క్షణమొక యుగమై తోఁచెను గణనీయ మైన మనసున గరితగ నీకై యణచుట శక్యము గాదిక పణముగ వేధింప వలదు భామిని కరుణన్
రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు రెండవ పాదంలో సరి గణంగా `యమైన' అని జగణం వేశారు. `గణనీయమ్మైన మందిని.. ' అనండి.
అనయమునీతలపులతోతృణముగ తలచితిని సుమ్మ స్థిర యాజవమున్క్షణమొక యుగమై తోచెన్వనజాక్షీ నిన్ను కనని వాసరమందున్ఆజవముః సంసారము
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. మొదటి పాదం అన్నదాన్ని మూడవ పాదం చేశారు.
క్షణమొక యుగమై తోచెనుతృణమైనను భారమయ్యె దీపియె విషమైవనజాక్షీ నీ విరహమువ్రణమై నామదిని నలిపె రయమున రమ్మా!
ఆంజనేయ శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
క్షణమొకయుగమై తోచెనుప్రణయము విరసమ యగుటన బ్రదికిన రోజుల్అణచగ యత్న ముజేయగ తృణముగ భావించె నాదు తీయని తలపుల్
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
క్షణ మొక యుగమై తోఁచెనుఫణిరాజ శయను నఘారిఁ బన్నగదమనున్ఫణి రాజారి గమను రుక్మిణీ మనోహారిఁ జూతు మెన్నడు ప్రీతిన్
పోచిరాజు కామేశ్వరరావు గురూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
క్షణమొక యుగమై తోచెనునినుగానని వేళలోన నీరజ నేత్రీ నను కరుణించవె సఖి, నామనసున నినుదేవతంచు మన్నన జేతున్ 2.మకరి బారిన పడిన కరి మనో వేదనక్షణమొక యుగమై తోచెనువ్రణమయ్యెను మకరి పట్టు పాహి ముకుందా!ననుగావగ రమ్మనుచునునినువేడితినోయి రమ్ము నిఖిలేశ్వరుడా!
ఆంజనేయ శర్మ గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
క్షణమొక యుగమై తోచెనుమనోహరీ!నీ తలపులు మరి మరి వేధించెను నిను జూడక మనజా లను విరహానలము బాప రావే సకియా
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
{.అతివృష్టి వానలయందుజిక్కినవారివిషయముపై}1.క్షణమొకయుగమై తోచెనుఅణు వణువున నీరు జేరి నాకలిదప్పుల్గణ నీయంబుగ బెరిగినమణులను మనముందునుంచ?మంచిది యగునా?2.క్షణ మొక యుగమై తోచెనుగుణమును గుప్పించువాన గురితప్పంగా?ఫణమున్నను ఫలితంబా?తృణమౌ జీవనవిశాలతీరన-వింతే.|
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
క్షణమొకయుగమై తోచెన్మనసిజు భాణములు నాకు మత్తెక్కించన్ నినుగనక నిలువలేనికఘనమగు నీ కౌగిలిని డు కాంతానాకున్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
క్షణమొక యుగమై తోచెనుఅణువణువున నీవె నిండి యగుపించకనేవనమాలీ! నీరాధన్ప్రణయముతో గట్టివేసి పఱుచుట తగునా!!!పఱుచు= బాధించు
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
"క్షణ మొక యుగమై తోఁచె నీ క్షణము నాకు జన్మ భూమిని విడనాడి జలధి దాటి పోయితిని డాలరాశకు పూని నేను శాంతి లేదిట పరుగు లశాంతి దప్ప.
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ తేటగీతి పద్యం బాగున్నది. అభినందనలు.
క్షణమొక యుగమై తోచెనుప్రణయని రాధకు మరువక వచ్చెద నని మాటను యొసగిన మాధవు డీక్షణముననే మాయమవగ కలవారమాయెన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
క్షణమొక యుగమై తోచెను!గణనీయమ్ముగ జలమ్ము కదలగ వరదైవణకుచు నే కేకలిడగనను దట్టుచు నమ్మ లేపె నాకది కలయే!
క్షణ మొక యుగమై తోఁచెనుకణకణమున శ్రాంతి యుడిగె కంపము హెచ్చెన్ తృణమో పణమో మామా! గుణమెంచక ఋణమునిమ్ము కూతురు పుట్టెన్!
క్షణమొక యుగమై తోఁచెనుగణనీయుడు భర్త పోవ కాకుత్స్థుండైక్షణమొక లీలగ గడచెను రణభూమికి భర్త రాగ లంకాపతియై!
క్షణమొక యుగమై తోఁచెను
రిప్లయితొలగించండిగణనీయ మైన మనసున గరితగ నీకై
యణచుట శక్యము గాదిక
పణముగ వేధింప వలదు భామిని కరుణన్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు
రెండవ పాదంలో సరి గణంగా `యమైన' అని జగణం వేశారు. `గణనీయమ్మైన మందిని.. ' అనండి.
అనయమునీతలపులతో
రిప్లయితొలగించండితృణముగ తలచితిని సుమ్మ స్థిర యాజవమున్
క్షణమొక యుగమై తోచెన్
వనజాక్షీ నిన్ను కనని వాసరమందున్
ఆజవముః సంసారము
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు. మొదటి పాదం అన్నదాన్ని మూడవ పాదం చేశారు.
క్షణమొక యుగమై తోచెను
రిప్లయితొలగించండితృణమైనను భారమయ్యె దీపియె విషమై
వనజాక్షీ నీ విరహము
వ్రణమై నామదిని నలిపె రయమున రమ్మా!
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
క్షణమొకయుగమై తోచెను
రిప్లయితొలగించండిప్రణయము విరసమ యగుటన బ్రదికిన రోజుల్
అణచగ యత్న ముజేయగ
తృణముగ భావించె నాదు తీయని తలపుల్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిక్షణ మొక యుగమై తోఁచెను
తొలగించండిఫణిరాజ శయను నఘారిఁ బన్నగదమనున్
ఫణి రాజారి గమను రు
క్మిణీ మనోహారిఁ జూతు మెన్నడు ప్రీతిన్
పోచిరాజు కామేశ్వరరావు గురూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్షణమొక యుగమై తోచెను
రిప్లయితొలగించండినినుగానని వేళలోన నీరజ నేత్రీ
నను కరుణించవె సఖి, నా
మనసున నినుదేవతంచు మన్నన జేతున్
2.
మకరి బారిన పడిన కరి మనో వేదన
క్షణమొక యుగమై తోచెను
వ్రణమయ్యెను మకరి పట్టు పాహి ముకుందా!
ననుగావగ రమ్మనుచును
నినువేడితినోయి రమ్ము నిఖిలేశ్వరుడా!
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
క్షణమొక యుగమై తోచెను
రిప్లయితొలగించండిమనోహరీ!నీ తలపులు మరి మరి వేధిం
చెను నిను జూడక మనజా
లను విరహానలము బాప రావే సకియా
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
{.అతివృష్టి వానలయందుజిక్కినవారివిషయముపై}
రిప్లయితొలగించండి1.క్షణమొకయుగమై తోచెను
అణు వణువున నీరు జేరి నాకలిదప్పుల్
గణ నీయంబుగ బెరిగిన
మణులను మనముందునుంచ?మంచిది యగునా?
2.క్షణ మొక యుగమై తోచెను
గుణమును గుప్పించువాన గురితప్పంగా?
ఫణమున్నను ఫలితంబా?
తృణమౌ జీవనవిశాలతీరన-వింతే.|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
క్షణమొకయుగమై తోచెన్
రిప్లయితొలగించండిమనసిజు భాణములు నాకు మత్తెక్కించన్
నినుగనక నిలువలేనిక
ఘనమగు నీ కౌగిలిని డు కాంతానాకున్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
క్షణమొక యుగమై తోచెను
రిప్లయితొలగించండిఅణువణువున నీవె నిండి యగుపించకనే
వనమాలీ! నీరాధన్
ప్రణయముతో గట్టివేసి పఱుచుట తగునా!!!
పఱుచు= బాధించు
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
"క్షణ మొక యుగమై తోఁచె నీ క్షణము నాకు
రిప్లయితొలగించండిజన్మ భూమిని విడనాడి జలధి దాటి
పోయితిని డాలరాశకు పూని నేను
శాంతి లేదిట పరుగు లశాంతి దప్ప.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ తేటగీతి పద్యం బాగున్నది. అభినందనలు.
క్షణమొక యుగమై తోచెను
రిప్లయితొలగించండిప్రణయని రాధకు మరువక వచ్చెద నని మా
టను యొసగిన మాధవు డీ
క్షణముననే మాయమవగ కలవారమాయెన్.
క్షణమొక యుగమై తోచెను
రిప్లయితొలగించండిప్రణయని రాధకు మరువక వచ్చెద నని మా
టను యొసగిన మాధవు డీ
క్షణముననే మాయమవగ కలవారమాయెన్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్షణమొక యుగమై తోచెను!
రిప్లయితొలగించండిగణనీయమ్ముగ జలమ్ము కదలగ వరదై
వణకుచు నే కేకలిడగ
నను దట్టుచు నమ్మ లేపె నాకది కలయే!
క్షణ మొక యుగమై తోఁచెను
రిప్లయితొలగించండికణకణమున శ్రాంతి యుడిగె కంపము హెచ్చెన్
తృణమో పణమో మామా!
గుణమెంచక ఋణమునిమ్ము కూతురు పుట్టెన్!
క్షణమొక యుగమై తోఁచెను
రిప్లయితొలగించండిగణనీయుడు భర్త పోవ కాకుత్స్థుండై
క్షణమొక లీలగ గడచెను
రణభూమికి భర్త రాగ లంకాపతియై!