17, నవంబర్ 2015, మంగళవారం

పద్యరచన - 1066

కవిమిత్రులారా!
“నే నొక పూలమొక్క కడ నిల్చి...”
ఇది కరుణశ్రీ గారి పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ (పుష్పవిలాపాన్ని ప్రస్తావించకుండా) పద్యం వ్రాయండి.

45 కామెంట్‌లు:

  1. నే నొక పూలమొక్క కడ నిల్చి సుమమ్ముల జూచినంత నా
    మానసమందు నీ ముఖమె నవ్వులు రువ్వుచు గుర్తురాగ దా
    వానలమల్లె మన్మధుని బాణపు తాపము చుట్టుముట్టెనే
    నేనిక తాళలేను చెలి నీయెడ బాటు క్షణమ్ము నైననున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘వలె’ను అల్లె అన్నారు. ‘దావానలరీతి’ అనండి.

      తొలగించండి
  2. నేనొక పూలమొక్క కడ నిల్చితి వన్నెల నీను పుష్పముల్
    కానగ నెంచి, యెన్ని నయగారము లొల్కుచు పిల్చుచుండెనో
    మానస చోరుడైన ప్రియ మాధవు గోరెడు గొల్ల భామలై
    తేనియ గ్రోలగన్ కొదమ తేటుల రమ్మని తావులీనుచున్

    రిప్లయితొలగించండి
  3. నేనొక పూలమొక్క కడనిల్చి సువాసన గ్రోలినం తనే
    మానస మందునన్ మెరిసె మాయలి వేణికి శోయగమ్మిడన్
    కానగ విస్తుబోవుచును కౌతుక మందున నోలలాడగా
    మిన్నుల నంటుసంత సముమీరగ కౌగిట జేరకుండునే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘సోయగము’ టైపాటువల్ల ‘శోయగ’ మయింది.

      తొలగించండి
    2. అక్కయ్యా,
      నాల్గవపాదంలో ప్రాస తప్పింది. పద్యాన్ని సవరించండి.

      తొలగించండి
    3. నేనొక పూలమొక్క కడనిల్చి సువాసన గ్రోలి నంతనే
      మానస మందునన్ మెరిసె మాయలివేణికి సోయగమ్మిడన్
      కానగ విస్తు బోవుచును కౌతుక మందున నోల లాడగా
      భానుని తేజమంటి తెలి భాసుర మొప్పగ జేరకుం డునే

      తొలగించండి
  4. నేనొక పూలమొక్క కడనిల్చితి జూచితి నొక్క తోటలో
    మ్రానది చిన్నదేను మరి మల్లెలు జాజులు బంతి పూవులన్
    తానుగ నిచ్చు "బోన్సయది" ధారుణి జేసెను సంకరమ్మునన్
    మానవుడెంతగొప్ప యొక మానుకు బుట్టెగ నిన్ని పూవులే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. నేనొక పూలమొక్కకడ నిల్చి తటాలున రెమ్మ వంచి చే
    యానగఁ గంటకమ్మొకటి యంగుళి కంటుకు గ్రుచ్చుకొన్న నా
    మానస మందునన్ మెదిలె మాన్యులు పాపయ శాస్త్రిగారితో
    దీనతఁ దెల్పినట్టి విరి ధీరత నందెనటంచు, కాలమా!

    రిప్లయితొలగించండి
  6. నే నొక పూలమొక్క కడ నిల్చిమనోహర పుష్పవాటికన్
    భానుని తీక్ష్ణ తేజములు భాసురమైయటఁ బ్రజ్వలింపగన్
    వీనుల విందు గొల్పెనట వీణమృదంగ రవమ్ము లత్తరిన్
    కానగ సల్పుచుంటి రొక కాంతకు పెండ్లియ వైభవమ్ముగన్

