16, నవంబర్ 2015, సోమవారం

పద్యరచన - 1065

కవిమిత్రులారా!
“ఎవ్వఁడో వచ్చి ని న్నుద్ధరించు ననుచు...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

43 కామెంట్‌లు:

 1. ఎవ్వఁడో వచ్చినిన్ను ద్ధరించు ననుచు
  నెదురు జూచిన నేరీతి బదులు రాదు
  నీకు నీవుగ గుండెను నిగ్ర హించి
  బ్రతుకు బండిని సాగించ బలము హెచ్చు

  రిప్లయితొలగించండి
 2. ఎవ్వడో వచ్చి నిన్నుద్ధరించు ననుచు
  కలల గననేల కూలును గాలిమేడ
  లై వృధాప్రయాస లవియు లక్షణముగ
  నీ శ్రమయె నీకు రక్షయై నిల్చునిలన

  రిప్లయితొలగించండి
 3. ఎవ్వడో వచ్చి నిన్నుద్ధరించుననుచు
  నెదురు జూచుచు నుండిన నేమి ఫలము ?
  కష్టపడి పని చేసిన కార్య సిద్ధి
  యగును తథ్యమిదియె నమ్ము మనవరతము.
  2ఎవ్వడో వచ్చి నిన్నుద్ధరించుననుచు
  కలలు గాంచుచు నుండిన కల్ల లౌను
  నీదు బలముతో పని చేయ సఫల మగును.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   రెండవపద్యంలో ఒక పాదం తప్పిపోయింది.

   తొలగించండి
 4. ఎవ్వడో వచ్చి నిన్నుద్ధరించు ననుచు
  ఎదురు జూచిన నీస్థితి కుదుట పడదు
  నిన్ను నువ్వుద్ధరించుకొనిన యతనము
  సేయుటే మేలని ప్రవచి౦చె గీత

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. * గు రు మూ ర్తి ఆ చా రి *

  మన బ్లాగునకు పద్యాలు ప౦పి౦చే వారిలో ఒక. ఉన్నత మైన వ్యక్తి గలడు .ఆయనే
  ి-
  శ్రీ కె౦బాయి తిమ్మాజిరావుగారు

  ఆయన వయస్సు 8 4. స౦వత్సరములు .
  ఇ౦త పెద్ద వయసు లోనూ సాహిత్యాభిలాష
  గలిగి పద్యరచనోత్సాహమును
  ఏమాత్ర౦ సడలనీక కొన్ని ఏ౦డ్ల క్రితము ను౦చి గూడ . ప్రతిదినము పూరణములు
  వ్రాసి ప౦పిస్తు ఉ౦టాడు .
  ఆయన సాహిత్యాభిమానాన్ని కవి హృదయాన్ని అభిన౦ది౦చ వలసి౦దే !
  అదియును గాక
  ఆయన నిర౦తర పురాణ పఠ నానురక్తి గల వ్యక్తి

  ---------------------------------------------
  నేను వ్యక్తిగత మగు ప్రేమచే ఆయనను శ్లాఘి౦చుట లేదు. ఆ పెద్దాయన పద్యరచనాభిలాషను కవితా చమత్కృత ని ే
  అభిన౦దిస్తున్నాను.
  -----------------------------------------------

  **************************

  శత వత్సరముల వరకు న
  మితమగు సాహిత్య సేవ. మేకొని గావి౦
  చి తరి౦చుము తిమ్మాజీ !
  చతురాస్యుని రాణి నిన్ను సతతము బ్రోచున్


  ******************************
  ఇట్లు
  గు రు మూ ర్తి ఆ చా రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీయుతులు,కవిమిత్రులు గురుమూర్తి ఆచారి గారికి ,మీస్నేహాభినందనకు ధన్యవాదములు గురుదేవులు శంకరయ్య గారిని కవిమిత్రుల౦దరినీ అసౌకర్యమునకు మన్ని౦చ వలయు నని ప్రార్దిస్తున్నాను.

