23, నవంబర్ 2015, సోమవారం

పద్యరచన - 1072

కవిమిత్రులారా,
"రాక రాక వచ్చితివి శ్రీరామచంద్ర...' 
ఇది పద్యంలో మొదటి పాదం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

25 కామెంట్‌లు:

 1. గురువు గారికి నమస్కారములు.....

  రాక రాక వచ్చితివి శ్రీ రామ చంద్ర
  వేచి యుంటిమి, నీ రాక వేడ్క మాకు
  చరణ సన్నిధి జేరితిన్ శరణ మనుచు
  ధర్మ మూర్తివి మాపైన దయను చూపు

  రిప్లయితొలగించండి
 2. రాకరాక వచ్చితివి శ్రీరామ చంద్ర
  వేచి యుంటిని నినుగాంచ వేయి కనుల
  మంచి పండ్లను రుచిజూసి యెంచి నాను
  పేద రాలిని పిడికెడు ప్రేమ నింపి

  రిప్లయితొలగించండి
 3. రాకరాకవచ్చితివి శ్రీ రామ చంద్ర
  యేమి భాగ్యము నాయది యేమి కరుణ
  యేరి పెట్టుదు బండ్లను భూరిగాను
  ఆరగించుమ యోరామ! యారగించు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘భూరిగాను ఆరగించుము’ అని విసంధిగా వ్రాయరాదు కదా! ‘యేరి బెట్టుదు బండ్లను యెంచి రుచుల| నారగింపుము...’ అందామా?

   తొలగించండి
 4. రాక రాక వచ్చితివి శ్రీ రామ చంద్ర !
  రస రమ్య పద్యముల బ్లాగు పురికి !
  అందించవయ నిండుగ ఆశీస్సులను
  అలరారు ఈ బ్లాగు నీదు కటాక్షమున !

  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ భావానికి నా పద్యరూపం......

   రాక రాక వచ్చితివి శ్రీరామచంద్ర!
   భవ్య రసరమ్య పద్యాల బ్లాగుపురికి
   నందజేయు మాశీస్సుల సుందరముగ
   నలరు నీ బ్లాగు నీదు కటాక్షముననె.

   తొలగించండి
 5. నమస్తే గురువుగారూ.నిన్నటి పూరణను పరిశీలింప గలరు.
  విద్య యొసగును విజయంబు వినయమెపుడు
  ధర్మ మార్గాన నడువంగ ధార్మికతయు
  పెరుగు,దరికిరా నీకు మత్సరము విగత
  మదమె ప్రగతికి మార్గమై ముదము నొసగు.

  రిప్లయితొలగించండి
 6. గురువుగారికి నమస్కారం. శబరి ఇంటికి రాముడు వచ్చిన సందర్భంలో అన్నట్టుగా నాకు చేతనయిన రీతిలో రెండు పూరణలు చేశాను. దయచేసి పరిశీలించగలరు.
  1. తే.గీ
  రాకరాకవచ్చితివిశ్రీరామచంద్ర
  ముసలితనముననాకిటుముదమునీయ
  కరువుతీరజూదమన్నకమ్మెనీరు
  పడదుయడుగిది,పెగలదుపలుకుజూడు

  2. తే.గీ
  రాక రాక వచ్చితివి శ్రీరామచంద్ర
  చెంతజానకిలేదనిచింతపడకు
  తల్లిజాడయుతప్పకతెలియునుమరి
  శబరియింటనుయూఱడుశమముతోడ
  రిప్లయితొలగించండి
 7. 1.రాక రాక వచ్చితివి శ్రీ రామచంద్ర
  యేళ్ళ తరబడి యిచటనె వేచి యుంటి
  ఫలము లెన్నొ దెచ్చితినిట వరుసగాను
  నొసగ సిద్ధపడితినయ్య నోరు తెరువు.
  2.రాకరాక వచ్చితివిశ్రీ రామచంద్ర
  రాయి నై యుంటి యిన్నేళ్ళు రఘకులేశ
  శా పము తొలగె మ్రొక్కెద సాధు చరిత
  యనుచు పలికె రామునితో నహల్య తాను.

  3.రాక రాక వచ్చితివి శ్రీ రామచంద్ర
  కలిగె నాకిట హర్షంబు కాలుమోప
  ధన్యు డైతి నీదయ నొంది ధరణి యందు
  యనుచు గుహుడుతా భాషించె యాదరాన.
  4.రాక రాక వచ్చితివి శ్రీ రామచంద్ర
  నీ కొరకు వేచి తిమి కరుణించు మమ్ము
  సకల శుభముల నొసగెడి చక్కనైన
  పేరు పలికించు సతతమ్ము పేర్మి తోడ.

  రిప్లయితొలగించండి
 8. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి పద్యాన్ని మరి కొంచెము మార్చి వ్రాసితిని. తిలకించ గోర్తాను.
  క్షణ మొక యుగమై తోఁచెను
  ఫణిరాజ శయను నఘారిఁ బన్నగ దమనున్
  ఫణిరాజారి విహారిని
  ఫణినిభ భాసుర ఘనతర బాహుంగనకన్

  రిప్లయితొలగించండి

 9. * గు రు మూ ర్తి ఆ చా రి *
  . . . . . . . . . . . .