    4 Oct 2015 నాటి సమస్య:
    నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై యొకింత ని
    త్యాను భవార్హ తోపకరణాదుల గూర్పగ చింతనా రతిన్
    మానస మందె సంతసము మల్లెల మొల్లలగంధమత్తరిన్
    మేనలరెన్ సువాసన సమేతపు మారుత తాడితంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      ఈమధ్య మతిమరుపు ఎక్కువైపోతున్నది. ఆ పద్యపాదాన్ని ఇంతకుముందే ఇచ్చానన్న విషయం గుర్తులేదు. గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు.
      మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.
      సమాసంలో ‘వీణామృదంగరవమ్ము’ అన వలసి ఉంటుంది. కాని కాళిదాసు, ధరణిపతి, ధరసుత ప్రయోగాలవలె దీనినీ స్వీకరింపవచ్చు ననుకొంటాను.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ముందు వీణ రవమ్ము అనుకొని వీణారవమ్ము సరియైనదని, మృదంగ చేర్చాను. అయినా యిది కూడ సందేహము తోనే వ్రాసాను.
      నే నొక పూలమొక్క కడ నిల్చిమనోహర పుష్పవాటికన్
      భానుని తీక్ష్ణ తేజములు భాసురమైయటఁ బ్రజ్వలింపగన్
      వీనుల విందు గొల్పెనట వేడ్క మృదంగ రవమ్ము లత్తరిన్
      కానగ సల్పుచుంటి రొక కాంతకు పెండ్లియ వైభవమ్ముగన్

      తొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      ‘కార్యశూరులై’ అన్నదానికి టైపాటు. ‘నిమేషము’ నిమీషము అయింది.

      తొలగించండి
  8. నేనొక పూలమొక్క కడ నిల్చి సుమమ్ములు గోసి యీ శు ని
    న్వేనకు వేలు మంత్రములు వేగము తోడను నుచ్చ రించుచు
    న్నానన మందు సంతసము నా రడి గొల్పగ బూజ జేయగా
    మానస మందు గల్గె మఱి మాయని దృప్తియు గారవంబులున్

    రిప్లయితొలగించండి
  9. నేనొకపూలమొక్కకడనిల్చిచివాలున కోయబోవగా?
    మానినికొప్పుకా?బ్రతుకుమాను శవంబుక?దైవపూజకా?
    జ్ఞానుల కంఠహారముక?జై యనువాడిక?కామకోర్కెకా?
    దేనికటన్నచందమున దీనతయందున జూచె మల్లియల్|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ తాజా పద్యం బాగుంది. అభినందనలు.
      ‘కామకోర్కె’ దుష్టసమాసం. ‘కామవాంఛకా’ అనండి.

      తొలగించండి
  10. గు రు మూ ర్తి ఆ చా రి
    ..............................

    నేనొక పూలమొక్క కడ నిల్చి , చివాలున వ౦చి కొమ్మలన్ ,
    సూనము లన్ని ద్రె౦చి , నొక సొ౦పగు మాలిక గూర్చి , భక్తి ని
    ధ్యానము మీరగా యల మదాలస క౦ఠ మల౦కరి౦చుచన్
    యానము జేసెదన్ గద. మహత్వ పటుత్వ కవిత్వ. వాహినిన్
    ...................................................
    { నిధ్యానము : మ౦చి ధ్యానము ; మదాలస:
    వాణి ; వాహిని : నది, ప్రవాహము }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘మీరగా నల....కంఠ మలంకరించుచున్’ అనండి.

      తొలగించండి
  11. నేనొక పూలమొక్కకడనిల్చికవిత్వపు తత్వమెంచగా
    తానొక పువ్వునవ్వుచును ధర్మవిరుద్దపు కార్యశూరులై
    “మానుచుమానవత్వమును మాధవసేవను జేయలాభమా?
    దీనులనుద్దరించకను ధీరుడ వాయని పల్కినట్లుగన్.
    2.నేనొక పూలమొక్కకడనిల్చినిమేషమునూరకున్న?నా
    మానసమందు దూరి ననుమానము మాన్పగ గాలిదోలుచున్
    జ్ఞానము నెంతయున్న మనజాలక,దైవము నెంచబోక,నీ
    కానల జీవనంబు ఘనకార్యము గాదనిదెల్పినూహకున్|



    రిప్లయితొలగించండి
  12. పూజ్యులైన గురువర్యులకు సవరించినపూరణములుపైపద్యములు

    రిప్లయితొలగించండి
  13. “నే నొక పూలమొక్క కడ నిల్చితి పూవుల గోయ వెంటనే
    మానస మందునన్ మెరసె మాన్యుడు పాపయ శాస్త్రిగారితో
    సూనములెల్లనన్న పలు సూనృత వాక్కులు, పూలు గోయుటన్
    మానియు తిర్గి పోయితిని మారిన చిత్తము తోడ నత్తరిన్.

