5, నవంబర్ 2015, గురువారం

సమస్య - 1846 (రామ యనిన నోరు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రామ యనిన నోరు ఱాతిరోలు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

32 కామెంట్‌లు:

 1. సార్థకమగు నంట సతతమ్ము భక్తితో
  రామ యనిన నోరు, ఱాతి రోలు
  రీతి మార్చకుండ మూతితో పలుమార్లు
  రామ యనిన చాలు రక్షణొసగు.

  రిప్లయితొలగించండి
 2. శివుని గొలిచి నంత చింతలు బోవంట
  రామ యనిన నోరు రాతి ఱోలు
  కరగ నట్టి రాయి మెరుగు పూజలేల
  వెఱ్ఱి జనుల భ్రమలు వేన వేలు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు. పూజ్యులు... అన్నచోట గణదోషం. 'పూజ లవేల' అనండి.

   తొలగించండి
 3. నామమెద్ది బలుక నాంజనేయుడు మెచ్చు ?
  తినుటకేది వలయు తిన్నగాను ?
  బామ్మ తొక్కె నాడు పచ్చడి దేనిలో ?
  రామ యనిన-నోరు-ఱాతి రోలు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. నామమెద్ది యనిన నాంజనేయుడు మెచ్చు ?
  తినుటకేది వలయు తిన్నగాను ?
  బామ్మ నూరె నాడు పచ్చడి దేనిలో ?
  రామ యనిన-నోరు-ఱాతి రోలు

  రిప్లయితొలగించండి
 5. రిప్లయిలు
  1. మాటునఁ గపిఁ జంప మర్యాద గునటయ్య
   రామ యనిన నోరు ఱాతిరోలు.
   మాటున మృగ వేట మర్యాద నిక్కంబు
   స్వానుజసతి హారి వాలి కాదె
   [నా రామచంద్ర శతకమందలి పద్యము:
   మాటున మృగ వేట మర్యాద నిక్కంబు
   స్వానుజసతి హారి వాలి ధర్మ
   హీనుని విదళింపఁ హీనమనదగునే
   రాగ దయ్య బ్రోవ రామ చంద్ర]

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మర్యాద +అగు... అన్నచోట యడాగమం వస్తుంది. మృగవేట.... అనడం దుష్టసమాసం.

   తొలగించండి
 6. రామరామయనుచు రాగాలఁదీయుచు
  భామ కానుపించ పరుగులెత్తు
  నవసరముల కొరకు ననవరతమ్మును
  రామయనిననోరురాతిఱోలు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. కార్య సాధనాన కరుణయు గురిపించు
  రామయనిన|”నోరు ఱాతి రోలు
  నామజపము లేక నాలుక పేలికే
  రామభజన మనకు రక్ష యగును.
  2.వైనమందు దలచి వాల్మీకి మారెగా
  రామయనిన|”నోరుఱాతిరోలు
  రామయన్నపలుకు రాకను-మరయని
  పలుకు దంచి దంచ?ప్రతిభ బెరిగె|

  రిప్లయితొలగించండి
 8. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  మద్యమమ్మకమ్ములు ద్యమమ్ముగ నిల్వ
  గుడిని బడిని పంట మడిని నేడు
  గ్రామసీమలందు రామకోవెల చెంత
  రామ యనిన నోరు ఱాతిరోలు.

  {ఈ సమస్య తే 24/06/2014 దీన
  సమస్య సంఖ్య 1454 గా యిచ్చినదే }

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఇది గతంలో ఇచ్చిన విషయం గుర్తు లేదు. ధన్యవాదాలు.

   తొలగించండి
 9. రామనామ గాన రసము నాస్వాదించు
  పన్నమున్న నోరు పెదము జేర్చు
  మాయలేడి యైన మారీచు డరచిన
  రామయనిన నోరు రాతి రోలు

  రిప్లయితొలగించండి
 10. రామనామ గాన రసము నాస్వాదించు
  పన్నమున్న నోరు పెదము జేర్చు
  మాయలేడి యైన మారీచు డరచిన
  రామయనిన నోరు రాతి రోలు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   పాదము.....?

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. గురువుగారికి నమస్కృతులు
   పాదము అని నేను వ్రాయలేదు పదము జేర్చు అనివ్రాసినాను
   పదము అనగా పరమ పదమని నాభావన

   తొలగించండి
 11. పావనంబు నగును బ్రత్యహమునునిల
  రామయననిననోరు రాతిరోలు
  బొత్ర ముండెనుగద పూర్వకాలమునందు
  గృహము గృహమునందు కృష్ణ ! వింటె?

  రిప్లయితొలగించండి
 12. అర్థి సాత్కృతమెవని ద్రవ్యమ్ము కాదొ
  జగతి కాతండ వ్రేగునా దగును గాని
  అంబుధులు కావు, కావరణ్యములు, త్హున
  కనక శైలాధికంబులు కావు బరువు

  ప్రసిద్ధ కవి తుమ్మల సీతారామ్మూర్తి గారి పఱిగపంట లోనిదీ పద్యం. భావం విషయంలో కొంచెం సందేహం. తెలిసిన వారు వివరిస్తే చాలా సంతోషిస్తాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మీదేవి గారూ,
   ప్రయాణపు టలసటతో ఉన్నాను. రేపు వివరిస్తాను..

   తొలగించండి
 13. పరవనితను గనిన పరవశమందుచు
  ముగ్గులోకి దింప సిగ్గుమాలి
  చెంత జేరి వెకిలి చేష్టల చూడవో
  రామ! యనిననోరు ఱాతిరోలు.

  రిప్లయితొలగించండి
 14. మడేలన్న మనువాడిన సతితో:

  "కాని చోట నుండి కలసివచ్చెదనన్న
  నేలు కొంటి నేని గేలి కాదె!
  సీత నేలు కొన్న శ్రీరాముడను కాను
  రామ! " యనిన నోరు ఱాతి నోరు!

  రిప్లయితొలగించండి


 15. నిన్నటి సమస్యాపూరణం: (పిన్నలు పెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్! )

  పిన్నవయస్కుడైన తను భీష్ముని పాత్రకు వన్నెతెచ్చియున్
  పిన్నలు 'శక్తిమాన' నుచు పిల్చగఁ దాల్చి 'ముఖేషు ఖన్న' డున్
  చెన్నుగ కీర్తికాంతనట చేగొనెడున్నభినందనా స్థలిన్
  పిన్నలు పెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి