కార్తిక పూర్ణిమ సమారాధన సందర్భమున మహాదేవునికి నా పద్యకుసుమార్చన: నాపుట్టిన రోజు కూడ కార్తీక పూర్ణిమే.దంభంబు విడిచి నే సంరంభంబున వేడుకొందు రాజమకుటునిన్గంభీర గరళ కంఠున్శంభుఁ ద్రినేత్రు గిరిజేశుశంకరు నీశున్ దంభము వీడినే గొలుతు దానవ ఖండన ఖేలనాతిసంరంభుని, దక్షయజ్ఞ పరి రక్షణ శిక్షణ హేతు భూతునిన్ స్తంభిత జాహ్నవున్ , వికట దండధరోద్ధత దర్పహంతకున్శంభుని, ఫాలనేత్ర తట సంజని తానల దగ్ధ మన్మధున్ [బ్రహ్మదేవుని కోరిక మేర శంకరుడు, యజ్న నాశనానంతరము దక్షుని మేష శిరముతో బ్రదికించి యజ్నాన్ని తిరిగి సంపూర్ణమగునటుల అనుగ్రహిస్తాడు.]
పోచిరాజు కామేశ్వరరావు గురూ,ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
కార్తిక పౌర్ణమి రోజునపూర్తిగ శివకేశవులను బూజించి మదిన్గీర్తించుచు దీపములన్స్ఫూర్తిగ వెలిగించ జనులు శుభములు బడయున్!!!
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.కర్తృపదం‘జనులు’ బహువచనం, క్రియాపదం ‘పడయున్’ ఏకవచనం అయ్యాయి.
1.అంబరాన వెలిగె నందాల జాబిలిపండువెన్నెలనిట పంచుచుండెసంతసించిన మది సఖుని చెలిమిని కోరవెన్ను డెక్కడనుచు వెదికె రాధ.2.నిండు చందమామ నింగిలో మెరిసేనుపండు వెన్నెలంత పరచు కొనియెకలువ భామమది కమ్మగా మురిసేనుపలవరింత తోడ పులకరించి.3.తే.గీ: పండు వెన్నెల కురిసేను పిండి యారబోసి నయటుల కలువలు పూచె నిలనునింగిలో వెలి గేటి యా నిండు చందమామ నిగనిగలను జూపి మరులు గొలిపె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
కార్తీకపున్నమి కలలను మాన్పించి----కాంక్షలు దీర్చును కలియుగానఇంటిముంగిళ్ళలో నిలవేల్పు చెంతన------ దీప కాంతులుంచ దిగులుదొలగుదేవాలయాలలో దివ్యత్వ ముంచులే-----కాంతి పుంజములందు కళలయందునదులలో స్నానాలు?మదిలోన మాలిన్య-----భావాలు దొలగించు|భాగ్యమదియెబంతి చేమంతు లంతట భక్తిచేతకొలువు దీరును-దేవుళ్ళ పిలుపులట్లు|దైవ కాంతిని బెంచగ దరికి జేరిదీప దూపాలు సేవించ ?పాపహరమె
కె. ఈశ్వరప్ప గారూ, మీ సీసపద్యం బాగున్నది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *.................................గురువుగారికి కవిమిత్రులకు వ౦దనములు కా ర్తి క పూ ర్ణ మి శు భా కా౦క్షలుమహాశివుని పద్యసుమాల తో ఆరాధి౦చవలెనను నా కోరిక. మన్ని౦చ గలరు శ్రీ కాశీ విశ్వేశ్వర !శ్రీ కర ! పురహర. ! భవహర ! శ్రితమ౦దారా !శ్రీ కా౦త ప్రముఖ వినుత. !శ్రీ క౦ఠా ! శూల హస్త ! శ్రి భ సురలోకా ! .................................................. సు గ౦ ధి వృత్తము.............................. బాలచ౦ద్ర మౌళి ! దీనభక్తపాల. ! శ౦కరా !శూలపాణి ! నాగభూష.! శుభ్రదేహ.! ఈశ్వరా !నీలక౦ఠ. ! నిర్వికార. ! నిర్మలా ! మనోహరా ! జాలమేల మమ్ము బ్రోవు జాలితో మహేశ్వరా !.....................................................శ్రీ కైవల్య వరప్రదాయక. ! శివా ! లీలోధ్ధితాకార. ! ఈశా ! కారుణ్య పయోనిధీ ! భయహరా ! చ౦ద్రార్థ మౌళీ ! హరా !సాకల్యామర. మౌనివ౦ద్య సుగుణా ! సధ్భక్త చి౦తా మణీ ! శ్రీ కళ్యాణ పురస్థ మానవ గణ క్షేమ౦కరా ! శ౦కరా !.................................................తల్లివి త౦డ్రియున్ గురువు దైవము నాకిల నీవె | నిల్పుమా యుల్లము లోన తావక మహోజ్జ్వల. రూపము | ఏ విపత్తు స౦ధిల్లగ నీక నన్ను ననునిత్యము పాలన చేయుమయ్య. | వా౦ఛిల్ల ని కే వర౦బులను శీతమయూఖధరా ! పరాత్పరా !....................................................ఎచ్చోట చూచిన ఈశ్వరాలయములే కనిపి౦చు చు౦డును కనుల ని౦డఎచ్చోట చూచిన ఈశ్వర భజనలే వినిపి౦చు వీనుల. వి౦దు గూర్చి ఎచ్చోట చూచిన ఈశ్వర భక్తులే బారులు తీరిచి వచ్చు చు౦ద్రుఎచ్చోట చూచిన. " ఈశ్వరా ! శ౦కరా ! " యను నామములె ప్రతిధ్వని౦చు ఎచట చూచిన లి౦గము లెసగు చు౦డుసతము శివ పురాణ సభలు జరుగు చు౦డుభవుడు వసియి౦చు " శ్రీ శైల " పర్వతమ్మువరలు రె౦డవ కైలాస పుర మన౦గ. ! !
