పాపము నశియించుచు నవ్య రూపమందునవని వెలుగ వలెననెడి యాశ గలుగదీపములవెలిగించి యా దీప్తి తోడతరిమెదరట తాపమనెడు తామసమును.
ఆంజనేయ శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నమస్కారములు గురువులకు బ్లాగుమిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు
పాపము నజ్ఞానమ్ముయుతాపపు ప్రతిరూప మవియు తామస మవియున్ దీపము లను వెలి గించినదీపావళికాంతి విరియ తిమిరము తొలగున్
ఆంజనేయ శర్మ గారూ, ఛందోవైవిధ్యంతో మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.‘...నజ్ఞానమ్మును’ అనండి.
పాపములను తొలగించగ దీపము లనువెలి గించి దీప్తిని గాంచన్ తాపము నణచిన మనమున రూపములను మార్చుకొనుచు రోషము వీడన్--------------------------- రూపములు = కోపతాపములయొక్క రూపాంతరములు
రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవపాదంలో గణదోషం. ‘దీపమ్ములను వెలిగించి...’ అనండి.
పాప వెలిగించె దీపాలు ప్రమిదె లందుకాంతి వెదజల్లె నలుదిశల్ వింత రూపుతోడ రంగురంగుల దీప ధూపములచెతాప మనియెడు తిమిరంబు దౌడు తీసె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘చే’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. ‘ధూపములను’ (తృతీయార్థంలో ద్వితీయ) అనండి.
పాప మనకను సత్యయె జంపె నసుర తాప మొనరించి నట్టియా తమియె తొలగె దీప కాంతులు వెదజల్లె దీప్తి కొఱకు రూపు మారెను జగమెల్ల ప్రాపు గనెను
రాజేశ్వరి అక్కయ్యా, మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
తాపము నణచగ భువిలో పాపపు నరకుడను జంప భామయె పతితోరూపము దాల్చగ హాళియెదీపపు వెలుగులను దెచ్చె దీపావళియే!!!
శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘పాపపు నరకుని వధింప భామయె...’ అనండి.
.........పూజ్యగురుదేవులకు, కవిమిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు...
ధన్యవాదాలు! మీకూ మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆకటిక పేద లందరియాకటి బాధలకునంద నాహారమ్మేచీకటి బ్రతుకుల వెలుగు త దేకముగా గలుగ నాడు దీపావళియే.
మాస్టరుగారికి, కవిమిత్రులకు, వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపముల వరుస పెట్టగ పాపములను తొలగజేయు పండుగ నేడే తాపములు మాడ్చు వెలుగుల రూపమ్మే మనసు నిండు రోజిది తెలియన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ దీపావళి పద్యం, పూరణ రెండూ బాగున్నవి. అభినందనలు.
పసిడి పాపలు రూపలావణ్య వతులుతైల దీపము లన్నియు దగ నమర్చి దనరిరి నరకజనిత సంతాప ముడుగలీల గృష్నుని దీపావళి శుభకరము
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాపము పెరిగిపోవగ భరణి పైననరకుని వెస రూపడచి బవరమునందుసత్య దీపముల్ వెలిగించె జనుల యిండ్లతనకుమారుడని యెరిగి తాపమొందె
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘భరణి’కి భూమి అనే అర్థం ఉన్నా ‘ఒక నక్షత్రం’గా ప్రసిద్ధార్థం. కనుక అక్కడ ‘వసుధపైన’ అంటే బాగుంటుందని నా సలహా.
గు రు మూ ర్తి ఆ చా రి ...............................ఛ౦దము = మధ్యాక్కర. ------------------------{ బాణ స౦చ కాల్చునపుడు జాగర్త సుమా } పాప " లక్ష్మీ దీప ". లక్ష్మి బా౦బు పేల్చ తగిలె నయ్యొ !పాప మా " రూప " రాకెట్టు వదలగ తనవైపు వచ్చె !పాపలారా బాలలార. బాణస౦చ కడ జాగర్త. !తాప మది + ఒక్కొక సారి దాగి యు౦డాన౦ద మ౦దె ! ( తాపము = బాధ. స౦తాపము ) ె
గురుమూర్తి ఆచారి గారూ, మీ మధ్యాక్కర పూరణ బాగున్నది. అభినందనలు.
