29, నవంబర్ 2015, ఆదివారం

పద్యరచన - 1078

కవిమిత్రులారా,
“హృత్పద్మము వికసించును...”
ఇది పద్యప్రారంభం. 
దీనికి కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.

48 కామెంట్‌లు:

 1. గురువుగారికి నమస్కారం. నా ఈక్రింది పూరణ పరిశీలించి తప్పులు తెలియచేయగలరు. ధన్యవాదాలు.
  కం:
  హృత్పద్మము వికసించును
  తత్పురుషుగనగ,భజింపతమసముగరుగున్
  తత్పరిగలుగునుమోక్షము
  సత్పధమునెపుడువిడువనిసన్మార్గునికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేదుల సుభద్ర గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘తత్పరి’ ప్రయోగమే సందేహాస్పదం. అది మాండలికం. ‘తదుపరి’ సంస్కృత శబ్దానికి గ్రామ్య రూపాంతరం.

   తొలగించండి
  2. ధన్యవాదాలు గురువుగారు. ఆంధ్రభారతిలో తత్పరి అన్న పదము తదుపరి అనే అర్ధములో వాడినందున అదే వ్రాశాను. మూడవపాదము ఇప్పుడిలా మార్చి రాశాను. ఉత్పతిత అనగా ఎగిసినది, పుట్టినది అన్న అర్ధం కలదు కనక.
   కం:
   హృత్పద్మము వికసించును
   తత్పురుషుగనగ,భజింపతమసముగరుగున్
   ఉత్పతి తమగును భక్తియు
   సత్పధమునెపుడువిడువనిసన్మార్గునికిన్

   తొలగించండి
 2. హృత్పద్మము వికసించును
  తత్ఫలమున కాశపడక ధైర్యము తోడన్
  సత్పథమున సాధించుచు
  సత్ఫలములనొందునాడు సంతోషముతో.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.
   కాని ప,ఫ లకు ప్రాస లేదు.

   తొలగించండి
 3. హృత్పద్మము వికసించును
  సత్పురుషుని ప్రేమ యందు సౌరులు విరియ
  న్నుత్పలముల బూజించిన
  తత్పలము లభించు నంట తరియించ మదిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ప,ఫ లకు ప్రాస లేదు.

   తొలగించండి
  2. హృత్పద్మము వికసించును
   సత్పురుషుని ప్రేమ యందు సౌరులు విరియ
   న్నుత్పలముల బూజించిన
   సత్పరి ణామము లభించు సంతస మొందన్

   తొలగించండి
  3. క్షమించాలి
   గురువులకు శ్రీ ఆంజనేయ శర్మ గారికీ ధన్య వాదములు

   తొలగించండి
  4. క్షమించాలి
   గురువులకు శ్రీ ఆంజనేయ శర్మ గారికీ ధన్య వాదములు

   తొలగించండి

 4. హృత్పద్మము వికసించును
  హృదయీసుడు వికసించిన
  హృదయీసుడు వికసించును
  ప్రేమస్వరూపము వికసించిన !

  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. హృత్పద్మము వికసించును 
  సత్పద్యము లల్ల గలుగు సత్కవి వరులై
  సత్పథ చరుడౌ రాముని 
  సత్పరి పాలన పొగిడెడు సత్కథ జదవన్

  రిప్లయితొలగించండి
 6. రిప్లయిలు
  1. శశికాంత్ మల్లప్ప గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   టైపాట్లున్నాయి.

   తొలగించండి
  2. హృత్పద్మము వికసించును
   సత్పురుషుల సహచరింప సాంగత్యముతో
   తత్పరిణామము విదితము
   సత్పరివర్తన గలుగును సంపూర్ణముగా
   గురువుగారు, అక్షరాల కూర్పులో ఇంకేమైనా దోషాలున్నాయా

   తొలగించండి
 7. హృత్పద్మ ము వికసించును
  తత్పదముల శరణుగోర ధార్మిక తోడన్
  తత్పురుషోత్తము డయ్యొడ
  సత్పురుషుని జేయుకతన జక్కగ మనకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు. ధార్మికబుద్ధిన్.... అనండి.

   తొలగించండి
 8. హృత్పద్మము వికసించును
  మత్పూర్వభవాదులన్న మర్చిన యేకిం
  చిత్పుణ్య విశేషమున భ
  వత్పద పద్మములు గనిన పన్నగదమనా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వరరావు గురూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. పద్యరచన
  * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { కోరుకొన కున్నను ప్రతిదినము నాకు
  కనిపి౦చి హితము చేయు భాస్కరా !
  నీ దర్శనము చేత నా మనో పద్మము
  వికసి౦చినది ప్రభూ ! }

  హృత్పద్మము వికసి౦చె న్

  త్వత్పావన బి౦బ దర్శ న౦బున | సుర సే

  వ్యత్పద ! ప్రభాకర. ! రవి ! ప

  రాత్పర . క్ష్మాస్థిత సమస్త ప్రాణిగణ హితా ి

  ్( సేవ్యత్ = సేవి౦ప దగిన )

  రిప్లయితొలగించండి
 10. హృత్పద్మము వికసించును
  మత్పంకేరుహదళాక్షి మత్తెక్కించన్
  మత్పథము వే సడలెనా
  యుత్పలగంధిక కనుగొని ఊష్మము రేగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. మిత్రులందఱకు నమస్సులు!

  హృత్పద్మము వికసించును
  సత్పథగాములుగ నున్న సత్పురుషులకున్!
  సత్పరిణామము లెసఁగి, వి
  యత్పథ విహరణము సేయు హర్ష యశమ్ముల్!

  రిప్లయితొలగించండి
 12. మిత్రులందఱకు నమస్సులు!

  హృత్పద్మము వికసించును
  సత్పథగాములుగ నున్న సత్పురుషులకున్!
  సత్పరిణామము లెసఁగి, వి
  యత్పథ విహరణము సేయు హర్ష యశమ్ముల్!

  రిప్లయితొలగించండి
 13. హృత్పద్మము వికసించును
  సత్పురుషుల జ్ఞాన బోధ, సంగతి వలనన్
  సత్పదుడగు హరి గొల్చిన
  సత్పథమును జూపి బ్రోచు సంకటములలో.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. హృత్పద్మము వికసించును
  త్వత్పాదాబ్జముల నంట తల్లీ! లలితా!
  సత్పథమవియే చూపును
  తత్పథమున సాగ బ్రదుకు ధన్యత నొందున్

  రిప్లయితొలగించండి
 15. సద్గుణశీలుని భర్తగా పోందిన ఒక వధువు తలపుగా.......

  హృత్పద్మము వికసించెను
  సత్పథమును వీడనట్టి చక్కని ప్రియుడే
  మత్పతి గా పదుగు రెదుట
  మత్పాణీ గ్రహణమొంద మనసే విరిసెన్

  రిప్లయితొలగించండి
 16. హృత్పద్మము వికసించును
  తత్పతిని మదిని దలంచు తరుణమునందున్
  సత్పథమున రవిమెరియగ
  తత్పరతగ నెదురుజూచు తరుణీమణికిన్ !!!

  రిప్లయితొలగించండి
 17. హృత్పద్మము వికసి౦చును
  తత్పరతన్ తత్సవితుని ధ్యానింపంగన్
  చిత్పథమున గన్పడు భగ
  వత్పాదులు ప్రత్యగాత్మ ప్రణవము నొకటై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. హృత్పద్మమువికశించును
  సత్పదములభక్తియనెడి సత్తువచేతన్|
  “మత్పరుషము దుర్మార్గం
  బుత్పాదనగన?వినాశ యూహలు బెరుగున్

  రిప్లయితొలగించండి
 19. హృత్పద్మము వికసించును
  సత్పురుషుని శిష్యుడౌచు సంశయము విడన్
  సత్పథ భగవద్గీత ప
  రాత్పరు ముఖపద్మమిడగ రథి జయమందెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 20. హృత్పద్మము వికసించెను
  సత్పథమున నడచి మంచి సంగతులెల్లన్
  హృత్పూర్వకముగ దలచుచు
  తత్పరమాత్ముని సతతము ధ్యానించు మదిన్.

  రిప్లయితొలగించండి
 21. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. హృత్పద్మము వికసించును
  హృత్పద్మపు హాస్పిటలున హేలాహేలిన్
  హృత్పద్మము స్తంభించును
  తత్పరమై బిల్లుజూడ తడికిట థాంథాం!

  రిప్లయితొలగించండి