వరవీ ణామృదు పాణీ కరములు జోడించితి నమ్మ కరుణిం చగనన్ పరుసము లాడక నిరతము సరసము గానుంచు మంటి సాహస మందున్
రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు.రెండవపాదంలో గణదోషం. ‘జోడించితి నమ/ జోడించితి నిక...’ అనండి. పద్యం చివర ‘సహవాసమునన్’ అంటే బాగుంటుందేమో!
వరవీ ణామృదు పాణీ కరములు జోడించితి నిక కరుణిం చగనన్ పరుసము లాడక నిరతము సరసము గానుంచు మంటి సహవాస మునన్ ధన్య వాదములు
మిత్రులందఱకు నమస్సులు!వరవీణా మృదుపాణీ!సురుచిర మధురోక్త వాణి! సుందర వేణీ!ధర వేదాగ్రణి! తరుణీవర రమణీ! గుణి! కవీశ వరనిశ్శ్రేణీ!
గుండు మధుసూదన్ గారూ, జన్మదిన శుభాకాంక్షలు!అంత్యానుప్రాసతో మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదములు శంకరయ్యగారూ!
* గు రు మూ ర్తి ఆ చా రి *..................................వరవీణా మృదుపాణీ !సరసీరుహభవుని రాణి ! చదువుల రాణీ !వర బ౦భర చయ వేణీ !సరసిజ పుస్తక శుకాక్ష స౦స్థిత పాణీ ![ బ౦భర చయము : తుమ్మెదల సమూహ౦. అక్ష :అక్షమాల. స౦స్థిత :చక్కగాను౦డిన ]
గురుమూర్తి ఆచారి గారూ, అంత్యానుప్రాసతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
వరవీణా మృదుపాణీకరకమ లాలంకృతాబ్జ కందర్పరధన్నరవిందాసన సుందరిసురుచిం గొలుతును విధాత సుమనోహారిన్
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వరవీణామృదుపాణీసరసిజములబోలునయన చదువుతల్లీమరినానాలుకమీదననిరతము వసియించుమమ్శ నెయ్యము దనరన్
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వరవీణా మృదుపాణీసరసిజ భవురాణిమాకు శరణమొసగుమోసరసిజనేత్రి కొలుతు నినువరము లొసగి బ్రోవుమమ్మ వదలకు మమ్మున్
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వర వీణా! మృదుపాణీ!భారతీ! బ్రాహ్మీ ! భగవతి! పలుకుల రాణీ !శారద ! శాబ్డీ ! రాజ్ఞీ !వరగుణ ! శ్వేతాంబరధరి ! భాషా యోషా!
శ్రీధర్ గారూ,మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘భారతి’ టైపాటు వల్ల దీర్ఘాంతమైనట్టుంది. దీర్ఘాంతమైతే గణదోషం.
కంది శంకరయ్య గురువు గార్కి పాద నమస్కారాలు. ఈ మధ్య నేను జల్లెడ బ్లాగులను జల్లించి చాలా దినాలయినది. క్షన్తవ్యోహం.కుశలమే కదా! ఉంటాను గురువుగారు.
శ్రీధర్ గారూ, మీ రాక సంతోషాన్ని కలిగించింది.
ఈ సమస్య ను చూడండి గురువుగారు: '' నా నీ పత్నికి కోర్కె దీర్ప మనెహన్మంతుండు కౌంతేయతో !
సమస్య బాగుంది. కానీ శార్దూల వృత్తాన్ని ఎందరు పూరిస్తారో? చూద్దాం... అవకాశాన్ని బట్టి బ్లాగులో ప్రకటిస్తాను.
వరవీణా మృధుపాణీ|కరుణయు లేకున్న?బ్రతుకు,కదలదు కలమేఅరుదగుననురాగంబునువరముగ హృదయాన బంచ?వందనమమ్మా.
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
గురువు గారికి నమస్కారములు గ్రామాంతరము వలన ఆలస్యమైనది...వరవీణామృదు పాణీ మరాళ వాహిని విధాత మానస రాణీ సురగణ పూజిత జననీ కరుణను కురిపించి జగతి గావగ రమ్మా!
ఆంజనేయ శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి.............. . .........శ్రీ గు౦డు మదు సూదన్ గారికి జ న్మ ది న శు భా కా ౦ క్ష లుగు౦డు మదు సూద నార్యా ! ని౦డుగ నూరే౦డ్లు బ్రతికి , నీమము తోడన్ మె౦డుగ పద్యము లల్లుచు ---ను౦డుము ; సాహిత్య గరిమ ఉ ధ్బాసిల్లన్
గురుమూర్తి ఆచారి గారూ, గుండు వారిపై మీ ఆశీఃపద్యం బాగుంది. ధన్యవాదాలు.
ధన్యవాదములు...!!!గురుమూర్త్యాచార్యా! విస్తరపూర్వక మంగళాప్త సద్వచనమ్ముల్కర మాదర మందించెను!మరువను మీ వచన మెపుడు మాన్య! నమస్తే!!
