14, నవంబర్ 2015, శనివారం

పద్యరచన - 1063

కవిమిత్రులారా,
ఈరోజు పద్యరచనకు అంశము...

‘బాలల దినోత్సవము’

35 కామెంట్‌లు:

  1. పాల వలె స్వచ్ఛ మైనది
    బాలల పసి మనసు లవియె భాగ్యపు జ్యోతుల్
    బాలల దినముయె జవహ
    ర్లాలార్య జయంతి నాడు రమ్యపు వేడ్కల్

    రిప్లయితొలగించండి
  2. కల్లా కపటము తెలియని
    పిల్లల మనసెంత హాయి ప్రేమను పంచన్
    బాలల దినోత్సవము గాన
    హేలగ దినుచును మిఠాయి నెహ్రూ జేజే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పద్యభావం బాగున్నది. అభినందనలు.
      ‘కల్లయు గపటము లెఱుగని’ అనండి. మూడవపాదం చివర గణదోషం. నాల్గవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. కల్లయు గపటము లెరుగని
      పిల్లల మనసెంత హాయి ప్రేమను పంచన్
      బాలల దినోత్సవ ముయని
      హేలగ దినెదరు మిఠాయి హేరాళముగన్

      హేరాళము = అధికము

      తొలగించండి

  3. పుట్టితి వట యీ రోజున
    బుట్టిన యో నెహ్రు !నీవు పూర్ణిమ చంద్రు
    న్చట్టున వెలిగితి విప్పుడ
    య ట్టులె యొకసారి రమ్ము హర్షము గలుగన్

    నీదు పుట్టిన రోజును నేడు మేము
    జరుపు కొనుచుంటిమి మఱి బా సు రముగాను
    బం డు గనువోలె ,మనసార పంచి పెట్టి
    చాకు లైట్లను బాలలు సంతసించ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. చాచా వారు లండను న చదివి
    దేశమున ముద్దు బిడ్డలకు ప్యారీ అయినారు !
    నమో వారు దేశమున చాయ్ చదివి
    లండను న ముద్దు బిడ్డలకు ప్యారీ అయినారు !

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      చాలాకాలానికి బ్లాగులో మీ పేరు చూడడం. సంతోషం!
      మీ భావానికి నా పద్యరూపం.....
      లండనున జవహరు లాలు చదివి భరత
      భూమి పిల్లలకును స్ఫూర్తి యయ్యె
      భరతభూమి విద్య బడసిన మోడీజి
      లండను జనుల కనుపండు వయ్యె.
      (మీ భావానికి సంపూర్ణ న్యాయం చేయలేదనుకోండి!)

      తొలగించండి
    2. శంకరయ్య గారు !

      నెనరస్య నెనరః ! సూపర్ !

      జిలేబి

      తొలగించండి
  5. కల్లాకపటంబెరుగని
    పిల్లలు నొకచోట చేరి వేడుక మీరన్
    యెల్లర మనముల దోచుచు
    నల్లరి చేయుచు చిలిపిగ నలరింతురుగా/రిటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మీర| న్నెల్లర...’ అనండి.

      తొలగించండి
  6. గు రు మూ ర్తి ఆ చా రి
    .............................

    తెలి చిరునగవుల వెలు౦గు వెలువరి౦చు
    వెలయు మురిపాల రతనాల c తొలుకరి౦చు
    పలుకు తేనెల చినుకుల చిలుకరి౦చు
    బాలల దినోత్సవము హర్ష వర్ష ధార

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రతనాల తరువాత అర్థానుస్వాసం అవసరం లేదు. ‘రతనాలఁ దొలకరించు’ అన్నప్పుడు అవసరం.

