4, నవంబర్ 2015, బుధవారం

సమస్య - 1845 (పిన్నలు పెద్ద లేఁగిరఁట...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పిన్నలు పెద్ద లేఁగిరఁట భీష్ముని పెండ్లికి మోద మందుచున్. 

31 కామెంట్‌లు:

  1. కన్నుల విందు జేయగను కారణ మేమిటొ రాచ వీధులన్
    మిన్నుల నంటు వేడుకలు మీరిన సుందర మేళతాళ ముల్
    పిన్నలు పెద్ద లేఁగిఁరట భీష్ముని పెండ్లికి మోద మందుచు
    న్నెన్నడు వింటిమేని యిది నేరక చోద్యము గంగ సూనుపై

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో అన్వయం లోపించినట్లున్నది. 'పడతి యందము' అనండి.

      తొలగించండి
    2. గురువు గారికి...కవిమిత్రులకు ప్రణామములు

      1.
      అన్నుల మిన్నయౌ పడతి యందము నొప్పెడు చందమామయై
      వెన్నెల నొల్కు కన్నియనె పెండిలి నాడెదనంచు కోనలో
      తిన్నడు భీషణమ్మగు ప్రతిజ్ఞను చేసిన భీష్ముడాతడున్
      పిన్నలు పెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్

      2.
      కన్నుల వించి జోదు శర ఘాతము సోకి తపమ్ము భగ్నమై
      పన్నగ భూషణుండు సతి పార్వతి జేకొన సిద్ధమైన నా
      కన్నుల పండుగే గద, జగమ్ములనేలెడు వారి పెండ్లికిన్
      పిన్నలు పెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్

      భీష్ముడు అనగా శివుడనే అర్థముకూడా యుండడముచే నిలా పూరించాను.
      సవరణ చేసిన గురువు గారికీ ధన్యవాదములు

      తొలగించండి
  3. గంగ దగ్గర పెరుగుతున్న ఏకైక పుత్రుని తలచుకొనుచున్న శంతనుని కలలు!

    కన్నుల పంటగా జనుల కబ్బురమౌ విధి పెండ్లి చేయగా
    పున్నెము లేకపోయెనని పొంగులు వారెడు వేదనమ్ములో
    నున్న మనంబు నెమ్మది నెదో యొక స్వప్నము! పెండ్లిఁ జేసితిన్,
    కన్నెనుఁ దెచ్చి, యెల్లరకు కమ్మటి విందులు బెట్టితిన్, భళా!
    పిన్నలు పెద్ద లేఁగిరఁట భీష్ముని పెండ్లికి మోద మందుచున్.
    అప్పటికి శాంతనవునికి భీష్ముడన్న పేరు లేదు. ఈ పూరణ అంత సరిఅయినదేమీ కాదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గంగ దగ్గర పెరుగుతున్న ' అనకుండా ' తనకోసం పెండ్లి మానుకున్న పుత్రుని..... ' అంటే సరిపోతుంది కదా!

      తొలగించండి
    2. నిజమేనండీ , నాకు తోచనే లేదు. తండ్రి అప్పుడూ ఈ కలగనవచ్చు.
      నేను ఆలోచించినపుడు గంగ వల్ల మిగిలిన పుత్రులందరూ పోయినా అని వ్రాద్దామనుకున్నా, ఎలాగూ ఆభావం పద్యంలో ఇమడ్చనే లేదు.
      మీరన్నట్టు తనకోసం పెండ్లి మానుకున్న పుత్రుని గురించి ఆలోచిస్తున్న శంతనుని భావనగా తీసుకోవచ్చు. అప్పుడు పూరణ అర్థవంతమూ అవుతుంది.
      అనేక ధన్యవాదాలు గురువుగారూ!

      తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి సమస్య యందు ధర్మ క్షేత్రము లో గుణ దోషాన్ని గమనించి మార్చాను. మళ్ళీ ఏ ధ్యాసలోనో అదే వ్రాసాను. సవరించిన పద్యము గమనించ గోర్తాను.
    ధర్మ బద్ధ కురుక్షేత్ర ధరణి యందు
    సంభవించెను యుద్ధము శతకుమారు
    లున్న ధృత రాష్ట్రునిసుతులందొకడు వాని
    నంగదునిఁ జంపె నర్జునుఁ డాహవమున.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. కన్నుల విందుగాగరళకంఠుడు గౌరిల బెండ్లి వేడ్కలో
    వెన్నెలఱేడు వీవనను పీథుడు చత్రము బట్టి మెచ్చగన్
    చెన్నుగ బ్రహ్మ వాణియును శ్రీపతి లక్ష్మియు నష్టసిద్ధులున్
    పిన్నలు పెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్ !!!




