27, నవంబర్ 2015, శుక్రవారం

సమస్య - 1867 (పెద్దవాఁడు దగఁడు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పెద్దవాఁడు దగఁడు వృద్ధుఁ డనఁగ.

42 కామెంట్‌లు:

 1. యత్న మించుకైన నక్కర లేకుండ
  పెరుగు చుండు వయసు ధరణి యందు
  సద్గుణములు లేని సంస్కార మెరుగని
  పెద్ద వాడు దగడు వృద్ధుడనగ

  రిప్లయితొలగించండి
 2. బుద్ధి మంతు డైన పురుషోత్త ముండని
  మెచ్చు కొందు రిలను మిక్కు టముగ
  పిదప బుద్ధి గలిగి పేశలముగ నుండు
  పెద్ద వాఁడు దగఁడు వృద్ధుఁ డనఁగ

  రిప్లయితొలగించండి
 3. వయసు మీరి గూడ వార్ధక్య భావాలు
  మనసునంటకుండ మసలు వాడు
  మహిని జూడ నెంతొ మహితత్వ యువకుడే
  పెద్ద వాడు! తగడు వృద్ధుడనగ

  రిప్లయితొలగించండి
 4. వయసు పెరుగు చుండ ప్రఙ్ఞ లేకున్నచో
  తీరు మార్చ వలెను తిట్టకుండ
  బుద్ధి మాంద్యు డనుచు పోషింప వలెగాని
  పెద్దవాడు దగడు వృద్ధు డనగ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. స్వార్ధబుద్ది వదలి సత్కర్మలను జేయు
   పెద్దవాడు జ్ఞాన వృద్దుడనగ
   ముదిమినందు నాలి ముచ్చు కోరిక లున్న
   పెద్దవాడు తగడు వృద్దుడనగ

   తొలగించండి
  3. స్వార్ధబుద్ది వదలి సత్కర్మలను జేయు
   పెద్దవాడు జ్ఞాన వృద్దుడనగ
   ముదిమినందు నాలి ముచ్చు కోరిక లున్న
   పెద్దవాడు తగడు వృద్దుడనగ

   తొలగించండి
  4. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. పిన్నవాడెయైన పెక్కుగ్రంధములను
  జదివియతుల విపుల జ్ఞానమొంది
  ప్రవచనఘనుడనెడి ప్రజ్ఞాన నిధియైన
  పెద్దవాఁడు దగఁడు వృద్ధుఁ డనఁగ.

  రిప్లయితొలగించండి
 6. అనుభవము గడించి యజ్ణానమును వీడి
  యువత కెపుడు మంచి యుక్తి జెప్పు
  వారు వృద్ధు లంట, వయసున మాత్రమే
  పెద్దవాడు తగదు వృద్ధుడనగ.

  రిప్లయితొలగించండి
 7. తలది పండిగూడ తలపులు పండక
  విషయ వాంఛలసలు విడవకుండ
  పరుల బాధపెట్టి బ్రతుకుచుండినయట్టి
  పెద్ద వాఁడు దగఁడు వృద్ధుఁ డనఁగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రవికాంత్ మల్లప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తల+ అది ' అన్నప్పుడు యడాగమం వస్తుంది, సంధి లేదు.

   తొలగించండి
 8. జ్నాన వృద్ద వృద్దజన శీలవృద్దుల
  నంబరగు త్రివిధ జనగణ మవని
  గుణ విహీను డైన కుమతియు వయసున
  పెద్దవాఁడు దగఁడు వృద్ధుఁ డనఁగ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వరరావు గురూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   జ్ఞాన.. టైప్ చేయడంలో ఇబ్బంది పడ్డట్టున్నారు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.” జ్ఞా” భద్ర పరచి ఉంచానిప్పుడు.

   తొలగించండి
 9. వయసు పెరుగు చున్న వాంఛలు వీడని
  మనుజుడధముడౌను మహిని తుదకు
  దుష్టబుద్ది తోడ దుండగములు జేయు
  పెద్దవాఁడు దగఁడు వృద్థుఁడనగ !!!

  రిప్లయితొలగించండి
 10. సమస్య
  * గు రు మూ ర్తి ఆ చా రి *
  ''''''''''''''''''''''''''''''''''''''''
  8. పా ద ము లు గ ల సీ స ప ద్య ము
  ......................................................

  సదనుభవమ్ముల స్పర్శ. లేకున్నచో
  పెద్దవాడు దగడు వృద్ధుడనగ
  ..................................
  పరులకు గ్నానమ్ము ప౦చ లేకున్నచో
  పెద్దవాడు దగడు వృధ్ధుడనగ
  ..................................
  దానగుణము భూతదయయు లేకున్నచో
  పెధ్ధవాడు దగడు వృధ్ధుడనగ
  .............. ..... ............
  మ౦చి c జెడును విమర్శి౦చ లేకున్నచో
  పెధ్ధవాడు దగడు వృధ్ధు డనగ
  ...................................
  "పెద్ద" నను పొగరు వీడ లేకున్నచో
  పెద్దవాడు దగడు వృద్ధుడనగ
  .............................. ..
  అ౦దరి ప్రేముడి న౦ద లేకున్నచో
  పెద్దవాడు దగడు వృధ్ధుడనగ
  .................................
  ఆశా పిశాచకి కవల. లేకున్నచో
  పెద్దవాడు దగడు వృధ్దుడనగ
  ..........................,.....
  హరిచి౦త నామృత. మాన లేకున్నచో
  పెద్దవాడు దగడు వృధ్ధుడనగ
  .....................................