తాప మణ గను బుడమికి దనరు నట్లు పాప కర్ముడు నరకుని బ్రతిమ జేసి దగ్ధ పఱతురు ,రూపము దహన మగుట గనెఱి గి ముదము తోడన గ్రామ ప్రజలు దీప ములవెలి గింతురు దీ ప్తు లొలుక
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాప కార్యాల మెలగెడు పౌరు లంతరూప లావణ్య కాంతుల రుచిని మరిగిదీప మిచ్చెడు వెలుగుల దివ్య శోభతాప మహిమన తత్వము తలచ రనఘ!
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ, బహుకాల దర్శనం... సంతోషం!మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాపము పండిన నాడేరూపము దాల్చియు జనులను బ్రోవగ గూల్చున్దీపము లుంచిన వరసగతాపత్రయముల్ దొలంగు దైవము మురియున్!
అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కాంతు లన్నియు నయ్యప్ప జోతి యగుచునాయు రారోగ్య సంపద లంచితముగబ్లాగు కవులకు నిచ్చుత ! ప్రమద మలరశుభము లొసగుదీ పావళి శుభ దినాన
సుబ్బారావు గారూ, ధన్యవాదాలు.
పాపకు దీపకాంతులను భావనరూపము తాపనెంచియే***---**------------------***------**-------ఏపగు పట్టణంబయిన-ఈదినమందున నింట దీపముల్రూపముగానుపించును|పరోక్షపురాక్షసు డంతమవ్వగా?పాపము మాన్పి సత్య మనపాలిట తాపము మాన్పినందుకే.|2పాపమన్నది పారద్రోలుచు భాగ్యమంతట నింపగన్దీప కాంతుల దివ్యరూపమె దీప్తి నింపేడి పండుగైతాప సైనను సంతసించుగతత్వమెంచియు రాక్షసున్రూపుమాపగ సత్యభామయె రూపసాయెనువెల్గునన్
కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ కర్బరుడు పాప కర్మల కడు సలుపగ తాప మొందెడి జనులకు ధైర్య మొసగరూపఱగ జేసెనా డనిరుద్ధు డనిని ;క్షితిని దీపావళిని దీప శిఖలు వెలిగె
భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొన్నటి సమస్యాపూరణము:నవకమలమ్ములఁ గోరకయవస్తలందున్నవారి నాదుకొనెడు మానవసేవఁ బూజనెడు కేశవ పూజల వలన జన్మ సార్థక మగురా!
సహదేవుడు గారూ, మొన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘పూజ+అనెడు’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ ‘పూజ యను’ అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:నవకమలమ్ములఁ గోరకయవస్తలందున్నవారి నాదుకొనెడు మానవసేవఁ బూజ యను కేశవ పూజల వలన జన్మ సార్థక మగురా!
గురుదేవులు కంది శంకరయ్య గారికి, శంకరాభరణం కవిమిత్రులందరకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు!
బొడ్డు శంకరయ్య గారూ, ధన్యవాదాలు. మీకు కూడా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.
గురువర్యులకు, కవిమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు.
రెడ్డి గారూ, ధన్యవాదాలు. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.
గురువు గారికి, శంకరాభరణము కవులందరకు దీపావళి శుభాకాంక్షలు.పాపనికాయ మెల్ల యొకప్రాణిగ మారిన, దానిఁ బోల్చగన్ చూపగవచ్చు భూరమణి సూనుడు శ్రీనరకాఖ్యరూపమున్గోఫకులాబ్దిచంద్రనిజకోమలి వాని వధించి నంతటన్ భూపరితాపమోక్షమున మోదము తోచెను దీపకాంతులన్
ఊకదంపుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. నా పద్యం కూడా పరిశీలించండి.
రెడ్డి గారూ, నిజమే... మీ పద్యాన్ని చదివినా, వ్యాఖ్యానించడం మరిచిపోయాను. ఇప్పుడు సమీక్షించాను.
కవి మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు
తిమ్మాజీ రావు గారూ, ధన్యవాదాలు. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.
పాపము నశియించుచు నవ్య రూపమందు
రిప్లయితొలగించండినవని వెలుగ వలెననెడి యాశ గలుగ
దీపములవెలిగించి యా దీప్తి తోడ
తరిమెదరట తాపమనెడు తామసమును.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నమస్కారములు
తొలగించండిగురువులకు బ్లాగుమిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు
పాపము నజ్ఞానమ్ముయు
రిప్లయితొలగించండితాపపు ప్రతిరూప మవియు తామస మవియున్
దీపము లను వెలి గించిన
దీపావళికాంతి విరియ తిమిరము తొలగున్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిఛందోవైవిధ్యంతో మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
‘...నజ్ఞానమ్మును’ అనండి.
పాపములను తొలగించగ
రిప్లయితొలగించండిదీపము లనువెలి గించి దీప్తిని గాంచన్
తాపము నణచిన మనమున
రూపములను మార్చుకొనుచు రోషము వీడన్
---------------------------
రూపములు = కోపతాపములయొక్క రూపాంతరములు
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో గణదోషం. ‘దీపమ్ములను వెలిగించి...’ అనండి.
పాప వెలిగించె దీపాలు ప్రమిదె లందు
రిప్లయితొలగించండికాంతి వెదజల్లె నలుదిశల్ వింత రూపు
తోడ రంగురంగుల దీప ధూపములచె
తాప మనియెడు తిమిరంబు దౌడు తీసె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘చే’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. ‘ధూపములను’ (తృతీయార్థంలో ద్వితీయ) అనండి.
పాప మనకను సత్యయె జంపె నసుర
రిప్లయితొలగించండితాప మొనరించి నట్టియా తమియె తొలగె
దీప కాంతులు వెదజల్లె దీప్తి కొఱకు
రూపు మారెను జగమెల్ల ప్రాపు గనెను
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
తాపము నణచగ భువిలో
రిప్లయితొలగించండిపాపపు నరకుడను జంప భామయె పతితో
రూపము దాల్చగ హాళియె
దీపపు వెలుగులను దెచ్చె దీపావళియే!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పాపపు నరకుని వధింప భామయె...’ అనండి.
.........పూజ్యగురుదేవులకు, కవిమిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు...
రిప్లయితొలగించండిధన్యవాదాలు! మీకూ మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
తొలగించండిఅందరికీ దీపావళి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఆకటిక పేద లందరి
యాకటి బాధలకునంద నాహారమ్మే
చీకటి బ్రతుకుల వెలుగు త
దేకముగా గలుగ నాడు దీపావళియే.
మాస్టరుగారికి, కవిమిత్రులకు, వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిదీపముల వరుస పెట్టగ
పాపములను తొలగజేయు పండుగ నేడే
తాపములు మాడ్చు వెలుగుల
రూపమ్మే మనసు నిండు రోజిది తెలియన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ దీపావళి పద్యం, పూరణ రెండూ బాగున్నవి. అభినందనలు.
పసిడి పాపలు రూపలావణ్య వతులు
రిప్లయితొలగించండితైల దీపము లన్నియు దగ నమర్చి
దనరిరి నరకజనిత సంతాప ముడుగ
లీల గృష్నుని దీపావళి శుభకరము
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాపము పెరిగిపోవగ భరణి పైన
రిప్లయితొలగించండినరకుని వెస రూపడచి బవరమునందు
సత్య దీపముల్ వెలిగించె జనుల యిండ్ల
తనకుమారుడని యెరిగి తాపమొందె
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘భరణి’కి భూమి అనే అర్థం ఉన్నా ‘ఒక నక్షత్రం’గా ప్రసిద్ధార్థం. కనుక అక్కడ ‘వసుధపైన’ అంటే బాగుంటుందని నా సలహా.
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
...............................
ఛ౦దము = మధ్యాక్కర.
------------------------
{ బాణ స౦చ కాల్చునపుడు జాగర్త సుమా }
పాప " లక్ష్మీ దీప ". లక్ష్మి బా౦బు పేల్చ తగిలె నయ్యొ !
పాప మా " రూప " రాకెట్టు వదలగ తనవైపు వచ్చె !
పాపలారా బాలలార. బాణస౦చ కడ జాగర్త. !
తాప మది + ఒక్కొక సారి దాగి యు౦డాన౦ద మ౦దె !
( తాపము = బాధ. స౦తాపము ) ె
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ మధ్యాక్కర పూరణ బాగున్నది. అభినందనలు.
