29, నవంబర్ 2015, ఆదివారం

సమస్య - 1869 (విస్కీ బ్రాండీల వలన...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్.

57 కామెంట్‌లు:

 1. గురువు గారికి నమస్కారము....నాన్న గారి ఆరోగ్యమెలా వుంది?

  శుష్కించును దేహమ్ముయు
  విస్కీ బ్రాండీ లవలన, విజ్ఞత హెచ్చున్
  నిష్కపటముతో మెదలుచు
  పుష్కలముగ పాలు పండ్లు భుజియించినచో.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   నాన్నగారి ఆరోగ్యం రోజురోజుకు దిగజారుతున్నది. రోజంతా హాస్పిటల్ లోనే ఉంటున్నాను.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఉభయప్రాసలో స-ష లకు ప్రాస వేయవచ్చు.

   తొలగించండి
 2. గురువుగారికి నమస్కారం. విరుపు లేకుండా పూరణ చేయాలని ప్రయత్నించాను. డాస్టోవిస్కీ అనే సుపరిచుతుడైన రచయితవీ , బ్రాండీ అన్న మొదటి పేరున్న యువరచయిత్రులు అనేకమంది ఉన్నారు (వీరిలో కొందరు మంచి పుస్తకాలు రాశారు). అటువంటి పుస్తకాలు చదివితే మనసుకు తస్కీస్ (ఆనందం, ఓదార్పు) కలుగుతుంది కనక విస్కీ, బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్ అని పూరణ చేశాను. దయచేసి పరిశీలించి నా తప్పులుంటే మన్నించగలరు.
  కం:
  విస్కీ యన్నను డాస్టో
  విస్కీ, బ్రాండీ రచనలను విరివిగ చదవన్
  తస్కీస్ దొరకును మనసుకు,
  విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేదుల సుభద్ర గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘రచనలను’ అన్నచోట గణదోషం. ‘రచనల’ అనండి.

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. ధన్యవాదాలు గురువుగారు. పొరపాటు సవరించాను.
   కం:
   విస్కీ యన్నను డాస్టో
   విస్కీ, బ్రాండీ రచనల విరివిగ చదవన్
   తస్కీస్ దొరకును మనసుకు,
   విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్.

   తొలగించండి
  4. వేదులసుభద్ర గారూ! మీ పూరణ అద్భుతమండి! అభినందనలు....

   తొలగించండి
 3. మస్కా గొట్టగ భార్యకు
  విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్
  సర్కసు ఫీట్లను జేయగ
  పుష్కలముగ లాభ మంట పురుషుల కెపుడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

  2. అహో జర్మనీయ విజ్ఞాన వినువీధి !
   భూలోకపు బెస్ట్ బ్రెయిన్ పెన్నిధి !
   వారి జ్ఞాన సంపదకు కారణం బెద్ది ?
   విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్ !

   జిలేబి

   తొలగించండి
  3. రాజేశ్వరి అక్కయ్యగారు నన్ను క్షమించాలి....మూడవపాదంలో ప్రాస సరిపోతుందంటారా!.....నాకు తెలియక అడుగుతున్నాను....

   తొలగించండి
  4. మస్కా గొట్టగ భార్యకు
   విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్
   హస్కును గొట్టచు నేర్పుగ
   పుష్కల మగు లాభ మంట పురుషుల కెపుడున్

   ధన్య వాదములు శ్రీ ఆంజనేయ శర్మ గారికి మరియు గువుగారికి

   తొలగించండి
 4. అక్కయ్యా,
  మూడవ పాదంలో ప్రాసదోషాన్ని నేను గమనించలేదు. సవరించండి.

  రిప్లయితొలగించండి
 5. విస్కీ బ్రాండీ లిరువురు
  కస్కంభటు యొద్ద వారు గరపియు విద్యన్
  తస్కిసు రచనలు జేయగ
  విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. రిప్లయిలు
  1. మస్కా గొట్టు గిరీశము
   విస్కీ లాభించినంత విడవక త్రాగన్
   కిస్కో తెలియని విద్యని
   విస్కీ బ్రాండీల వల్ల విజ్ఞత పెరుగున్

   తొలగించండి
  2. శశికాంత్ మల్లప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. హస్కీగా స్మిత యిట్లనె
  విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్
  మస్కా కొట్టకుభామా!
  శుష్కించును దేహమనుచు సుస్మిత జెప్పెన్!!!
  దుష్కర రోగములుగలుగు
  విస్కీ బ్రాండీలవలన , విజ్ఞత హెచ్చున్
  నిష్కర్షగ పాలు గుడువ
  పుష్కలముగ సుస్థతనిడి బుద్ధిని బెంచున్!!!