  శీలు డైన. నగును :- చిన్న వాడైనను
  పెద్ద వాడు | దగడు వృద్ధు డనగ >
  పెద్ద గుణముల కడు పేర్మి లేకు౦డిన|
  వయస దేల ? కాల్చ పనికి వచ్చు !


  6 వ పా . ప్రేముడి : ప్రేమ
  7 వ పా. అవల లేకున్నచో : అవతల లేనిచో
  8 వ పా. ఆనలేకున్నచో : త్రాగలేనిచో
  శీలుడు : సుగుణవ౦తుడు
  పేర్మి =పేరిమి : గౌరవము
  ............................................................

  రిప్లయితొలగించండి
 11. పెద్దవాడు దగడు వృద్దుడనగనేడు
  నాగరికుల యందు మూగవాడు
  సంతుకంతులందు సాగెడిబ్రతుకున
  మంతనాలుజరుపు మాన్యు డైన|
  2.కోటివిద్యలుండి కోట్లను నింపినా?
  పాట్లుదప్పవాయె బ్రమలయందు
  సంతసంబు లేని వింతపోకడలందు
  పెద్దవాడు దగడు వృద్దుడనగ
  3.నాటిపద్దతులను నేటికి జరిపించ
  పెద్దవాడుదగడు వృద్దుడనగ
  ఇంటిపెత్తనంబు నంటించు కొన్నచో?
  తగనిమాటలందు తల్లడిల్లు|

  రిప్లయితొలగించండి
 12. తల్లి క ర్మ కాండ తనరగ జేయంగ
  పె ద్దవాడు దగడు, వృధ్ధు డనగ
  వయసు మీరునతడు , పనిపాటు లే వియు
  చేయలే ని వాడు,క్షితిని బరగు

  రిప్లయితొలగించండి
 13. చంద్రమౌళి రామారావుగారి పూరణ:-

  జ్ఞానగరిమచేత సౌజన్యమహిమంబు
  చేత పిన్నఁ బెద్ద సేత తగును
  వయసు బలిమి ప్రాభవమున్న మాత్రాన
  పెద్దవాఁడు దగఁడు వృద్ధుఁ డనఁగ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి రామారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవపాదంలో గణభంగం. ‘...ప్రాభవమ్మున్న మాత్రాన’ అనండి.

   తొలగించండి
 14. మాష్టారూ...అది నా టైపాటు...అన్నయ్య ము క్రింద మ ఒత్తు తోనే వ్రాశారు

  రిప్లయితొలగించండి
 15. వరదరాజు గారి కిరువురు పుత్రులు
  గనఁగ పెద్దవాని కెనిమిదేడు
  లైదు వత్సరమ్ము లా చిన్నవానికి
  పెద్దవాఁడు దగఁడు వృద్ధుఁ డనఁగ.

  రిప్లయితొలగించండి
 16. వయసుమీరినంత వక్రబుద్ధి గలుగు
  పెద్దవాడు దగడు వృద్ధుడ నగ
  మంచి బుద్ధిగలిగి మనుచున్నవానిని
  వృద్ధుడనగ వలయు ప్రీతి తోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. శ్రీకృష్ణభగవానునితో ధర్మజుడు:

  ఎదుట నిలువ నెవని పదునుచాలదు బావ!
  చేతఁ జిక్కి బ్రతుకు జీవుఁ డెవడు?
  వెఱపు లేని వాడు! కురువంశ భీష్ముండు
  పెద్దవాఁడు! తగఁడు వృద్ధుఁ డనఁగ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. గురువుగారికి నమస్కారం. నా ఈ క్రింది పూరణ ను పరిశీలించి తప్పులు తెలియచేయగలరు.

  కొంతమందికుర్రవాళ్ళుపుటకతోనె
  వయసుమీరుముసలివారనుచును
  పరుగుపోటీనికడుబలమునగెలిచిన
  పెద్దవాఁడు దగఁడు, వృద్ధుఁ డనఁగ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేదుల సుభద్ర గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటిపాదంలో యతిదోషం. ‘కొంతమంది కుర్రకుంకలు జన్మతో’ అనండి. అలాగే ‘పరుగు పందెము కడు బలమున...’ అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదాలు గురువుగారు. సవరించానండి
   కొంతమందికుర్రకుంకలుజన్మతో
   వయసుమీరుముసలివారనుచును
   పరుగుపందెముకడుబలమునగెలిచిన
   పెద్దవాఁడు దగఁడు, వృద్ధుఁ డనఁగ.

   తొలగించండి
  3. ధన్యవాదాలు గురువుగారు. సవరించానండి
   కొంతమందికుర్రకుంకలుజన్మతో
   వయసుమీరుముసలివారనుచును
   పరుగుపందెముకడుబలమునగెలిచిన
   పెద్దవాఁడు దగఁడు, వృద్ధుఁ డనఁగ.

   తొలగించండి