22, నవంబర్ 2015, ఆదివారం

సమస్య - 1862 (మదమె ప్రగతికి మార్గమై...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మదమె ప్రగతికి మార్గమై ముదము నొసఁగు. 
(మద్దూరి రామమూర్తి గారికి ధన్యవాదాలతో)

25 కామెంట్‌లు:

 1. రోసము నకుప్రతీ కగ మీస మనుచు
  భీమ సేనుడు గదతోన భీక రముగ
  తొడను గొట్టగ రారాజు దురిత మణగె
  మదమె ప్రగతికి మార్గమై ముదము నొసఁగు

  రిప్లయితొలగించండి
 2. స్వార్థపరతను విడనాడి సంతతమ్ము
  సేవచేయునర్మిలిగల చిత్తమున ప్ర
  మదమె ప్రగతికి మార్గమై ముదమునొసగు
  నట్టివారి యశము నిల్చు ననవరతము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. నాశ నంబును జేయును నరుని భువిని
  మదమె, ప్రగతికి మార్గమై ముదము నొసగు
  మనముచేసెడియుపకృతి మన్ననలరి
  మానవునిసేవ చెందును మాధవునికి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. స్వార్థమన్నది విడనాడి వసుధ జనులు
  ఐక మత్యమ్ము పాటించి ఆదరమున
  సోదరులవోలె మసలిన సొబగు లీను
  వీడవలెనవ రోధమౌ పాడు కులపు
  మదమె, ప్రగతికి మార్గమై ముదము నొసగు
  నటుల జీవింప వలెనింక యవని యందు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'జనులు+ఐకమత్య` మన్నపుడు సంధి నిత్యం. జనులె యైకమత్య మనండి.

   తొలగించండి
 5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 6. అప జయమ్ములఁ గుందక నవని జనులు
  పురుష యత్నము నిత్యము పూన దగును
  సాధ నావిరళ కృషియు చలము విజయ
  మదమె ప్రగతికి మార్గమై ముదము నొసఁగు.
  [విజయమదము=జయముమీదిమత్తు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వరరావు గురూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. సుఖము సంతోషముల తోడ సుమతు లగుచు
  జనులు జీవింప వలెనయ్యె జగతి యందు
  తృప్తి గలిగిన మనసున తేజ మౌ ప్ర
  మదమె ప్రగతికి మార్గమై ముదము నొసగు.

  ధనమదము, కులమదము, విద్యామదమను
  త్రిమదములు జాతికిక హాని దెచ్చు, వీడు
  మదమె, ప్రగతికి మార్గమై ముదము నొసగు
  పథము నెఱగుచు సాగుము భారమనక.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ తాజా రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   జీవింపవలె నయ్య... అనండి.

   తొలగించండి
 8. తీష్ణ కిరణాల తో రవి తిరుగకున్న
  నీటి మేఘాలు నింగిలో నిలువగలవ?
  వర్షమందగ జీవులువరలు|సూర్య
  మదమె ప్రగతికి మార్గమై ముదమునొసగు|
  2.కవులు మాటలతూటాలు కాల్చకున్న
  ఉన్నతధికారు లందర మిన్నకున్న
  చదువు నేర్పెడి గురువుల పదవులందు
  మదమె ప్రగతికి మార్గమై ముదమునొసగు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   తీక్ష్ణ. .. తీక్ష... అయింది.
   ఉన్నతాధికారులు అని సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అక్కడ ఉన్నతాధికారులు తాము మిన్నకున్న... అనండి.

   తొలగించండి
 9. సమస్య
  * గు రు మూ ర్తి ఆ చా రి *

  గురువు గారూ! మదమె అను పదమునకు వ్యతిరేకపదము నిర్మదమె. కానీ తేటగీతిలో
  చివర గురువు తగదు .
  అ౦దువల్ల మీ సమస్యాపాదరూపమునకు భ౦గము వాటిల్లకు౦డా
  మా లి ని వృ త్త పా ద ము లో సమస్యను
  మలచుకొని పూరిస్తన్నాను నన్ను మన్ని౦చ౦డి .
  ......... ..................................................
  మా లి ని వృ త్త ము
  న. న. మ. య. య. యతి = 8 వ అ "
  -----------------------------------------------మదమె ప్రగతికి మార్గ మైముదమునొసగు = మదమె ప్రగతికిన్ మార్గ౦బగున్ మోదమిచ్చున్ ్
  ...........................................................
  మా లి ని లో పూరణ.

  మదమె నిను నశి౦ప౦ జేయు ,
  వర్జి౦పుమా ; ని
  ......................................
  ర్మదమె ప్రగతికిన్ మార్గ౦బగున్ ,
  మోదమిచ్చున్ ;
  ..........................................
  తదుపరి , విడు , స్వార్థ౦ బు న్ ;
  పరశ్రేయమున్ జే
  .............................................
  య దగును సుమ. ! కాపాడున్
  నినున్ ధర్మ మి౦కన్
  ....................................................
  { నిర్మదమె =మదము లేకు౦డుటయె
  4. వ పాద౦లో యతి = కాపాడు
  కాపు + ఆడు }  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని ఛందస్సు మార్చినా సమస్య పాదంలో మార్పు రానీయకండి.

   తొలగించండి
 10. స్వార్థ చింతన లేక సంశయమువీడి
  సర్వ జనహితసేవయే సౌఖ్యమనుచు
  వినయ సంపన్నుఁడైయుండు ననఁగ విగత
  మదమె ప్రగతికి మార్గమై ముదము నొసఁగు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. గురువుగారికి నమస్కారం. నా ఈ పూరణను పరిశీలించి తప్ప్లు తెలియచేయగలరు..
  తే.గీ:
  ధనమువలననుగలుగునుదర్పమెపుడు,
  వినయమేభూషణమగుచువిలువనిడును
  మనసునిర్మలముగనుండి,మనమువీడు
  మదమెప్రగతికిమార్గమైముదమునొసగు

  రిప్లయితొలగించండి
 12. అమలిన వాతావరణము ,
  విమలమ్ముగ లోకులెల్ల ప్రేమాస్పడులై
  శమమున జీవించిన సమ
  దమె ప్రగతికి మార్గమై ముదము నొసగు గదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ కందపద్య పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. కూడు గూడుకు గుడ్డకు కొదువ లేక
  సకల జనులకు సమకూర్చ, సౌఖ్యములను
  జీవనము నొంద , ముఖముల జిలుకు నట్టి
  మదమె ప్రగతికి మార్గమై ముదము నొసఁగు.

  రిప్లయితొలగించండి