19, నవంబర్ 2015, గురువారం

పద్యరచన - 1068

కవిమిత్రులారా,
"పరి పరి విధములఁ జెప్పితి...'
ఇది పద్యంలో మొదటి పాదం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

35 కామెంట్‌లు:

 1. పరి పరి విధములఁ జెప్పితి
  సరియని నెరనమ్మి నన్ను సాగుము నరుడా!
  దరిఁజేరును విజయమ్మని
  పరమాత్ముడు గీతఁ జెప్పి పార్థుని బనిచెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   గీతాబోధన ప్రసక్తితో మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. పరిపరి విధముఁల జేప్పితి
  విరిసిన మల్లెలను కోసి వేలుపు కిడగన్
  మురియుచు నాడుట కొరకని
  పరుగిడి తివిపలుక కుండ భాగ్య మటంచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   చెప్పిన పని చేయక ఆటలాడే బాలికను సంబోధించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. పరిపరి విధముల జెప్పితి
  పరమాత్ముని యందు మనము పదిలపరచుచున్
  శరణంచు హరిని వేడుము
  సిరిపతి కరుణించి నీకు సిరులను యొసగున్.
  2.పరిపరి విధముల జెప్పితి
  సరిగాదీతలపిటనీకు జక్కగ వినుమా
  సరిగంచు చీరలు దెచ్చెడి
  సిరివంతుడ గాను నేను చిలుకలకొలికీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   భగవద్భక్తిని గురించిన మొదటి పద్యం, పతి నిస్సహాయతను గురించిన రెండవ పద్యం బాగున్నవి. అభినందనలు.
   మొదటిపద్యంలో ‘సిరులను+ఒసగున్’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సిరుల నొసంగున్’ అనండి.
   రెండవపద్యం రెండవ, మూడవ పాదాలలో గణదోషం. ‘సరి గాదీ తలపు నీకు...| సరిగంచు చీర దెచ్చెడి...’ అనండి.

   తొలగించండి
 4. రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   ధనాపేక్ష వదలి దేవతాపూజలు చేయుమన్న మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   రెండవపాదంలో గణదోషం. చెడేవు అనడం వ్యావహారికం. ‘మరి వినకున్నను జెడెదవు...’ అనండి.

   తొలగించండి
  2. పరి పరి విధముల జెప్పితి
   మరి వినకున్నను జెడెదవు మరవక వినరా
   సిరులను గోరుట గాదుర
   సురులను పూజించ వలెను సుమతిగ వెలగన్

   తొలగించండి
  3. మరొక్క సవరణ... ‘సురులు’ అనరాదు, ‘సురలు’ అనడం సాధువు.

   తొలగించండి

 5. పరి పరి విధముల జెప్పితి నీ నామమును
  హరి హరి అని పలికితి అన్ని వేళ లను
  సరి సరి అని తల ఊపితివి గద తిరుపతయ్యా
  మరి మరి నన్ను నీ చెంతకు రప్పించ వేలవయ్యా ?

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ భావానికి నా పద్యరూపం.....

   పరిపరి విధములఁ జెప్పితి
   హరిహరి యని పలికి తట్టి యావేళలలో
   సరి యని తల నూపితివే
   మరి నను నీ చెంతఁ జేర్చ మదిఁ దలఁచవొకో?

   తొలగించండి
 6. పరిపరి విధముల జెప్పితి
  సరియగు పథమును కనుగొని సాగుము, పైపై
  మెరుగుల కొరకై యెప్పుడు
  పరుగుల తీయంగవలదు భారత వీరా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   భారతవీరునకు హితోపదేశం చేస్తున్న మీ రెండవ పద్యం బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 7. పరి పరి విధములఁ జెప్పితి
  పరిపక్వాహార భోజ్య భక్ష్యాదులచే
  విరివిగ దధి నీరాదుల
  బరితుష్టుల జేయు మనుచు బాలింతలనున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   బాలెంతల ఆహార నియమాలను గురించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. పరి పరి విధములఁ జెప్పితి
  పరమత సహనంబు మనము పాటించ వలెన్
  కరుణా మృత పలుకులతో
  కలసియు మనమెల్ల యున్న కలుగును శుభముల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మీ నారాయణ గారూ - చివరి పాదం ప్రాస సరిచేయండి.

