21, నవంబర్ 2015, శనివారం

పద్యరచన - 1070

కవిమిత్రులారా,
"వచ్చి పోవుచుంద్రు బంధువుల్ మిత్రులు...'
ఇది పద్యంలో మొదటి పాదం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

26 కామెంట్‌లు:

  1. 1.
    వచ్చి పోవుచుంద్రు బంధువుల్ మిత్రులు
    కలిమి యున్న వాడి కరుణ గోరి
    సిరులు లేని వాడి దరికి జేరరెవరు
    వాస్త వమ్ము యిదియె వసుధ యందు

    2.
    వచ్చిపోవుచుంద్రు బంధువుల్ మిత్రులు
    అవస రార్థు లగుచు అతిథు లగుచు
    సాయమడిగి నంత ఛాయమాత్రమునైన
    కానరారు నిజము ఘనులు వారు

    3.
    వచ్చిపోవుచుంద్రు బంధువుల్ మిత్రులు
    పేర్మి తోడ నెంతొ కూర్మి తోడ
    కష్ట సుఖము నెఱగి కలతలనే ద్రుంచి
    అండగాను నిలిచి యాదరించ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పద్యంలో ‘వాస్తవమ్ము+ఇదియె’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వాస్తవ మ్మిదె కద వసుధయందు’ అనండి.

      తొలగించండి
  2. వచ్చిపోవుచుంద్రు బంధువుల్ మిత్రులు
    రొక్కముగలవారి యిక్కువలకు
    ధనముడిగిన నాడు దరిదాపులకు రారు
    నేటికాలమందు నీతి యిద్ది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. వచ్చి పోవు చుంద్రు బంధువుల్ మిత్రులు
    కపట బుద్ధి తోడ కలిమి గాంచి
    నున్న తంబు గాంచి నోర్వక శపియించి
    ఈసు జెంది తుదకు దోస మెంచి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘కలిమి గాంచి| యున్నతంబు గాంచి యోర్వక’ అనండి.

      తొలగించండి
    2. వచ్చి పోవుచుంద్రు బంధువుల్ మిత్రులు
      కపట బుద్ధి తోడ కలిమి గాంచి
      యున్న తంబు కనగ యోర్వక శపియించి
      ఈసు జెంది తుదకు దోస మెంచి

      తొలగించండి
  4. 1.వచ్చి పోవు చుంద్రు బంధువుల్ మిత్రులు
    ధనము చెంత నున్న తరుణ మందు
    కష్టములు కలిగిన కన్నెత్తి జూడరు
    తెలివి తోడ దీని తెలిసి కొనుము.

    2.వచ్చి పోవు చుంద్రు బంధువుల్ మిత్రులు
    వారికవసరమ్ము వచ్చినపుడు
    మన యవసరములకు మరి యిటు జూడరు
    యిప్పు డొత్తు మంచు నెపుడు రారు.

    3.వచ్చి పోవు చుంద్రు బంధువుల్ మిత్రులు
    సంకటంబులందు సాయ పడుచు
    అడగ కుండగానె నాసర గానిల్చి
    చేయుదు రిల మేలు సేమ మరసి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పద్యంలో ‘చూడరు+ఇప్పుడు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వత్తుము’ను ‘ఒత్తుము’ అనడం దోషమే. ‘మరి యిటు చూడబో| రిపుడు వత్తు మనుచు...’ అనండి.

      తొలగించండి
  5. వచ్చి పోవుచుంద్రు బంధువుల్ మిత్రులు
    ధనము గలిగెనేని దండిగ నిల
    ధన విహీను జూడ దలగి పోవరె వారు
    ధనమె మూల మాయె ధరణి నేడు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నా శతకము లోని పద్యము:
      ధనమున్న మెండు బాంధవ
      జనులు సఖులు ధనము వెంటఁ జనుదురు నరులున్
      ధనహీనుని గన రక్కట
      తనవారును పోచిరాజతనయా వినుమా

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం, శతక పద్యం రెండూ బగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. వచ్చి పోవు చుంద్రు బంధువుల్ మిత్రులు
    అక్షరాల సత్య మదియ సామి
    చెరువు,క ప్ప వోలె చీటికి మాటికి
    ధనముకలుగ మనకుదండిగాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. వచ్చిపోవుచుంద్రు బంధువుల్ మిత్రులు
    మెచ్చుకొంటు మనము పచ్చ గున్న
    మచ్చు కైన రారు మనమెండి పోయిన
    డబ్బు మహిమ గనుము రబ్బ నీవు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘మెచ్చుకొనుచు’ అనండి.