  1 . రాక రాక వచ్చితివి శ్రీరామ చ౦ద్ర
  లక్ష్మణ స్వామి తోడ సలక్షణముగ
  వృద్ద శబరి పై కొ౦డ౦త. కృప వహి౦చి ;
  దన్య మాయె జన్మ౦బు మీ దర్శనమున ు
  ------------------------------------------------
  2 . రాక రాక వచ్చితివి శ్రీ రామచ౦ద్ర
  యి౦క చాలు జన్మ౦బు తరి౦చె నయ్య
  వృధ్ధురాలిని కడు నిరు పేద రాలి - >ి
  నైతి ; ఈ జాల రుచ్య భోజ్యముల నేను
  రసములను రుచిజూచి తర్వాత మీకు
  నిచ్చెదను తృప్తి దీర భుజ౦చు డయ్య.

  { రుచ్య = రుచికరమగు
  : రసములు=ప౦డ్లు }

  రిప్లయితొలగించండి
 10. రాకరాక వచ్చితివి శ్రీరామ చంద్ర
  యెదురుచూచుచు నుంటినే నిచ్చతోడ
  శుద్ధమైన పండ్లిచట ను సిద్ధమనుచు
  కొరకి రుచిచూసి తినిపించె కొసరి కొసరి

  రిప్లయితొలగించండి
 11. రాక రాక వచ్చితివి శ్రీరామచంద్ర
  వారిద నిభదేహా రఘు వంశ తిలక
  దశరధతన యాఘవినాశ ధరణిజేశ
  ధన్యుల మయితిమే తవ దర్శనమున

  రిప్లయితొలగించండి
 12. రాక రాక వచ్చితివి శ్రీరామచంద్ర!
  నేను బంధువునేయైన నిన్ను గనను
  గాయకులలోన సత్కీరి గడన బొంది
  నట్టి సద్గాయకా గొను మభినుతులను.

  రిప్లయితొలగించండి
 13. * గు రు మూ ర్తి ఆ చా రి *

  { ఒక మిత్రుని ఇ౦టికి ఇ౦కొక మిత్రుడు వెళ్ళగా " శ్రీరామచ౦ద్ర. " అను ఊత పద౦తో
  అతడు పలుకరి౦చుట. }

  రాక రాక వచ్చితివి " శ్రీ రామ. చ౦ద్ర ".
  యిన్ని నాళ్ళకు మము జూడ. నిఛ్ఛ గలిగె ! ె
  యేమి స౦గతి ? నీ రాక. యెచటి ను౦డి ?
  చెల్లి కుశలమే ? క్షేమమే పిల్ల లెల్ల. ?

  రిప్లయితొలగించండి
 14. రాక రాక వచ్చితివి! శ్రీరామచంద్ర
  రూపమున శంఖ చక్రములొదుగ వెలసి
  భద్రగిరిగ బ్రోవుమనంగ ప్రార్థన విని,
  వేడ్కఁ జేసెభద్రాచల విభునిగ హరి

  రిప్లయితొలగించండి
 15. రాకరాకవచ్చితివి శ్రీరామచంద్ర
  సీత,లక్ష్మణ స్వామితో చేరిరాగ
  జన్మ ధన్యత నొందె నాజాను భాహు|
  ననుచుశబరియు బల్కెగా నడవియందు.
  2.రాకరాకవచ్చితివి శ్రీరామచంద్ర
  అడవిఫలములు దెత్తుమీరారగించ
  గుహుడు ధన్యుడుభక్తియు గూడుజేర
  భక్తి కున్నట్టి శక్తి విరక్తి మాన్పు|


  రిప్లయితొలగించండి
 16. నిన్నటి పద్యరచన:
  క్షణమొక యుగమై తోచెను!
  గణనీయమ్ముగ జలమ్ము కదలగ వరదై
  వణకుచు నే కేకలిడగ
  నను దట్టుచు నమ్మ లేపె నాకది కలయే!

  రిప్లయితొలగించండి
 17. రాక రాక వచ్చితివి శ్రీరామచంద్ర
  సఫల మాయెను నేటికీ శబరి జన్మ.
  సేద తీరుము రామ రాజీవ నేత్ర
  ధన్యురాలను, దక్కె నీ దర్శనంబు.

  సకల బాధలు నీ కృపన కడతేరు
  అట్టి నా దైవమున కెంత కష్ట మొచ్చె
  సర్వ భూతములకు నీవె శరణు గాగ
  పురుష సింహము నేడిట్లు పొగుల నేల.

  సతిని యెడబాసి దుఃఖించు సగటు మనిషి
  సబబు గాదు వీరులకిది సహజముగను
  శాంత చిత్తము గలిగి యోచన సలిపిన
  బాధలకు తగు హేతువు బోధపడును.

  వానరుల మైత్రి సర్వ శుభముల గూర్చు
  జానకి వెదకు యత్నంబు సఫల మగును
  ఖలుల కడతేర్చి లోకాల గాచ గలవు
  మేటి పాలన గావించు సాటి లేక.

  రిప్లయితొలగించండి