30, నవంబర్ 2015, సోమవారం

పద్యరచన - 1079

కవిమిత్రులారా,

“జననీ జనకుల పదములు...”

ఇది పద్యప్రారంభం. 

దీనికి కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.

35 కామెంట్‌లు:

 1. జననీ జనకుల పదములు
  మనసారగ పూజసేయు మాన్యున కిలలో
  నొనగూడును సక లార్ఠము
  లనుమాటలు కల్లగావనందురు వినుమా!

  2.
  జననీ జనకుల పదములు
  ఘనమే సురకోటి కన్న గడు బుణ్యంబౌ
  ననునిత్యమునా చరణము
  లను పూజించని జనులిల నల్పులె సుమ్మీ

  రిప్లయితొలగించండి
 2. 1.జననీ జనకుల పదముల
  ననవరతమ్ము గొలుతు నిటునభిమానముతో
  వినుమీ వీరలె కారా
  మనకిట దేవతలనంగ మహిలో చూడన్
  2.జననీ జనకుల పదముల
  ననయము సేవించి ముక్తి నందిన ముని బా
  లునికథ బాలులకు దెలుప
  వినయవివేకము బెరుగు విజయము గల్గున్.
  3.జననీ జనకుల పదములు
  కనిపించని శ్రీహరి పద కమలము లనుచున్
  ననిశము ధ్యానము చేసిన
  నొనగూరు సకల శుభంబు లుర్విన్ జూడన్.

  రిప్లయితొలగించండి
 3. జననీ జనకుల పదములు
  ననువుగ తామ్రొక్కి నంత నాయువు పెరుగున్
  మనమున భక్తిని నింపుచు
  వినయముగా నణగి యున్న వెలుగు శుభంబుల్

  రిప్లయితొలగించండి
 4. జననీ జనకుల పదములు
  గని మొక్కని జన్మ జూడ కడు వ్యర్థంబౌ
  అనిశము సేవింపగదగు
  మనిషై మనువాడు తెలుప మహిలో నెపుడున్

  రిప్లయితొలగించండి
 5. జననీ జనకుల పదములు
  గని మొక్కని జన్మ జూడ కడు వ్యర్థంబౌ
  అనిశము సేవింపగదగు
  మనిషై మనువాడు తెలుప మహిలో విధిగన్

  రిప్లయితొలగించండి
 6. జననీ జనకుల పదములు
  గని మొక్కని జన్మ జూడ కడు వ్యర్థంబౌ
  అనిశము సేవింపగదగు
  మనిషై మనువాడు తెలుప మహిలో నెపుడున్

  రిప్లయితొలగించండి
 7. జననీ జనకుల పదములు
  వినవలయును నుడివినంత విజ్ఞతతోడన్
  జననీ జనకుల పదములు
  జనులందరు గొలువవలయు శ్రద్ధాభక్తిన్.

  రిప్లయితొలగించండి
 8. మాస్టరు గారూ ! ఇప్పుడే ఫేస్ బుక్ లో వార్త చూచి చాలాచింతించుచున్నాను. దివంగతులైన మీ పితృదేవుల ఆత్మకు శాంతి కలుగుగాక.

  రిప్లయితొలగించండి
 9. గురువుగారూ! దివంగతులైన మీ పితృదేవుల ఆత్మకు శాంతి కలుగు గాక.

  రిప్లయితొలగించండి
 10. ఇప్పుడే తెలిసింది.మీతండ్రిగారి ఆత్మకు శాంతి కలుగుగాక.

  రిప్లయితొలగించండి
 11. ఇప్పుడే తెలిసింది.మీతండ్రిగారి ఆత్మకు శాంతి కలుగుగాక.

  రిప్లయితొలగించండి
 12. వారి యాత్మకు అా పార్వతీ పరమేశ్వరులు శాంతిని ప్రసాదించు గా

  రిప్లయితొలగించండి
 13. ప్రణామములు గురువుగారు...చాలా విచారకరమైన వార్త.. మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను...

  రిప్లయితొలగించండి
 14. జననీ జనకుల పదములు
  అనునిత్యమునంటుచున్న హరియే మెచ్చున్
  కనబడు దైవములనిలను
  జనులందరు గొలువవలయు సౌహార్దముతో!!!


  రిప్లయితొలగించండి
 15. పద్యరచన
  * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { " క్ర మా ల౦ కా ర ము " }

  జననీ జనకుల పదముల.

  జననీ జనకుల పదముల 1 చక్కగ వినుమా ,

  2 మనమున భక్తి౦ గనుమా ;

  కనబడు శ్రీ కేశవు లిక. కారే వారల్ ?

  ,;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

  జననీ జనకుల పదముల.

  మునుకొని పూజి౦చి మరియు ముమ్మారు ప్రద

  క్షిణమొనరి౦చి - గణపతి , గు

  హుని గెల్చుచు గ రి పె తా మహోన్నత నీతిన్

  { గుహుడు = కుమార స్వామి ;
  గరిపె = క రి పె = నేర్పె

  రిప్లయితొలగించండి
 16. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పితృ దేవుని సేవలో నిమగ్నులైన మీరు ధన్యాత్ములు. నాన్న గారి కి స్వస్థత చేకూర్చాలని భగవంతుని వేడుకొను చున్నాను.