      తొలగించండి
  7. బాల లతి సున్నితులు నిష్కపటులు నిర్మ
    లులు వివృత హృదయులు పెద్దలు నుడివిన య
    టులె చరింతురు గాదె యిటు లన దగును
    నేఁటి బాలలే రేపటి నేత లనుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు సమస్యాపూరణానికి, పద్యరచనకు ఒకే పద్యాన్ని (కొద్ది మార్పుతో) వ్రాశారు. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. కాళిదాసు మహాకవి శ్లోకాలు గుర్తుకు వచ్చి వ్రాసాను.
      అద్య ధారా నిరాధారా నిరావలమ్బే సరస్వతీ
      పండితాస్సర్వే ఖండితాః భోజరాజో దివంగతః

      అద్య ధారా సదాధారా సదావలమ్బే సరస్వతీ
      పండితాస్సర్వే మండితాః భోజరాజో భువంగతః
      [శ్లోకాలు సరిగ్గా గుర్తు లేక పొరపాట్లు ఉండవచ్చు.]

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      ఈ శ్లోకాలు, వాటి కథ గతంలో శంకరాభరణంలో ప్రకటించాను. క్రింది లింకును క్లిక్ చేసి చూడండి.
      కాళిదాసు శ్లోకం

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. సరియైన శ్లోకములు తెలియజేశారు.

      తొలగించండి
  8. నేడే బాలల పండుగ
    నేడే మన తొలి ప్రధాని నెహ్రు జనించెన్
    నేడే సంతోషముగను
    నాడుచు పాడుదురు దేశ నలు మూలలలోన్

    రిప్లయితొలగించండి
  9. నేడే బాలల పండుగ
    నేడే మన తొలి ప్రధాని నెహ్రు జనించెన్
    నేడే బాలలు మురియుచు
    నాడుచు పాడుదురు దేశ నలు మూలలలోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘దేశ నలుమూల’లని సమాసం చేయరాదు. ‘దేశ నానాస్థలులన్’ అందామా?

      తొలగించండి
  10. బాలల దినోత్సవంబన?
    మూలము నెహ్రూ జయంతి ముచ్చట బడుచున్
    తేలికగా విద్యార్ధులు
    పాలకు లీనాటిదినము పండుగజూడన్.
    2.బాలలదినోత్స వంబన?
    కాలానికి కట్టుబడెడి కల్పన లెన్నో
    తేలికగా మార్పుంచియు
    మూలము సద్ విద్యనేర్వ ముఖ్యముబాలా.

    రిప్లయితొలగించండి
  11. చాచా పుట్టిన రోజును
    నాచారముగా జరుపుకొందుమాచారముగాన్
    చాచాకు జయముబలుకగ
    నాచావడి మారుమ్రోగి యంబరమంటున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో ‘ఆచారము’ పునరుక్తమయింది. ‘ఆచారముగా జరుపుకొందు మానందముగాన్’ అనండి.

      తొలగించండి
  12. నెహ్రు పుట్టిన దినమును నెమ్మితోడ
    జరుపు చుందురు బాలలు సంతతమ్ము
    వివిధ వేషములు ధరించి పిల్లలంత
    దేశనేతలన్ జ్ఞప్తికి తెచ్చు చుండ్రు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  13. *గు రు మూ ర్తి ఆ చా రి *

    కల్ల కపటము నెరుగని పిల్ల లెల్ల
    దైవ సన్నిభు లౌదురీ ధరణి లోన
    వారితో నాడి మురియు జవహరు నెహ్రు
    మరి యికె౦త పవిత్రుడో అరయ గలమె ! !

    రిప్లయితొలగించండి

  14. రోజా పూవును జేబుకు
    తాజాగా దాల్చె నెహ్రు తప్పక దినమున్
    రాజాలవంటి పిల్లల
    నైజముఁ దాబోలుననుచు నవ్వుచుఁ దెల్పన్!

    మాలిన్యము లేని మనసు
    బాలలదనుచును దలంచి వారిని మెచ్చన్
    బాలల దినోత్సవమనుచు
    హేలగ తనజన్మదినము నెంచిరి నెహ్రూ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  15. నెహ్రు పుట్టిన దినమును నెమ్మితోడ
    జరుపు చుందురు బాలలు సంతతమ్ము
    వివిధ వేషములు ధరించి పిల్లలంత
    దేశనేతలన్ జ్ఞప్తికి తెచ్చు చుండ్రు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి