2, నవంబర్ 2015, సోమవారం

పద్యరచన - 1052

కవిమిత్రులారా!
“విసమును మ్రింగినట్లు కడు వేదన...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

29 కామెంట్‌లు:

  1. విసమును మ్రింగినట్లు కడు వేదన పొందుచు నుంటినయ్యయో
    ముసిముసి నవ్వు మాటు తన బుద్ధి గ్రహించక పెండ్లియాడితిన్
    పొసగదు వీనితోడ తను మూర్ఖుడు త్రాగుడు మానడెన్నడా
    వ్యసనపు మైకమందు నను బాదును గొడ్డును బాదినట్లుగన్
    కసికసిగా

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      "విసమును మ్రింగినట్లు కడు వేదన పొందుచు నీ వియోగమం
      దసమశరుండు వేయు విరి యమ్ములు తాఁకగ నోర్వలేక..... " అంటూ ప్రణయకవిత్వం చెప్తారని ఊహించాను సుమా!

      తొలగించండి
  3. విసమును మ్రింగి నట్లు కడువేదన జెందెద వేలనో సఖీ
    రుసరుస లాడకుండ మరిరోసము బెంచక నాలకింపుమీ
    రసభరితమ్ము నీదుమధు లాలస ప్రేమ సుధా కలాపముల్
    బిసజము వంటి నేత్రములు భీతిల జేయుట సఖ్యమేరికిన్

    నమస్కారములు
    సోదర సోదరీమణు లందరికీ శుభాకాంక్షలు .గురువులు [ సోదరులు ] శ్రీ శంకరయ్య గారి కాశీ యాత్ర దిగ్విజయంగా జరిగి విశ్వనాధుని విశేషాలను మనకు అందజేయాలని కోరుతూ . దీవించి .అక్క

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      చాలా రోజుల తర్వాత మిమ్మల్ని బ్లాగులో చూసి సంతోషిస్తున్నాను. ఇంతకాలం మీ ఆరోగ్యం గురించి ఆందోళన పడ్డాను.
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. మిత్రులందఱకు నమస్సులు!

    విసమును మ్రింగినట్లు కడు వేదన నాకునుఁ గల్గెఁ! బాండవుల్
    పొసఁగఁగ రాజసూయమునుఁ బొందికఁ జేయఁగ నేల? రాజులన్
    గసిమసఁగంగ గెల్చి, ధనగర్వము నందఁగ నేల? యిట్టి మా
    య సభ మయాభిదత్త మయమై సననేల? మహౌత్సుకుండనై
    వెస సభ కేఁగ నేల? సని, వేగమె కల్ల సరస్సునందు సా
    రసమునుఁ గాలితో భ్రమను రాయఁగ నేల? పడంగ నేల? మా
    నస మది వ్రక్కలై చనెడు నట్టుల ద్రౌపది నవ్వనేల? నే
    విసమును మ్రింగి జీవితము వీడెద నిప్డు! సహింపలే నిఁకన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      మయసభలో పరాభవాన్ని తలపోస్తూ ప్రవహిస్తున్న దుర్యోధనుని ఆత్మగతాన్ని ఆవష్కరిస్తూ చక్కని పద్యాన్ని చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  5. విసమును మ్రింగినట్లు కడు వేదన కల్గెను నామనంబులో
    మసలితి సద్విచారమున మాన్యులు మెచ్చగ నెల్లవేళలన్
    మసలితి దైన్య జీవితము మార్చగ చిన్న తనంబు నుండి నే
    మసలక పోతి నా యనుగు మజ్జన మానసముల్ గ్రహించియున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      "మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. విసమును మ్రింగి నట్లు కడు వేదన బొందగ నేలభా మినీ !
    రుస రుస లాడు చుండు నుగ రోజును నీపతి దప్ప ద్రాగుచు
    న్వ్య సనపు మైకమే యది యు బాధలు దప్ప వుగాక !నీ కుపా
    యసమును దెత్తు నే దిన ప్రియంబని నీకు లలామ !యిప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పద్యంలో 'గుండెలోన నం |కుశముల....' అనండి. లోకము టైపాటు వల్ల లొకమయింది.
      రెండవ పద్యంలో భర్త తర్వాత అరసున్న అవసరం లేదు. వీడగా|నసహజ... అనండి. అలాగే వసుధను నాడజన్మ... అనండి.

