13, నవంబర్ 2015, శుక్రవారం

సమస్య - 1853 (ముద్దు మగని ప్రాణముల...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ముద్దు మగని ప్రాణముల హరించె.

42 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘పాము+ఒకటి’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి నిత్యం. ‘క్రొత్త పామొకండు’ అనండి.

   తొలగించండి
  2. గురువు గారికి నమస్సుమాంజలులు
   సుప్రభాతం,...సుకవి మిత్రులెల్లరులకు అభినందనలు

   పాము బట్టి దాని పండ్లను పీకించి
   అమ్మి కాసు నొందు నామె భర్త
   కొత్త పామొకండు కోపాన పెట్టిన
   ముద్దు మగని ప్రాణముల హరించె

   తొలగించండి
 2. సద్దు జేయ వద్దు సరసమ్ము మనకేల
  పంటి నుండు విషము పరమ హాని
  వినక చెంత జేరె విషపు కన్నెవంటి
  ముద్దు మగని ప్రాణ ములహ రించె

  రిప్లయితొలగించండి
 3. మృగముగాఁ దలంచి మిధునానురక్తులన్
  జంపి పొంది నట్టి శాప విధిని
  చెలువపుసతి చేరి చెల్లించబోయిన
  ముద్దు మగని ప్రాణ ములహరించె.

  రిప్లయితొలగించండి
 4. మిత్రులందఱకు నమస్సులు!

  క్రౌంచ మిథునముఁ గని క్రౌర్యాన బోయఁడు
  తనదు తిండి కొఱకుఁ దలఁచి మదిని
  జంట పక్షిఁ బాప సరసత వీడియు

  ముద్దు మగని ప్రాణముల హరించె!

  రిప్లయితొలగించండి
 5. శాపమంది యుండి చపలత్వ మతి చేత
  పాండురాజు మాద్రి ప్రక్కజేరి
  సరసమాడువేళ చనిపోయెగా నాడు
  ముద్దు మగని ప్రాణముల హరించె

  రిప్లయితొలగించండి
 6. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “లంక+అయిన =లంకయిన” సంధి సమ్మతమేనా? యడాగమమవుతుందా? రెండూ సమ్మతమేనా? సందేహ నివృత్తి జేయ గోర్తాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   అక్కడ సంధి లేదు. ‘లంక యయిన’ అని యడాగమం వస్తుంది.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 7. ఓ అభాగ్యురాలి ఆవేదన:

  మాయదారి దోమ మాయింట దూరింది
  వాలి మీదఁ గుట్టె జాలి లేక
  డెంగ్యు జ్వరము సోకి డీలా పడిన నాదు
  ముద్దుమగని ప్రాణముల హరించె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   ‘దూరించి’ వ్యావహారికం. ‘దూరెను’ అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ప్రణామములు. సవరించిన పూరణ:

   ఓ అభాగ్యురాలి ఆవేదన:

   మాయదారి దోమ మాయింట దూరెను
   వాలి మీదఁ గుట్టె జాలి లేక
   డెంగ్యు జ్వరము సోకి డీలా పడిన నాదు
   ముద్దుమగని ప్రాణముల హరించె!

   తొలగించండి
 8. రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘మగని యెదను’ అనండి. షష్ఠ్యర్థంలో ద్వితీయ.

   తొలగించండి
 9. గు రు మూ ర్తి ఆ చా రి
  ................. . ........

  గురువు గారూ !
  మయూరము + లు = మ యూ రా లు కదా! కానీ నిన్న ఒక కవిమిత్రుడు
  మ యూ రా ల్ అని అన్నాడు . మరి
  ఈ ప్రయోగము సా ధు వే నా ? పూర్వకవులు
  ఈవిధ౦గ ప్రయోగి౦చారా ?
  దయచేసి నా స౦శయము తీర్చ౦డి !

  రిప్లయితొలగించండి
 10. కీచకుని భార్య కీచక మరణానంతరమిల బాధపడినదని ఊహించిన పద్యము

  దాసిననుచు వచ్చె దయలేని పడతియే
  మరులు గొలిపె నాదు మగని యెదను
  సరసమాడ పిలిచి సరసాంగి యాయింతి
  ముద్దుమగని ప్రాణముల హరించె

  రిప్లయితొలగించండి


 11. గు రు మూ ర్తి ఆ చా రి
  ..................................

  { కేవలము హాస్యము కోసము మాత్రమె ఈపూరణ చేయబడినది ఎవరిని ఉద్దేశి౦చి కాదు }

  పూచి పుల్ల వ౦టి పుల్లయ్యను > హిడి౦బి
  వ౦టి లావు భార్య . - ఫస్టు నైటు
  వదలక. కరుచుకొని . వరుస ముద్దులు పెట్ట
  ముద్దు మగని ప్రాణములు హరి౦చె .

  రిప్లయితొలగించండి
 12. కట్టుకొన్న సతిని కాలదన్ని మగడు
  తప్పు దారి బట్టి తప్పు జేసె
  ఆడదాని పొందు నాయవాంఛితమైన
  ముద్దు మగని ప్రాణములు హరించె.

  రిప్లయితొలగించండి
 13. ముద్దు లధికము గను ముదిత యొ కతెతన
  భర్త కీయ యతడు నుభరి యించ
  నోప కపుడు నయ్యె నుక్కిరి బిక్కిరి
  ముద్దు మగని ప్రాణముల హరించె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవపాదంలో యతి తప్పింది. ‘ఈయ నతడు’ అనాలి.

   తొలగించండి
 14. హద్దు మీరి గొనెడి యడ్డ దారులలోని
  ముద్దు మగని ప్రాణముల హరించె
  భార్య దుర్గుణమును భరియించకను భర్త
  ఆత్మ హత్య చెంది యవని విడచె.

  రిప్లయితొలగించండి
 15. భర్త గూడి చనియె భార్య వాహ్యాళికిన్
  కొండ చఱియ నకట గూలె పతియె
  ముప్పిరి గొనగ ఘన మోహానురక్తుల
  ముద్దు మగని ప్రాణముల హరించె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. ముద్దుమగని ప్రాణములు హరించె|తెలిసి
  మద్యపానమన్నమరణమనుచు
  హద్దుమీర ద్రాగి నంటగ రోగాలు
  బ్రతికి చచ్చినట్లె |బలముదరుగ.
  2వైరమందు మనసువైవిధ్య మైనచో?
  సాగుచున్న బ్రతుకు సారమేది
  రోష,రోగమున్నరోజులు చావక
  ముద్దుమగని ప్రాణములు హరించె.
  3ప్రాణముండి మనసురాయిగమారిన
  ఉండి లేనివాడి ఊహలందు
  తల్లిదండ్రి భార్య తత్వాలు వేరయ్యు
  ముద్దుమగని ప్రాణములు హరించె|

  రిప్లయితొలగించండి
 17. గాలమొక్క చేత వలనొక చేబట్టి
  నోట నొక్క చేప నుంచ నదియె
  గొంతు లోన దూరి కోసి కుత్తుక , లేమ
  ముద్దు మగని ప్రాణముల హరించె.

  ( నేటి ' ఈనాడు ' వార్తా పత్రిక లోని వార్త కు
  స్పందించి )

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ పేరుమీద గూగుల్ ఖాతా ప్రారంభించారన్న మాట... సంతోషం!
   ఈ వార్త ప్రొద్దునే చదివాను. ఆ నేపథ్యంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది. ‘ఒక్కచేత గాల మొకచేత వల బట్టి’ అనండి.

   తొలగించండి
 18. హద్దు లేని హాయి ననుభవింతుననుచు
  కలలు గనెను సి౦హ బలుడు కాని
  సద్దు మణగ నాట్య శాల లో భీముని
  ముద్దు మగని ప్రాణముల హరించె

  రిప్లయితొలగించండి
 19. లెక్కసేయకుండ చక్కనైన సతిని
  సానికొంపలందు కానిపనుల
  రోగబారిపడగ, భోగములే రూఢి
  ముద్దు మగని ప్రాణములు హరించె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘రోగబారి’ అనరాదు కదా! ‘రోగపీడితు డయి...’ అనండి.

   తొలగించండి