవనయానమందు తనచింతన, నీతినినుంచుశిష్యుడా
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
దైవము పైన భారమిడి ధర్మముఁ దప్పక సాగుమర్జునా!
తొలగించండినీ వొనరించు కర్మలను నిశ్చల చిత్తుడవై మదర్పణా
భావనఁ జేయుమా! ఫలముపై నధికారము నీదికాదయా!
చేవయె లేనివాడటుల చెల్లక యుండక ముందుకేగుమా!
కౌసల్య వనవాసమేగు రాముని దీవింఛుట...
రిప్లయితొలగించండిదైవముపైన భారమిడి ధర్మముఁ దప్పక సంచరించుమే
తావుననైన, రాజ్యమును తమ్ము కొసంగితి, కాననమ్ములో
నీవును సీతతో కలిసి నెమ్మది నుండగ లక్ష్మణుండు తా
సేవలఁ జేయగా మిగుల క్షేమమునుండుము, దీవనమ్మిదే!
దైవముపైన భారమిడి ధర్మముఁ దప్పక వోట్లకోసమై
రిప్లయితొలగించండిదీవెన కోరుచున్ గుడుల తీర్చుచు దిద్దుచు పంగనామముల్
పావల వడ్డికిన్ పడసి బ్యాంకుల దోచుచు వేలకోట్లనున్
నీవెర సార్వభౌముడవు నిక్కము భారత దేశభక్తుడా!
దైవముపైన భారమిడి ధర్మముఁ దప్పక పీల్చి గంజనున్
రిప్లయితొలగించండికోవెల లందు మ్రొక్కుచును కొబ్బరి కాయలు కొట్టుమయ్యరో!
నావలె కన్నుగొట్టుచును నవ్వుచు మోడిని కౌగిలించరా!
పోవుము వాయనాడునకు పోవగ సీటు యమేఠినందునన్!