వరవీణా మృదుపాణీ సరసిజభవు ముద్దుపత్ని చదువుల తల్లీ నిరతము నిన్ను భజింతును వరమిమ్ము కవితలు వ్రాయ బాషా లక్ష్మీ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వరవీణా మృదుపాణీచరణములేమాకురక్ష శాంతిని నిలుపన్నిరతము నిత్యసుఖంబునవరలగ సద్బుద్ధినొసగు వాక్ శుద్ధిడుమా.
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గుండు మధుసూధన కవికిమెండుగానుజన్మదిన శుభా కాంక్షలుజరుపుకొనగఆయురారోగ్య భాగ్యమ్ము లందునట్లుశక్తి,వాణి,యు,లక్ష్మి నాసక్తినొసగు.
జన్మదిన శుభాకాంక్ష లొసంగినట్టియీశ్వరప్పకవీశ్వర! హితకరముగస్వస్తి వచనమ్ముఁ దెలిపితి! వందనములు!ధన్యవాదమ్ములందింతు ధన్యచరిత!!
వరవీణా మృదు పాణీ!హరిసుతు మురిపాల రాణి! యందవె వాణీ!వరమై! కవిత్వ బోణీదొరలగ నానోట మదిని దోచెడు బాణీ!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కవివర్యులు శ్రీ గుండు మధుసూదన్ గార్కి శంకరాభరణం బ్లాగు వేదికగా మరో మారు జన్మదిన శుభాకాంక్షలు.
ధన్యవాదములు సహదేవుఁడు గారూ!
వరవీణామృదు పాణీపరమేష్టుని పత్ని హంస వాహిని రాణీవరదాయిని వేదాగ్రణిసరసిజ నేత్రీ భగవతి శరణము వాణీ!!!
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వరవీణా మృదుపాణీ!కరములు జోడింతు నన్ను కరుణన్ గనుమా! పరిపరి మ్రొక్కెద జడుడను...స్వరమును తగ్గించి నాకు శాంతిన్నిడుమా!
వరవీణా మృదుపాణీకరములు జోడింతునమ్మ కాసేపటికై వరవీణను చాలింపుము పరుపున పడుకొచు పోయె పాపడు నిదురన్
* పడుకొనుచు
వరవీ ణామృదు పాణీ
రిప్లయితొలగించండికరములు జోడించితి నమ్మ కరుణిం చగనన్
పరుసము లాడక నిరతము
సరసము గానుంచు మంటి సాహస మందున్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో గణదోషం. ‘జోడించితి నమ/ జోడించితి నిక...’ అనండి. పద్యం చివర ‘సహవాసమునన్’ అంటే బాగుంటుందేమో!
వరవీ ణామృదు పాణీ
రిప్లయితొలగించండికరములు జోడించితి నిక కరుణిం చగనన్
పరుసము లాడక నిరతము
సరసము గానుంచు మంటి సహవాస మునన్
ధన్య వాదములు
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండివరవీణా మృదుపాణీ!
సురుచిర మధురోక్త వాణి! సుందర వేణీ!
ధర వేదాగ్రణి! తరుణీ
వర రమణీ! గుణి! కవీశ వరనిశ్శ్రేణీ!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిజన్మదిన శుభాకాంక్షలు!
అంత్యానుప్రాసతో మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదములు శంకరయ్యగారూ!
తొలగించండి
రిప్లయితొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
..................................
వరవీణా మృదుపాణీ !
సరసీరుహభవుని రాణి ! చదువుల రాణీ !
వర బ౦భర చయ వేణీ !
సరసిజ పుస్తక శుకాక్ష స౦స్థిత పాణీ !
[ బ౦భర చయము : తుమ్మెదల సమూహ౦.
అక్ష :అక్షమాల. స౦స్థిత :చక్కగాను౦డిన ]
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిఅంత్యానుప్రాసతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
వరవీణా మృదుపాణీ
రిప్లయితొలగించండికరకమ లాలంకృతాబ్జ కందర్పరధ
న్నరవిందాసన సుందరి
సురుచిం గొలుతును విధాత సుమనోహారిన్
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వరవీణామృదుపాణీ
రిప్లయితొలగించండిసరసిజములబోలునయన చదువుతల్లీ
మరినానాలుకమీదన
నిరతము వసియించుమమ్శ నెయ్యము దనరన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివరవీణా మృదుపాణీ
రిప్లయితొలగించండిసరసిజ భవురాణిమాకు శరణమొసగుమో
సరసిజనేత్రి కొలుతు నిను
వరము లొసగి బ్రోవుమమ్మ వదలకు మమ్మున్
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వర వీణా! మృదుపాణీ!
రిప్లయితొలగించండిభారతీ! బ్రాహ్మీ ! భగవతి! పలుకుల రాణీ !
శారద ! శాబ్డీ ! రాజ్ఞీ !
వరగుణ ! శ్వేతాంబరధరి ! భాషా యోషా!