    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. అన్నుల మిన్న మన్మధ వధాంతర భగ్నమనోరధార్తియై
      యన్నగరాజ నందనహిమాద్రి తటిందపమాచరించి ము
      క్కన్నుల వేల్పునీల ఘనకంఠుని పార్వతి పెండ్లియాడగన్
      పిన్నలు పెద్ద లేఁగిరఁట భీష్ముని పెండ్లికి మోద మందుచున్.
      [భీష్ముడు = శివుడు]

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. కుమార సంభవం:
      తధా సమక్షం దహతా మనోభవం పినాకినా భగ్న మనోరధా సతీ
      నినంద రూపం హృదయేన పార్వతీ ప్రియేషు సౌభాగ్య ఫలాహి చారుతా

      తొలగించండి
  7. అన్నులమిన్న హైమ కరమందగఁజేయు తలంపుతోడుతన్
    చెన్నగుపూలభాణముల చెచ్చెర వేయగ శంబరారి ఆ
    జన్నపువేటగాడు గొనె శాంభవి హస్తము పారవశ్యతన్
    పిన్నలుపెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. పిన్నలు పెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్
    ఎన్నడువింటిమేయిదియ పిన్నలు పెద్దలునేగిరా మరిన్
    పిన్నలునెట్లుగానపుడు వెళ్లిరి యెన్నడులేనిపెండ్లికిన్
    అన్నదయాకరా చెపుమ యాతృతగామదియుండెనిప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాకుంటే కాస్త గందరగోళంగా ఉంది.

      తొలగించండి
  9. మల్లియ మంచి గంధమును మౌనముగా వెదజల్లు రీతిగా
    ఎల్లరి మెప్పు బొందియును వేసెడి వేషము నచ్చి మెచ్చగా
    మెల్లగ పేరుబొంది తనుమెచ్చిన-ద్రౌపది పెళ్లియాడగా
    పిల్లలు,పెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్{ఈపూ
    రణనాటకాలలోవేష ములు వేయు ఇద్దరు పాత్రదారులకుపెళ్ళిగా
    పూరించడ మైనది.}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రాస మ(మా)ర్చి నట్టున్నారు ఈశ్వరప్ప గారూ!

      తొలగించండి
    2. కె. ఈశ్వరప్ప గారూ,
      ప్రాసను పట్టించుకోకుంటే మీ పూరణ బాగున్నది. ప్రాసను పాటిస్తూ మరో పూరణ ఇవ్వండి.

      తొలగించండి
  10. తిన్నడు విష్ణుభక్తుడట తీర్థమునందున గ్రుంకి మోక్షమున్
    వెన్నుడు పొందినాడట వివేకమెరుంగడు పార్థుడంట యౌ
    పిన్నలు పెద్ద లేఁగిరఁట భీష్ముని పెండ్లికి మోద మందుచున్
    మన్నిక లేని మాటలన మాన్యతయే ? వినలేను మిత్రమా!

    రిప్లయితొలగించండి
  11. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    తిన్నది లెక్కలేదనెడి తీరున మెక్కుచు పిండి వంటలన్
    మున్నెప్పుడైన చూడనిది ముక్కిన కల్లును త్రాగి మత్తునన్
    కన్నులు విప్పలేక,హరి గాధను గానము చేతునంచనెన్
    పిన్నలు పెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్

    రిప్లయితొలగించండి
  12. పిన్నవయస్కుడైన తను భీష్ముని పాత్రకు వన్నెతెచ్చియున్
    పిన్నలు 'శక్తిమాన' నుచు పిల్చగఁ దాల్చి 'ముఖేషు ఖన్న' డున్
    చెన్నుగ కీర్తికాంతనట చేగొనెడున్నభినందనా స్థలిన్
    పిన్నలు పెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్!

    రిప్లయితొలగించండి
  13. కన్నడు గాంధి వంశజుడు గారవ మొందుచు భీష్మమొప్పగా...
    విన్నర! వీధులందునను విందులు జేసెడి వార్తనివ్విధిన్:👇
    తిన్నగ కాంగ్రెసార్యులట త్రిప్పట
    నోర్చుచు రోమునందరున్
    పిన్నలు పెద్ద లేఁగిరఁట భీష్ముని పెండ్లికి మోద మందుచున్

    రిప్లయితొలగించండి
  14. భవిష్య పురాణం:

    పన్నుగ గెల్వ నెన్నికను భళ్ళున నవ్వి ప్రధాన మంత్రియై
    కన్నెల వేలవేలిచట గాంచుచు నెన్నగ స్వీటు హార్టునున్
    తిన్నగ రోము జేరుచును తీరుగ పిల్వగ కాంగ్రెసోళ్ళనున్
    పిన్నలు పెద్ద లేఁగిరఁట భీష్ముని పెండ్లికి మోద మందుచున్

    రిప్లయితొలగించండి