11, నవంబర్ 2015, బుధవారం

పద్యరచన - 1061

కవిమిత్రులారా!

“తిమిరముఁ బాఱఁద్రోలుటకు దీపము లెల్లెడఁ దేజరిల్లె...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

29 కామెంట్‌లు:

 1. తిమిరముఁ బాఱఁద్రోలుటకు దీపము లెల్లెడఁ దేజరిల్లెనే
  తమకము తోన పొంగుచును తారక లన్నియు మోదమందగా
  కుముదము లన్ని కౌముదిని కోరుచు హాసము లాడె నంతలో
  నిముసము కాంతులీను చిరునీలపు భ్రాంతికి మోహ మేలనో

  రిప్లయితొలగించండి
 2. తిమిరముఁ బాఱఁ ద్రోలుటకు దీపము లెల్లెడఁ దేజరిల్లెనే
  ప్రమదలు మోదమందు చునువాకిలి ముంగిటముగ్గు లేసినన్
  సుమములు జల్లి ప్రీతిగను శోభను గూర్చెడి జ్యోతి వెల్గులే
  గమకము తోడనీ కనులగాంచిన శోయగమెంత వింతయో

  రిప్లయితొలగించండి
 3. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. తిమిరము బారద్రోలుటకు దీపము లెల్లెడ దేజరిల్లె నా
  ప్రమిదెల నుండి వెల్గు చిరు ప్రజ్వల జ్వాలలు భీకరమ్ముగా
  సమరము సల్పుచున్ పెనువిషాదపు చిహ్నమనంగ నొప్పు నా
  తమమును సంహరింప వసుధాతలమంతయు ప్రజ్వరిల్లెనే.

  రిప్లయితొలగించండి
 5. తిమిరముఁ బాఱఁ ద్రోలుటకు దీపము లెల్లెడఁ దేజరిల్లెనే
  సుమదళ దామసంయుత సుశోభిత సౌధ విరాజితావళుల్
  ఢమఢమ శబ్ద మత్తరి పటాకులు గాల్చ నభంబు నిండగన్
  ఘుమఘుమ లాడు వంటలట గూర్పగ బండుగ జేసి రెల్లరున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. పద్యరచన

  గు రు మూ ర్తి ఆ చా రి
  ........................

  గురువుగారికి , కవిమిత్రులకు ,కవయిత్రులకు
  గురుమూర్తిఆచారి " అ ౦ బు రు హ. వృ త్త ము " తో
  దీపావళి శుభాకా౦క్షలు తెలుపుచున్నాడు

  అ౦బురుహము =
  భ భ భ భ. ర స వ. యతి 13. అక్షర౦

  మె౦డుగ మ్రోగు పటాకుల సవ్వడి =
  మేళవి౦చు జయధ్వనిన్
  ----------------------------
  ప౦డుగ గొల్పును పూల మతాబులు =
  భాగ్యరేఖల నీనుచన్
  ------------------------------------
  మ౦డును ము౦గిట దీపపు టావళి =
  మ౦గళ౦బగు జ్యోతులై
  -----------------------------------
  ని౦డుకొనున్ గద య౦దరి డె౦దము
  ని౦డుగా = ముద మీ యెడన్
  ------------------------------
  " నమస్కృతులతో మీ
  గు రు మూ ర్తి ఆ చా రి "

  రిప్లయితొలగించండి
 7. తిమిరము బార ద్రోలుటకు దీపము లెల్లెడ దేజ రిల్లెనా
  యమిత ముదమ్మునన్ జనులు యంత పటాసులబేల్చి యందరున్
  ఢమ ఢమ సద్దు జేయగను ధారిత్రి కోపముహెచ్చి జూచుచున్
  కుమతులె మానవాధములు గోరి వినాశము లేల పిల్తురో!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. తిమిరము బా ఱద్రోలుటకు దీ పము లెల్లెడ దేజ రిల్లగా
  ప్రమిద లలోన దైలము ను బాగుగ ,నిండుగ బోయు చుందురే
  ప్రమదు లు నింట ,,చక్కగను భావము నింపెసలార పాడుచున్
  తిమిరము నందు,, వెల్తు రది తెల్లటి కాంతిని నింపుచు న్నదే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 9. కాంతు లన్నియు నయ్యప్ప జోతి యగుచు
  నాయు రారోగ్య సంపద లంచితముగ
  బ్లాగు కవులకు నిచ్చుత ! ప్రమద మలర
  శుభము లొసగుదీ పావళి శుభ దినాన

  రిప్లయితొలగించండి
 10. అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

  తిమిరముఁ బాఱఁ ద్రోలుటకు దీపము లెల్లెడఁ దేజరిల్లె నా
  కొమరుని లోకకంటకుని గూల్చగ సత్యయె చక్రి తోడుగన్
  దమసము నిండగన్ జనుల దారుణ రీతుల క్షోభ పెట్టిన
  న్నిమిషము దైవమోపదిల నీదని నాదని బేధమెంచదున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. తిమిరము బారద్రోలుటకు దీపము లెల్లెడ దేజరిల్లె, మీ
  గమనము సాగనిండుయిక కామిత సిద్ధిని గల్గజేయు యా
  రమ కృప కోరి మెండుగను ప్రార్థన సల్పుచు మోదమంది ఢం
  ఢమఢమ మోత మోగెడి పటాకుల గాల్చుచు సందడించుచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రవికాంత్ మల్లప్ప గారూ,
   బహుకాల దర్శనం... సంతోషం!
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. తిమిరముపారద్రోలుటకుదీపము లెల్లెడతేజరిల్లుటా?
  ప్రమిదల పండుగై సకలపాపము బాపుచు భాగ్యమందుటా?
  శ్రమలను పంచిపెంచి మనసన్నదిమంచిని నిల్పబూనుటా?
  అమరగ పండుగందరకు నంబర మంటగ సంబరంబులే

  రిప్లయితొలగించండి
 13. తిమిరముపాఱద్రోలుటకుదీపము లెల్లెడ తేజరిల్లెడిన్
  సమరము నందునన్ నరక సంహరణంబును సత్య జేయగా|
  విమలమనస్కులై ప్రజల విజ్ఞత యందున సంతసంబునన్
  సుమముల బాణ బంధమునసూక్ష్మతనింపిరి పండుగంతటన్

  రిప్లయితొలగించండి
 14. కవిమిత్రులకు పండితులకుసమస్యానిర్వహణకర్తలకుదీపావళి శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 15. మొన్నటి పద్యరచన:
  రుక్మిణి భవానీ మాతతో:
  పూమాలల్ గడు భక్తిఁ దెచ్చితిని నీ పూజార్థినై యీశ్వరీ!
  సేమమ్మీయగ నాదిదంపతుల నాశీర్వాదమున్ బొందగ
  న్నామీదన్ దయఁ జూపరమ్మ! హరినిన్నావాడిఁ గావించగన్
  మీమీదన్ గల నమ్మకమ్ము వరమై మెప్పించ నే వేడెదన్!

  రిప్లయితొలగించండి
 16. తిమిరముఁబారఁద్రోలుటకు దీపములెల్లెడఁదేజరిల్లెపో
  ప్రమదలు తాల్చి నూతనపు పచ్చడముల్, హరిమందిరమ్ములో
  రమణులఁగాయనెంచుచును ప్రార్థన జేయుచుండ్రి భక్తితో
  ప్రమిదలలోని వత్తులు విభాసిలుచుండగ దేవళమ్ములో
  సందేహముః
  రమణుడుః భర్త, భర్తలు అనటానికి రమణులు అనవచ్చా?

  రిప్లయితొలగించండి
 17. గురువర్యులకు, కవిమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.
   మూడవపాదంలో ‘...జేయుచుండ్రి’ అన్నచోట గణభంగం. ‘...జేయుచు నుండ్రి...’ అనండి.
   రమణులు అని నిస్సందేహంగా ప్రయోగించవచ్చు.

   తొలగించండి
 18. విశాఖపట్టణం 1958 - 65:

  తిమిరముఁ బాఱఁద్రోలుటకు దీపము లెల్లెడఁ దేజరిల్లె నా
  యమవస రాత్రి వేడుకల హాయి టపాసలు మ్రోగుచుండగా
  ఢమఢమ లాడు మేఘములు ఠారులు గొల్పుచు క్రుమ్మరించగా
  తిమిరము బార ద్రోలగల దీపము లెల్లెడ నారిపోయెనే :(

  రిప్లయితొలగించండి
 19. తిమిరముఁ బాఱఁద్రోలుటకు దీపము లెల్లెడఁ దేజరిల్లెనే
  విమలపు కార్తికమ్మునను విడ్డుర మొందగ పక్షులన్నియున్
  కొమరులు కూతులెల్లరును కూడగ నింటిని కాపురాలతో
  చెమటలు పోసె నాకికను చెక్కులు చింపగ పండుగందునన్

  రిప్లయితొలగించండి