24, నవంబర్ 2015, మంగళవారం

పద్యరచన - 1073

కవిమిత్రులారా,
"కందిపప్పు చారు కటువయ్యెరా రామ ...'
ఇది పద్యంలో మొదటి పాదం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

38 కామెంట్‌లు:

 1. కందిపప్పు చారు కటువయ్యెరా రామ
  యాకసమ్మునంటె యధికధరలు
  కడుపునింపనింత గంజియైనను లేదు
  పేదవానికిలను లేదుచోటు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్య నారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది అభినందనలు.

   తొలగించండి
 2. కంది పప్పు చారు కటువయ్యె రారామ
  అమ్మ కలిపి బెట్టె కమ్మ గాను
  నింగి నంటు ధరలు నేలకు దిగిరావు
  ఆలి కేమొ వంట సులువు దెలిసె

  రిప్లయితొలగించండి
 3. గురువు గారికి నమస్కారములు.... నాన్నగారికి సత్వరమే స్వస్థత చేకూరాలని ఆ పరమేశ్వరుని వేడుకొందాం.... ధైర్యాన్ని కోల్పోవద్దు పెద్దలు మీకు చెప్పెంత వాడిని కాదు నేను.

  కంది పప్పు చారు కటువయ్యెరా రామ
  దాని ధరయు మెర సె తార లందు
  గుప్పె డంత పప్పు గుంట భూమిని మ్రింగు
  కంది తెచ్చె నరుని కంట నీరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   ధన్యవాదాలు.
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. కంది పప్పు,చారు కరువయ్యె రా ,రామ!
  గడ్డి తినెడి దొరలు గద్దె నెక్క
  ఆకుకూర వెలయు నాకాశమున కంట
  ఏమి తినగ వలయు నీశ చెపుమ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. కంది పప్పు,చారు కరువయ్యె రా ,రామ!
  గడ్డి తినెడి దొరలు గద్దె నెక్క
  ఆకుకూర వెలయు నాకాశమున కంట
  ఏమి తినగ వలయు నీశ చెపుమ

  రిప్లయితొలగించండి
 6. పద్యరచన
  * గు రు మూ ర్తి ఆ చా రి *
  -----------------------
  { రామ ములక ప౦డ్లు టమోటా ప౦డ్ల. జాతికి చె౦దినవి. అవి చాలా చిన్న చిన్న గా
  ఉ౦టాయి . బలే రుచి ! ఇ౦క. పుల్ల గూర ఊరుబి౦డి = గో౦గూర పచ్చడి }

  --------------------------------------------

  క౦ది పప్పు చారు కటువయ్యెరా ! రామ --
  ములక. ప౦డ్ల చారు , పుల్ల. గూర ---
  నూరు బి౦డి ని తినుచు౦టి ; మా రె౦డు , మా
  పెరడు లో విరివిగ పెరుగు చు౦డు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పద్యం బాగున్నది.
   రామములక పళ్ళను గుర్తు చేసి సంతోషాన్ని కలిగించారు.

   తొలగించండి
 7. రిప్లయిలు
  1. కందిపప్పు చారు కటువయ్యెరా రామ
   వెలసె నిపుడు వివిధ పిశిత పాక
   రాజ భక్ష్యములు సురాదులు చోష్యముల్
   పశ్చిమోర్వి సుప్రభావమునను

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వరరావు గురూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. కంది పప్పు చారు కటువ య్యె రారామ
  య యిన పెట్ఠు చుంటి మ య్య యప్పుడపుడు
  చౌక దొరకు కూర లాకుకూ రలు గాన
  వాటి దినగ వలయు ప్రజలు ధరసు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. '... యయిన పెట్టుచుంటి మప్పు డపుడు' అనండి.

   తొలగించండి
 9. కంది పప్పు చారు కటువయ్యెరా రామ
  గగన కుసుమ మయ్యె గంది పప్పు
  ఘర్మ జలము రాల్చు ఘాటుపెరిగెనయ్యొ
  కలిమి లొగి లందు కులుకు నికను

  రిప్లయితొలగించండి
 10. కంది పప్పు చారు కటువయ్యెరా రామ
  తల్లి వంటి యుల్లి దడుకు బెంచె
  తనదు రుచిన తాను దగ్గెతమాటయే
  యే నివేదనమ్ము నీకు సేతు?

  రిప్లయితొలగించండి
 11. కందిపప్పు చారు కటువయ్యెరా రామ
  చాల కాల మయ్యె చారు లేక
  నొప్పు కొనదు నాల్క పప్పు చారును లేక
  ధరలు తగ్గు నెపుడొ దొరల కెరుక.  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. కంది పప్పు చారు కటువయ్యెరా రామ
  నంజుకొనగ ఉల్లి నప్పదింక
  కర్మభూమినందు కరువు తాండవమాడ
  పయనమెచటికమ్మ భరతమాత!