శ్రీధర్ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘భారతి’ టైపాటు వల్ల దీర్ఘాంతమైనట్టుంది. దీర్ఘాంతమైతే గణదోషం.
కంది శంకరయ్య గురువు గార్కి పాద నమస్కారాలు.
రిప్లయితొలగించండిఈ మధ్య నేను జల్లెడ బ్లాగులను జల్లించి చాలా దినాలయినది. క్షన్తవ్యోహం.
కుశలమే కదా! ఉంటాను గురువుగారు.
శ్రీధర్ గారూ,
తొలగించండిమీ రాక సంతోషాన్ని కలిగించింది.
ఈ సమస్య ను చూడండి గురువుగారు: '' నా నీ పత్నికి కోర్కె దీర్ప మనెహన్మంతుండు కౌంతేయతో !
రిప్లయితొలగించండిసమస్య బాగుంది. కానీ శార్దూల వృత్తాన్ని ఎందరు పూరిస్తారో? చూద్దాం... అవకాశాన్ని బట్టి బ్లాగులో ప్రకటిస్తాను.
తొలగించండివరవీణా మృధుపాణీ|
రిప్లయితొలగించండికరుణయు లేకున్న?బ్రతుకు,కదలదు కలమే
అరుదగుననురాగంబును
వరముగ హృదయాన బంచ?వందనమమ్మా.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
గురువు గారికి నమస్కారములు గ్రామాంతరము వలన ఆలస్యమైనది...
రిప్లయితొలగించండివరవీణామృదు పాణీ
మరాళ వాహిని విధాత మానస రాణీ
సురగణ పూజిత జననీ
కరుణను కురిపించి జగతి గావగ రమ్మా!
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
.............. . .........
శ్రీ గు౦డు మదు సూదన్ గారికి
జ న్మ ది న శు భా కా ౦ క్ష లు
గు౦డు మదు సూద నార్యా !
ని౦డుగ నూరే౦డ్లు బ్రతికి , నీమము తోడన్
మె౦డుగ పద్యము లల్లుచు ---
ను౦డుము ; సాహిత్య గరిమ ఉ ధ్బాసిల్లన్
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిగుండు వారిపై మీ ఆశీఃపద్యం బాగుంది. ధన్యవాదాలు.
ధన్యవాదములు...!!!
తొలగించండిగురుమూర్త్యాచార్యా! వి
స్తరపూర్వక మంగళాప్త సద్వచనమ్ముల్
కర మాదర మందించెను!
మరువను మీ వచన మెపుడు మాన్య! నమస్తే!!
వరవీణా మృదుపాణీ
రిప్లయితొలగించండిసరసిజభవు ముద్దుపత్ని చదువుల తల్లీ
నిరతము నిన్ను భజింతును
వరమిమ్ము కవితలు వ్రాయ బాషా లక్ష్మీ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వరవీణా మృదుపాణీ
రిప్లయితొలగించండిచరణములేమాకురక్ష శాంతిని నిలుపన్
నిరతము నిత్యసుఖంబున
వరలగ సద్బుద్ధినొసగు వాక్ శుద్ధిడుమా.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గుండు మధుసూధన కవికిమెండుగాను
రిప్లయితొలగించండిజన్మదిన శుభా కాంక్షలుజరుపుకొనగ
ఆయురారోగ్య భాగ్యమ్ము లందునట్లు
శక్తి,వాణి,యు,లక్ష్మి నాసక్తినొసగు.
జన్మదిన శుభాకాంక్ష లొసంగినట్టి
తొలగించండియీశ్వరప్పకవీశ్వర! హితకరముగ
స్వస్తి వచనమ్ముఁ దెలిపితి! వందనములు!
ధన్యవాదమ్ములందింతు ధన్యచరిత!!
వరవీణా మృదు పాణీ!
రిప్లయితొలగించండిహరిసుతు మురిపాల రాణి! యందవె వాణీ!
వరమై! కవిత్వ బోణీ
దొరలగ నానోట మదిని దోచెడు బాణీ!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కవివర్యులు శ్రీ గుండు మధుసూదన్ గార్కి శంకరాభరణం బ్లాగు వేదికగా మరో మారు జన్మదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిధన్యవాదములు సహదేవుఁడు గారూ!
తొలగించండివరవీణామృదు పాణీ
రిప్లయితొలగించండిపరమేష్టుని పత్ని హంస వాహిని రాణీ
వరదాయిని వేదాగ్రణి
సరసిజ నేత్రీ భగవతి శరణము వాణీ!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వరవీణా మృదుపాణీ!
రిప్లయితొలగించండికరములు జోడింతు నన్ను కరుణన్ గనుమా!
పరిపరి మ్రొక్కెద జడుడను...
స్వరమును తగ్గించి నాకు శాంతిన్నిడుమా!
వరవీణా మృదుపాణీ
రిప్లయితొలగించండికరములు జోడింతునమ్మ కాసేపటికై
వరవీణను చాలింపుము
పరుపున పడుకొచు పోయె పాపడు నిదురన్
* పడుకొనుచు
తొలగించండి