తాప మణ గను బుడమికి దనరు నట్లు
రిప్లయితొలగించండిపాప కర్ముడు నరకుని బ్రతిమ జేసి
దగ్ధ పఱతురు ,రూపము దహన మగుట
గనెఱి గి ముదము తోడన గ్రామ ప్రజలు
దీప ములవెలి గింతురు దీ ప్తు లొలుక
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాప కార్యాల మెలగెడు పౌరు లంత
రిప్లయితొలగించండిరూప లావణ్య కాంతుల రుచిని మరిగి
దీప మిచ్చెడు వెలుగుల దివ్య శోభ
తాప మహిమన తత్వము తలచ రనఘ!
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
తొలగించండిబహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాపము పండిన నాడే
రిప్లయితొలగించండిరూపము దాల్చియు జనులను బ్రోవగ గూల్చున్
దీపము లుంచిన వరసగ
తాపత్రయముల్ దొలంగు దైవము మురియున్!
అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిగుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండికాంతు లన్నియు నయ్యప్ప జోతి యగుచు
నాయు రారోగ్య సంపద లంచితముగ
బ్లాగు కవులకు నిచ్చుత ! ప్రమద మలర
శుభము లొసగుదీ పావళి శుభ దినాన
సుబ్బారావు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపాపకు దీపకాంతులను భావనరూపము తాపనెంచియే
రిప్లయితొలగించండి***---**------------------***------**-------
ఏపగు పట్టణంబయిన-ఈదినమందున నింట దీపముల్
రూపముగానుపించును|పరోక్షపురాక్షసు డంతమవ్వగా?
పాపము మాన్పి సత్య మనపాలిట తాపము మాన్పినందుకే.|
2పాపమన్నది పారద్రోలుచు భాగ్యమంతట నింపగన్
దీప కాంతుల దివ్యరూపమె దీప్తి నింపేడి పండుగై
తాప సైనను సంతసించుగతత్వమెంచియు రాక్షసున్
రూపుమాపగ సత్యభామయె రూపసాయెనువెల్గునన్
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండికర్బరుడు పాప కర్మల కడు సలుపగ
తాప మొందెడి జనులకు ధైర్య మొసగ
రూపఱగ జేసెనా డనిరుద్ధు డనిని ;
క్షితిని దీపావళిని దీప శిఖలు వెలిగె
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొన్నటి సమస్యాపూరణము:
రిప్లయితొలగించండినవకమలమ్ములఁ గోరక
యవస్తలందున్నవారి నాదుకొనెడు మా
నవసేవఁ బూజనెడు కే
శవ పూజల వలన జన్మ సార్థక మగురా!
సహదేవుడు గారూ,
తొలగించండిమొన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పూజ+అనెడు’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ ‘పూజ యను’ అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:
తొలగించండినవకమలమ్ములఁ గోరక
యవస్తలందున్నవారి నాదుకొనెడు మా
నవసేవఁ బూజ యను కే
శవ పూజల వలన జన్మ సార్థక మగురా!
గురుదేవులు కంది శంకరయ్య గారికి, శంకరాభరణం కవిమిత్రులందరకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిబొడ్డు శంకరయ్య గారూ,
తొలగించండిధన్యవాదాలు. మీకు కూడా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.
గురువర్యులకు, కవిమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిరెడ్డి గారూ,
తొలగించండిధన్యవాదాలు. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.
గురువు గారికి, శంకరాభరణము కవులందరకు దీపావళి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిపాపనికాయ మెల్ల యొకప్రాణిగ మారిన, దానిఁ బోల్చగన్
చూపగవచ్చు భూరమణి సూనుడు శ్రీనరకాఖ్యరూపమున్
గోఫకులాబ్దిచంద్రనిజకోమలి వాని వధించి నంతటన్
భూపరితాపమోక్షమున మోదము తోచెను దీపకాంతులన్
ఊకదంపుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. నా పద్యం కూడా పరిశీలించండి.
రిప్లయితొలగించండిరెడ్డి గారూ,
తొలగించండినిజమే... మీ పద్యాన్ని చదివినా, వ్యాఖ్యానించడం మరిచిపోయాను. ఇప్పుడు సమీక్షించాను.
కవి మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండితిమ్మాజీ రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.