  రిప్లయితొలగించండి
 13. పద్యరచన కందిపప్పు చారు కటువయ్యె రారామ
  ఎల్లి,ఉల్లి-ధరలు నెక్కువాయె
  ఈటమోట కరువు నెగడుచునుండగ
  కల్తిసరుకులున్న?కాదుచారు

  రిప్లయితొలగించండి
 14. కందిపప్పు చారు కటువయ్యెరా రామ
  ధరలుబెరుగుచుండ విరివిగాను
  కాయగూరలుగొన కాదని భావించి
  పచ్చడెంచుకొనిరి పల్లెజనులు|

  రిప్లయితొలగించండి
 15. కందిపప్పు చారు కటు వయ్యె రా రామ
  గిట్టుబాటు ధరను కూర్చలేక
  చేతులెత్త ప్రభుత సే ద్యము పడిపోవ
  బడుగు వారి బ్రతుకు భారమయ్యె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. కందిపప్పు చారు కటువయ్యెరా రామ
  గడ్డి గూడ తినెడి కాల మొచ్చు
  పుట్ట గొడుగుల వలె పుట్టుకొచ్చు జనుల
  కడుపు నింపు కొనుట కష్ట మగును.

  సాగు పొలము లోన సారంబు గనరాక
  పంట పొలములన్ని పాడు బోయె
  ఆశ చెదరి రైతు అసువులు బాయంగ
  రాజకీయ మనుచు రంగు లమరె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పియెస్సార్. మూర్తి గారూ,
   మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   వచ్చును ఒచ్చు అన్నారు. అక్కడ `కాల మగును' అనండి.

   తొలగించండి
 17. కంది పప్పు చారు కటువయ్యెరా రామ
  నంజుకొనగ ఉల్లి నప్పదింక
  కర్మభూమినందు కరువు తాండవమాడ
  పయనమెచటికమ్మ భరతమాత!

  రిప్లయితొలగించండి
 18. గురువుగారికి నమస్కారం. నా ఈ పద్యము పరిశీలించి తప్పులు తెలియచేయగలరు...

  కందిపప్పు చారు కటువయ్యెరా రామ
  రామములగకాయేనగురాచదినుసు
  గగనమంటగధరయుల్లిగడ్డదిలను
  కలదమార్గముకాలెడుకడుపునింప?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేదుల సుభద్ర గారూ,
   ఇచ్చిన పద్యపాదం ఆటవెలది. మీరు మిగిలిన మూడు పాదాలు తేటగీతి వ్రాసారు. మీ పద్యానికి నా సవరణ....
   కందిపప్పు చారు కటువయ్యెరా రామ
   రామములగకాయె రాచదినుసు
   గగన మంటె నుల్లిగడ్డల ధరలేమొ
   కలదె దారి కాలు కడుపు నింప.

   తొలగించండి
 19. కందిపప్పు చారు కటు వాయెరా రామ
  సగటు మనిషకింక సత్తు వేది ?
  కాయగూరలు గొన గగనసుమములయ్యె
  కడుపు నింపు టెట్లు కమల నయన!!!

  రిప్లయితొలగించండి
 20. కందిపప్పు చారు కటువయ్యెరా రాము
  ధరలు నింగి కెగసెదలచ తరము గాదు
  కొనగ నేమిసేతునకట గోలపెట్టు
  వారి నెట్టు సముదయింతు నేమి చేతు.
  కందిపప్పు చారు కటువయ్యెరా రామ
  కడుపు నిండెడి దారియే కాన రాదు
  పచ్చడి మెతుకులను పంచ వలసి వచ్చె
  చారు యన్నమాటయ్యెను చద్ది మూట.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   ఇచ్చిన పద్యపాదం ఆటవెలది. మీరు తేటగీతులు వ్రాశారు. మీ పద్యాలకు నా సవరణ....
   1)
   కందిపప్పు చారు కటువయ్యెరా రామ
   ధరల తీరు నెంచఁ దరము గాదు
   కొనఁగ నేమి సేతు గోలపెట్టు నకట
   యెట్లు సముదయింతు నేమి సేతు?
   2)
   కందిపప్పు చారు కటువయ్యెరా రామ
   కడుపు నింపు దారి కానరాదు
   పచ్చడి మెతుకులను పంచవలసి వచ్చె
   చారు మాట యయ్యె చద్ది మూట.

   తొలగించండి
 21. కందిపప్పు చారు కటువయ్యెరా రామ!
  కంది పప్పు ధరలు గగన మంటె
  చింత పండు జూడ చెట్టుమీద కెదిగె
  సత్తు బోలె తెచ్చె నత్త గారు

  రిప్లయితొలగించండి