ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
ఆంజనేయ శర్మ గారూ,రాజేశ్వరి అక్కయ్యా,నేనిచ్చిన సమస్యలో యతిదోషాన్ని సహదేవుడు గారు తెలియజేశారు. ఇప్పుడు సవరించాను. సవరించిన సమస్యకు మరో పూరణ వ్రాయండి. మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు మన్నించండి.
అవును " చ " కి " సే " యతి కుదరదు కదా అని అనుమానం వచ్చింది.కానీ చెప్పేంత దాన్ని కాదు కదా అని వ్రాయ లేదు .ధన్య వాదములు
గురువుగారికి నమస్కారములు నేనే మీకు తెలపాలనుకున్నాను చక్రి-సేనుడు కాని మరిచి పోయి దానికి తగిన పద్యం రాసాను ఇబ్బందేం లేదండీ
ప్రత్య గాత్మ యనుచు బరమేశు నమ్మితి మాయ జూద మందు మామ శకుని యక్ష విద్య తోన కక్షగా నోడించె శివునిఁ జంపె భీమ సేనుఁ డలిగి
అక్కయ్యా, పద్యం వరకు బాగుంది. భావమే అవగాహన కాలేదు. కాస్త వివరించండి.
నమస్కారములు త్రిగుణాత్మకుడని శివుణ్ణి నమ్మినందుకు శకుని వలన మాయజూదంలో ఓడించాడు అందుకే శివుడిమీద అలిగి శివుణ్ణి చంపాడు అని నాభావం .
ఎదిరి యుద్ధమందు నీపేర్లు గల్గిన కరి సమూహమంత యురికి రాగ శ్యామ,భీమ,రామ,చక్రి,యశ్వత్థామ శివునిఁ జంపె భీమ సేనుఁ డలిగి
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, శివుడనే పేరు గలిగిన ఏనుగును భీముడు చంపాడన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కీచకుండువచ్చి కేలుజాపిపిలువదాగి చూచుచుండ ద్రౌపదటనుభీతిగొల్పుచుఁ, దలపించుచు లయకాలశివునిఁ, జంపె భీమ సేనుఁ డలిగి అన్వయక్లేశ మొకటైతే, ద్రౌపది, అటను సంధి చేయవచ్చా లేదా అని కూడా సందేహమండీ
ఊకదంపుడు గారూ, అన్వయక్లేశం లేదు. పూరణ బాగుంది. అభినందనలు.‘ద్రౌపది+అటను’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ ‘ద్రౌపది యట’ అనండి.
గురువుగారూ, ధన్యవాదములు.సవరించిన పద్యము:కీచకుండువచ్చి కేలుజాపిపిలువదాగి చూచుచుండ ద్రౌపది యటభీతిగొల్పుచుఁ, దలపించుచు లయకాలశివునిఁ, జంపె భీమ సేనుఁ డలిగి
అసురు డైన వాడి నంతమ్ము గోరుచున్ తల్లి యానతిగొని తరలె నతడు బకుని గెలువ గలుగు బలమునిమ్మని గోరెశివుని, జంపె భీమ సేనుడలిగి.
ఆంజనేయ శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్తి తోడ నెపుడు బ్రార్ధించ వలయును శివుని, జంపె భీమ సేను డలిగి యుద్ధ రంగ మందు బద్ధ శ త్రువులను ధర్మ యుద్ధ మెయది వర్మ ! తెలియు
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ద్రోవది సభకీడ్చ దుశ్శసేనుని వైపు గదను బట్టి రయమె కదలఁ జూడనన్న సైగ తోడ నణచి పెట్టుచు లోనిశివునిఁ జంపె భీమసేనుఁడలిగి!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, (‘సహ’ తర్వాత స్పేస్ అవసరం లేదు కదా!),లోని శివుణ్ణి చంపాడన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు.పొరపాటుగ స్పేస్ యివ్వడము జరిగింది. సవరించానండి.
పాత్రి పెండ్లి యాడె ప్రమదముగ పరమశివుని, జంపె భీమసేనుడలిగిదంతకూరమందు ధార్తరాష్ట్రునిబట్టిబాస దీర్చుకొనెను వాతసుతుడు!!!
శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
త్రిపుర దైత్యు లెదరు తిరుగిరి రుద్రుని శివునిఁ , జంపె భీమసేనుఁ డలిగివారి నెల్ల నని నవారిత శక్తినిన్సంతసించి రెల్ల జనులు భువిని[ భీమసేనుఁ డు = శివుడు= భీమ శంకరుడు = భయంకరుడు]
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అంబ పూజ సలిపె నత్యంత భక్తితోశివుని, చంపె భీమ సేను డలిగితొడలు విరుగ గొట్టి దుర్యోధనుని తానుకృష్ణు డిచ్చినట్టి కిటుకు తోడ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి--------------------హిమవదచలపుత్రి యెవ్వాని యర్ధా౦గి ? చక్రి యేమి జేసె చైద్యు నపుడు ?దుస్ససేను నెవరు ద్రు౦చెను రణమ౦దు ? శివుని | జ౦పె | భీమసేను డలిగి | ............................................... రె౦డవ పద్యము +++++++++++ వణిజు డైన "శివుడు"వ్యాపారమున , స్నేహితమ్ము మరచి , వ౦చనమ్ము సేయ. >పెద్ద కక్ష రగిలె "భీమసేన్"మదిలోన శివుని జ౦పె భీమసేను డలిగి
గురుమూర్తి ఆచారి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
శివుడు”.”భీము” డనెడి స్నేహితుల్ “”కురు నాథు”,“భీమ” పాత్రలందు వెలయు చుండ్రి .నాటకమ్మున కురునాథు పాత్ర ధరించు శివుని జంపె భీమసేను డలిగి
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు నమస్సులు నిన్నటి దత్త పదికి పద్యము పాప కర్ముడు నరకుని రూపు మాపి తాప మడగించు మోహన రూప కృష్ణ! దీప తోరణ సేవ నందించు మమ్ము నితము బ్రోవుము మా నమస్కృతులు గొనుము
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, నిన్నటి దత్తపదికి మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘నరకుని రూప మడపి’ అనండి. దత్తపదం ‘రూప’ కదా!
తిమ్మాజీ రావు గారూ, మన్నించండి. నేను ‘మోహన రూప’ను గమనించలేదు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణబాల భీము చేష్ట పరిమితి మించగానాట బొమ్మలీయ నాడుకొనగకంఠమందునున్నకాల సర్పముగనిశివుని జంపె భీమసేనుడలిగి
భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్తిభావమందుశక్తిగ వేడుముశివుని.”జంపె భీమసేను డలిగిరణమునందుబెదరిరాక్షస కృత్యానకౌర వోత్తములనుకాటికంపె.
కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులసూచనకు ధన్యవాదములు .సత్తపదిలో "రూప"రెండవ పాదములో "మోహనరూప' సమాసములో నున్నది
తిమ్మాజీ రావు గారూ, పైన మీ పూరణ క్రింద చూడండి.
మిత్రులందఱకు నమస్సులు!(జరాసంధుని పరాక్రమమును నిరోధింప నుంకించు భీముని నాపి యర్జునుఁడు శివుని జయమునీయుమని వేడుచుండఁగనే, యలిగిన భీముఁ డా జరాసంధునిం జంపినాఁడనుట)మగధరా ట్పరాక్రమ నిరుద్ధుఁ డా జరాసంధుఁ జంపఁ బోయె! సవ్యసాచియాపి, "జయము నీయు" మని నెమ్మదిగ వేడెశివునిఁ! జంపె భీమసేనుఁ డలిగి!!(మగధరా ట్పరాక్రమ నిరుద్ధుఁడు=భీముఁడు)
గుండు మధుసూదన్ గారూ, నిస్సందేహంగా మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదములు శంకరయ్యగారూ!
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిఆంజనేయ శర్మ గారూ,
రిప్లయితొలగించండిరాజేశ్వరి అక్కయ్యా,
నేనిచ్చిన సమస్యలో యతిదోషాన్ని సహదేవుడు గారు తెలియజేశారు. ఇప్పుడు సవరించాను. సవరించిన సమస్యకు మరో పూరణ వ్రాయండి. మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు మన్నించండి.
అవును " చ " కి " సే " యతి కుదరదు కదా అని అనుమానం వచ్చింది.కానీ చెప్పేంత దాన్ని కాదు కదా అని వ్రాయ లేదు .ధన్య వాదములు
తొలగించండిగురువుగారికి నమస్కారములు నేనే మీకు తెలపాలనుకున్నాను
తొలగించండిచక్రి-సేనుడు కాని మరిచి పోయి దానికి తగిన పద్యం రాసాను ఇబ్బందేం లేదండీ
ప్రత్య గాత్మ యనుచు బరమేశు నమ్మితి
రిప్లయితొలగించండిమాయ జూద మందు మామ శకుని
యక్ష విద్య తోన కక్షగా నోడించె
శివునిఁ జంపె భీమ సేనుఁ డలిగి
అక్కయ్యా,
రిప్లయితొలగించండిపద్యం వరకు బాగుంది. భావమే అవగాహన కాలేదు. కాస్త వివరించండి.
నమస్కారములు
తొలగించండిత్రిగుణాత్మకుడని శివుణ్ణి నమ్మినందుకు శకుని వలన మాయజూదంలో ఓడించాడు అందుకే శివుడిమీద అలిగి శివుణ్ణి చంపాడు అని నాభావం .
రిప్లయితొలగించండిఎదిరి యుద్ధమందు నీపేర్లు గల్గిన
కరి సమూహమంత యురికి రాగ
శ్యామ,భీమ,రామ,చక్రి,యశ్వత్థామ
శివునిఁ జంపె భీమ సేనుఁ డలిగి
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిశివుడనే పేరు గలిగిన ఏనుగును భీముడు చంపాడన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కీచకుండువచ్చి కేలుజాపిపిలువ
రిప్లయితొలగించండిదాగి చూచుచుండ ద్రౌపదటను
భీతిగొల్పుచుఁ, దలపించుచు లయకాల
శివునిఁ, జంపె భీమ సేనుఁ డలిగి
అన్వయక్లేశ మొకటైతే, ద్రౌపది, అటను సంధి చేయవచ్చా లేదా అని కూడా సందేహమండీ
ఊకదంపుడు గారూ,
తొలగించండిఅన్వయక్లేశం లేదు. పూరణ బాగుంది. అభినందనలు.
‘ద్రౌపది+అటను’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ ‘ద్రౌపది యట’ అనండి.
గురువుగారూ, ధన్యవాదములు.
తొలగించండిసవరించిన పద్యము:
కీచకుండువచ్చి కేలుజాపిపిలువ
దాగి చూచుచుండ ద్రౌపది యట
భీతిగొల్పుచుఁ, దలపించుచు లయకాల
శివునిఁ, జంపె భీమ సేనుఁ డలిగి
అసురు డైన వాడి నంతమ్ము గోరుచున్
రిప్లయితొలగించండితల్లి యానతిగొని తరలె నతడు
బకుని గెలువ గలుగు బలమునిమ్మని గోరె
శివుని, జంపె భీమ సేనుడలిగి.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్తి తోడ నెపుడు బ్రార్ధించ వలయును
రిప్లయితొలగించండిశివుని, జంపె భీమ సేను డలిగి
యుద్ధ రంగ మందు బద్ధ శ త్రువులను
ధర్మ యుద్ధ మెయది వర్మ ! తెలియు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ద్రోవది సభకీడ్చ దుశ్శసేనుని వైపు
రిప్లయితొలగించండిగదను బట్టి రయమె కదలఁ జూడ
నన్న సైగ తోడ నణచి పెట్టుచు లోని
శివునిఁ జంపె భీమసేనుఁడలిగి!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, (‘సహ’ తర్వాత స్పేస్ అవసరం లేదు కదా!),
తొలగించండిలోని శివుణ్ణి చంపాడన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు.పొరపాటుగ స్పేస్ యివ్వడము జరిగింది. సవరించానండి.
తొలగించండిపాత్రి పెండ్లి యాడె ప్రమదముగ పరమ
రిప్లయితొలగించండిశివుని, జంపె భీమసేనుడలిగి
దంతకూరమందు ధార్తరాష్ట్రునిబట్టి
బాస దీర్చుకొనెను వాతసుతుడు!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
త్రిపుర దైత్యు లెదరు తిరుగిరి రుద్రుని
రిప్లయితొలగించండిశివునిఁ , జంపె భీమసేనుఁ డలిగి
వారి నెల్ల నని నవారిత శక్తినిన్
సంతసించి రెల్ల జనులు భువిని
[ భీమసేనుఁ డు = శివుడు= భీమ శంకరుడు = భయంకరుడు]
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅంబ పూజ సలిపె నత్యంత భక్తితో
రిప్లయితొలగించండిశివుని, చంపె భీమ సేను డలిగి
తొడలు విరుగ గొట్టి దుర్యోధనుని తాను
కృష్ణు డిచ్చినట్టి కిటుకు తోడ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
--------------------
హిమవదచలపుత్రి యెవ్వాని యర్ధా౦గి ?
చక్రి యేమి జేసె చైద్యు నపుడు ?
దుస్ససేను నెవరు ద్రు౦చెను రణమ౦దు ?
శివుని | జ౦పె | భీమసేను డలిగి |
...............................................
రె౦డవ పద్యము
+++++++++++
వణిజు డైన "శివుడు"వ్యాపారమున , స్నేహి
తమ్ము మరచి , వ౦చనమ్ము సేయ. >
పెద్ద కక్ష రగిలె "భీమసేన్"మదిలోన
శివుని జ౦పె భీమసేను డలిగి
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
శివుడు”.”భీము” డనెడి స్నేహితుల్ “”కురు నాథు”,
రిప్లయితొలగించండి“భీమ” పాత్రలందు వెలయు చుండ్రి .
నాటకమ్మున కురునాథు పాత్ర ధరించు
శివుని జంపె భీమసేను డలిగి
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు నమస్సులు
రిప్లయితొలగించండినిన్నటి దత్త పదికి పద్యము
పాప కర్ముడు నరకుని రూపు మాపి
తాప మడగించు మోహన రూప కృష్ణ!
దీప తోరణ సేవ నందించు మమ్ము
నితము బ్రోవుము మా నమస్కృతులు గొనుము
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండినిన్నటి దత్తపదికి మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నరకుని రూప మడపి’ అనండి. దత్తపదం ‘రూప’ కదా!
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమన్నించండి. నేను ‘మోహన రూప’ను గమనించలేదు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిబాల భీము చేష్ట పరిమితి మించగా
నాట బొమ్మలీయ నాడుకొనగ
కంఠమందునున్నకాల సర్పముగని
శివుని జంపె భీమసేనుడలిగి
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్తిభావమందుశక్తిగ వేడుము
రిప్లయితొలగించండిశివుని.”జంపె భీమసేను డలిగి
రణమునందుబెదరిరాక్షస కృత్యాన
కౌర వోత్తములనుకాటికంపె.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులసూచనకు ధన్యవాదములు .సత్తపదిలో "రూప"
రిప్లయితొలగించండిరెండవ పాదములో "మోహనరూప' సమాసములో నున్నది
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిపైన మీ పూరణ క్రింద చూడండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి(జరాసంధుని పరాక్రమమును నిరోధింప నుంకించు భీముని నాపి యర్జునుఁడు శివుని జయమునీయుమని వేడుచుండఁగనే, యలిగిన భీముఁ డా జరాసంధునిం జంపినాఁడనుట)
మగధరా ట్పరాక్రమ నిరుద్ధుఁ డా జరా
సంధుఁ జంపఁ బోయె! సవ్యసాచి
యాపి, "జయము నీయు" మని నెమ్మదిగ వేడె
శివునిఁ! జంపె భీమసేనుఁ డలిగి!!
(మగధరా ట్పరాక్రమ నిరుద్ధుఁడు=భీముఁడు)
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండినిస్సందేహంగా మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదములు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి