3, నవంబర్ 2015, మంగళవారం

సమస్య - 1844 (అంగదునిఁ జంపె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అంగదునిఁ జంపె నర్జునుఁ డాహవమున.

33 కామెంట్‌లు:

 1. వాలి కొమరుం డీతడు వాన రమ్ము
  లక్ష్మణ సూనుని పేరు లక్ష ణముగ
  పేరు పేరున బడసిన నేరి సుతుని
  నంగదునిఁ జంపె నర్జునుఁ డాహ వమున

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   ప్రయాణపు టలసట వల్లనో మరే కారణమో మీ భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. పైగా 1, 2 పాదాలలో గణదోషం.

   తొలగించండి
 2. సాగనంపెను రాముడు సంధిఁజేయ
  నంగదుని, చంపె నర్జును డాహవమున
  సైంధవుని తలను నఱకి సత్వరముగ
  సూర్యుడస్తమించకమున్ను స్ఫూర్తితోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. రాయబారిగ లంకకు రాముడంపె
  నంగదుని, జంపె నర్జునుఁ డాహవమున
  అంగరాజగు కర్ణుని లొంగదీసి
  అంజలికమను జఘ్నితో నాగ్రహముగ!!!

  రిప్లయితొలగించండి
 4. రావణాసురుండు గనెను రౌద్రముగను
  నంగదుని;జంపె నర్జును డాహవమున
  అంగ రాజగు కర్ణుని నలుక తోడ
  సారథిగ నడుపుచు నుండ శౌరి రథము.

  రిప్లయితొలగించండి
 5. గురువు గారికి ప్రణామములు. మీకు కాశీలో అంతా కుశలమే అని తలుస్తాను.

  కవిమిత్రులకు నమస్కారములతో

  పాండు వీరులు చెలరేగి భండనమున
  శక్తి యుక్తుల జూపుచున్ శత్రువులను
  మట్టి గరిపించ శంతనా త్మజుడొరిగెను
  అంగదుని జంపె నర్జునుడా హవమున

  అంగదుడు = ద్రుతరాష్ట్రుని శతసుతులలో నొకడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కానీ అంగదుడు శంతనాత్మజు డెలా ఔతాడు? శంతనుడి మనుమడు కదా!

   తొలగించండి
  2. గురువు గారికి నమస్కారములు
   అర్జునుని చేత భీష్ముడు ఒరిగాడనీ అలాగే అంగదున్ని కూడా అర్జునుడే చంపాడనే భావంతో వ్రాసానండి

   తొలగించండి
 6. సహజ కవచ కుండలములన్ శక్రుడడుగ
  వాని తనయంగములనెడు భయమువీడి
  దానమిడు కర్ణుడే మహాదాత యట్టి
  యంగదుని జంపె నర్జును డాహవమున
  (ఈ తర్కం గమనించ గోరుచున్నాను)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధనికొండ రవిప్రసాద్ గారూ,
   నిస్సందేహంగా కర్ణుడిని అంగదు డనవచ్చు. మీ తర్కం ప్రశంసింప దగినది. చక్కని పూరణ. అభినందనలు.

   తొలగించండి
  2. చాలా మంది మిత్రులు అంగదుడనే కౌరవుడు ఉన్నట్లు , అతణ్ని అర్జునుడు చంపినట్లు వ్రాశారు. కానీ నాకైతె ఆ పేరుగల కౌరవుడు నిజంగా ఉన్నాడా ? ఊహయేనా ? అని సందేహం.కౌరవులలో యుయుత్సుడనే పేరుగల యతడు పాండవపక్షం లోకి వచ్చాడు. మిగిలిన 99 మందినీ భీముడే చంపినట్లు ప్రసిద్ధి. ఈ సందేహాన్ని ఎవరైనా తీర్చ గలరని కోరుతున్నాను.

   తొలగించండి
  3. రవి ప్రసాద్ గారూ,
   మీ సందేహం నాకూ కలిగింది. అప్పుడు కాశీ ప్రయాణంలో ఉండి వివరాలు సేకరించలేకపోయాను. ఇప్పుడు పరిశీలిస్తే కౌరవులలో ‘అంగదుడు’ అనేవాడు లేడు. చూడండి...
   కౌరవుల పేర్లు
   కౌరవుల పేర్లు
   http://eap.bl.uk/database/results.a4d?projID=EAP038

   తొలగించండి
  4. పొరపాటున బ్రిటిష్ లైబ్రరీ లింక్ కూడా పేస్ట్ అయింది (చివరిది)...

   తొలగించండి
 7. ధృత రాష్ట్ర కుమారులలో నొకడంగదుడు. మహాభారత యుద్ధము లో చనిపోతాడు. అర్జునుని చేతిలో హతమయి ఉంటాడని యూహ.

  ధర్మ క్షేత్రకురుక్షేత్ర ధరణి యందు
  సంభవించెను యుద్ధము శతకుమారు
  లున్న ధృత రాష్ట్రునిసుతులందొకడు వాని
  నంగదునిఁ జంపె నర్జునుఁ డాహవమున.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ధర్మక్షేత్ర అన్నప్పుడు ర్మ గురువై గణదోషం.

   తొలగించండి
 8. రాయ బారిగ పంపెను రాము డా ర్య !
  యం గదుని, జంపె నర్జును డా హ వమున
  వేల కొలదిగ రిపులను వేటు వ ఱఛి
  యుద్ధములు లేక యుండుట యొప్పు ధరను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. అంగదుని వేషమతనిని యాదరించ
  పాటవముగల్గి వెల్గెను నాటకముల
  దాన కర్ణుని పాత్రను దాల్చననిరి
  'యంగదుని జంపె నర్జును డాహవమున'

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. రామ,రావణ సంధికోర-నియమించె
  అంగదుని|”జంపె నర్జను డాహవమున
  కర్ణ,సైంధవ నెదురించి –కాటికంప?
  ధర్మ మున్న-నధర్మము తరుగుగాదె|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కర్ణసైంధవాదుల నెల్ల కాటికంప ' అనండి.

   తొలగించండి
 11. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  సీత నారాము కడజేర్చ సేమమనుచు
  రాయబారము సాగించ రాముడంపె
  నంగదుని;జంపెనర్జును డావహమున
  కర్ణ,నొందగ విస్మితి కౌరవులట

  రిప్లయితొలగించండి
 12. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్న కాశీ చేరుకున్నాం. నిన్న కేవలం గంగాస్నానం చేసి, గంగాహారతి చూడగలిగాము. ఈరోజు ఉదయం విశ్వనాథుని, అన్నపూర్ణను దర్శించుకుని ఆతర్వాత కాలభైరవుని, సంకటమోచన హనుమంతుని మందిరాన్ని, తులసీమాతను మరికొన్ని స్థానిక దేవాలయాలను దర్శించుకున్నాము.
  ముఖ్యంగా నాకు ఆనందాన్ని కలిగించింది కాశీ విశ్వవిద్యాలయం వెళ్ళడం.

  రిప్లయితొలగించండి
 13. కాశీవిశ్వేశ్వరుని దర్శన భాగ్యం మీకు కలిగింది అభినందనలు
  అలాగే గయ కూడా వెళ్ళిరండి గురువుగారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   ధన్యవాదాలు. ఈరోజు కాశీలోని మిగిలిన దేవాలయాల దర్శనం. రేపు గయకు వెళ్తున్నాం.

   తొలగించండి