  రిప్లయితొలగించండి
 8. రిప్లయిలు
  1. తస్కరు నిందాత యనిన
   భాస్కరు డుదయించు నేని పశ్చిమ దిక్కున్
   మస్కరము మండదని యన
   విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్.

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వరరావు గురూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. మిత్రులందఱకు నమస్సులు!

  మస్కాకొట్టియుఁ బొందిన
  దస్కముతో మద్యపాన తర్పితు లగుచోన్
  దస్కరణ కెఱగఁ జేయును

  విస్కీ బ్రాండీ! లవల నవిజ్ఞత హెచ్చున్!!

  (విస్కీ బ్రాండీలు+అవలన్+అవిజ్ఞత హెచ్చున్)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండు మధుసూదన్ గారూ,
   విలక్షణమైన విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 10. ి సమస్య
  * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { దుష్క్రియా చేతస్కు లగు ఘనులకు
  విస్కీ బ్రా౦దీలు విఙ్ఞానమును
  పె౦పొ౦ది౦ప జేయును }

  తస్కరణము | నర హత్య | వ

  యస్క సుగుణ భ౦గ దుష్క్రియా వర్తన. చే


  తస్కు లయిన ఘనుల కెపుడు

  విస్కీ బ్రా౦దీల వలన విఙ్ఞత. పెరుగున్

  {…తస్కరణ : దొ౦గతనము ; వయస్కుడు :
  యువకుడు ; వయస్క : యువతి ; వయస్క సుగుణభ౦గము : కన్యాశీలభ౦గము ;
  దుష్క్రియా చేతస్కుడు :చెడుపనులు చేయు
  మనసు గలవాడు } ి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 11. మాస్కోచెస్స్ పోటీలో
  స్పాస్కీ విజయమ్ము నొందె; వైనము నెరుగన్
  పాస్కలు వ్యాఖ్యానించెను
  విస్కీ బ్రా౦డీల వలన విజ్ఞత హేచ్చున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 13. అవును. గురుమూర్తి ఆచారి గారి పూరణ అద్భుతంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 14. తీస్కోరా సభ్యత్వము
  చూస్కోరా క్లబ్బులోన చూతువు దివినే
  వ్రాస్కోరా నా మాటిది
  విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్.

  రిప్లయితొలగించండి
 15. శైలజ గారి రెండవ పూరణలో ప్రాస భంగమయినట్లుంది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   స,ష ప్రాస లాక్షణికులకు ఆమోదమే.

   తొలగించండి
  2. అలాగా గురువుగారూ నాకు తెలియని విషయం తెలుసుకున్నాను. ధన్యవాదాలు.

   తొలగించండి
 16. సంస్కార విహీను లవరె
  విస్కీ బ్రాండీల వలన ? విజ్ఞత హెచ్చున్
  తస్కర ముష్కరు లైనను
  మస్కరు లై విధిని జేరు మార్గము నెమకన్

  రిప్లయితొలగించండి
 17. హస్కీ వాయిసు తో స్మిత
  పుష్కలముగ మందుగొట్టి ముద మున బలికెన్
  మస్కాగొ ట్టగ జనులకు
  విస్కీ బ్రాం డీలవలన విజ్ఞత హె చ్చున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. మస్కా పెట్టుచు చెప్పును
  రాస్కెలు కడు త్రాగు బోతు రామయ నీకున్
  భాస్కర! వినకీ మాటలు
  "విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 19. సమస్యమస్కాగొట్టుచు దెలిపెను
  విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్
  విస్కీ విష సంస్కృతితో
  మస్కాలేబెరిగిపోయె మనుగడ యందున్.

  రిప్లయితొలగించండి
 20. మస్కా కొట్టక వినుమా
  మూస్కొని నీ నోరు పెద్ద మూఢుడ ఛీ!ఛీ!
  రాస్కెల్ !విని వీడనిచో
  విస్కీ బ్రాండీల "వల " నవిజ్ఞత హెచ్చున్.

  రిప్లయితొలగించండి
 21. డిస్కషను లన్న చోటను
  కాస్కొనెదరు మందుఁగొట్ట కాలముఁ గనకన్
  హస్కేసు కొందురె! యెటుల
  విస్కీ, బ్రాండీల వలన విజ్ఙత హెచ్చున్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 22. మాస్టరు గారూ ! ఇప్పుడే ఫేస్ బుక్ లో వార్త చూచి చాలాచింతించుచున్నాను. దివంగతులైన మీ పితృదేవుల ఆత్మకు శాంతి కలుగుగాక.

  రిప్లయితొలగించండి
 23. ఇస్కో విస్కీ దేదో
  ఉస్కో బ్రాండీ ప్రతిదిన ముదయము రాత్రిన్
  చస్కా హైదరబాదున
  విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్!

  రిప్లయితొలగించండి