      తొలగించండి
    3. సవరణలను సూచించిన గురువుగారికి ధన్యవాదములు ....,.కాశీయాత్రలో నున్నను మీరు ప్రయాసకోర్చుచూ మా పద్యములను విశ్లేషించు మీకు ప్రత్యేక ధన్యవాదములండి

      తొలగించండి
    4. 1.
      విసమును మ్రింగినట్లు కడు వేదన దాచితి గుండెలోన, నం
      కుశముల భంగి తీవ్రముగ గ్రుచ్చుచు నుండ భరింప లేక నీ
      విషయముఁ జెప్పుచుంటిని వివేకులు మాన్యుల కెల్ల బేలనై
      యసురుల లోక మయ్యెను సహాయము జేసెడు వారులేరిలన్


      2.
      విసమును మ్రింగినట్లు కడు వేదన దాచితి నింత కాలమున్
      పశువుల కన్న హీనుడగు భర్త భరింపగ లేక వీడగా
      నసహజమైన చూపులు పెడార్థపు మాటల నాడు బంధువుల్
      వసుధను యాడ జన్మ కిక బాధల శోకము తప్పకుండునే

      తొలగించండి
  10. కైకేయి తను వరములు కోరి భరతునికి పట్టాభిషేకము రామునికి వనవాసము కల్పించి నట్లు పుత్ర శోకము తో దశరధుని మరణించిన విషయము భరతుని తో చెప్పిన సందర్భము.

    విసమును మ్రింగినట్లు కడు వేదన మానసమందు నాటగన్
    వసుమతి భర్త దుర్మరణ వార్తయు రామవనాంత రమ్మునన్
    వసనము నార చీరల సభార్య సహానుజుడై ప్రవాసతన్
    మసలగ లక్ష్మణాగ్రజుడు మండుచుఁ దల్లిని జూచె నుగ్రతన్
    [వసనము =ఉనికి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. విసమును మ్రింగినట్లు కడు వేదనఁజెందిన లాభమేమి? యే
    దెస పరమాత్ముడుండునని దిక్కులఁ జూచిన నేమివచ్చు, నే
    రసమయ కావ్యమైన ,కడు రమ్యముగా గలదన్న న, ర్థమై
    రసఝురిఁ దేలగాఁ జదువరాదు, కటా! యిదె వేదనమ్మగున్.

    రిప్లయితొలగించండి
  12. విసమును మ్రింగినట్లు కడువేదనగల్గును నీతివీడగన్
    అసువులు బాసినట్లగును |అంతరమందున యాత్మదెల్పగా
    విసుగును విజ్ఞతన్ మరచి వీరుడటంచునురాజరాజు గా
    ముసుగున మూర్ఖు డాయెగద మోదము వీడినగర్వమందునన్
    2.విసమునుమ్రింగినట్లు కడువేదన జెందెను సితగానకన్
    ముసిరిన కారుమేఘముల ముంగిట జేరిన చంద్ర బింబమై
    మసకగ రామచంద్రుడిల మాధవుడయ్యును కానుపించెగా
    పసగల జీవితంబునకుపట్టిన దుర్గతి నెంచశక్యమా?

    రిప్లయితొలగించండి
  13. విసమును మ్రింగినట్లు కడువేదనగల్గును నీతివీడగన్
    అసువులు బాసినట్లగును |అంతరమందున యాత్మదెల్పగా
    విసుగును విజ్ఞతన్ మరచి వీరుడటంచునురాజరాజు గా
    ముసుగున మూర్ఖు డాయెగద మోదము వీడినగర్వమందునన్
    2.విసమునుమ్రింగినట్లు కడువేదన జెందెను సితగానకన్
    ముసిరిన కారుమేఘముల ముంగిట జేరిన చంద్ర బింబమై
    మసకగ రామచంద్రుడిల మాధవుడయ్యును కానుపించెగా
    పసగల జీవితంబునకుపట్టిన దుర్గతి నెంచశక్యమా?

    రిప్లయితొలగించండి
  14. విసమును మ్రింగినట్లు కడు వేదన మోమున జూపనేలయా?
    పసితన మెన్నిరోజులని? బాధ్యతలన్నను పారిపోకుమా!
    పసగల వాడవంచు నిను బల్వురు మెచ్చెడు రీతి సాగుమా!
    కుశలము గూర్చు నీకదియె గోపతి కావగ! లెమ్ము నందనా!

    రిప్లయితొలగించండి
  15. చః విసమును మ్రింగినట్లు కడు వేదన నిచ్చెడు నిత్య దూషణల్
    కసికసి చూపులన్ సతము కట్టడిచేయుచు చేయు సూచనల్
    పసితనమందు నిన్నుతన ప్రాణము కంటెను మిన్నగాకనన్
    ముసలితనమ్మునన్ కరము మూర్ఖత తల్లిని చూడ పాడియా?

    రిప్లయితొలగించండి
  16. విసమును మ్రింగినట్లు కడు వేదన జూపుట పాడియే శివా...
    కసిగొని పార్వతమ్మ ముడి గట్టగ కొంగిట నర్ధభాగమై...
    తసదియ! గంగ నెత్తినను తాండవ మాడగ తక్కతక్కతై...
    పసువది నంది పారగను పండుగ జేయుచు వెండి కొండలన్...

    రిప్లయితొలగించండి
  17. విసమును మ్రింగినట్లు కడు వేదన నొందుట భావ్యమేగదా
    నసుగుచు నూనె వీడుచును నాణ్యపు నేతిని వేస్టుజేయుచున్
    కసురుచు వంట జేయుచును కమ్మని కూరలు మాడ్చి వేయుచున్
    తసదియ మాటిమాటికిని తైతక లాడెడి నత్తయుండగా!

    రిప్లయితొలగించండి