4, నవంబర్ 2015, బుధవారం

పద్యరచన - 1054

కవిమిత్రులారా!
“చుక్కలు మిలమిల మెరిసెను...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

33 కామెంట్‌లు:

  1. చుక్కలు మిలమిల మెరిసెను
    మక్కువ హెచ్చంగ చందమామను చూడన్
    చక్కని వెన్నెల కురిసెను
    దిక్కులకును చేరె వెలుగు దేదీప్యముగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. 1.
    చుక్కలు మిలమిల మెరిసెను
    చక్కని యా చందమామ సఖులై మురియన్
    చిక్కటి చీకటి భయపడి
    గ్రక్కున పరుగెత్తి పోవ కాంతులు విరిసెన్

    2.
    చుక్కలు మిలమిల మెరిసెను
    మిక్కుటముగ పగలు రాత్రి మేధిని యందున్
    చుక్కలు కావట చూడగ
    రెక్కలు తొడిగిన ధరలవి రివ్వున యెగసెన్

    రిప్లయితొలగించండి
  3. చుక్కలు మిలమిల మెరిసెను
    చక్కని చంద్రికల చెంత సరసము లాడన్
    మిక్కిలి మురియుచు మామయె
    చెక్కిలి మీటుచును కులికె చెంగల్వ దరిన్

    రిప్లయితొలగించండి
  4. 1.చుక్కలు మిలమిల మెరిసెను
    దిక్కుల నిండెను తిమరము;దీధితు లెసగన్
    చక్కని వెన్నెల పర్వుచు
    మక్కువతో చందమామ మాటున దాగెన్.

    2.చుక్కలు మిలమిల మెరిసెను
    గ్రక్కున జాబిలి మురిసెను కలువల చెంతన్;
    దిక్కుల చీకటి తొలగగ
    మిక్కుటమగు హాయి జనుల మీటుచు నుండెన్.


    3.చుక్కలు మిలమిల మెరిసెను
    చక్కని చిరునగవు తోడ సరసము లాడన్
    మిక్కుటముగ నవ్వుచు హరి
    చెక్కిలి మీటుచు తరుణుల చెంతకు చేరెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  5. చుక్కలు మిలమిల మెరిసెను
    చక్కగ నెంచగలిగిన ప్రశంసల తోడన్,
    లెక్కలు చెప్పిన వారికి
    చక్కటి బహుమతులు గలవు ,చకచక చనుమోయ్!

    రిప్లయితొలగించండి
  6. చుక్కలు మిలమిల మెరిసెను
    చక్కని చందురుని జూచి సంతోషముతో
    మక్కువతో యువజంటలు
    చిక్కని వెన్నెలను గాంచి చెలగుచు నుండన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. చుక్కలు మిలమిల మెరిసెను
    విలసిల్లెను దిక్కులెల్ల వెన్నెల చేతన్
    వలపులు హెచ్చిన జంటల
    కలువల దొర గాంచకుండ గ్రమ్మెను మబ్బుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      'మిలమిల మెరిసెను జుక్కలు ' అన్న పాదంతో మీ పద్యం బాగుంటుంది. కాని నియమోల్లంఘన అవుతుంది. మరో పద్యం వ్రాయండి.

      తొలగించండి
  8. చుక్కలు మిలమిల మెరిసెను
    చక్కని రేరాజు బెట్టు చక్కిలి గిలితో
    నిక్కుగ విరియగ కలువలు
    చిక్కని రేయెండ భువిని చిందులు వేసెన్!!!



    రేయెండ = వెన్నెల

    రిప్లయితొలగించండి
  9. చుక్కలు మిలమిల మెరిసెను!
    యక్కజ మేమున్నదయ్య యాకసమైనన్!
    మక్కవగా చేయించగ
    చక్కగ మా పడకటింట చంద్రికలమరెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'మెరిసెను +అక్కజ' మన్నప్పుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పద్యం:
      చుక్కలు మిలమిల మెరిసె!
      న్నక్కజ మేమున్నదయ్య యాకసమైనన్!
      మక్కవగా చేయించగ
      చక్కగ మా పడకటింట చంద్రికలమరెన్!

      తొలగించండి
  10. చుక్కలు మిలమిల మెరిసెను
    మిక్కిలి వింతగ వెలసెను మిహికాకరుడున్
    చక్కని వెన్నెల విరిసెను
    గ్రక్కున శారద నిశీధిఁ గనువిందగుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. ,
    చుక్కలు మిలమిలమెరిసెను
    చక్కగనాకాశమందు చంద్రుని తోడన్
    చిక్కటి రాతిరి యగుటన
    అక్కాయది సహజమమ్శ యాలోచింపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. చుక్కలు మిలమిల మెరిసెను
    ప్రక్కన నీవేల లేవు ప్రాణ సఖీ, నా
    యక్కున జేరుము గ్రక్కున
    ఫక్కున నవ్వకు, సరసము వద్దన దోసం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పి. యస్. ఆర్. మూర్తి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      పద్యాంతంలో 'దోసం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ 'దొసగే/దొసగౌ' అంటే సరి.

      తొలగించండి
  13. చుక్కలు మిలమిల మెరిసెను
    చక్కని చంద్రుండు వెలుగు చకచక బంచన్
    మక్కువనింపెడి భార్యను
    అక్కున జేర్చంగ మనసు హాయిని బంచెన్

    రిప్లయితొలగించండి
  14. 2.చుక్కలు మిలమిల మెరిసెను
    నక్కిన మేఘాలు పొంచి నయవంచనతో
    టక్కరిజేయగ-చంద్రుడు
    పక్కాగా వెలుగులుంచి పక్కున నవ్వెన్|
    3.చుక్కలు మిలమిల మెరిసెను
    నిక్కము నెలకొన్న రీతి నింగిన వెలుగన్
    ప్రక్కన చీకటి విసురుల
    మక్కువనే-చంద్రుడంత మసకనుమాన్పెన్.

    రిప్లయితొలగించండి
  15. చుక్కలు మిలమిల మెరిసెను
    చక్కని మోమున నిషాని చతురపు కనులన్...
    మక్కువ మీరగ టాటూ
    నిక్కము మెరియగ భుజమున నిగనిగ లాడెన్

    రిప్లయితొలగించండి
  16. చుక్కలు మిలమిల మెరిసెను
    మిక్కిలి యందమును గూర్చి మెండుగ నగుచున్
    చెక్కిలికి రంగు పూయుచు
    చక్కగ లోకసభ కిడుచు చైతన్యమునున్

    రిప్లయితొలగించండి