17, నవంబర్ 2015, మంగళవారం

సమస్య - 1857 (కారమ్మే భూజనులకు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కారమ్మే భూజనులకుఁ గడు హిత మొసఁగున్.

47 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘కోరగ సతతము...’ అంటే అన్వయం చక్కగా కుదురుతుంది.

   తొలగించండి
  2. గురువు గారికి ధన్యవాదములు
   మీ సూచన ప్రకారము సవరించ గలను

   తొలగించండి
  3. పేరిమి వదలక మనుజులు
   కూరిమి తో మెలగవలెను కువలయ మందున్
   కోరగ సతతము జన సహ
   కారమ్మే భూజనులకు గడు హిత మొసగున్

   తొలగించండి
 2. ఓరిమి గలిగిన జనులకు
  కూరిమి తోనున్న యెడల కోరిన సిరులౌ
  నేరము లెంచక నిలమమ
  కారమ్మే భూజనులకుఁ గడు హితమొసఁగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘నేరమ్ముల నెంచని మమకారమ్మే...’ అన్వయం బాగుంటుంది.

   తొలగించండి
  2. ఓరిమి గలిగిన జనులకు
   కూరిమితో నున్న యెడల కోరిన సిరులౌ
   నేరమ్ముల నెంచని మమ
   కారమ్మే భూజనులకుఁ గడుహిత మొసఁగున్

   తొలగించండి
 3. పౌరుల్లారా ఘనముగ
  మీరెల్లరుఁ గన్న కలలు మేధినిపై సా
  కారమునకుఁ జుట్టెడు శ్రీ
  కారమ్మే భూ జనులకుఁ గడు హితమొసఁగున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. మిత్రులందఱకు నమస్సులు!

  సారమనమ్మున నిత్యము
  తీరని వెతలన్ని దూరతీరముఁ జేర్పన్
  ధారాళోచ్చారిత "ఓం

  కారమ్మే" భూజనులకుఁ గడు హిత మొసఁగున్!

  రిప్లయితొలగించండి
 5. ధారుణిలో నొకరికొకరు
  కూరిమితో మెలగు నెడల గొడవలు దగ్గున్
  నారయ నోరిమి గల సహ
  కారమ్మే భూజనులకుఁ గడు హిత మొసఁగున్!!!

  రిప్లయితొలగించండి
 6. కూరిమి గల జనముల కిల
  పరమానందము గలుగును బాయును వెతలున్
  పరిమితు లెరుగని యా మమ
  కారమ్మే భూజనులకు గడుహిత మొసగున్
  2.కరమభిమానము జూపుచు
  చెరగని చిరునగవు తోడ చెలిమిని చేయన్
  తరగని పెన్నిధియౌ నుప
  కారమ్మే భూజనులకు గడు హితమొసగున్.
  3.నేరము లెంచక కరముప
  కారము చేసిన జనులను కలకాలంబున్
  మరువక నందించెడు సహ
  కారమ్మే భూజనులకు గడు హితమొసగున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పూరణలు ఛందోనియమాన్ని పాటించలేదు. కందపద్యం మొదటి పాదం గురులఘువులలో దేనితో మొదలవుతుందో మిగిలిన పాదాలు దానితోనే ప్రారంభించాలని నియమం కదా! మీ పద్యాలను సవరించండి.

   తొలగించండి
 7. తీరుగ శ్రీమంతులు తమ
  యూరును యభివృద్ధి జేయు నుద్దేశ్యముతో
  మీరుచు గొను దత్తత స్వీ
  కారమ్మే భూజనులకుఁ గడు హిత మొసఁగున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. గోలి వారూ,
   ‘దత్తత స్వీకార’ మన్నప్పుడు త గురువై గణదోషం. ‘దత్త స్వీకారమ్మే’ అనండి.

   తొలగించండి
 8. ద్వారముకు తోరణము లా
  గారము ముంగిటను ముగ్గు కడు యింపొసగన్
  వైరమ్ము మాని మత సహ
  కారమ్మే భూజనులకు గడు హిత మొసగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. తిమ్మాజీ రావు గారూ,
   ‘ద్వారముకు’ అనడం దోషం. ‘ద్వారమునకు’ అనాలి. ‘ద్వారమునకు తోరణ మా|గారము...’ అనండి. ‘కడు నింపొసగన్’ అనాలి.

   తొలగించండి
  3. గురుదేవులు శంకరయ్యగారికి ధన్యవాదములు
   మీ సూచనమేరకు పద్యము సవరించితిని
   ద్వారమునకు తోరణమా
   గారము ముంగిటను ముగ్గు కడు నింపొసగన్
   వైరమ్ము మాని మత సహ
   కారమ్మే భూజనులకు గడు హిత మొసగున్.

   తొలగించండి
 9. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ................................

  కోరికల గ౦ప తలపై
  భారమ్ముగ ను౦డె ననుచు వగచిన ఫలమే ?
  ధీరత నొనరి౦చు పురుష
  కారమ్మే భూజనులకు కడు హిత మొసగున్

  { పురుష కారము : పురుష ప్రయత్నము }
  ........................,..........................

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ ‘పురుషకార’ పూరణము బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి సమస్యా పూరణ మొదటి పద్యములో “ఫలకాకర” విభక్తి ప్రత్యయ విహీనమైనదనియే రెండవ పద్యము వ్రాసి పంపితిని.
  అయినను,” ఫలకాకర! మేఘములను చేదు (ము)” అని వేడుకొనే మన మాట కల్లయే నిజము కాదు (ఫలించదు) అని అన్వయించు కోవచ్చునని పంపాను.
  కాకర, చేఁదు రెండు పదములకు సామాన్యేతర అర్ధములు వాడవలెనన్న ఉత్సాహము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ వివరణ నా సందేహాన్ని తొలగించి సంతృప్తి నిచ్చింది. ధన్యవాదాలు.

   తొలగించండి
 11. పేరిమి సుజనుల యెడ మమ
  కారముల మసలుచు కుందక వికారాహం
  కారములఁ బరస్పర సహ
  కారమ్మే భూజనులకుఁ గడు హిత మొసఁగున్.

  రిప్లయితొలగించండి
 12. మారక మానవతత్వము
  కోరిన కోర్కెలను దీర్చు కూరిమినిడుచున్
  దారిని జూపెడిదౌ సహ
  కారమ్మే భూజనులకు గడు హితమొసగున్
  2.ధారణచే నవధానము
  ప్రీరణచే చదువు,సంధ్య,పెద్దల వాక్యాల్
  చేరిన విజయుడి కిడుస
  త్కారమ్మే భూజనులకు కడుహితమొసగున్.
  3.ప్రేరణ చేగురువర్యులు
  ధారణగా ధర్మబుద్ధి,దానము జేయన్
  మారని చదువన్నదినుప
  కారమ్మేభూజనులకు కడుహిత మొసగున్.
  4.కారణములు దెలుపకనే
  వేరగు సంసారు లయ్యు వేదన లందే
  జేరిన జేరినతగుమమ
  కారమ్మే భూజనులకు కడు హిత మొసగున్

  రిప్లయితొలగించండి
 13. ధరనుండు ప్రజలు నిరతము
  విరసముగా నుండ బోక బ్రియమును దోడ
  న్నొకరికి మఱి యొక రిడుసహ
  కా రమ్మే భూజనులకు గడు హిత మొసగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   సమస్యగా ఇచ్చిన పాదం దీర్ఘంతో ప్రారంభమయింది. మీరు మూడు కందపాదాలను లఘువులతో ప్రారంభించారు. మరొక పూరణ చేసి పంపండి.

   తొలగించండి
 14. నారాయణు కథలన్నియు
  పారాయణఁజేయుచు కడు పరిశుద్ధమదిన్
  ధారుణినసదులకిడు మమ
  కారమ్మేభూజనులకు కడు హితమొసగున్

  రిప్లయితొలగించండి
 15. వీరావేశముజెందుచు
  నేరినిమరి తూలనాడకెప్పుడుగూడన్
  వీరా! యెరుగుము నీసహ
  కారమ్శే భూజనులకుగడుహితమొసగున్

  రిప్లయితొలగించండి
 16. భూసారపు నర్సయ్య గారి పూరణ.....

  సారము లేనిది యీ సం
  సారము హుళ్ళక్కి యనెడు చక్కని సూక్తిన్
  మీరకు మరిషడ్వర్గవి
  కారమ్మే భూజనులకు గడు హిత మొసఁగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నర్సయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ఊరకె ప్రవచనము లిడక
   సారము గల మాటలాడి సాఫల్యము కై
   తీరుగ పని చేయగ సా
   కారమ్మే భూజనులకుఁ గడు హిత మొసఁగున్.

   తొలగించండి
  3. కృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘సాఫల్యమునకై’ అనవలసి ఉంటుంది. అక్కడ ‘సఫల మగుటకై’ అనండి.

   తొలగించండి
 17. మీరెను హింసాచారము
  ధారుణిలో మానవత్వ ధర్మము దప్పెన్
  నేరమ్మిది యొప్పరు మమ
  కారమ్మే భూజనులకుఁ గడు హిత మొసఁగున్.

  రిప్లయితొలగించండి
 18. లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. వారము వర్జ్యమును గనక
  కోరిక మీరగను స్వీట్లు కుమ్మగ వెగటై ...
  జోరుగ నుల్లుల మిర్చుల
  కారమ్మే భూజనులకుఁ గడు హిత మొసఁగున్

  రిప్లయితొలగించండి


 20. నోరార స్వీటులను తిన
  లేరు! భుజింపంగ శక్తి లేదు జిలేబీల్!
  సారు! 'దియాబేటీ' దయ
  కారమ్మే భూజనులకుఁ గడు హిత మొసఁగున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి