12, నవంబర్ 2015, గురువారం

పద్యరచన - 1062

కవిమిత్రులారా!
“అటఁ జని కాంచెను ప్రవరుఁడు...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

48 కామెంట్‌లు:

  1. అటఁ జనికాంచె భూమిసురుఁ డంబరచుంబి శిరస్సరజ్ఘరీ
    పటల ముహుర్ముహు ర్లుఠధ భంగ తరంగ మృదంగ నిస్స్వన
    స్పుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
    గటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్

    ఇది అసలుపద్యము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      అందరికీ తెలిసిన పద్యమే. అయినా ఇక్కడ ప్రస్తావించినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
    2. నమస్కారములు
      నాకు మనుచరిత్ర చాలా ఇష్టం .అందుకే వ్రాసాను

      తొలగించండి
  2. అటఁజని కాంచెను ప్రవరుఁడు
    కుటజమ్ము లుతీగ లల్లె కొండల పైనన్
    తటములు సుందర వనములు
    నిటలాక్షుని వింత సృష్టి నిండుగ విరిసెన్

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘పర్వత సొబగుల్’ అని సమాసం చేయరాదు.“హిమపర్వత శోభల్’ అనండి.

      తొలగించండి
    2. అటజని కాంచెను ప్రవరుఁడు
      పటపట చినుకు కురియు హిమ పర్వత శోభన్
      నటనము నాడుమయూరాల్
      కటజాలపు క్రీడలగనె కమనీయతనే

      తొలగించండి
  4. అటజని కాంచెను ప్రవరుఁడు
    కుటజమ్ములశాఖలూచు కుంజరములనే
    పటలము తోతిరు గాడుచు
    నటనము జేసెడు నెమలుల నాట్యపు శోభన్

    రిప్లయితొలగించండి
  5. 1.అటజని కాంచెను ప్రవరుడు
    నిటలాక్షుని కొండపైన నెమ్మది తోడన్
    నటనము లాడెడు కేకిని
    చిటిపొటి పలుకులు పలికెడి చిలుకల గుంపున్.
    2.అటజని కాంచెను ప్రవరుడు
    తటిల్లత వలె నగపడు తరుణీమణినిన్
    తటుకున దరిచేరియూరి దారిని వేడెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పద్యాలలో మొదటిది బాగున్నది. అభినందనలు.
      రెండవ పద్యంలో మూడవపాదం తప్పిపోయింది. రెండవపాదంలో గణదోషం. ‘తటిల్లత వలె నడయాడు తరుణీమణినిన్’ అనండి.

      తొలగించండి
  6. 2.అటజని కాంచెను ప్రవరుడు
    తటిల్లత వలె నడయాడు తరుణీమణినిన్
    తటుకున గుండెలు యదరగ
    తటుకున దరిచేరియూరి దారిని వేడెన్.

    ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి

  7. అటఁ జని కాంచెను ప్రవరుఁడు
    నిటలాక్షుడు నిలచు గిరిని నిర్మల గంగన్
    దిటవైన హిమపు శోభలు
    చటుకున ప్రత్యక్షమైన చానవరూధిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. అట జని కాం చెను ప్రవరుడు
    నిట లాక్షుని మామ నగము ,నిర్మల ఝరులన్
    కుటజపు మెలికల సొగసులు
    నటనల తోనింపు గొలుపు నడవి నెమళ్ళ న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. అట జని కాంచెను ప్రవరుడు
    తటములు సుందర వనములు దంతావళముల్
    నటనము లాడు మరుకముల
    నిటలాక్షుని శీతనగము, నిశ్చేష్టుండై!!!

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. అటఁ జని కాంచెను ప్రవరుఁడు
      నటనోల్లాస మదశిఖిగణా వృత తటినిన్
      కటకచరిత మృగ యుగముల్
      పటుతర వృక్ష భరితమ్ము పర్వతరాజున్

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.

      తొలగించండి
  11. గురువుగారికి మరియు కవిమిత్ర బృందమునకు శ్రీ కార్తీకమాసారంభ పర్వదిన శుభాకాంక్షలు.

    శ్రీమద్గౌరీ వల్లభ
    కామదహనకర యఖండ గరళ సుభోక్తా
    క్షేమంకర భవనాశక
    స్వామీ భవ నామ జప విభవమునొసఁగుమా!

    శ్రీకైలాస నివాస భక్తజన సంక్షేమంకరా దివ్య లీ
    లా కృత్యాది విశేష భూషిత హరా! బ్రహ్మాండ సంపోషకా!
    శ్రీకళ్యాణ శుభంకరా! యమర సంసేవార్చితాంఘ్రిద్వయా!
    నీకున్ మ్రొక్కెద నీదు నామ జపమింతే కోరితిన్ తీర్చుమా.

    గరళమును కంఠమందున
    సరళముగా నుంచుకొన్న సావసవంతా
    దరిజేరు విధము దెల్పుము
    పరమేశా నీకు నేను ప్రణతుఁడనగుదున్.

    ఈనాటి పద్యరచనాంశ పూరణము................

    అటఁ జని కాంచెను ప్రవరుఁడు
    నిటలాక్షుని దివ్య భవ్య నివహంబును వి
    స్ఫుట భక్తి భావ ఋషి సం
    పటలంబునచేతనా వివశుఁడై యెలమిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పద్యాలన్నీ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      సావసవంతా... ‘సాహసవంతా’కు టైపాటా?

      తొలగించండి
  12. అటజని కా౦ చెను ప్రవరుడు
    కుటిలాలక వేల్పు వెలది కోమలి నొకతెన్
    విటపి సమీప వితర్దిని
    చిటి వ్రేళుల వీణ మీటి శ్రీ రాగమునన్

    రిప్లయితొలగించండి
  13. అటజని కా౦ చెను ప్రవరుడు
    కుటిలాలక వేల్పు వెలది కోమలి నొకతెన్
    విటపి సమీప వితర్దిని
    చిటి వ్రేళుల వీణ మీటి శ్రీ రాగమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. అటజని కాంచెను ప్రవరుడు
    నటియించు వరూధిని కడ నగరంబుకుదా
    రి-టకటక జెపుమన-వినియు
    ప్రకటించెనుహావభావ పద్ధతులెన్నో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘నగరమునకు దా’ అనండి.

      తొలగించండి
  15. రిప్లయిలు
    1. కః అటజని కాంచెను ప్రవరుడు
      నిటలాక్షుండునివసించు నీకాయ్యము
      న్నటవీప్రాంతమునందున
      చటులమ్ముగ తిరుగుచున్న చక్కెరబొమ్మన్

      తొలగించండి
    2. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘నీకాయ్యము’...?

      తొలగించండి
  16. రిప్లయిలు
    1. జి.ఎన్.రెడ్డి నిఘంటువు- , నికేతనము, నిలయము, నివసతి, నివసనము, నివాసము, నివేశనము, నివేశము, నిశాంతము, నీకాయ్యము, నీకేతనము

      తొలగించండి
  17. రిప్లయిలు
    1. అటఁ జని కాంచెను ప్రవరుఁడు
      కుటిలంబిసుమంతలేని కువలయ నయనన్
      వెటకారము చేయక తన
      పటిమోన్నతి బిలుచు నట్టి వనిత వరూధిన్

      తొలగించండి
    2. గండూరి లక్ష్నినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. అటఁజని కాంచెను ప్రవరుడు
    స్ఫటికాకృతిఁ దాల్చినట్టి ఫల వృక్షములన్
    చిటబొట సడుల హిమనగముఁ
    దటాలున వరూథినిఁదను తపనలఁ చేరన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. మిత్రులందఱకు నమస్సులు!

    అటఁజని కాంచెను ప్రవరుఁడు
    నిటలేక్షణ సద్మ బహుళ నిర్మలతుహినో
    త్కట సలిల పతితనిర్ఝ
    ర్యుటంకి తస్ఫుట నటిత మయూర హిమాద్రిన్!

    రిప్లయితొలగించండి
  20. అటఁ జని కాంచెను ప్రవరుఁడు
    తటపటలాడుచు హిమమున తప్పగ దారి
    న్నెటుజూచిన కొండలె గద
    నెటువర్కులు లేవచటను నిటలాక్షునకున్

    రిప్లయితొలగించండి
  21. అటఁ జని కాంచెను ప్రవరుఁడు
    తటములు నేరులను దాటి తత్తరబిత్తై...
    కటకట యేమి నుడివెదను!
    బటువగు హిమకూటమందు ప్లాస్టికు బాటిల్స్

    రిప్లయితొలగించండి