    రిప్లయితొలగించండి
  14. నే నొక పూలమొక్క కడ నిల్చి తటాలున కొమ్మ వంచితిన్
    కానగనైతి నేనది యెకాయెకి కస్సున దూరె ముల్లు, మా
    నానిని పిల్చి ముల్లు దిగె నయ్య యెవండిట ముళ్ళ కంప నీ
    కాననిరీతి యుంచిరని గట్టిగ తిట్టితి, వాడు చెప్పినా
    డేనది చేసినాడ పొరుగింటిని తుంటరి కళ్ళుగప్పి తా
    పూనిక పూవులన్నియును ప్రొద్దుటివేళను కోయుచుండె, నే
    వానికి శాస్తిజేయగను పాతితి కంపను మర్చిపోయితిన్
    దానిని మీకు చెప్పుటనె, తప్పు గదా యిది నేను చెప్పెదన్
    ' హీనము ప్రక్కవారి విరులెన్నడు తాకకు ' మంచు మంచిగా
    వానికి, తీసివైచుమిట వద్దుర ముళ్ళని యంటి నానితో.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ కంటకోపాఖ్యానం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. దేవుని పూజకు వాడే పూలు మన మొక్కనుంచి కోసినా చెందేది ఆ పరమాత్మునికే! కాని ఆ మొక్కను దైవపూజకు పూలనిస్తుందన్న ఉద్దేశ్యంతో పెంచిన వారికి కొన్నైనా మిగిలిస్తే బాగుంటుంది. మేమూ బాధితులమే నండీ!

      తొలగించండి
  15. నేనొక పూలమొక్క కడ నిల్చితి కోయగ లేక పూవులన్
    దీనత జెంది సూనములు తెల్పినవీగతి"శంకమానుమా,
    మానవ!కోసికొమ్ము మము మాధవసేవకు నంకితమ్ముగా;
    క్షోణిని రాలి జీవనము కూలుట కన్నను శ్రేయమే గదా

    రిప్లయితొలగించండి
  16. నేనొక పూలమొక్కకడ నిల్చి పరాకున కొమ్మవంచగన్
    సూనము లన్ని నన్నుగని జోకగ బిల్చుచు దెల్పెనిట్టులన్
    మానిని! దుమ్ముధూళిబడి మాతనువుల్ వసి వాడిపోకనే
    పూనికతోడమమ్ముగొని పుష్కర నాభుని మ్రోల నిల్పుమా!!!

    రిప్లయితొలగించండి
  17. మిత్రులందఱకు నమస్సులు!

    నేఁ డింటియందు విద్యుదాటంకమును, నంతర్జాలావరోధమును నన్ను నిరోధింపఁగ నిప్పటికి నా పద్యమునుం బ్రకటింపఁగలిగినందులకు మన్నింపుఁడని వేడుకొనుచు...

