8, నవంబర్ 2015, ఆదివారం

సమస్య - 1849 (కష్టము గద కవిత లల్ల...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కష్టము గద కవిత లల్లఁ గందమునందున్.
ఈ సమస్యను పంపిన భాగవతుల కృష్ణారావు గారికి ధన్యవాదాలు. 

39 కామెంట్‌లు:

 1. ఇష్టముగ నేర్చి నడకను
  స్పష్టమ్ముగఁ బట్టుకొన్న చతురమతులకున్
  తుష్టినిఁ గూర్చుచును విగత
  కష్టము గద కవిత లల్లఁ గందమునందున్.

  రిప్లయితొలగించండి
 2. నిష్టగ శారదను కొలిచి
  స్పష్టముగా దెలిసి నంత సంతస మందున్
  ఇష్టము లేకను దెలియక
  కష్టము గద కవితలల్లఁ గందము నందున్

  రిప్లయితొలగించండి
 3. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కాని నిష్ఠను నిష్ట అన్నారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నిస్ఠగ శారదను కొలిచి
   స్పష్టముగా తెలిసి నంత సంతస మందున్
   ఇష్టము లేకను దెలియక
   కష్టము గద కవితలల్లఁ గందము నందున్

   తొలగించండి
 4. రిప్లయిలు
  1. దుష్ట సమాసము లుండును
   శిష్టులు వినరండి నేను చెప్పెడు నుడులన్
   పుష్టిగ భాషనెఱుంగక
   కష్టము గద కవితలల్లఁ గందము నందున్

   తొలగించండి
  2. స్పష్టత గల భాషయు పరి
   పుష్టిగ ఛందో నియమపు పూర్వాపరముల్
   నిష్ఠగ నేర్వని వాడికి
   కష్టము గద కవితలల్లఁ గందము నందున్

   తొలగించండి
  3. ఆంజనేయ శర్మ గారూ శ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 5. కష్టము వళులుం బ్రాసలు,
  కష్టము దీర్ఘ పదదళ సుకర రచనమ్ముల్,
  కష్టము జగణ నియమముయుఁ,
  గష్టము గద కవిత లల్లఁ గందమునందున్.

  రిప్లయితొలగించండి
 6. శిష్టులు కొందరు పలికిరి
  కష్టముకద గవితలల్ల గందమునందున్
  కష్టముకాదుగ నాకది
  యిష్టముగావ్రాయుచుందునెప్పుడునేనున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. నష్టమె నాగరికంబన
  కష్టముగద కవితలల్ల ?గందము నందున్
  పుష్టియునందక తినుటయె
  నిష్టయు లేనట్టి నీతి నిలువదు నిలలో.

  రిప్లయితొలగించండి
 8. నష్టమె నాగరికంబన
  కష్టముగద కవితలల్ల ?గందము నందున్
  పుష్టియునందక తినుటయె
  నిష్టయు లేనట్టి నీతి నిలువదు నిలలో.

  రిప్లయితొలగించండి
 9. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్న రోజంత ప్రయాణము లో ఉన్నందున పంపించ లేకపోయాను. సమస్యా పూరణ, పద్యరచన తిలకించ గోర్తాను.

  పరిణయ మాయెను గోరిన
  పురుషునితో ముదమలరగ ముదిత కతి శుభం
  కరమగు మంగళ సూత్రా
  భరణమ్మును బొందె వధువు భాగ్య మటంచున్.

  కాలుని దున్నపోతు మెడ గంటలు కన్పడవెప్పుడేరికిన్
  కాలము కర్మమున్నరసి కాలుడు జీవుల ప్రాణవాయువుల్
  జాలి యొకింత జూడకయు సత్వరముం గొనిపోవునుం గదా
  కాలుడు ధర్మ మూర్తి యవికారుడు సంయమనుండు జూడగన్
  [మూర్తియు + అవికారుడు = మూర్తి యవికారుడు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. Unknown గారూ,
   మీ సమస్యాపూరణం, పద్యరచన రెండూ బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 10. పుష్టిగ నడకను నేర్వక
  కష్టము గద కవితలల్ల గందము నందు
  న్నిష్టముతో నేర్చుకొనిన
  కష్టము కాబోదు కవిత ఘటియించంగన్!!!


  రిప్లయితొలగించండి
 11. ఇష్టములేని విషయముల
  కష్టముగద కవితలల్ల , గంద ము నందున్
  నిష్ట గ కూర్చుండినపుడు
  స్పష్టముగాకవితలల్ల సాధ్యంబవ్వున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అవ్వున్' అన్నచోట 'సాధ్యం బగురా /సాధ్యము సుమ్మీ' అనండి.

   తొలగించండి
 12. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  స్పష్టత ధార పటిష్ట వి
  శిష్టత పుష్టిగ కవితను సిద్ధించు గతిన్
  స్రష్టకు సరితూగు పగిది
  కష్టము గద కవిత లల్లఁ గందమునందున్.

  రిప్లయితొలగించండి
 13. దృష్టిని చంధము,భావము,
  స్పష్టతలందుంచి నడక సరళమ్మనగ
  న్నిష్టముగ వ్రాయ నుండదు
  కష్టము! గద! కవితలల్లఁ గందము నందున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్న రోజంత ప్రయాణము లో ఉన్నందున పంపించ లేకపోయాను. సమస్యా పూరణ, పద్యరచన తిలకించ గోర్తాను.

  పరిణయమాయెను గోరిన
  పురుషునితో ముదమలరగ ముదితకతిశుభం
  కరమగు మంగళ సూత్రా
  భరణమ్మును బొందె వధువు భాగ్య మటంచున్.

  కాలుని దున్నపోతు మెడ గంటలుకన్పడవెప్పుడేరికిన్
  కాలము కర్మమున్నరసి కాలుడు జీవుల ప్రాణవాయువుల్
  జాలియొకింతజూడకయు సత్వరముంగొనిపోవునుంగదా
  కాలుడు ధర్మ మూర్తి యవికారుడు సంయమనుండు జూడగన్
  [మూర్తియు+ అవికారుడు = మూర్తి యవికారుడు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇది మా తమ్ముడు కామేశ్వర రావు పంపినది .

   తొలగించండి
  2. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ అనుజులు పోచిరాజు కామేశ్వరరావు గారి పద్యాలు బాగున్నవి. బ్లాగుకు పద్యాలను పంపడంలో మీ ఆసక్తి ప్రశంసనీయం.

   తొలగించండి
 15. స్పష్టముగా వ్యాకరణము
  స్పష్టముగా కందపద్య ఛందస్సును సు
  స్పష్టముగా తెలియక
  కష్టము గద కవిత లల్లఁ గందమునందున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. స్పష్టముగ యతి ప్రాసను
  స్పష్టముగా కందపద్య ఛందస్సును సు
  స్పష్టమగు భాష తెలియక
  కష్టము గద కవిత లల్లఁ గందమునందున్.

  రిప్లయితొలగించండి
 17. సృష్టించెడి యుహలకున్
  పుష్టియు పరిసరములందు పులకింతలలో
  నిష్టయు గనిపించనిచో?
  కష్టముగద కవితలల్ల గందము నందున్

  రిప్లయితొలగించండి
 18. కష్టము కాదిట జనులకు
  ఇష్టంబుగ నేర్చుకొన్న యేచదువైనన్
  తుష్టినొసగు తమి కరువౌ
  కష్టము గద కవితలల్ల గందము నందున్.
  2.స్పష్టముగా నాటవెలది
  నిష్టముగా వ్రాయవచ్చు నెత్తరి యైనన్
  నిష్ఠగ ప్రాసలతోడను
  కష్టము గద కవిత లల్ల గందము నందున్.

  3ఇష్టముతో వ్రాసిన నే
  కష్టంబన్పించదిలను కౌతుకమలరన్
  స్పష్టత లేకయె నందురు
  కష్టము గద కవితలల్ల గందము నందున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ.
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   నిష్ఠను నిష్ట అన్నారు. స్పష్టత లేకయె యందురు... అనండి.

   తొలగించండి
 19. స్పష్టము లైనట్టి విధులు
  పుష్టిగ నేర్వంగ నమరు పొందిక కాన
  న్నిష్టము కూరగ నెవ్విధి
  "కష్టము గద కవిత లల్లఁ గందమునందున్?"

  రిప్లయితొలగించండి
 20. మాష్టారు వ్రాయమనగన్
  మిష్టరుదౌ డెస్కుటాపు మేయగ బగ్గుల్
  సిష్టము నిరాకరించగ
  కష్టము గద కవిత లల్లఁ గందమునందున్

  రిప్లయితొలగించండి