   తొలగించండి
  2. గురుమూర్తి ఆచారి గారూ,
   తిమ్మాజీ రావు గారు నాకంటె పెద్దవారని అనుకున్నాను. కాని ఇంతటి వయోవృద్ధులని భావించలేదు. వారి విశేషాలు తెలిపినందుకు ధన్యవాదాలు.

   తొలగించండి
  3. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పద్యరచానాభిలాష స్ఫూర్తిదాయకం. మీరు మా నాన్నగారికంటే నాలుగేళ్ళు చిన్నవాళ్ళు. వయోభారాన్ని గణించకుండా చక్కని పద్యాలు వ్రాస్తున్నందుకు సంతోషం. పితృసమానులైన మీకు పాదాభివందనాలు.

   తొలగించండి
 6. ఎవ్వడో వచ్చి నిన్ను ధ్ధ రించు ననుచు
  గలలు గనకుమ యెన్నడు కాంత ! నీవు
  కీడు చేయువాం డ్రే గాని గేలు నీయ
  రుగద యెవరును నోయమ్మ ! యుర్వి యందు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 7. మన్నించండి.పొరపాటు జరిగింది.మూడవ పాదం మొదటిసగం నాల్గవ పాదం రెండవ సగం కలిపేశాను.
  ఎవ్వడో వచ్చి నిన్నుద్దరించుననుచు
  కలలు గాంచుచు నుండిన కల్ల లౌను
  నీదు బలముతో నొనరించు నేపనైను
  సర్వకాలము లందునుసఫల మగును.


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘ఏపనైను’... ‘ఏ పనియైనను’ అని మీ అభిప్రాయం కాబోలు.

   తొలగించండి
 8. ఎవ్వఁడో వచ్చి నిన్నుద్ధరించు ననుచు
  భ్రాంతి బడనేల? నీ ప్రతిభను మది నెఱ
  నమ్మి చక్కటి కృషితోడ నరయు ఫలము
  కృషియె మూలమీ జగతికి కీర్తి నొసగు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. ఎవ్వఁడో వచ్చి నిన్నుద్ధరించు ననుచు
  నెదిరి చూడకు మికనైన నెడ్డివాడ
  శ్రమయె ఫలమిచ్చు తప్పక సక్రమమున
  చేయు మెవరికి చెయి సాప కోయి నీవు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఎవ్వఁడో వచ్చి నిన్నుద్ధరించు ననుచు
   నెదురు చూడకు మికనైన నెడ్డివాడ
   శ్రమయె ఫలమిచ్చు తప్పక సక్రమమున
   చేయు మెవరికి చెయి సాప కోయి నీవు.

   తొలగించండి
  2. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. ఎవ్వరోవచ్చి నన్నుద్ధరింతురనుచు
  యెదురుచూడంగ వలదయ్య యెరుకలేక
  సాధనమ్ము న పనులన్ని జరిగి పోవు
  నన్నబుధుల మాటల విను డనవరతము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. ఎవ్వడో వచ్చి నిన్నుద్దరించు ననుచు దలచకనె
  రువ్వుభావాలు గనుగొనిరోదనవిడనాడి తానె
  సవ్వడేమియు జేయక మన సన్నది దెల్పినట్లుగనె
  నవ్వుచు జేసెడి పనులు నలుగురు మెత్తురు జూడ.
  2.ఎవ్వడో వచ్చి నిన్నుద్దరించుననుచు
  తలచు తత్వంబు మరచియు ధైర్యమందు
  కొంత ఆలోచనందున పంతమందు
  చేయబూనిన కార్యాలుచేటుమాన్పు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 12. ఎవ్వఁడో వచ్చి ని న్నుద్ధరించు ననుచు
  భ్రాంతి కూడదు ఫల్గుణా! రణము జేయు
  సమయ మాసన్నమాయెను సంశయమ్ము
  వీడి విల్లందుకొనుము వివేకమతిని.

  రిప్లయితొలగించండి
 13. సహస్రచంద్ర దర్శన భాగ్యము నందిన కవి చంద్రులు శ్రీ కెంబాయి తిమ్మాజీరావు గారి పద్యరచనాభిలాషకు జోహార్లు. వారిని పరిపూర్ణాయుష్కులను జేసి అనుగ్రహించవలసినదని పరమేశ్వరుని కోరుకొంటున్నాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుకవి మిత్రులు శ్రీ దువ్వూరి మిస్సన్న గారికి ధన్యవాదములు
   నేను వృద్ధ కవినే గాని కవివృద్దుడను గాను శుద్ధ కవిత్వము వ్రాయాలని నాతపన
   మీయందరి ప్రోత్సాహమే నాబలము

   తొలగించండి
  2. సుకవి మిత్రులు శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారూ! మీ పద్యరచనా వ్యాసంగ మమోఘము! మీకు శతసహస్ర వందనములు!

   వృద్ధత్వము వయసునకే!
   శుద్ధ మనమ్మునకుఁ గాదు! చూడఁగ విద్యా
   వృద్ధుఁడవయ "కెంబాయి"! స
   మృద్ధిగ పద్యములు వ్రాయు శ్రేష్ఠుఁడ వీవే!!

   తొలగించండి
  3. శ్రీయుతులుగుండు మధు సూదన్ గారికి మీ ప్రశంసలు నారచనాసక్తిని ఇనుమడింప జేస్తున్నాయి
   మీకు నాకృతజ్ఞతలు .ధన్య వాదములు

   తొలగించండి
  4. మిస్సన్న గారికి, గుండు మధుసూదన్ గారికి ధన్యవాదాలు.

   తొలగించండి
 14. ఎవ్వడో వచ్చి నిన్ను ద్ధరించు ననుచు
  నెదురు తెన్నులు జూడకు నిదుర గాచి
  నాత్మ శక్తియె తోడుగా నడుగు లేసి
  సాగిపొమ్మిక నేస్తమా !జయము నీదె!!!

  రిప్లయితొలగించండి
 15. ఎవ్వరో వచ్చి నన్నుద్ధరించుననుచు
  నూహలన్ దేలిన ఫలితముండు నెట్లు?
  పుడమిఁ బురుష ప్రయత్నమె పొందఁ జేయు
  సకలమున్ శ్రద్ధయు, సబూరి జనులదైన!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. మిత్రులందఱకు నమస్సులు!

  “ఎవ్వఁడో వచ్చి ని న్నుద్ధరింౘు ననుౘు
  నెదురు తెన్నులు ౘూడక నీవె నిన్ను
  వృద్ధి నొందింౘు కొనవలెఁ కృషినిఁ ౙలిపి!
  లేనిౘో నీదు పతనమ్మె యౌను సుమ్ము!!"

  రిప్లయితొలగించండి
 17. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఉదయం మా బంధువులకు కాశీ ప్రసాదం పంచడానికి అక్కయ్య వాళ్ళ ఊరు వెళ్ళాను. వెంట టాబ్‍లెట్ ఉన్నా అక్కడ నెట్ అందుబాటులో లేక నా స్పందనలను వెంట వెంట తెలియజేయలేకపోయాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 18. "ఎవ్వడో వచ్చి నన్నుద్ధరించు ననుచు
  తలువకను సినీ కవి పల్కు తలతు నెపుడు
  నట్టి పలుకు నా బతుకున కర్ధ మొసగె
  నా మహాకవి పాదాల కంజలింతు

  రిప్లయితొలగించండి
 19. ధనికొండ రవిప్రసాద్ గారూ,
  చక్కని పద్యరచన చేసారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. "ఎవ్వఁడో వచ్చి నిన్నుద్ధరించు ననుచు"
  భరత మాతకు వేచెడి బాధ లేదు
  తగుల బెట్టగ గలడిట వగల రేడు...
  ఇంపు సొంపుల వంపుల డింపులయ్య :)

  రిప్లయితొలగించండి