      తొలగించండి


    2. వచ్చిపోవుచుంద్రు బంధువుల్ మిత్రులు
      మెచ్చుకొనుచు మనము పచ్చ గున్న
      మచ్చు కైన రారు మనమెండి పోయిన
      డబ్బు మహిమ గనుము రబ్బ నీవు

      తొలగించండి
  8. వచ్చిపోవు చుంద్రుబంధువుల్ మిత్రులు
    పిలువకున్న వచ్చి కలయుచుంద్రు
    మమతలున్నచోట సమతల దృష్టియే
    సాగాకున్న మనము మూగవారె|
    2.వచ్చిపోవుచుంద్రు బంధువుల్ మిత్రులు
    అవసరాలకొరకు నాదుకొనుచు
    నొకరికొకరు లేక సకలముసూన్యమే
    సంఘ జీవ నాన సారమిదియె|
    3.వచ్చిపోవు చుంద్రుబంధువుల్ మిత్రులు
    కలిమిలేకయున్న కలసి మెలసి
    బ్రతుకునందుమనకుబాధ్యతభాగ్యమ్ము
    పంచ గలుగువారె-మంచివారు.



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపద్యంలో మనము మూగవారము అనాలి కదా! అక్కడ ‘సాగకున్న జనులు మూగవారె’ అందామా?
      రెండవపద్యంలో ‘శూన్యము’నుకు సూన్యము టైపాటు.

      తొలగించండి
  9. వచ్చిపోవు చుంద్రు బంధువుల్ మిత్రులు
    పిలచి నపుడు పెండ్లి వేడుకలకు
    కరువు కాటకముల కష్ట కాలమున౦దు
    వచ్చిగడపు వాడె బందువగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. పద్యరచన
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    .............................

    క్షమి౦చ౦డి , గురువుగారూ ! మీరిచ్చిన
    ఆటవెలది పాదాన్ని అ౦ బు రు హ. పాద౦గా
    మార్చుకొని పూరిస్తున్నాను .
    -----------------------------------------౭---
    అ౦ బు రు హ వృ త్త ము

    భ. భ. భ. భ. ర. స. వ. యతి = 13. వ. అ "
    ------------------------------------------------

    వచ్చుచు పోవుచు ను౦దురు వద్దకు
    బ౦ధువుల్ ప్రియ మిత్రులున్
    ........... ..............................................
    న్నిచ్చకమౌ వచన౦బుల నాడుచు
    నివ్వమ౦ద్రు ధన౦ బికన్
    ................................... ....................
    నచ్చిన నివ్వుము ; లేదని పి౦చిన.
    నౌ రు మా ట ల c బ౦పుమా ;
    ........ . .............................................
    నచ్చు వడన్ బరుష౦బుల బల్కకు ,
    నాయ మెప్పుడు కాదు సూ !
    .... ..... ... ............................................

    { నౌరుమాటలు = మృదువగు మాటలు :
    నచ్చు వడన్ = బాధపడునట్లు :
    కాదు సూ = కాదు సుమా }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ అంబురుహ వృత్తం బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  11. వచ్చి పోవు చుంద్రు బంధువుల్ మిత్రులు
    కష్ట సుఖములందు కలివిడిగను
    ఆదరముగ వారి కాతిధ్యమీయుచు
    కలసి మెలసి యున్న గలుగు సుఖము !!!

    రిప్లయితొలగించండి
  12. వచ్చిపోవుచుంద్రు బంధువుల్ మిత్రులు
    అతిథులంచు నీవు యాదరించఁ
    గల్గు సంఘమందు గౌరవసంపద
    మాన్యుడనుచుఁ బొగడ ధన్యచరిత!

    రిప్లయితొలగించండి
  13. వచ్చి పోవుచుంద్రు బంధువుల్ మిత్రులు
    జబ్బు జేసినపుడు సంతసముగ
    చూచి పోవుచుంద్రు చుట్టపు రీతిని
    రొక్కమడిగి నంత చిక్కరింక!

    రిప్లయితొలగించండి