    నేనొక పూలమొక్క కడ నిల్చి, సుమాలనుఁ జేరు తుమ్మెదల్
    తేనియ లానుటల్ గనఁగఁ, దేఁటి యదొక్కతె పల్కె "నో కవీ!
    వీనుల విందొనర్చు మము వెక్కసమైన కుతూహలమ్ముతోఁ
    గానఁగ నేలొకో? మది వికారమగున్ మము బోంట్ల తేంట్ల దుః
    ఖానుభవానురూప యుత గాథలు! నిత్యము భుక్తి కోసమై
    గాన మొనర్చుచున్ వెతలఁ గాంచుచుఁ బూవుల తేనెఁ గూర్చఁగన్
    మేనులు డస్సిపోయెను! నిమేషము కూడ విరామ మెద్ది? యీ
    దీనులఁ జూచి మీ కవులు తేనెలు చిందెడి కావ్యమందు స
    మ్మానిత గానకోవిదుల మంచును, వేలుగఁ బేర్లు పెట్టి, మా
    మేనిని నున్న నల్లఁదన మెంతటి యంద మటంచుఁ బల్కి, మీ
    మానసమందు సంతసము మంజు మనోహర మౌనటుల్ భళా
    న్యూనత లేక సెప్పెదరు నొవ్వును నెవ్వరుఁ జూడ రియ్యెడన్!
    మానవు లిద్ది కానకయె మా నవ రూప వికాస సౌష్ఠవ
    మ్మౌనని కావ్యమందుఁ బరమాద్భుత రీతినిఁ గూర్తు రేల? స
    న్మానము లందునట్లు బహుమాన్యము లిచ్చుట లేలకో కవీ?
    కానము మేము! మమ్ముఁ బొడఁగాంచక పొమ్మిట నుండి వేగమే!
    మేనిఁ గలట్టి శోభఁ దలమే యిట వర్ణన సేయ మీకు! మా
    మానసమందు క్షోభఁ దరమా యిఁక వర్ణన సేయ మీకు? మ
    మ్మీ నవలోక కర్తలుగ నెప్పుడు భావన సేయకుండఁగన్
    మేనిని వంచి మ్రొక్కెదము మిక్కిలిగన్ దయచేసి పొమ్ము! మే
    మీ ననలున్ బ్రియుల్ ప్రియల మెప్పుడుఁ గా మయ! భోజనానికై
    మానితమౌ గమమ్ముల సమంచిత రీతులఁ బూవుఁబోండ్ల పూఁ
    దేనియ బొట్లుబొట్లుగను తీపిరుచుల్ గ్రహియింప నెట్టులో
    వాని ముఖస్థ చుంబన సువాసనఁ గ్రోలెదమయ్య మేమిఁకన్!
    గాన, మమున్ హసింపక, సుఖాలనుఁ గ్రోలుచు నుంటిమంచు మీ
    రే నవకావ్యమున్ వెలయనే వల దింకను మానుఁ" డంచనన్
    నేనును దాని మాటలను నెమ్మదిఁ దాలిచి నింటి కేఁగితిన్
    దేనెల సోనలన్ గుఱియు తేఁటి గముల్ మదిలోన నాడఁగన్!!

    రిప్లయితొలగించండి
  18. మధుసూదన్ గారూ,
    నేను పుష్పవిలాపాన్ని ప్రస్తావించవద్దని అన్నందుకు మీరు ‘భ్రమరవిలాపం’ వ్రాసారు. మీ ఉత్పలమాలిక తేనెవాక వలె మధురంగా, మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. నేనొకపూల మొక్కకడ నిల్చితి పీల్చగ మంచి గంధమున్
    మానసమందునన్ తగిలె మా రుని భాణము
    చల్ల గాలిలో
    వీనుల విందు చేయగనుబృం గము లచ్చట చేయు సవ్వడుల్
    నేనట నాగజాలనిక నెచ్చెలిచెంతకు
    వేగ బోయెదన్

    రిప్లయితొలగించండి
  20. నే నొక పూలమొక్క కడ నిల్చి సుమమ్ముల గ్రోలుచుండగా
    వానల కాలమందు విరి వన్నెల సోయగ మొల్లుచుండగా
    దీన దయాళుడైన విధి తీరుల గాంచుచు విస్తుపోవగా
    తూనిగ ముక్కుపై నడర తుమ్మగ ఝమ్మని పారిపోయెనే :)

    anti-poetry👆

    రిప్లయితొలగించండి
  21. నే నొక పూలమొక్క కడ నిల్చి సుమమ్ములు కోయుచుండగా
    వేణువు నూదుచున్ హృదిని ప్రేమను లేపుచు వంగభామ హా
    తానును రాగయే పువుల తట్టను పట్టుచు నవ్వులొల్క తన్
    మేనును తాకి వాయువులు మీనుల వాసన తేగ పారితిన్

    రిప్లయితొలగించండి