23, నవంబర్ 2015, సోమవారం

సమస్య - 1863 (మూడును మూడును గలసిన...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మూడును మూడును గలసిన ముప్పదియేడౌ.

32 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. ఊకదంపుడు గారూ,
   రాత్రి పడుకునేముందు సరిగానే పోస్టును షెడ్యూల్ చేశాను. మరి సమస్య ఎందుకు పోస్ట్ కాలేదో అర్థం కావడం లేదు. ఇప్పుడు సవరించాను. ధన్యవాదాలు.

   తొలగించండి
 2. మూడూ మూడూ నారే
  మూడుకు మూడిడను ప్రక్క ముప్పది మూడౌ
  చూడగ నెట్టుల మిత్రమ
  మూడును మూడును గలసిన ముప్పదియేడౌ?

  రిప్లయితొలగించండి
 3. చిన్న పిల్లలకు ఒక తెలుగు మాస్టారు గణితము బోధిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకు పద్య రూపం:

  మూడది పదిమార్లు బెరిగి
  కూడగ తానొకటితోడ కూరిమితోడన్
  ఆడుతు పాడుతు దానికి
  మూడును మూడును గలసిన ముప్పదియేడౌ

  రిప్లయితొలగించండి
 4. మూఢుడు గణింప తేలెను
  మూడును మూడును గలసిన ముప్పది మూడై
  వాడిని మించిన వాడనె
  మూడును మూడును గలసిన ముప్పది యేడౌ

  రిప్లయితొలగించండి
 5. గురువుగారికి నమస్కారం. నా ఈ క్రింది పూరణ పరిశీలించి తప్పులు తెలియచేయగలరు.

  ఆడుతు పాడుతు నేర్చిన
  కూడిక లెక్కలు మనసుకు కూర్మిగ తోచున్
  కూడిన నొకటితొ ముప్పది
  మూడును మూడును గలసిన ముప్పదియేడౌ

  రిప్లయితొలగించండి
 6. రిప్లయిలు
  1. ఏడును దానికి కుదురుగ
   నేడును వాటికిని గూర్ప యేడును చివర
   న్నేడును వీటికి మూడును
   మూడును మూడును గలసిన ముప్పదియేడౌ.

   తొలగించండి
 7. మూడును పది మార్లే సుకు
  కూడిన ఫలమున కొకటిని కొసరుగ వేయన్ 
  జూడుమిక దాని కింకను
  మూడును మూడును గలసిన ముప్పది యేడౌ.

  రిప్లయితొలగించండి
 8. చూడుము ముప్పది యొకటికి
  మూడును మూడును గలసిన ముప్పదియేడౌ
  కూడిక లివి సామాన్యడు
  చూడగనే చేయగలడు చోద్యమ్మేలా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మాస్టరు గారూ ! మీ నాన్నగారికి అరోగ్యము త్వరగా కుదుట బడాలని భగవంతుని కోరుకొనుచున్నాను.

   తొలగించండి
 9. 'మూడును' బట్టే యగునని
  తేడాగా తెలియజేయ తెలివిగ తెలిపెన్
  వాడొక గడుసరి పిడుగే
  మూడును మూడును గలిపిన 'ముప్పది'యేడౌ

  రిప్లయితొలగించండి
 10. ఏడవక నాడుచు నువ్
  పాడుచు నేర్వుమిటు రెండువందల క్రిందన్
  కూడుచు నాల్గును తదుపరి
  మూడును మూడును గలసిన ముప్పది*యేడౌ!
  (30 x 7 = 210 )

  రిప్లయితొలగించండి
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 12. మూడు ముడులు కట్టినచో
  మూడు ప్రదక్షిణలు సేసి,మురియుచు నడువన్
  యేడడుగులు,బంధమేర్పడ,
  మూడును మూడును కలసిన [ముప్పు+అది] ముప్పది యేడౌ

  రిప్లయితొలగించండి
 13. కవిమిత్రులారా,
  నమస్కృతులు.
  మా నాన్నగారి ఆరోగ్యం విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చేర్పించాము. ఉదయం నుండి ఆసుపత్రిలోనే ఉన్నాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీనానగారి ఆరోగ్యము త్వరగా కుదుట పడాలని దైవాన్న వేడుకొంటూ గురుదేవులకు శుభకాంక్షలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. భగవంతుని దయ వలన మీ నాన్నగారి ఆరోగ్యము కుదుట పడాలని ప్రార్ధిస్తున్నాము.

   తొలగించండి
 14. సమస్య వాడొక మాంత్రికుడట నే
  జూడగనే పెన్నులారు జూపుచు కర్రే
  నీడుచు ద్రిప్పుచు వింతగ
  మూడును మూడును గలిపినముప్పది యేడౌ.|
  2.నేడిల వడ్డీ మోసము
  మూడును మూడును గలిపిన ముప్పది యేడౌ
  ఏడాదిదాటిపోయిన
  తోడుగ వడ్డీనిజేర్చు|దొంగగ-దొరగా{వడ్డీ వ్యాపారుల మోసమునఒకపద్దతి}
  రిప్లయితొలగించండి
 15. వేడుక కాదని గణితము
  కూడికలను జేసెనంట కుదురే లేకన్
  చూడగ తప్పుల తడకలు
  మూడును మూడును గలసిన ముప్పది యేడౌ

  రిప్లయితొలగించండి
 16. నమస్కారములు
  మీ నాన్నగారి ఆరోగ్యము త్వరగా కుదుట పడాలని భగవంతుని వేడుకుంటున్నాము. ఫర్వాలేదు ధైర్యంగా ఉండండి .అక్క

  రిప్లయితొలగించండి
 17. కూడును గుడ్డకె కాకన్
  గూడున నొక తోడునీడకు న్నోచని వా
  డాడెను పూటుగ త్రాగుచు
  మూడును మూడును గలసిన ముప్పదియేడౌ.

  రిప్లయితొలగించండి
 18. మాస్టరు గారూ ! మీ నాన్నగారికి అరోగ్యము త్వరగా కుదుట బడాలని భగవంతుని కోరుకొనుచున్నాను.

  రిప్లయితొలగించండి
 19. కూడిక చేయగ నారగు
  మూడును మూడును గలసిన, ముప్పదియేడౌ
  నేడును ముప్పది గలసిన
  వీడెను గానీదుశంక వేదుల క్ష్మీ !

  రిప్లయితొలగించండి
 20. ఏడును మూడును మూడును
  మూడును కలిపి మరియును మూడును యేడున్
  మూడును రెండును చేర్చుచు
  ముడును మూడును కలిసిన ముప్పది యేడౌ.

  రిప్లయితొలగించండి
 21. గురువుగారు. మీ నాన్నగారికి త్వరలోనే స్వస్థత చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను..

  రిప్లయితొలగించండి
 22. గురువుగారు. మీ నాన్నగారికి త్వరలోనే స్వస్థత చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను..

  రిప్లయితొలగించండి

 23. గురువుగారు. మీ నాన్నగారికి త్వరలోనే స్వస్థత చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను

  రిప్లయితొలగించండి