  జననీ జనకుల పదములు
  వనజ భవాంఛిత పవిత్ర పాద సదృశముల్
  అనవర తారాధ్యార్హ క
  మనీయ కోమల కుసుమ సమానమ్ము లిలన్

  రిప్లయితొలగించండి
 17. జననీ జనకులపదములు
  కని మ్రొక్కని వాడు భువిని కఠినాత్ముండే
  వినుమరి యాతని ప్రాణము
  కననొల్లని దూరమేగు గడచిన పిదపన్

  రిప్లయితొలగించండి
 18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 19. జననీ జనకుల పదములు
  ఘనగంగానది సదృశము ఖండిని పైనన్
  దినముఖమున పూజలు సలి
  పిన లచ్చి మగండు కరము ప్రీతిని పొందున్
  ఖండినిః భూమి

  రిప్లయితొలగించండి
 20. మీ తండ్రి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 21. గురువు గారూ, నాన్నగారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ సంతాపం తెలియజేస్తున్నాను

  రిప్లయితొలగించండి
 22. పద్యరచన
  * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { " క్ర మా ల౦ కా ర ము " }

  జననీ జనకుల పదముల.

  జననీ జనకుల పదముల 1 చక్కగ వినుమా ,

  2 మనమున భక్తి౦ గనుమా ;

  కనబడు శ్రీ కేశవు లిక. కారే వారల్ ?

  ,;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

  జననీ జనకుల పదముల.

  మునుకొని పూజి౦చి మరియు ముమ్మారు ప్రద

  క్షిణమొనరి౦చి - గణపతి , గు

  హుని గెల్చుచు గ రి పె తా మహోన్నత నీతిన్

  { గుహుడు = కుమార స్వామి ;
  గరిపె = క రి పె = నేర్పె

  రిప్లయితొలగించండి
 23. జననీ జనకుల పదములు
  తనయులు సేవింప జన్మ ధన్యమ్మగు ,ధా
  రుణి కన్పట్టెడి వేల్పులు
  మనయునికికి మనుగడకున్ మాన్యులువారే

  రిప్లయితొలగించండి
 24. జననీ జనకుల పదములు
  తనయులు సేవింప జన్మ ధన్యమ్మగు ,ధా
  రుణి కన్పట్టెడి వేల్పులు
  మనయునికికి మనుగడకున్ మాన్యులువారే

  రిప్లయితొలగించండి
 25. జననీ జనకుల పదములు
  ననుదినమును గొల్చు భాగ్య మందరి కిలలో
  నొనగూడదు మనుజుడు తన
  మనుగడకై యిల్లు వదలి మసలుచు నుండున్

  రిప్లయితొలగించండి
 26. జననీ జనకుల పదములు
  ననుదినమును గొల్చు భాగ్య మందరి కిలలో
  నొనగూడదు మనుజుడు తన
  మనుగడకై యిల్లు వదలి మసలుచు నుండున్

  రిప్లయితొలగించండి
 27. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికిం గలిగిన పితృవియోగమునకుఁ జింతించుచు వారికి నా ప్రగాఢ సానుభూతిఁ దెలియఁజేయుచున్నాను. వారి తండ్రిగారు కీ.శే. శ్రీ కంది వీరస్వామి గారి యాత్మ కా భగవంతుఁడు శాంతిని జేకూర్చుఁగాక!

  పదియు నొక్కండ్రు సంతాన బలిమిచేత
  వాసిఁ గనిన వీరస్వామి పఱగ దివికి
  నేఁగె! ఋణము సెల్లెను గాన నేఁగెఁ గాదె!
  వారి యాత్మయె శాంతినిఁ బడయుఁ గాత!!

  స్వస్తి

  రిప్లయితొలగించండి
 28. జననీ జనకుల పదములు
  అనిశము గొలిచిన నిరతిగ అలరును శుభముల్.
  తనయుల కది పేరిమి యగు
  ఒనరుగ మనలకు నడతను నొసగును భువిలో.

  రిప్లయితొలగించండి
 29. జననీ జనకుల పదములు
  వినవలయును కొంత వరకు విజ్ఞత తోడన్...
  అనుసరణము కాని యెడల
  వినవలయును గృహిణి మాట వినరా సుమతీ!

  పదము = వాక్యము
  (శబ్దరత్నాకరము)

  రిప్లయితొలగించండి


 30. జననీ జనకుల పదములు
  వనితా విడువక జనులు గవ‌నముగ గానన్
  మనుగడ ప్రగతిని గాంచును
  వినుమా విదురుల పలుకుల విని సల్పు పనిన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 31. జననీ జనకుల పదములు
  ఘనముగ పట్టంగ వలయు కాంతను తేగన్
  జననీ జనకుల పదములు
  ఘనముగ వీడంగ వలయు కాంతయె రాగన్

  రిప్లయితొలగించండి