6, నవంబర్ 2015, శుక్రవారం

పద్యరచన - 1056

కవిమిత్రులారా!
“పద్యముఁ జెప్పఁగావలెను భావము...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

27 కామెంట్‌లు:

  1. పద్యముఁ జెప్పఁగా వలెను భావము మైమర పింపగా మదిన్
    మధ్యము ద్రాగినట్టు లుగ మత్తున దేలుచు నూయలూ గుచున్
    విద్యల తల్లినే దలచి వేలుపు నీవని మ్రొక్కి నంతనే
    గద్యము పద్దెమున్ బలుక కాదట కష్టము కావ్యమల్ల గన్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. పద్యము జెప్పగా వలెను భావము ధారయు నొక్కనీయకన్
    గద్యము కన్న భిన్నముగ కంఠము నెత్తుచు రాగయుక్త నై
    వేద్యము శారదాంబకు నివేదన జేసిన జాలునీ యిలన్
    పద్యము పొందునోయిగత వైభవ మన్నది సత్యమే గనన్

    రిప్లయితొలగించండి
  4. పద్యముజెప్పగా వలెను భావము మంచిగ యుండునట్లుగా
    గద్యము గూడనావిధము హృద్యముగా మరియుండినొప్పినన్
    అద్దిర యంచు నెప్పుడును నందరు మెత్తురుగాదెయయ్యదిన్
    పద్యము లన్నియున్ మరియుగద్యములున్ జదువంగనేర్తురే

    రిప్లయితొలగించండి
  5. పద్యముఁ జెప్పఁగావలెను భావము పండిత పామరేద్ధ సం
    వేద్యముగన్ పఠింపనల వీనుల విందుగ శోభితంబునై
    హృద్యమ మై వెలుంగుచు సహేతుకమౌ పద సంహితంబునై
    విద్యల నుత్తమంబుగ కవీశ్వరు లందరు జెప్ప నేర్తురే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. “పద్యముఁ జెప్పఁగావలెను" భావమునన్ తలపిద్ది నాకు, నే
    విద్యల గాను నేర్పరిని, వీసము గూడను లేదు చెప్పగా
    హృద్యకవిత్వమున్ తెలివి, యేమని వ్రాయుదు పద్యమిత్తరిన్ ?
    గద్యమె మేలు చూడగను, కాని ప్రయత్న మదేల మానెదన్.

    పద్యముఁ జెప్పఁగావలెను భావము కమ్మగ పండు రీతిలో
    హృద్యకవిత్వసౌరభము లింపుగ తాక పఠించు డెందమున్
    విద్యల నెన్ని నేర్చినను వీనులవిందగు కైతలల్లుటల్
    పద్యసుమాల గూర్చి యలవాటుగ మారనిచో వృధా కదా.

    రిప్లయితొలగించండి
  7. పద్యముజెప్పగా వలెను భావముప్రస్ఫుటమైన రీతిగా
    విద్యలు నేర్పగావలె వివేకము,శీలము,దేశభక్తియున్
    సేద్యము సేయగా వలె కృషీవలు రెల్లరు ఖ్యాతినొందగా
    వాద్యపు ధ్వానముల్ పొగడ భారత దేశ మహత్వ సత్వముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. పద్యముజెప్పగా వలెను భావమునిండిన రాగయుక్తమై
    మద్యమ,శంకరాభరణ, మాళవ, తోడియు గౌళరాగముల్
    అద్యయనంబుకంటె మనకంటును మానసమందు వేగమే
    విద్యయె లోకరక్షణగు వింతగు జీవన నాటకంబునన్|
    ------------మధ్యాక్కర-----------------
    పద్యము జెప్పగా వలయు భావమువీడక-విన్న
    నుద్యమ మార్గ మౌను గద యూహల జేరిన|మంచి
    విద్యయె విశ్వ మానవత వేల్పుగ గాచును మిమ్ము|
    అద్యయనంబు వీడకనె అందరు నేర్చిన మేలు.

