10, నవంబర్ 2015, మంగళవారం

పద్యరచన - 1060

కవిమిత్రులారా!
“ఒక మంచిమాటె చాలును...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

37 కామెంట్‌లు:

  1. ఒక మంచిమాటె చాలును
    ప్రకటించగ మనసులోని భావనలదియే
    యొకటిగ చేయును మనముల
    వికటించిన ప్రేమ చిగురు వేయును మరలా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      వికటించిన ప్రేమ చిగురింఛడానికి ఒక మంచిమాట చాలునన్న మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ‘మరలా’ అన్నదాన్ని ‘మరలన్’ అనండి.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      ఒక మంచిమాట ముకుళించిన హృదయాలను వికసింప జేస్తుందన్న మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘సకలార్థము లందుట కది...’ అనండి.

      తొలగించండి
    2. ఒక మంచి మాటె చాలును
      సకలార్థము లందుటకది సాధన మగుచున్
      ముకుళించిన హృద యాలను
      వికసింపగ జేయునదియె విజ్ఞుల నుడులై

      తొలగించండి
  3. ఒకమంచి మాటె చాలును
    సకలము సాధించ వచ్చు సౌగంధి కముల్
    వెకవెక పలుకుల మాటున
    వికటిత మగుభావ ముండి వేధించు మదిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మంచిమాటతో సకలం సాధించవచ్చు నన్న మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘సౌగంధికముల్’...?

      తొలగించండి
    2. నమస్కారములు
      " సౌగంధికములు " అంటే ఒక్కమంచి మాటతో కలిగిన ఉత్సాహము నందు , కష్టమైనా , కుబేరుని వనము నందలి " సౌగంధికములను " సైతము [ భీముడివలె ] సాధించి తేవచ్చును . అని నాఉద్దేశ్యము .అదన్నమాట.
      అసల్ సంగతి

      తొలగించండి
    3. అక్కయ్యా,
      సౌగంధికపుష్పం గురించి తెలుసు. కాని పద్యంలో దానికి అన్వయం ఎక్కడ అన్నది నా ప్రశ్న.

      తొలగించండి
    4. నిజమే అన్వయం ఎక్కడా లేదు ఆపదం ఇష్టమని వ్రాసాను.అంతె.పొరబాటును మన్నించ గలరు
      ఒకమంచి మాటె చాలును
      సకలము సాధించ వచ్చు "సంతస మందున్ "
      వెకవెక పలుకుల మాటున
      వికటితమగు భావముండి వేధించు మదిన్
      అంటే సరిపోతుందను కుంటాను .

      తొలగించండి
  4. ఒక మంచిమాట చాలును
    సకలము నెరిగిమసలంగ శక్యమవుగదా/శక్యంబౌగా
    వికలము చెంద నేటికి
    ప్రకటిత మయ్యెనిట నీదు భావము సుదతీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      ఒక్క మాటతో స్వభావాన్ని తెలిసికొనవచ్చు నన్న మీ పద్యం బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  5. ఒకమంచిమాటె చాలును
    మకిలంబగు మనము కదియె మంత్రము వోలెన్
    నికరంబుగ వినిపించుచు
    సకలాత్ముని దెలుసుకొనెడి సన్మతి నీయున్!!!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మంచిమాట మనోవైకల్యానికి మంత్ర మన్న మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘మనముకు’ అనరాదు, ‘మనమునకు’ సాధుప్రయోగం. ‘మనమున కదె...’ అనండి.

      తొలగించండి
  6. ఒకమంచి మాట చాలును
    మకిలను పోగొట్టి శుద్ధ మనిషిని చేయన్
    సకలమ్ము నెరుగుదు ననుచు
    నెకసెక్కాలాడువార లెదుగుట కల్లే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'మకిలిని' అనండి. '... ననుచు |న్నెకసెక్కా' లనండి.