{ గమనిక. :- సీస పద్యములో నాలుగవ. లైను లో సవరణ. :--- " యను నామములె ప్రతి ద్వని నొస౦గు " }
గురుమూర్తి ఆచారి గారూ, మీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.
పద్యరచన దీపకాంతులకార్తీక-దివ్యవేళహరి,హరాదుల జూచిన?మరువతరమమానసంబున వెలుగును మలచినపుడుచింత చీకట్లు మాయులేవింతగాను
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
హరియె మత్స్యావ తారాన యవని పైననవత రించిన రోజిదే యద్భుతమ్ముకార్తికపు పూర్ణిమయె మోక్ష గాము లెల్లహరిహరులను గొల్తురు భేద మనకనేడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కాంతులు విరజిమ్ము కార్తీక పూర్ణిమ పాపతామసమును పరిహరించుమత్స్యావతారాన మాధవుండిలలోన అవతరించెను నేడు అదియె ఘనముత్రిపురా సురుని సంహ రించిన రోజిది మోక్షగాములు మెచ్చి మురియు రోజుకలికి తులసి పెండ్లి ఘనముగా ఇంటింట క్రతువుగా జరిపేరు రమ్యముగను హరిహరులను కొలుచు టద్వితీయము నేడుకనులపండువిదియె కల్పమందునదుల లోన నేడు స్నానమ్ము సేసినబాపములును ద్రుంచు పర్వదినము
ఆంజనేయ శర్మ గారూ, మీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.
కార్తిక పూర్ణిమ సమారాధన సందర్భమున మహాదేవునికి నా పద్యకుసుమార్చన:
రిప్లయితొలగించండినాపుట్టిన రోజు కూడ కార్తీక పూర్ణిమే.
దంభంబు విడిచి నే సం
రంభంబున వేడుకొందు రాజమకుటునిన్
గంభీర గరళ కంఠున్
శంభుఁ ద్రినేత్రు గిరిజేశుశంకరు నీశున్
దంభము వీడినే గొలుతు దానవ ఖండన ఖేలనాతిసం
రంభుని, దక్షయజ్ఞ పరి రక్షణ శిక్షణ హేతు భూతునిన్
స్తంభిత జాహ్నవున్ , వికట దండధరోద్ధత దర్పహంతకున్
శంభుని, ఫాలనేత్ర తట సంజని తానల దగ్ధ మన్మధున్
[బ్రహ్మదేవుని కోరిక మేర శంకరుడు, యజ్న నాశనానంతరము దక్షుని మేష శిరముతో బ్రదికించి యజ్నాన్ని తిరిగి సంపూర్ణమగునటుల అనుగ్రహిస్తాడు.]
పోచిరాజు కామేశ్వరరావు గురూ,
తొలగించండిముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు.
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండికార్తిక పౌర్ణమి రోజున
రిప్లయితొలగించండిపూర్తిగ శివకేశవులను బూజించి మదిన్
గీర్తించుచు దీపములన్
స్ఫూర్తిగ వెలిగించ జనులు శుభములు బడయున్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కర్తృపదం‘జనులు’ బహువచనం, క్రియాపదం ‘పడయున్’ ఏకవచనం అయ్యాయి.
1.అంబరాన వెలిగె నందాల జాబిలి
రిప్లయితొలగించండిపండువెన్నెలనిట పంచుచుండె
సంతసించిన మది సఖుని చెలిమిని కోర
వెన్ను డెక్కడనుచు వెదికె రాధ.
2.నిండు చందమామ నింగిలో మెరిసేను
పండు వెన్నెలంత పరచు కొనియె
కలువ భామమది కమ్మగా మురిసేను
పలవరింత తోడ పులకరించి.
3.తే.గీ: పండు వెన్నెల కురిసేను పిండి యార
బోసి నయటుల కలువలు పూచె నిలను
నింగిలో వెలి గేటి యా నిండు చంద
మామ నిగనిగలను జూపి మరులు గొలిపె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
కార్తీకపున్నమి కలలను మాన్పించి
రిప్లయితొలగించండి----కాంక్షలు దీర్చును కలియుగాన
ఇంటిముంగిళ్ళలో నిలవేల్పు చెంతన
------ దీప కాంతులుంచ దిగులుదొలగు
దేవాలయాలలో దివ్యత్వ ముంచులే
-----కాంతి పుంజములందు కళలయందు
నదులలో స్నానాలు?మదిలోన మాలిన్య
-----భావాలు దొలగించు|భాగ్యమదియె
బంతి చేమంతు లంతట భక్తిచేత
కొలువు దీరును-దేవుళ్ళ పిలుపులట్లు|
దైవ కాంతిని బెంచగ దరికి జేరి
దీప దూపాలు సేవించ ?పాపహరమె
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ సీసపద్యం బాగున్నది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి................................
.గురువుగారికి కవిమిత్రులకు వ౦దనములు
కా ర్తి క పూ ర్ణ మి శు భా కా౦క్షలు
మహాశివుని పద్యసుమాల తో ఆరాధి౦చవలెనను నా కోరిక. మన్ని౦చ గలరు
శ్రీ కాశీ విశ్వేశ్వర !
శ్రీ కర ! పురహర. ! భవహర ! శ్రితమ౦దారా !
శ్రీ కా౦త ప్రముఖ వినుత. !
శ్రీ క౦ఠా ! శూల హస్త ! శ్రి భ సురలోకా !
..................................................
సు గ౦ ధి వృత్తము
..............................
బాలచ౦ద్ర మౌళి ! దీనభక్తపాల. ! శ౦కరా !
శూలపాణి ! నాగభూష.! శుభ్రదేహ.! ఈశ్వరా !
నీలక౦ఠ. ! నిర్వికార. ! నిర్మలా ! మనోహరా !
జాలమేల మమ్ము బ్రోవు జాలితో మహేశ్వరా !
.....................................................
శ్రీ కైవల్య వరప్రదాయక. ! శివా !
లీలోధ్ధితాకార. ! ఈ
శా ! కారుణ్య పయోనిధీ ! భయహరా !
చ౦ద్రార్థ మౌళీ ! హరా !
సాకల్యామర. మౌనివ౦ద్య సుగుణా !
సధ్భక్త చి౦తా మణీ !
శ్రీ కళ్యాణ పురస్థ మానవ గణ
క్షేమ౦కరా ! శ౦కరా !
.................................................
తల్లివి త౦డ్రియున్ గురువు దైవము
నాకిల నీవె | నిల్పుమా
యుల్లము లోన తావక మహోజ్జ్వల.
రూపము | ఏ విపత్తు స౦
ధిల్లగ నీక నన్ను ననునిత్యము
పాలన చేయుమయ్య. | వా౦
ఛిల్ల ని కే వర౦బులను
శీతమయూఖధరా ! పరాత్పరా !
....................................................
ఎచ్చోట చూచిన ఈశ్వరాలయములే
కనిపి౦చు చు౦డును కనుల ని౦డ
ఎచ్చోట చూచిన ఈశ్వర భజనలే
వినిపి౦చు వీనుల. వి౦దు గూర్చి
ఎచ్చోట చూచిన ఈశ్వర భక్తులే
బారులు తీరిచి వచ్చు చు౦ద్రు
ఎచ్చోట చూచిన. " ఈశ్వరా ! శ౦కరా ! "
యను నామములె ప్రతిధ్వని౦చు
ఎచట చూచిన లి౦గము లెసగు చు౦డు
సతము శివ పురాణ సభలు జరుగు చు౦డు
భవుడు వసియి౦చు " శ్రీ శైల " పర్వతమ్ము
వరలు రె౦డవ కైలాస పుర మన౦గ. ! !
{ గమనిక. :-
రిప్లయితొలగించండిసీస పద్యములో నాలుగవ. లైను లో
సవరణ. :---
" యను నామములె ప్రతి ద్వని నొస౦గు " }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.
పద్యరచన దీపకాంతులకార్తీక-దివ్యవేళ
రిప్లయితొలగించండిహరి,హరాదుల జూచిన?మరువతరమ
మానసంబున వెలుగును మలచినపుడు
చింత చీకట్లు మాయులేవింతగాను
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
హరియె మత్స్యావ తారాన యవని పైన
రిప్లయితొలగించండినవత రించిన రోజిదే యద్భుతమ్ము
కార్తికపు పూర్ణిమయె మోక్ష గాము లెల్ల
హరిహరులను గొల్తురు భేద మనకనేడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాంతులు విరజిమ్ము కార్తీక పూర్ణిమ
రిప్లయితొలగించండిపాపతామసమును పరిహరించు
మత్స్యావతారాన మాధవుండిలలోన
అవతరించెను నేడు అదియె ఘనము
త్రిపురా సురుని సంహ రించిన రోజిది
మోక్షగాములు మెచ్చి మురియు రోజు
కలికి తులసి పెండ్లి ఘనముగా ఇంటింట
క్రతువుగా జరిపేరు రమ్యముగను
హరిహరులను కొలుచు టద్వితీయము నేడు
కనులపండువిదియె కల్పమందు
నదుల లోన నేడు స్నానమ్ము సేసిన
బాపములును ద్రుంచు పర్వదినము
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.