    రిప్లయితొలగించండి
  9. పద్యము జెప్పగా వలెను భావము తీయగ జాలువారగన్
    హృద్యములైన వాక్యముల సృష్టిని జేయుమ నామనంబునన్
    విద్యల తల్లి బ్రహ్మసతి! వేడుచు మ్రొక్కెద నాదరమ్ముతో
    సద్యశమందజేయుమిల సర్వులు మెచ్చగ నాదు కైతలన్!!!

    రిప్లయితొలగించండి
  10. పద్యముజెప్పగా వలెను భావముప్రస్ఫుటమైన రీతిగా
    విద్యలు నేర్పగావలె వివేకము,శీలము,దేశభక్తియున్
    సేద్యము సేయగా వలె కృషీవలు రెల్లరు ఖ్యాతినొందగా
    వాద్యపు ధ్వానముల్ పొగడ భారత దేశ మహత్వ సత్వముల్

    రిప్లయితొలగించండి
  11. పద్యముఁ జెప్పఁగావలెను భావము గోచరమౌ విధంబుగన్
    పద్యము జెప్పగా వలెను పండిత శ్రేష్ఠులు మెచ్చు రీతిగన్
    పద్యము జెప్పగా వలెను పాఠకు లుల్లసమొందు పెంపుగన్
    పద్యము జెప్పగావలెను పామరులున్ వినగోరు నట్టులన్.

    రిప్లయితొలగించండి
  12. పద్యముఁ జెప్పఁగావలెను భావము గోచరమౌ విధంబుగన్
    పద్యము జెప్పగా వలెను పండిత వర్యులు మెచ్చు రీతిగన్
    పద్యము జెప్పగా వలెను పాఠకు లుల్లసమొందు పెంపుగన్
    పద్యము జెప్పగావలెను పామరులున్ వినగోరు నట్టులన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. *గు రు మూ ర్తి ఆ చా రి *

    పద్యము చెప్పగా వలయు భావము ప్రస్ఫుటమౌ విధ౦బుగా ;
    పద్యము చెప్పగా వలయు భవ్యపద౦బుల నేరి కూర్చుచున్
    పద్యము పుష్పమాలయగు ; భావము సూత్రమగున్ ;
    పదాళియే
    హృద్య లతా౦తముల్ ; పదము లేటికి , భావము లేకయున్నచో ?

    రిప్లయితొలగించండి
  14. పద్యముఁజెప్పగావలయు భావము స్పష్టముచేయుకోర్కెతో
    గద్యముకంటె వేగమది కాంచును సుమ్మ ప్రజానురాగమున్
    విద్యలతల్లి సంతతము ప్రేమను పంచుచు నుండ హృద్యమౌ
    పద్యపరంపరల్ మదిని పల్కు పసందగు కూర్పుతోడుతన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. పద్యముఁ జెప్పఁగా వలెను భావము దైవము జేరునట్టులున్
    గద్యము నందు ప్రాస,యతి, కమ్మని చంధము మేళవించెడున్
    విద్యలెరింగి మాటలును వెన్నలు చిందుచు సాగినంత నై
    వేద్యముఁ గోరడెన్నడును వెన్నుడు మెచ్చుచు విన్నపమ్ములున్!

    రిప్లయితొలగించండి
  16. పద్యముఁ జెప్పఁగావలెను భావము సూటిగ హృత్తుకందెడిన్
    పద్యము చెప్పగా వలెను భారపు సంధులు మెండు లేకయే
    పద్యము చెప్పగావలెను పాడుట కింపుగ రమ్యమౌచునో
    పద్యము చెప్పగావలెను భక్తిని రక్తిని ముక్తి నిచ్చెడిన్

    రిప్లయితొలగించండి
  17. పద్యముఁ జెప్పఁగావలెను భావము సుంతయు కానజాలకే
    మద్యము గ్రోలగా వలెను మైకము సుంతయు కానజాలకే
    విద్యను నేర్పగా వలెను వేదన సుంతయు కానజాలకే
    సేద్యము జేయగా వలెను స్వేదము సుంతయు కానజాలకే
    సద్యశమున్ గొనంగ వలె చప్పుడు గొప్పగ చేయకుండనే

    రిప్లయితొలగించండి