28, నవంబర్ 2015, శనివారం

పద్యరచన - 1077

కవిమిత్రులారా,
“ఇడుములు వచ్చును పోవును...”
ఇది పద్యప్రారంభం. 
దీనికి కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.

45 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘దడుపు’ మాండలిక పదం. ‘విజయమ్’ అని హలంతంగా ప్రయోగించారు. ‘తడయక భయమును విడగను తథ్యము గెలుపౌ’ అందామా?

      తొలగించండి
    2. గురువు గారికి నమస్కారములు....

      ఇడుములు వచ్చును పోవును
      తడబడినను చింత వలదు ధైర్యము తోడన్
      కడవరకు సాగ వలయును
      తడయక భయమును విడగను తథ్యము గెలుపౌ

      తొలగించండి
  2. ఇడుములు వచ్చును పోవును
    కడవరకును వేచి యున్న కలుగు శుభమ్ముల్
    కడలిని మించిన హృదయము
    విడువక దైవమును కొలిచి వేడిన చాలున్

    రిప్లయితొలగించండి
  3. ఇడుములు వచ్చును పోవును
    ఇడుముకొను ఈశుని దృడమ్ముగ
    ఉడుము పట్టు పట్టి విడనాడకుము
    చుడుమున వాడే పట్టు నిను జిలేబి!
    శుభోదయం
    జిలేబి


    నడుములు పట్టిన పట్టును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ భావానికి నా పద్యరూపం.....

      ఇడుములు వచ్చును పోవును
      విడువక నీశుని మనమున నిడుముకొనియుఁ దా
      నుడుమువలె పట్టి వర్తి
      ల్లెడు వానికి శుభ మనుచు జిలేబియె చెప్పెన్.

      తొలగించండి
  4. ఇడుములు వచ్చును పోవును
    దడవక యెదురొడ్డు వాని ధైర్యము తోనీ
    వడుగులు వేయుము ముందుకు
    కడగండ్లే లేని వ్యక్తి కలడే యిలలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. గురువుగారికి నమస్కారం. నా ఈ క్రింది పూరణ పరిశీలించి తప్పులు తెలియచేయగలరు.
    కం:
    ఇడుములు వచ్చును పోవును...
    కడలినికెరటములటునిటుకదలినరీతిన్
    జడవకనిలిచినవానికి
    విడువక కలుగును ఘనమగు విజయము గనగా

    రిప్లయితొలగించండి
  6. ఇడుములు వచ్చును పోవును
    బడుగుల జీవనము నందు పరిపాటేగా
    నడవడికన్నది ముఖ్యము
    తడబాటున తప్పులేక ధర్మమునిలచున్.
    2.ఇడుములు వచ్చునుపోవును
    గడిబిడి లేనట్టి బ్రతుకు గమనించంగా?
    గడుపుటలో స్వర్గంబగు
    చెడుగును యాచించకున్న?శ్రేష్టులువారే.
    3.ఇడుములు వచ్చునుపోవును
    మడి మాన్యము లెన్నియున్న-మహారాజైనా
    బడిబాటనునాశించగ
    నడవడికే మారిపోవు నాణ్యతబెరుగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      కొన్ని వ్యావహారిక పదాలను ప్రయోగించారు. ‘పరిపాటె కదా, గమనించంగన్’ అనండి. మూడవపద్యం రెండవపాదంలో ‘మహారాజైనా’ అన్నచోట గణదోషం.

      తొలగించండి
  7. ఇడుములు వచ్చును పోవును
    దడవక మరి వాటికెపుడు ధైర్యము తోడన్
    కడగండ్ల నధిగమించుచు
    కడవరకుంసాగునతడు గమ్యము చేరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. ఇడుములు వచ్చును పోవును
    వడివడి మబ్బులట నింగి వచ్చిన భంగిన్
    పటుతర వాయు నిభ ధృతిన్
    జటిల సమస్య లవలీల సన్నగిలునిలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా శతకమందలి పద్యము:
      చిక్కకు దురాశ లందును
      స్రుక్కకు నైరాశ్యమునను రోయకు వెతలన్
      చిక్కులకుఁ బరిష్కారము
      దక్కును ధృతిఁ బోచిరాజతనయా వినుమా

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

    3. జీపీయెస్ వారి కళ్ళే కళ్ళు :)

      ట డ ప్రాసరుభయోరభేధః అట్లా యేదన్నా వుందేమో ?


      జిలేబి

      తొలగించండి
  9. ఇడుములు వచ్చును పోవును
    పడిలేచే యలలవోలె పథికుడ! వసుధన్
    తడబడక నెదురు నిలిచిన
    కడకవి నినుగెలువ లేక కాంతులొసంగున్!!!



    ఇడుములు వచ్చును పోవును
    జడవక భవసాగరమున సాగుము నరుడా!
    అడుగిడు నాపద లందున
    జడదారిని నమ్ముకొనిన జయముల నీయున్!!!





    రిప్లయితొలగించండి
  10. ఇడుములు వచ్చును పోవును
    తడబడ కుండగ మనమును తాలిమి తోడన్
    యొడిదుడుకులు లేకున్నచొ
    కడవరకునుగడుప వచ్చు కలతలులేకన్.
    2ఇడుములు వచ్చుము పోవును
    కడలిని యున్నయల వోలె కాపురమందున్
    తడబాటు పడక యాసతి
    విడువక సహనమును జూప వేడుక మిగులున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  11. ఇడుములు వచ్చును పోవును
    మడుగుపడువరకును జీవి మహిలో సుమ్మా!
    కడుధైర్యముతోడ సతము
    నడుగిడవలె జీవితమున నజునిఁగొలుచుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  12. ఇడుములు వచ్చును పోవును
    మడయుట రైతన్న మంచి మార్గమ్మౌనా?
    విడవక ధైర్యము మదిలో
    నడచిన జయ మబ్బు నీకు న్యాయము జరుగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. ఇడుములు వచ్చును పోవును
    నడవడికను తీర్చి దిద్దు నలుగురు మెచ్చన్
    జడుపేలర? జీవితమున
    పెడదారులఁ బట్టకుంద్రు విజ్ఙులు మహిలో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. పద్యరచన
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { క్షమి౦చ౦డి గురువుగారూ ! ఒక ఉపమానమును చేర్చి పూరి౦ప. నె౦చితిని . క౦దము చిన్న దౌనని
    చ౦పక మాలలో వ్రాస్తున్నాను. మన్న౦చి ి
    స్వీకరి౦చ౦డి }
    ................. ........ .. ..... ...................

    ఇడుములు వచ్చు c బోవును, మరె౦త
    మహాత్ముల కేని | సౌఖ్యముల్ ్
    ....................................................
    బడసెడు వేళ పొ౦గకు | విపత్తుల క్రు౦గకు |
    మాత్మ ధైర్య. మీ
    ........................................................
    విడకు | మహా స్రవ౦తి ప్రవహి౦చదె ,
    దాటుచు నుఛ్ఛ నీచముల్ ,
    ...........................................................
    కడలిని జేర. ? నీ వటులె కష్టము లీదుము
    చేర గమ్యమున్ !
    ...................................... ................
    { ఇడకు = విడకు ;
    మహాస్రవ౦తి = మహా నది }
    ............................................



    ి

    రిప్లయితొలగించండి
  15. ఇడుములు వచ్చును పోవును
    కడలినికెరటములరీతి కలవరపడకన్
    నడచిన చాలును నీతిని
    విడువక,చీకటులుతొలుగు వెలుగులు పూయున్!!!

    రిప్లయితొలగించండి
  16. ఇదుములు వచ్చును,పోవును
    అడవులపాలైన పాండవాదులు సతితో
    కడగండ్లను పడలేదా !
    విడిచిర ధైర్యము?చివరకు విజయము గనరే!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘పోవును+అడవుల’ అన్నప్పుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు కదా!

      తొలగించండి
  17. ఇడుములు వచ్చును పోవును
    దడవకుమా వానిజూచి తడవకు, మదిలో
    విడువక దైర్యము పోరిన
    కడగండ్లే పారిపోవు గదరా!నరుడా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. ఇడుములు వచ్చును పోవును
    కడలితరంగముల భంగి, కష్టము లెపుడున్
    నిడుజడి యై ముసరవు మరి
    వడివడిగా సంపదలు జేర వందురు వినుమా!

    రిప్లయితొలగించండి


  19. ఇడుములు వచ్చును పోవును
    విడువకు నీశుని జిలేబి విభుడాతడు నీ
    కడుగడు నగుపడు దృష్టిని
    సడలింపక గాన సూవె చక్కగ తోడై !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. ఇడుములు వచ్చును పోవును
    వడగండ్లు కురిసి వెలిసెడి వానల వోలెన్
    తడబడి లేచిన వెంటనె
    ధడబడమని నెత్తి మీద ధాటిగ కుమ్మున్

    రిప్లయితొలగించండి
  21. ఇడుములు వచ్చును పోవును
    పడవలు తేలును మునుగును పారెడు నదియౌ
    తడిపొడి సంసారమ్మున
    కడకిక మనకున్ మిగులును కాష్ఠమె రామా!

    రిప్లయితొలగించండి