26, నవంబర్ 2015, గురువారం

పద్యరచన - 1075

కవిమిత్రులారా,
“ఋణానుబంధరూపేణ పశుపత్నీసుతాదయః”
పై భావాన్ని వివరిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.

16 కామెంట్‌లు:


  1. కర్మానుబంధరూపేణ
    బ్లాగ్ టపా వ్యాఖ్యాదయః !
    ఋణానుబంధరూపేణ
    పశుపత్నీ సుతాదయః !

    రిప్లయితొలగించండి
  2. పద్యరచన జన్మ జన్మలబంధమే జగతియనగ
    ఋణము దీరగ నీచెంతనెదుగ రెవరు
    బంధమంతయు విడిపోవు”గంధముడుగు
    పువ్వు నలిగినరీతియౌ పుడమిబ్రతుకు”.

    రిప్లయితొలగించండి
  3. గురువు గారికి ప్రణామములు .....నాన్నగారి ఆరోగ్యం కాస్త కుదుటపడిందని భావిస్తాను,

    ఘనముగ ప్రేమను జూపెడు
    మనుజులలో పొంగి పొరలు మమతలు గనినన్
    అనుబంధమ్మాప్యాయత
    లనుబంధమ్ములు పుడమిన యప్పుయె సుమ్మీ.



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      నాన్న గారి ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు. నేను రోజంతా హాస్పిటల్ లోనే ఉంటున్నాను.
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. పశుసుత పత్న్యాదులఁ బర
    వశులై మోహాంధకార బద్ధులు నరులున్
    విశదమ ఋణానుబంధము
    పశమింపం జనుటలెల్ల బాంధవ్యములున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనకుం డెవ్వడు జాతుడెవ్వడు జని స్థానంబు లెచ్చోటు సం
      జననం బెయ్యది మేనులే కొలది సంసారంబు లేరూపముల్
      వినుమా యింతయు విష్ణుమాయ దలపన్ వేఱేమియుం లేదు మో
      హ నిబద్ధంబు నిదాన మింతటికి జాయా విన్నబో నేటికిన్?

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వరరావు గురూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పోతనామాత్యుని పద్యము సందర్భోచితమని ప్రస్తావించాను.

      తొలగించండి
  5. పద్యరచన
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఛ౦దము = ద్రు త వి ల౦ బి త వృ త్త ము
    చాలా సరళ మైన వృత్త౦.
    గణాలు = న. భ. భ. ర. యతి 7. వ. అ "

    పురుషు డే సతి c బొ౦దునొ ! యామె కె
    వ్వరు జని౦తురొ ! వారి భవిష్య మే
    కరణి సాగునొ , కా౦తువె ? యెన్న డే
    ని ఋణ బ౦ధము నీ కిక తప్పునే ?
    ............................................
    గురువు గారూ ! నాలుగవ పాద౦లో
    ప్రా స. సరిపోతు౦ది కదా ?
    ర. కు , ఋ. కు ప్రాస
    సమ౦జసమే కదా ?
    ................................................

    రిప్లయితొలగించండి
  6. ఆలియైన గాని ఆత్మభవులు యైన
    మనప్రమేయమునను మనకు రారు
    గోము తోడ పెంచు గోవులే యైనను
    అప్పు లాంటి వందు రార్యు లెల్ల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ఆత్మభవులు నైనా.... అనండి.

      తొలగించండి
  7. ఆలియైన గాని ఆత్మభవులు యైన
    మనప్రమేయమునను మనకు రారు
    గోము తోడ పెంచు గోవులే యైనను
    అప్పు లాంటి వందు రార్యు లెల్ల.

    రిప్లయితొలగించండి
  8. సుతులునుబశువులుపత్నియు
    ఋతముగనేజెప్పుచుంటి ఋణముగ లుగుటన్
    గతియించిన పుట్టుదురట
    ఋతముగ నిక వానిఋణముతీరున్వరకున్

    రిప్లయితొలగించండి