      తొలగించండి
  7. ఒక మంచి మాటె చాలును
    నొకరిని నిల బాగుజేయ నో గురు వర్యా !
    యకళం క మనసు గలిగిన
    నొక నేస్తమె చాలు వాని నూరడి జేయన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. ఒకమంచి మాట చాలును
    వికసించును ముఖము విమల విరుల విధంబున్
    ఒక చెడుపు మాట చాలును
    ముకిలించును విరులు మూతి ముడిచిన భంగిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'విరుల విధమునన్ ' అనండి.

      తొలగించండి
  9. మధ్యాక్కర
    ఒకమంచి మాటచాలునుగ ఒరులకు మేలెంచు నపుడు
    అకళంకమేలేక బ్రతుకు ఆనంద మౌనుగా మనకు
    ఒక పూర ణైననుచాలు ఒదిగిన భావాన నిలువ.
    సకలుర సంతసంబొసగు|సద్గుణ సారమున్న.

    రిప్లయితొలగించండి
  10. ఒక మంచి మాటె చాలును
    వికలము జెందిన మనుజుని వేదన బాపన్
    ముకుళించిన కమల దళము
    వికసించదె సూర్య కిరణ విలసనమునకున్ !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంద పీతాంబర్ గారూ,
      బహుకాల దర్శనం. సంతోషం!
      మీ నీతిపద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. ఒక మంచిమాటె చాలును
    సుకరంబులగుబనులెల్ల సూటిగ ధరణిన్
    సకల విబుధజన సంతో
    షకరము, మృదుభాషణములు సన్నుతములగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. ఒకమంచి మాటచాలును
    ప్రకటనలో గాక-చేయు పనిలోనిలుపన్
    అకళంక మేమిలేకను
    వికసించెడి పుష్ప గంధ విలువల వలెనే

    రిప్లయితొలగించండి

  13. గు రు మూ ర్తి ఆ చా రి
    ...........................


    ఒక మ౦చి మాట చాలును
    నికర౦బగు శా౦తి హృదిని నెలకొల్పుటకున్ ;
    ఒక మ౦చి మాట చాలును
    సుకమగు + ఆజీవనమును సూచి౦చుటకున్ .

    { ఆజీవనము = జీవనోపాయము )

    రిప్లయితొలగించండి
  14. ఒక మంచిమాటె చాలును
    ముకుళిత వదనమ్ము విచ్చు మోదము నిండ
    న్నకలంక మధుర భాషణ
    సకలమ్మున భూషణమ్ము ! సర్వోన్నతమున్!

    రిప్లయితొలగించండి
  15. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు ధన్యవాదములు.తమరు నన్ను చంద్రమౌళి సూర్యనీరాయణననుకొన్నారు!

      తొలగించండి
    2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మన్నించండి. సరిగా మీ పద్యాన్ని చదువుతున్న సమయంలో మా మిత్రుడొకడు “అంత తొందరగా, సులభంగా మీకు కాశీకి రైలు రిజర్వేషన్ ఎలా దొరికింది?” అని అడిగాడు. నేను “మా బ్లాగు మిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణ గారు రైల్వేలో పనిచేస్తారు. వారి వల్ల సాధ్యమయింది” అని చెప్తూ నా వ్యాఖ్యను టైప్ చేశాను. ఆ సమయంలో నా ఆలోచనలనిండా వారే ఉన్నారు. అందువల్ల జరిగిన పొరపాటు అది..మన్నించండి.
      అన్నట్టు మీ అమ్మాయి పెళ్ళికి వచ్చినప్పుడు కూడా వారే టికెట్ రిజర్వేషన్ చేయించారు.

      తొలగించండి
  16. ఒక మంచిమాటె చాలును
    వికటించిన రావణులకు వినిపించంగా
    పకపక నవ్వెదరు;...మరల
    ప్రకటించిన బాదెదరు ప్రభాకర శాస్త్రీ!

    రిప్లయితొలగించండి
  17. ఒక మంచిమాటె చాలును
    రకరకముల శ్రమలు తీర్చ లంచము తోడన్
    నికటపు పాములు పారున
    బెకబెక మని కప్పలరవ భీతిని సుమతీ

    రిప్లయితొలగించండి