13, నవంబర్ 2015, శుక్రవారం

పద్యరచన - 1062

కవిమిత్రులారా!
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

22 కామెంట్‌లు:

  1. హిమపు ముక్క పైన ఇంపైన రంగులు
    చెక్కరనుగలిపిన చక్కనైన
    పుల్ల యైసు క్రీము పిల్లల కిష్టమ్ము
    చవక యదియు కొనుడు చతురు లార!

    రిప్లయితొలగించండి
  2. మండు టెండ లోన మంచినే స్తమనుచు
    చల్ల గాను తినుచు సంబర మున
    రంగు లీను హిమము రమ్యమై నదటంచు
    పిల్ల లంత కలసి యుల్ల మలర

    రిప్లయితొలగించండి
  3. మిత్రులందఱకు నమస్సులు!

    ఇంత చిన్నయపుడు హిమఫలమ్ముల వేడ్కఁ
    జప్పళించి తింటి సంబరముగ!
    వయసు ముదిరె నిపుడు వలదనుచుంటిని!
    పండు ముదికి దసలు పంచెలేల?

    రిప్లయితొలగించండి
  4. 1.పిల్లల కని గాదు పెద్దల కెల్లను
    యెల్ల వేళ లందు యిష్ట మైన
    దిదియె,తినగ తినగ దీని రుచియు హెచ్చు
    వేగ తినగ రండు పిల్లలార.
    2.పుల్ల ఐసు గలదు చల్లగా నున్నది
    కనగ రండు వేగ కరగి పోవు
    చేత పట్టు కొన్న చేయి చల్లగ నుండు
    నోట నుంచగానె యూట పెరుగు
    3.పుల్ల ఐసు జూడ ఫుల్లుగా మదినిండు
    చల్లగుండు నిదియు చలువ జేయు
    ననెడి మాట లనక ననుమతిండు తినగ
    వలదు వలదు యన్న వదల బోము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పద్యంలో ‘...కెల్లను| నెల్లవేళలందు నిష్టమైన’ అనండి.
      మూడవపద్యంలో ‘వలదటన్న’ అనండి.

      తొలగించండి
  5. ఐసు ఫ్రూ టు లు గలవట యార్య !చూడు
    మెంత చక్కగ నున్నవో యంత చెడును
    జేయు మనకవి నిజముగ చీక వలదు
    సంత సంబును నొందుట సరియ చూసి

    రిప్లయితొలగించండి
  6. విశదంబిది జనులకు పర
    వశులై మురియుదురు గనిన బాలురు విడువన్
    వశమగునె సురుచి రామో
    ఘ శర్కర మిళిత తుషార ఖండము లచటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  7. ఉల్లము రంజిల్లంగా
    చల్లని యైసును దినుటకు సంబరపడుచున్
    పిల్లలు గంతులు వేయుచు
    నల్లరి జేతురు కొనమని యర్మిలి తోడన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘రంజిల్లంగన్’ అనండి.

      తొలగించండి


  8. గు రు మూ ర్తి ఆ చా రి
    ..... ......... .......... ...

    పిల్లల త౦డ్రి :-
    ................................................
    ి
    పిల్ల ల౦దరి నిట్టులేడ్పి౦చ నేల. ?
    ఐసుక్రీములు చలికాల మమ్మనేల ?

    ఐసుక్రీములు అమ్ము వాడు :-
    .............................................

    ఎ౦డ కాలమై పోయె న౦ చె౦చ కు౦డ.
    సూర్యు డికను ప్రతాపము చూపుచు౦డె
    అ౦దుకే నేను " హిమక్రీము " లమ్ముచు౦టి
    " వారి నేడిపి౦చక కొనివ్వ౦డి సా రు ! "

    { కొనివ్వ౦డి: ఐసుక్రీము లమ్ము వాని భాష }

    రిప్లయితొలగించండి
  9. నీటఁ దీపి, రంగు,నీటుగా నొకపుల్ల
    శీతళీకరణముఁ జేయనుంచి
    తీసి నంత నైసు తీయతీయగనుండి
    చల్ల దనముఁ బంచు నుల్ల మలర!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. కలుషిత ఐసును దిన్నచొ?
    పలువిధముల నష్ట బరచుపరికించంగా
    విలువలునింపని రుచులన
    నలవోకగ హాయినింపి నాయువు ద్రుంచున్|
    2.నీటికి రంగు ,చక్కరను నేరుగ జేర్చియు పుల్లనుంచిచ
    న్నీటిగ మార్చిఐసుగను నీటుగ యంత్రములందుజేయగా
    వాటిని నాలుకంచులకుబట్టియు బట్టకనుంచి తిన్నచో?
    ఓటమి బొందు వేడియని-నోర్పున దిందురు పిల్ల,పెద్దలున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      ‘కలుషిత ఐసు’ అని సమాసం చేయరాదు కదా! ‘కలుషిత హిమమును...పరికించంగన్’ అనండి.

      తొలగించండి
  11. పుల్ల లైసు ప్రూటు యుల్లమలరజేయు
    పిల్లలకవి కరము ప్రీతినొసగు
    వేసవిదినములను విరివిగా తిందురు
    తపన తగ్గునంచు తలచి మదిని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి