5, నవంబర్ 2015, గురువారం

పద్యరచన - 1055

కవిమిత్రులారా!
“వనితయుఁ గవితయు రెండును...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

29 కామెంట్‌లు:

 1. వనితయుఁ గవితయు రెండును.
  మనములనాహ్లాద పరచి మత్తెక్కించున్
  ధనరాశులెన్ని కలిగిన
  నొనగూడని సుఖము నిచ్ఛునుత్తమమైనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ఉత్తమరీతిన్..... అంటే బాగుంటుంది.

   తొలగించండి
 2. వనితయు గవితయు రెండును
  కనినంతనె బోధపడవు, కష్టమనక సా
  ధనజేసినంత వశమై
  మనసులనే దోచునివియె మహిమాన్వితమౌ.

  రిప్లయితొలగించండి
 3. వనితయు కవితయు రెండును
  మనసుల నుప్పొంగ జేసి మైమర పించున్
  వనమున విరిసిన సుమములు
  ఘనమగు సంతసము నిచ్చు కానుక లనగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వనితయు గవితయు రెండును
   తన పుట్టినచోటనుండ తగ్గును కళ, చే
   కొనిమెచ్చు వారి చేతను
   ఘనముగనే మెప్పుబొందు గదరా భువిలో.

   తొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   *******
   గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. 1.వనితయు కవితయు రెండును
  ఘనముగ మనలకు యశమును కలిమిని కూర్చున్
  మనమున తలచిన చాలును
  మనము,తనువును పులకించు మహిలో గనుమా !

  2.వనితయు కవితయు రెండును
  జనులకు హితమొసగుచుండు జగతిని జూడన్
  వనితా పుస్తకములు జా
  రిన మరల కరముల జేర రనెదరు విబుధుల్.

  3వనితయు కవితయు రెండును
  ననయము నాశ్రయము గోరు నయమగు రీతిన్
  ఘనమౌ తీరున వారిని
  గనినన్ ఖ్యాతియు దొరకును కావుము వారిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణ చివరి పాదంలో యతి తప్పింది. 'జా|రిన మరల కరముల జేర రిది సత్య మగున్' అనండి.

   తొలగించండి
 5. వనితయు గవితయురెండును
  అనవరతము నవసరంబె నజ్ఞానమునే
  దినమున ద్రుంచెడి మార్గము
  మనసుకు మహిమాన్వితంబు మలచును విధిగా

  రిప్లయితొలగించండి
 6. వనితయుఁ గవితయు రెండును
  మనుషుల మనసులను మార్చు మంత్రాస్త్రామ్ముల్
  వినవలెను జెప్పినట్టుల
  వినకున్నను మిగుల వంత బెంచును మిత్రా !


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. వనితయుఁ గవితయు రెండున
  వని కుసుమ సదృశులపార భావ నిగూఢుల్
  మనముల నలరింతు రిరువు
  రు నలంకారప్రియులు గురుతర గమనులే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. వనితయు కవితయు రెండును
  మనుచుండును సంతతమ్ము మధురోహలలో
  కనతరమె వాటి లోతులు
  మనసిజమర్దనునికైన మహిలో సుమ్మా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. .వనితయు కవితయు రెండును
  మనుగడ సహజీవనంబు మరియాదలతో
  ఘనతగ సాగెడి మార్గపు
  పనితనములు పంచి బెంచు పరవశ మునకై|
  3వనితయు కవితయు రెండును
  కనుపించగ రెండు కళ్ళు కళలకు,కలకున్
  తనలోధర్మము నిలుపగ
  జనియించిన మనసు,మమత జతబడు రీతిన్

  రిప్లయితొలగించండి
 10. వనితయు గవితయు రెండును
  నెవరికినిన్ బోధపడవు నిసుమంతయును
  న్నవగత మగుటకు గావలె
  నవిరళమగు నోర్పు మనకునార్యా గురువా

  రిప్లయితొలగించండి
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 13. నిన్నటి పద్యరచన:

  పిన్నవయస్కుడైన తను భీష్ముని పాత్రకు వన్నెతెచ్చియున్
  పిన్నలు 'శక్తిమాన' నుచు పిల్చగఁ దాల్చి 'ముఖేషు ఖన్న' డున్
  చెన్నుగ కీర్తికాంతనట చేగొనెడున్నభినందనా స్థలిన్
  పిన్నలు పెద్దలేగిరట భీష్ముని పెండ్లికి మోదమందుచున్!

  నేటి పద్యరచన:

  వనితయుఁ గవితయు రెండును
  సునిశిత భావమ్ము తోడ శోభను గూర్చున్!
  వినయము విజ్ఙతల నొకరు,
  గణ,యతి, ప్రాసలిడ నొకరుఁ గాంతురు ప్రణతుల్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు. పిల్చగ అన్నచోట పిల్వగ.... అనండి.
   ఈనాటి మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్న రాత్రి గయకు వెళ్ళి రోజంతా విశ్రాంతి లేకుండా ప్రయాణం చేసి ఇప్పుడే సత్రం చేరుకున్నాము. అలసట వల్ల మీ పద్యాలను ఇప్పుడు సమీక్ష చేయలేకున్నాను. రేపు ఉదయం చూస్తాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 15. వనితయుఁ గవితయు రెండును
  కనుటకు వినుటకును మస్తు ఘనముగ నుండున్
  కనుగొనగ లేము రెంటికి
  వినయము లేదెందు వలనొ;...వేమనె తెలియున్!

  రిప్లయితొలగించండి
 16. వనితయుఁ గవితయు రెండును
  కనిపించగ కవివరునకు కైపున్ గూర్చున్
  పనిలేని మంగలోడట
  కనిపించిన పిల్ని గొరిగి గంధము పూయున్

  రిప్లయితొలగించండి