   తొలగించండి
  2. గుండూరి లక్ష్మినారాయణ గారూ,
   మత సహనాన్ని గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
   నాల్గవపాదంలో ప్రాస తప్పింది. ‘కురిపించిన ప్రేమ మనకు కూరిమి గలుగున్’ అందామా?
   *****
   అన్నపరెడ్డి వారూ,
   ధన్యవాదాలు.

   తొలగించండి
 9. పరి పరి విధముల జెప్పితి
  నరుడా ! యది వినని యెడల నరకమె గలుగున్
  నరుడ నుకొని రాముని మఱి
  పరునిం గా జూడ కెపుడు ,పరమా త్ముండే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   రాముని సేవించకున్న నరకప్రాప్తి అన్న మీ పద్యం బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 10. పరిపరి విధముల జెప్పితి
  కరుణయు లేనట్టి భార్య కాపురమనగా
  వరకట్న మాశచేతను
  పరుగెత్తియు పాలు దాగ?ఫలితముసున్నా.


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   వరకట్నంపై ఆశతో అనుకూలవతి కాని భార్యతో ఇబ్బందుల గురించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. కుమారునకుచదువుకొమ్మని తండ్రిదెలుపుట
  పరిపరి విధముల జెప్పితి
  గురువుల సద్ విద్యనేర్చి-గుణవంతుడవై
  తరుగని కీర్తిని బొందుము
  అరుదగు నానందమొసగు నానందమదే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   తండ్రి హితబోధగా మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. పరిపరి విధముల జెప్పితి
  సరసమునకు సమయమిమ్ము సఖునకు నంచున్
  నిరతము దెప్పు సతిని విడి
  సరిజోడి యనుచు విభుండు సానిని జేరెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   సరసంగా లేని సంసారం సానివాడకు దారి చూపిందన్న మీ పద్యం బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 13. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ............................................................

  పరిపరి విధముల జెప్పితి
  పరికి౦చక మ౦చి చెడుల భాషి౦పకుమా ;
  పరిభవము చేసి హితులను ,
  పరిచయమును పె౦చు కొనకు పాపాత్ములతో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ నీతిపద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. అందరికి నమస్కారములు.
  పరిపరి విధముల జెప్పితి
  యెరిగెడి దాన్నెరుగుమోయి, యెరిగిన మీదన్,
  యెరుగని దానిని యెరిగిన
  యెరిగినదే లేకపోవునేమన లేకన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భూసారపు నర్సయ్య గారూ,
   ఆధ్యాత్మిక చింతనతో చెప్పిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
   మీ పద్యానికి నా సవరణ (యడాగమ దోషాలను సవరించి...‘దాన్ని’ అనడం వ్యావహారికం)...
   పరిపరి విధములఁ జెప్పితి
   నెరిగెడి దాని నెరుగు మని యెరిగిన మీద
   న్నెరుగని దానిని నెరిగిన
   నెరిగినదే లేకపోవు నే మనలేకన్.

   తొలగించండి
 15. పరిపరి విధముల జెప్పితి
  నరకకుమా చెట్లననుచు నయమగ నీకున్
  మరలా జెప్పెద ను వినుము
  తరువులనిల పెంచుగాని తఱుగుట దగునా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   వృక్షసంరక్షణ గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘మరలన్ జెప్పెద’ అనండి.

   తొలగించండి
 16. పరి పరి విధములఁ జెప్పితి
  చెరిసగ మివ్వమని నేను శ్రీమతి తోడన్
  కొరకుచు కర్కాటకమును
  పరుగులనిడి పారి పోయె వదలుచు నన్నున్

  రిప్లయితొలగించండి